ఇరాన్: మొరాలిటీ పోలీసుల వల్లే అర్మితా గెరవాండ్ మరణించారని మానవహక్కుల సంస్థల ఆరోపణ
బలవంతంగా హిజాబ్ ధరించాలన్న నిబంధనకు అర్మిత తాజా బాధితురాలని, 28 రోజులపాటు ఆమె మృత్యువుతో పోరాడి మరణించిందని హంగావ్ సంస్థ అన్నది.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్
కుటుంబంలో 7గురు ఒకేరోజు ఆత్మహత్య...పోలీసులు ఏం చెప్పారు?
ఇరాన్: మొరాలిటీ పోలీసుల వల్లే అర్మితా గెరవాండ్ మరణించారని మానవహక్కుల సంస్థల ఆరోపణ

ఫొటో సోర్స్, IRNA/UGC
ఇరాన్ మొరాలిటీ పోలీసులు చేతిలో గాయపడినట్లు చెబుతున్న 16 ఏళ్ల అర్మితా గెరవాండ్ అనే యువతి మరణించినట్లు ప్రభుత్వ మీడియా ధృవీకరించింది.
ఇరాన్ రాజధాని టెహరాన్‌లో అర్మితా మెట్రో రైలు ఎక్కుతుండగా పడిపోయారు. అయితే, మొరాలిటీ పోలీసులు ఆమెను కొట్టారని, అందుకే అపస్మారక స్థితికి చేరుకున్నారని ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతున్న మానవహక్కుల కార్యకర్తలు ఆరోపించారు.
శనివారం ఉదయం అర్మిత మృతి చెందరు. ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఇర్నా ప్రకారం ఆమె మెదడుకు తీవ్ర గాయంతో బాధపడ్డారు. గత ఆదివారం అర్మితకు బ్రెయిన్ డెడ్ అయ్యిందని డాక్టర్లు ప్రకటించగా, ఈ శనివారం ఉదయం ఆమె మరణించారు.
అయితే, అర్మిత మృతిపై కుటుంబం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
ఆమె మరణంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని నార్వేకు చెందిన మానవ హక్కుల సంస్థ హంగావ్ డిమాండ్ చేసింది.
బలవంతంగా హిజాబ్ ధరించాలన్న నిబంధనకు అర్మిత తాజా బాధితురాలని, 28 రోజులపాటు ఆమె మృత్యువుతో పోరాడి మరణించారని హంగావ్ సంస్థ అన్నది.
వరల్డ్ కప్ 2023: పాక్ జట్టు దుస్థితికి బాధ్యత ఎవరిది, సొంత దేశం నుంచే ఎందుకు విమర్శలు వస్తున్నాయి?
వరల్డ్ కప్ 2023:ఉత్కంఠ పోరులో న్యూజీలాండ్‌పై ఆస్ట్రేలియా విజయం

ఫొటో సోర్స్, Getty Images
ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు 49.2 ఓవర్లలో 388 పరుగులు సాధించి, న్యూజీలాండ్‌కు భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ట్రావిస్ హెడ్ 109 పరుగులు, డేవిడ్ వార్నర్ 81 పరుగులు చేశారు. తరువాతి ఆటగాళ్లు కూడా రాణించడంతో ఆసీస్ భారీ స్కోర్ చేయగలిగిది.
న్యూజిలాండ్ కూడా లక్ష్యం చేధించే క్రమంలో మంచి ఆట తీరును కనబరిచింది. ఓపెనర్లు తడబడినా, ఆ తరువాత వచ్చిన రచిన్ రవీంద్ర 116 పరుగులు, డారిల్ మిచెల్ 54 పరుగులు, జేమ్స్ నీషమ్ 58 పరుగులు చేశారు.
చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో, విజయానికి ఒక బంతిలో 6 పరుగులు సాధించాల్సిన న్యూజిలాండ్‌కు ఆ అవకాశం చిక్కలేదు.
9 వికెట్ల నష్టానికి 50 ఓవర్లలో 383 పరుగులకే పరిమితమైంది.
విడాకులకూ పెళ్లంత ఘనంగా మేళతాళాలతో వేడుక, ఈ తండ్రి ఎందుకిలా చేశారంటే....
ఆంధ్రప్రదేశ్: కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దుండగుల దాడి, హారన్ కొట్టినందుకే తనపై దాడి జరిగిందన్న డ్రైవర్

ఫొటో సోర్స్, UGC
ఫొటో క్యాప్షన్, కిందపడిపోయిన డ్రైవర్ బీఆర్ సింగ్ నెల్లూరు జిల్లా కావలి పరిధిలోని మద్దూరుపాడు వద్ద కొందరు వ్యక్తులు ఆర్టీసీ డ్రైవరుపై దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఏపీ 16 జడ్ 0702 నంబరుగల బస్సు బెంగళూరు నుంచి విజయవాడకు వస్తుండగా ఈ ఘటన జరిగింది.
కావలి ట్రంకు రోడ్డుపై బైకు అడ్డం రావడంతో తాను హారన్ కొట్టానని, ఈ విషయంలో బైకు యజమాని దేవరకొండ సుధీర్ తనతో వాదనకు దిగారని బస్సు డ్రైవర్ బీఆర్ సింగ్ తెలిపారు. వెనుక నుంచి ఇతర వాహనదారులు హారన్ కొడుతుండటంతో సుధీర్ అప్పటికి అక్కడి నుంచి వెళ్లిపోయారని, కాసేపటికి తన మిత్రులతో కలిసి మద్దూరుపాడు వద్ద బస్సుకు అడ్డం వచ్చారని సింగ్ వెల్లడించారు.
తనను బస్సు నుంచి కిందకు లాగి విచక్షణా రహితంగా కొట్టారని, అడ్డుకున్న ప్రయాణికులను కూడా బెదిరించారని డ్రైవర్ వెల్లడించారు.
ఈ ఘటనపై సమాచారం అందడంతో పోలీసులు డ్రైవర్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ వ్యవహారంలో 10 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు కావలి డీఎస్పీ వెంకటరమణ మీడియాకు చెప్పారు.
ఈ దాడిని ఖండించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, ఇది వైసీపీ నాయకుల అరాచకాలకు పరాకాష్టని అన్నారు.
అక్టోబర్ 7 మారణకాండకు పాల్పడిన హమాస్ కమాండర్‌ను మట్టుబెట్టాం-ఐడీఎఫ్

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, క్షేత్రస్థాయి దాడులను ముమ్మరం చేసిన ఇజ్రాయెల్ సైన్యం అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేసి, మారణకాండ సృష్టించిన వారిలో ముఖ్య పాత్రధారిని హతమార్చామని ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) అధికార ప్రతినిధి డేనియల్ హగేరి మీడియాతో మాట్లాడుతూ..ముఖ్య పాత్రధారులైన హమాస్ కమాండర్‌తోపాటు ఇతర హమాస్ కమాండర్‌లను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చిందని వెల్లడించారు.
ఇప్పటికే ఉత్తర గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ దళాలు క్షేత్రస్థాయి దాడులను ముమ్మరం చేస్తాయని తెలిపారు. కాగా రాత్రి నుంచి కొనసాగుతున్న దాడుల్లో ఇజ్రాయెల్ సైనికులెవరూ చనిపోలేదని తెలిపారు.
మరోవైపు మానవతాసాయాన్ని మరింత మెరుగ్గా అందించేందుకు, ఎక్కువ సంఖ్యలో ఆహారం, నీరు, మందులు అందేలా చూస్తామని తెలిపారు.
ఉత్తర గాజాలో శుక్రవారం రాత్రి వరుస బాంబుల దాడులు జరిగాయి. ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిచిపోయి, బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
"బాంబులు, వైమానిక దాడులతో తగలబడుతున్న గాజా''

ఫొటో సోర్స్, EPA
ఫొటో క్యాప్షన్, గాజాలో కొనసాగుతున్న వైమానిక దాడులు శుక్రవారం రాత్రి ఉత్తర గాజా, గాజా సిటీల్లో మొదలైన బాంబుల దాడులు, వైమానిక దాడులతో ఆ ప్రాంతమంతా తగలబడుతున్న వాతావరణం కనిపిస్తోందని గాజాలోని బీబీసీ ప్రతినిధి రష్దీ అబ్దులౌఫ్ తెలిపారు. అక్కడి తాజా పరిస్థితులను ఆయన నివేదించారు.
శుక్రవారం రాత్రి నుంచి గాజాలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయి, బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన పరిస్థితి ఏర్పడింది.
ఉత్తర గాజాలో నాలుగు చోట్ల పేలుళ్లు సంభవించాయని స్థానిక రేడియో స్టేషన్ రిపోర్ట్ చేసినట్లు తెలిపారు.
“ఇది ఇంతకు ముందు ఎన్నడూ చూడని తీవ్ర స్థాయిలో ఉంది”అని ఆ రేడియోలో కాలర్స్‌తో చెప్పినట్లుగా తెలిపారు.
దక్షిణ ప్రాంతంలోని ఖాన్ యూనిస్ నుంచి ఆయన మాట్లాడుతూ..స్థానిక అధికారులు, ఆసుపత్రులను సంప్రదించడానికి కూడా సాధ్యం కావడంలేదని, ఎంతమంది చనిపోయి ఉంటారో కూడా తెలియడం లేదని అన్నారు.
ఒకవేళ ఇజ్రాయెల్ క్షేత్రస్థాయిలో దాడులు ముమ్మరం చేస్తే, ఏం జరుగుతుందో అని ప్రజలు భయాందోళనలో ఉన్నారని చెప్పారు.
'దమ్ మారో దమ్' హిప్పీలు ఏమయ్యారు?
గుజరాత్: మోర్బీ వంతెన విషాదానికి ఏడాది... సిట్ దర్యాప్తులో ఏం తేలింది?
మహువా మొయిత్రా: పార్లమెంటులో లంచాలు తీసుకుని ప్రశ్నలు అడుగుతున్నారనే ఆరోపణల్లో చిక్కుకున్న తృణమూల్ ఫైర్‌బ్రాండ్ ఎంపీ
గాజాపై పెరిగిన బాంబుల దాడి.. క్షేత్ర స్థాయిలో దాడులను ముమ్మరం చేస్తున్నట్లు ప్రకటించిన ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, AFP
గాజాలో క్షేత్ర స్థాయిలో దాడులను ముమ్మరం చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
"మేం గాజాలో దాడులను పెంచాం. ఈ సాయంత్రం భూ బలగాలతో దాడులను తీవ్రతరం చేస్తాం. వైమానిక దళం కూడా భూగర్భ లక్ష్యాలు, తీవ్రవాద మౌలిక సదుపాయాలపై విస్తృతంగా దాడి చేస్తుంది'' అని ఇజ్రాయెల్ రక్షణ ధళాల ప్రతినిధి డేనియల్ హగారి శుక్రవారం ప్రకటించారు.
గాజా పౌరులను దక్షిణ గాజాకు వెళ్లాల్సిందిగా ఇజ్రాయెల్ సైన్యం మరోసారి సూచించింది. కాగా, గాజాలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
