తెలంగాణ: మరో 45 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

గతంలో అభ్యర్థులను ప్రకటించిన 55 స్థానాలను కలుపుకొంటే 100 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా 19 స్థానాలకు ప్రకటించాల్సి ఉంది.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. అలిపిరి నడక మార్గంలో చిరుతపులి, ఎలుగుబంటి సంచారం

    చిరుతపులి

    తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో ఈ నెల 24 నుంచి 27వ తేదీ మధ్యలో శ్రీ లక్ష్మీ నారాయణస్వామి ఆలయం నుంచి రిపీటర్ మధ్య ప్రాంతంలో ఒక చిరుతపులి, ఒక ఎలుగుబంటి తిరుగుతున్నట్టుగా కెమెరాల్లో రికార్డు అయ్యిందని టీటీడీ తెలిపింది.

    నడకదారి భక్తులు అప్రమత్తంగా ఉండాలని, భక్తులు గుంపులు గుంపులుగానే వెళ్లాలని టీటీడీ హెచ్చరించింది.

    ఎలుగుబంటి
  3. తెలంగాణ: మరో 45 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్, బళ్ల సతీశ్, అమరేంద్ర యార్లగడ్డ, బీబీసీ ప్రతినిధులు

    కాంగ్రెస్ జెండా

    ఫొటో సోర్స్, Getty Images

    తెలంగాణ అసెంబ్లీఎన్నికలకు 45 మంది అభ్యర్థులతో శుక్రవారం రాత్రి ఏఐసీసీ మరో జాబితాను విడుదల చేసింది. గతంలో అభ్యర్థులను ప్రకటించిన 55 స్థానాలను కలుపుకొంటే 100 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా 19 స్థానాలకు ప్రకటించాల్సి ఉంది.

    కాంగ్రెస్ శుక్రవారం ప్రకటించిన జాబితాలోని 45 మంది అభ్యర్థులు వీరే

    • సిర్పూర్‌- రావి శ్రీ‌నివాస్‌
    • ఆసిఫాబాద్ (ఎస్టీ)- అజ్మీరా శ్యామ్‌
    • ఖానాపూర్ (ఎస్టీ)- ఎడ‌మ‌ భొజ్జు
    • ఆదిలాబాద్‌- కంది శ్రీ‌నివాస‌రెడ్డి
    • బోధ్‌- వెన్నెల అశోక్‌
    • ముధోల్‌- భోస్తే నారాయ‌ణ రావ్ పాటిల్‌
    • ఎల్లారెడ్డి- కె. మ‌ద‌న్‌మోహ‌న్‌రావు
    • నిజామాబాద్ రూర‌ల్‌- రేచుల‌ప‌ల్లి భూప‌తిరెడ్డి
    • కోర‌ట్ల‌- జువ్వాది న‌ర‌సింగ‌రావు
    • చొప్ప‌దండి- మేడిప‌ల్లి స‌త్యం
    • హుజూరాబాద్‌- వ‌డిత‌ల ప్ర‌ణ‌వ్‌
    • హుస్నాబాద్‌- పొన్నం ప్ర‌భాక‌ర్‌
    • సిద్ధిపేట‌- పూజ‌ల హ‌రికృష్ణ‌
    • న‌ర‌సాపూర్‌- ఆవుల రాజిరెడ్డి
    • దుబ్బాక‌- చెరుకు శ్రీ‌నివాస్‌రెడ్డి
    • కూక‌ట్‌ప‌ల్లి- బండి ర‌మేష్‌
    • ఇబ్ర‌హీంప‌ట్నం- మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి
    • ఎల్‌.బి.న‌గ‌ర్‌- మ‌ధుయాష్కీ
    • మ‌హేశ్వ‌రం- కిచ్చెన్న‌గారి ల‌క్ష్మారెడ్డి
    • రాజేంద‌ర్ న‌గ‌ర్‌- క‌స్తూరి న‌రేంద‌ర్‌
    • శేరిలింగంప‌ల్లి- వీ. జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌
    • తాండూరు- బి.మ‌నోహ‌ర్‌రెడ్డి
    • అంబ‌ర్‌పేట్‌- రోహిన్ రెడ్డి
    • ఖైర‌తాబాద్‌- పి. విజ‌యారెడ్డి
    • జూబ్లీహిల్స్‌- మ‌హ్మ‌ద్ అజారుద్దీన్‌
    • సికింద్రాబాద్ కంటోన్నెంట్‌- జీ.వి. వెన్నెల (గ‌ద్ద‌ర్ కుమార్తె)
    • నారాయ‌ణ్‌పేట్‌- పర్ణిక చిట్టెంరెడ్డి
    • మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌- ఎన్నెం శ్రీ‌నివాస‌రెడ్డి
    • జ‌డ్చ‌ర్ల‌- జే. అనిరుధ్‌రెడ్డి
    • దేవ‌ర‌క‌ద్ర‌- గ‌వినోళ్ల మ‌ధుసూద‌న్‌రెడ్డి
    • మ‌క్త‌ల్‌- వాకిటి శ్రీ‌హ‌రి
    • వ‌న‌ప‌ర్తి- జి. చిన్నారెడ్డి
    • దేవ‌ర‌కొండ‌- నేనావ‌త్ బాలూ నాయ‌క్‌
    • మునుగోడు- కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి
    • భువ‌న‌గిరి- కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
    • జ‌న‌గాం- కొమ్మూరి ప్ర‌తాప్‌రెడ్డి
    • పాల‌కుర్తి- య‌శ‌శ్వినీ ఎం.
    • మహ‌బూబాబాద్‌- డాక్ట‌ర్ ముర‌ళీనాయ‌క్‌
    • ప‌ర‌కాల‌- రేవూరి ప్ర‌కాశ్‌రెడ్డి
    • వ‌రంగ‌ల్ ప‌డ‌మ‌ట‌- నాయ‌ని రాజేంద‌ర్‌రెడ్డి
    • వ‌రంగ‌ల్ తూర్పు- కొండా సురేఖ‌
    • వ‌ర్ధ‌న్న‌పేట‌- కే.ఆర్‌. నాగ‌రాజు
    • పిన‌పాక‌- పాయం వెంక‌టేశ్వ‌ర్లు
    • ఖ‌మ్మం- తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు
    • పాలేరు- పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

    కాంగ్రెస్ అభ్యర్థులు ఇంకా ప్రకటించని 19 నియోజకవర్గాలు ఇవే:

    1.వైరా

    2.కొత్తగూడెం

    3.మిర్యాలగూడ

    4.చెన్నూరు

    5. చార్మినార్

    6.నిజామాబాద్ అర్బన్

    7.కామారెడ్డి

    8. సిరిసిల్ల

    9.సూర్యాపేట

    10.తుంగతుర్తి

    11.బాన్సువాడ

    12.జుక్కల్

    13.పఠాన్ చెరువు

    14.కరీంనగర్

    15.ఇల్లందు

    16.డోర్నకల్

    17.సత్తుపల్లి

    18.నారాయణ్ ఖేడ్

    19.అశ్వారావుపేట

  4. ఈ వెయ్యి పిల్లులను ఎందుకు చంపాలనుకున్నారు?

  5. చంద్రబాబుపై ఎంపీ గోరంట్ల మాధవ్ అనుచిత వ్యాఖ్యలు... రిమాండ్‌లో ఉన్న వ్యక్తి గురించి చట్టసభల సభ్యుడు అలా మాట్లాడవచ్చా?

  6. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌‌పై చదివితే మెదడుకు ఏమవుతుంది?

  7. షాపులో బంగారం చోరీ.. ‘బొమ్మ’ అరెస్ట్

  8. హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా భారత్ ఎందుకు ప్రకటించలేదు?

  9. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఎందుకు చేర్చారు... ఏ అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు?

  10. పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మాలిక్‌ను అరెస్ట్ చేసిన ఈడీ, ప్రభాకర్ మణి తివారీ, బీబీసీ ప్రతినిధి

    జ్యోతిప్రియా మాలిక్

    ఫొటో సోర్స్, Sanjay Das/BBC

    'రేషన్ పంపిణీ కేసు'లో పశ్చిమ బెంగాల్ అటవీ శాఖ మంత్రి జ్యోతిప్రియ మాలిక్‌ను శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది.

    గురువారం ఉదయం నుంచి ఈడీ బృందం ఆయనకు సంబంధించిన ఆస్తులపై దాడులు చేసింది. దాదాపు 20 గంటల పాటు ఈ సెర్చ్ ఆపరేషన్ జరిగింది.

    అనంతరం తెల్లవారుజామున 3 గంటలకు మంత్రిని అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారి ఒకరు తెలిపారు. జ్యోతిప్రియా మాలిక్ గతంలో ఆహార, సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు.

    తనపై కుట్ర జరిగిందని, దీనిలో బీజేపీ నేత సువేందు అధికారి ప్రమేయముందని మంత్రి జ్యోతిప్రియా మాలిక్ ఆరోపించారు.

    కాగా, మాలిక్ ఇంటిపై ఈడీ దాడులను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం ఖండించారు. ఆయనకు ఏదైనా జరిగితే బీజేపీ, ఈడీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని తెలిపారు.

  11. మార్టిన్ లూథ‌ర్ కింగ్ రివ్యూ: సంపూర్ణేశ్ తెలుగు ఓటరును మెప్పించాడా... ఈ సినిమాకూ ఏపీ రాజకీయాలకూ సంబంధమేంటి?

  12. ఆ 'దెయ్యం' ఎప్పుడూ అక్కడే, అదే సమయానికి కచ్చితంగా కనిపించడమేంటి... ఏమిటీ రహస్యం?

  13. బ్రేకింగ్ న్యూస్, తూర్పు సిరియాలోని రెండు ప్రాంతాలపై అమెరికా దాడులు

    అమెరికా

    ఫొటో సోర్స్, Getty Images

    తూర్పు సిరియాలో ఇరానీ దళాలు, దాని అనుబంధ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్న రెండు ప్రదేశాలపై ఆమెరికా దాడులు చేసింది.

    ఇరాక్, సిరియాలోని తమ సైనికులను రక్షించడానికే ఈ దాడులు చేస్తున్నట్లు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఒక ప్రకటనలో తెలిపారు.

    ఇరాన్ మద్దతుతో నడుస్తున్న మిలీషియా గ్రూపుల దాడులకు ప్రతిస్పందనగా ఈ చర్య జరిగినట్లు ఆయన చెప్పారు.

    అమెరికా బలగాలపై ఇరాన్-మద్దతుతో దాడులు చేయడం ఆమోదయోగ్యం కాదని, వాటిని అనుమతించబోమని ఆస్టిన్ పేర్కొన్నారు.

    ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపుల దాడులు ఇలాగే కొనసాగితే అమెరికా తదుపరి చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు.

    ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య కొనసాగుతున్న సంఘర్షణతో దీనికి సంబంధంలేదని కూడా ఆయన తెలిపారు.

    ఇటీవల ఇరాక్, సిరియాలలో జరిగిన దాడులలో 21 మంది అమెరికా సైనికులు గాయపడ్డారని యూఎస్ రక్షణ శాఖ తెలిపింది.

  14. హమాస్ కమాండర్‌ను హతమార్చాం అని ప్రకటించిన ఇజ్రాయెల్

    గాజా నగరంలోని ఓ వీధి

    ఫొటో సోర్స్, EPA

    ఇజ్రాయెల్ తూర్పు సరిహద్దు ప్రాంతంలోని తాజాలోని వైద్య కేంద్రం వద్ద పేలుడు సంభవించిందని ఈజిప్ట్ మీడియా సంస్థ అల్-ఖహెరా తెలిపింది.

    ఆ పేలుడు మిసైల్ వల్ల జరిగిందని చెప్పినప్పటికీ, దానిని ప్రయోగించింది ఎవరన్నది వెల్లడించలేదు.

    ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారని తెలిసింది.

    మరోవైపు, అక్టోబర్ 7 నాటి రాకెట్ దాడులకు పథకం పన్నిన హమాస్ కమాండర్‌ను హతమార్చామని ఇజ్రాయెల్ ప్రకటించింది.

    హమాస్ ఇంటలిజెన్స్ విభాగం డిప్యూటీ హెడ్ షాదీ బారుద్‌ను తమ ఫైటర్ జెట్స్ మట్టుబెట్టాయని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) తెలిపాయి.

    'బారుద్ గాజాలోని హమాస్ హెడ్ యాహ్యా సిన్వర్‌తో కలసి దారుణమైన రాకెట్ దాడులకు పథకం రచించారు' అని ఐడీఎఫ్ వైమానిక దాడుల వీడియోలో ప్రకటించింది.

  15. చైనా మాజీ ప్రధానమంత్రి, ఆర్థికవేత్త లీ కెకియాంగ్ మృతి

    లీ కెకియాంగ్

    ఫొటో సోర్స్, Getty Images

    చైనా మాజీ ప్రధానమంత్రి, ఆర్థికవేత్త లీ కెకియాంగ్ మరణించారని ఆ దేశ అధికారిక మీడియా ప్రకటించింది. ఆయన వయసు 68 ఏళ్ళు.

    లీ కెకియాంగ్ గత ఏడాది రిటైరయ్యేంత వరకు పాలక చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీలో రెండవ అత్యంత శక్తిమంతమైన నేతగా కొనసాగారు.

    గురువారం నాడు కెకియాంగ్‌కు గుండెపోటు వచ్చిందని, ఆయన షాంఘైలో 'విశ్రాంతి' తీసుకుంటున్నారని మీడియా తెలిపింది.

    అయితే, శుక్రవారం అర్ధరాత్రి ఆయన పరిస్థితి విషమించిందని, అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ రక్షించలేకపోయారని స్టేట్ బ్రాడ్‌కాస్టర్ సీసీటీవీ వెల్లడించింది.

    ప్రఖ్యాత పెకింగ్ యూనివర్శిటీలో చదివిన కెకియాంగ్, ఆర్థిక విధానాల్లో ఆచరణాత్మక పద్ధతులను అవలంభించడంలో పేరుగాంచారు.

    కెకియాంగ్‌కి పార్టీలో మంచి పట్టుంది, అధ్యక్షుడి స్థానానికి పోటీపడేంత బలమైన నాయకుడిగా ఎదిగారాయన.

    చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ విధేయుల బృందానికి చెందని ఏకైక ఉన్నతాధికారి ఆయనే.

    అయితే జిన్‌పింగ్ తన చుట్టూ అధికారాన్ని కూడగట్టుకోవడంతో లీ కెకియాంగ్ తన కెరీర్ చివరలో పక్కకు తప్పుకున్నారని విశ్లేషకులు చెప్పారు.

  16. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.