You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

హమాస్ దాడుల గురించి బైడెన్ ఏమన్నారు?

ఇజ్రాయెల్‌పై హమాస్ దాడుల గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టెలివిజన్ ప్రసంగంలో మాట్లాడారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. ది గ్రేట్ ట్రైన్ రాబరీ: రైల్లో చొరబడి 120 డబ్బు సంచులను దోచుకెళ్లారు.. థ్రిల్లర్ సినిమాను తలదన్నే ఈ దోపిడీ ఎలా జరిగింది?

  3. గగన్‌యాన్: శ్రీహరికోట నుంచి కాసేపట్లో టెస్ట్ ఫ్లైట్ ప్రయోగించనున్న ఇస్రో

  4. గోల్కొండ వజ్రాలతో ఆ యూదుల దశ ఎలా తిరిగింది?

  5. తెలంగాణ ఎన్నికలు: ట్రక్, రోడ్ రోలర్, ఆటో రిక్షా గుర్తులు 2018లో చూపిన ప్రభావం ఏమిటి?

  6. ఇజ్రాయెల్‌: శిథిలాల కింద కాళ్లకు లోహపు వైర్లతో నగ్నంగా మహిళ శవం.. మరో చోట 20 మంది పిల్లలను బంధించి దహనం చేశారు

  7. క్రికెట్ వరల్డ్ కప్: విరాట్ కోహ్లీ సెంచరీ కోసం సెల్ఫిష్‌గా ఆడారా... అవతలి వైపు క్రీజులో ఉన్న కేఎల్ రాహుల్ ఏం చెప్పాడు?

  8. ప్రపంచ కప్: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా దూరం

    కాలిమడమ గాయం కారణంగా ధర్మశాలలో అక్టోబర్ 22న న్యూజిలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌కు భారత్ జట్టు వైస్ కెప్టెన్ హార్డిక్ పాండ్యా దూరమయ్యారు.

    ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కాలిని స్కాన్ చేసిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని అందులో పేర్కొంది.

    ఆయన బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉండనున్నారు. అక్టోబర్ 20న ధర్మశాల వెళ్లనున్న భారత్ జట్టులో హార్డిక్ పాండ్యా లేరు. లఖ్‌నవూలో ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌‌ నాటికి ఆయన జట్టుకి అందుబాటులోకి వస్తారని బీసీసీఐ తెలిపింది.

    బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 9వ ఓవర్ వేస్తున్న సమయంలో హార్డిక్ పాండ్యా కాలికి గాయమైంది. ఓవర్‌లో మూడో బంతిని బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ లిటన్ దాస్ స్ట్రెయిట్ డ్రైవ్ షాట్ కొట్టారు. ఈ బంతి బౌండరీ వైపు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నంలో హార్దిక్ పాండ్యా కాలి మడమకు గాయమైంది.

    వెంటనే మైదానంలోకి వచ్చిన ఫిజియోథెరపిస్ట్ కాలిని సరిచేసే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో హార్డిక్ పాండ్యా గ్రౌండ్ వీడాల్సి వచ్చింది.

  9. ఇరాక్‌లో అమెరికన్ భద్రతా దళాలపై డ్రోన్ దాడుల వార్తలు

    ఇరాక్‌లో అమెరికా సైనికులు ఉన్న సైనిక స్థావరంపై రాకెట్లు, డ్రోన్లతో దాడి జరిగింది.

    ఎయిన్ అల్ అసద్ ఎయిర్‌బేస్ లోపల పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు భద్రతా దళాలు చెప్పాయని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ఇరాక్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు పేర్కొంది.

    ఈ దాడిలో ఎంతమంది చనిపోయారు. ఎంతమందికి గాయాలయ్యాయనే వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు.

    ఇరాక్, సిరియాలో అమెరికా భద్రతా దళాలపై మంగళవారం నుంచి డ్రోన్ దాడులు జరుగుతున్నాయని పెంటగాన్ తెలిపింది. ''ఇరాన్ మద్దతు ఉన్న కొన్ని మిలీషియా సంస్థలు ఈ దాడులు చేశాయి. వీటిపై దర్యాప్తు కొనసాగుతోంది. సమాచారం సేకరిస్తున్నాం'' అని పెంటగాన్ ప్రతినిధి బ్రిగేడియర్ ప్యాట్ రైడర్ చెప్పారు.

  10. కామసూత్రలోనే వాత్సాయనుడు స్వలింగ సంపర్కం గురించి రాశారా? భారత చరిత్రలో ఈ లైంగికత మూలాలు ఎక్కడ ఉన్నాయి?

  11. ఆంధ్రప్రదేశ్: వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఎస్సీల పరిస్థితి ఏంటి... కొత్త కాలనీలు పూర్తయితే మార్పు వస్తుందా?

  12. భారత్ నుంచి 41 మంది దౌత్యవేత్తలను వెనక్కి రప్పించిన కెనడా... దీని ప్రభావం ఎలా ఉండబోతోంది?

  13. పుతిన్, హమాస్‌ను గెలవనివ్వనన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

    టెర్రరిస్టులు, నియంతలు తగిన మూల్యం చెల్లించాల్సిందే అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఇజ్రాయెల్ పర్యటన అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

    యుక్రెయిన్, ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న సమస్యల మధ్య సారూప్యత ఉందని ప్రసంగంలో ఎత్తిచూపే ప్రయత్నం జరిగింది. ఆ రెండు దేశాలకు మద్దతుగా ప్యాకేజీకి ఆమోదం తెలపడంతో పాటు చర్యలు తీసుకునేందుకు సహకరించాలని బైడెన్ కాంగ్రెస్‌ను కోరారు.

    అదనంగా ఎంత సాయం చేయాలనుకుంటున్నది బైడెన్ ప్రస్తావించలేదు. అయితే, అది వందల బిలియన్ డాలర్లలో (లక్షల కోట్ల రూపాయలు) ఉండే అవకాశం ఉంది.

    ''హమాస్, పుతిన్ బెదిరింపులు వేర్వేరు అయినప్పటికీ వాటి లక్ష్యం ఒకటే. పొరుగు దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలనుకుంటున్నారు.

    ఒకవేళ మనం పుతిన్ అధికార, ఆధిపత్య దాహాన్ని నిలువరించకపోతే ఇది యుక్రెయిన్‌తో ఆగదు'' అని బైడెన్ అన్నారు.

    మరోవైపు ''హమాస్ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది''. అలాగే, ''బందీలుగా ఉన్న అమెరికన్ల భద్రత కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు'' అని నొక్కి చెప్పారు బైడెన్.

    ఆ రెండు ఘర్షణలు అమెరికన్లతో పెద్దగా సంబంధం లేదనే భావనలను కూడా ఆయన ప్రస్తావించారు. ''ఇజ్రాయెల్, యుక్రెయిన్ విజయం సాధించడం అమెరికా జాతీయ భద్రతకు కూడా చాలా ముఖ్యం'' అని బైడెన్ పేర్కొన్నారు.

  14. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.