ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
గత రెండేళ్లుగా పార్టీలో జరుగుతున్న పరిణామాల మీద పీసీసీ అధ్యక్షుడితో మాట్లాడటానికి చాలాసార్లు ప్రయత్నిస్తే కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, AFP
ఫ్రాన్స్‌లోని ఓ పాఠశాలలో దుండగుడు కత్తితో దాడి చేయడంతో అక్కడి టీచర్ మృతి చెందారు. ఈ ఘటనలో మరో టీచర్, సెక్యూరిటీ గార్డు తీవ్రంగా గాయపడ్డారు.
అరాస్ నార్త్ సిటీలోని గంబెట్టా హైస్కూల్‌లో శుక్రవారం ఉదయం ఈ దాడి జరిగిందని మంత్రి గెరాల్డ్ డర్మానిన్ తెలిపారు.
హత్యకు గురైన వ్యక్తి ఫ్రెంచ్ లాంగ్వేజ్ టీచర్. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
దాడి సమయంలో "అల్లాహు అక్బర్" అని నిందితుడు అరిచాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
నిందితుడు పాఠశాల పూర్వ విద్యార్థి అని ఫ్రాన్స్ మీడియా చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో 2028లో జరిగే ఒలింపిక్ గేమ్స్‌లో క్రికెట్, స్క్వాష్‌లతో పాటు మరో మూడు ఆటలు చేర్చాలని సిఫార్సు చేస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బ్యాచ్ అన్నారు.
శుక్రవారం ఆయన ముంబయిలో మీడియాతో మాట్లాడారు.
"లాస్ ఏంజిల్స్‌లో జరిగే 2028 ఒలింపిక్స్ కోసం ఐవోసీ మూడు నిర్ణయాలు తీసుకోవలసి ఉంది. అందులో ఒకటి ఐదు కొత్త క్రీడలను ప్రవేశపెట్టడం. ఈ ఐదు క్రీడలు- క్రికెట్, బేస్ బాల్, సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, స్క్వాష్" అని ఆయన అన్నారు.
క్రికెట్‌ను ప్రవేశపెట్టాలనేది ప్రతిపాదన మాత్రమేనన్నారు థామస్ బ్యాచ్. దీనికోసం ఐసీసీతో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఎన్ని జట్లు పాల్గొనాలనేది నిర్ణయించలేదని చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ అక్టోబరు 17 మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా పడింది.
ఆయన పిటిషన్‌పై ఈ రోజు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ఎదుట వాదనలు కొనసాగాయి. తర్వాత విచారణ మంగళవారానికి వాయిదా పడింది.
ఈ కేసులో అరెస్టైన చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉంచారు.
ఫైబర్‌నెట్ కేసు: ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం మంగళవారానికి వాయిదా వేసింది.
ఈ కేసులో బుధవారం వరకు చంద్రబాబును అరెస్టు చేయబోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టుకు తెలిపారు.

ఫొటో సోర్స్, FaceBook/Ponnala lakshmaiah
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తన రాజీనామా లేఖను పంపారు.
పార్టీలో తనకు అవమానం జరిగిందంటూ లేఖలో పేర్కొన్నారు.
గత రెండేళ్లుగా పార్టీలో జరుగుతున్న పరిణామాల మీద పీసీసీ అధ్యక్షుడితో మాట్లాడటానికి చాలాసార్లు ప్రయత్నిస్తే కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు.
బయట కలిసినప్పుడు కూడా నమస్కారం పెడితే మాట్లాడకుండా, చూడకుండా తనను అవమానించిన సందర్భాలు ఉన్నాయని లేఖలో రాశారు.
ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే కనీసం ఒక్కసారి కూడా బదులు ఇవ్వలేదని పేర్కొన్నారు.
పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని అన్నారు.


ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shutterstock
గాజా స్ట్రిప్‌లోని ఒక ప్రాంతం నుంచి ప్రజలను ఖాళీ చేయించాలన్న ఇజ్రాయెల్ నిర్ణయం ఒక మానవతా చర్య అని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి జొనాథన్ కాన్రికస్ అన్నారు.
ప్రజల ప్రాణాలను కాపాడటమే తమ ఉద్దేశమని, సామాన్యులు తమకు శత్రువులు కాదని ట్విటర్‌లో ఆయన పేర్కొన్నారు.
అంతర్జాతీయ సాయుధ పోరాట చట్టాలకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.
గాజా స్ట్రిప్‌లో దాడి సమయంలో సామాన్యుల ప్రాణాలకు ముప్పు కలగకూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు.
‘‘ప్రజలను ఖాళీ చేయించడానికి సమయం పడుతుందని మాకు తెలుసు. ఇది అంత సులభమైన ప్రక్రియ కూడా కాదు’’ అని ట్వీట్‌లో రాశారు.
ఇజ్రాయెల్ ఆదేశాలు గాజాలోని దాదాపు సగం జనాభాను ప్రభావితం చేస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రాణాలను కాపాడుకునేందుకు ఉత్తర గాజా నుంచి వెళ్లిపోవాలని పౌరులకు ఇజ్రాయెల్ చెబుతుండగా, ఇజ్రాయెల్ చెప్పే మాటలు వినొద్దని ప్రజలను హమాస్ కోరుతోంది.
ఉత్తర గాజా నుంచి ప్రజలంతా దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశించడాన్ని ‘‘నకిలీ ప్రచారం’’ అని హమాస్ అధికారి ఒకరు అభివర్ణించారు.
ఇజ్రాయెల్ ఆదేశాలను పట్టించుకోవద్దని చెప్పారు.
హమాస్ సంస్థ, తమ ఫైటర్లను కాపాడుకోవడానికి అమాయక ప్రజలను మానవ కవచాలుగా ఉపయోగిస్తోందంటూ చాలా కాలంగా అంతర్జాతీయ సమాజం విమర్శిస్తోంది.
2006 ఎన్నికల్లో గెలిచిన తర్వాత గాజా స్ట్రిప్‌లో హమాస్ అధికారంలోకి వచ్చింది.

ఫొటో సోర్స్, Maxar Technologies
గాజాపై గడిచిన ఆరు రోజుల్లో 6,000 బాంబులు జారవిడిచినట్లు ఇజ్రాయెల్ చెప్పింది.
ఈ బాంబుల బరువు 4,000 టన్నులు ఉంటుందని తెలిపింది.
గాజాలోని 3,600లకు పైగా లక్ష్యాలపై బాంబులు వేసినట్లు ఇజ్రాయెల్ వైమానిక దళం వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర గాజాలో నివసించే ప్రతీ ఒక్కరినీ వచ్చే 24 గంటల్లో దక్షిణ గాజాకు తరలించాలని ఇజ్రాయెల్ కోరినట్లు ఐక్యరాజ్యసమితి (యూఎన్) అధికార ప్రతినిధి చెప్పారు.
ఉత్తర గాజాలో దాదాపు 11 లక్షల మంది ఉంటారని యూఎన్ వెల్లడించింది. అంటే మొత్తం గాజా స్ట్రిప్ జనాభాలో దాదాపు సగం అన్నమాట. అత్యధిక జనసాంద్రత ఉండే గాజా నగరం కూడా ఇక్కడే ఉంటుంది.
గాజా, జెరూసలేం కాలమానం ప్రకారం అర్ధరాత్రి యూఎన్‌కు ఇజ్రాయెల్ ఈ హెచ్చరిక ఉత్తర్వును పంపింది.
ఇంత తక్కువ సమయంలో 11 లక్షల మందిని తరలించడం అసాధ్యమని ఐక్యరాజ్య సమితి భావిస్తోంది.
వెంటనే ఈ హెచ్చరిక ఉత్తర్వును రద్దు చేయాలని ఇజ్రాయెల్‌ను యూఎన్ కోరింది.
గాజా సరిహద్దులో యుద్ధ ట్యాంకులు, భారీ ఆయుధాలు, సైనికులను పోగు చేస్తోన్న ఇజ్రాయెల్, గాజాపై దాడులకు సన్నద్ధం అవుతోంది.
ఇజ్రాయెల్ మీద హమాస్ మిలిటెంట్ల అనూహ్య దాడుల తర్వాత శనివారం నుంచి గాజా మీద ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తోంది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.