ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 447 మంది చిన్నారులు మృతి: పాలస్తీనా అధికారులు

ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 1,417 మంది చనిపోయినట్లు పాలస్తీనా అధికారులు చెప్పారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

    ధన్యవాదాలు.

  2. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 447 మంది చిన్నారులు మృతి

    గాజాపై ఇజ్రాయెల్ దాడులు

    ఫొటో సోర్స్, Getty Images

    ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 1,417 మంది చనిపోయినట్లు పాలస్తీనా అధికారులు చెప్పారు.

    వారిలో 447 మంది చిన్నారులు ఉన్నట్లు తెలిపారు.

    ఇజ్రాయెల్ దాడుల్లో 6,268 మందికి గాయాలైనట్లు పాలస్తీనా భూభాగంలోని ఆరోగ్య శాఖా మంత్రి వెల్లడించారు.

    3,38,000 మంది పాలస్తీనా వాసులు నిరాశ్రయులుగా మారారని లేదా తమ ఇళ్లను విడిచిపెట్టాల్సి వచ్చిందని చెప్పారు.

    అదే విధంగా ఇజ్రాయెల్‌లో హమాస్ జరిపిన దాడుల్లో మరణాల సంఖ్య 1,300కి చేరుకుంది.

    గాజా సిటీ కరెస్పాండెంట్ రుష్ది అబు అలూఫ్ గాజా నగరంలోని అల్ షిఫా హాస్పిటల్‌ను సందర్శించారు. ఈ హాస్పిటల్‌లో 2 వేల మంది ఆశ్రయం పొందుతున్నారు.

  3. రెండో ప్రపంచ యుద్ధంలో మాదిరి ఇజ్రాయెల్‌పై దాడికి హమాస్ పారాచూట్లను ఎలా వాడింది?

  4. అమిత్ షాతో భేటీలో తెలంగాణ ఎన్నికలు, ఏపీలో పొత్తులు చర్చకు రాలేదు: లోకేశ్

    నారా లోకేశ్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, నారా లోకేశ్

    కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీలో రాజకీయాలుగానీ, పొత్తులుగానీ చర్చకు రాలేదని తెలుగుదేశం పార్టీప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పారు.

    తెలంగాణ ఎన్నికల అంశంగానీ,ఏపీలో రాజకీయ పొత్తుల అంశం కానీ తమ మధ్య చర్చకు రాలేదని ఆయన గురువారం దిల్లీలో చెప్పారు.

    టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి అరెస్టు వెనుక బీజేపీ లేదని అమిత్ షా తనతో అన్నారని ఆయన చెప్పారు. చంద్రబాబు అరెస్ట్, ఆ తరువాత పరిణామాలు, ఆయన ఆరోగ్యం గురించి అమిత్ షా తనను వివరాలు అడిగారని తెలిపారు. జైలులో చంద్రబాబు భద్రత, ఆయన ఆరోగ్యం విషయంలో తమకున్న ఆందోళనలను అమిత్ షాకు వివరించానని చెప్పారు.

    ‘‘కిషన్ రెడ్డి నాకు ఫోన్ చేసి, అమిత్ షా కలవాలనుకుంటున్నారని చెప్పారు’’

    తనకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫోన్ చేసి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కలవాలనుకుంటున్నారని చెప్పారని, దాంతో ఆయన్ను కలిసేందుకు వెళ్లానని తెలిపారు.

    ఆంధ్రప్రదేశ్ మంత్రి ఒకరు, వైసీపీ ఎంపీ ఒకరు చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉన్నట్లు వ్యాఖ్యలు చేశారని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లానని, చంద్రబాబు అరెస్టు వ్యవహారానికి బీజేపీకి సంబంధం లేదని ఆయన చెప్పారని తెలిపారు.

    ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ విషయంలో బీజేపీపై నిందలు మోపేలా వ్యవహరిస్తున్నారని అన్నారని లోకేశ్ చెప్పారు.

    చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టారు, ఏమేం ఆరోపణలు చేశారు వంటి వివరాలన్నీ అమిత్ షా అడిగారని, అన్నీ రాజకీయ కక్షతో పెట్టిన కేసులేనని ఆయనకు చెప్పానని లోకేశ్ తెలిపారు.

  5. తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం: షర్మిల

    వైఎస్ షర్మిల

    తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ(వైఎస్‌ఆర్‌టీపీ) పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు.

    తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని ఆమె చెప్పారు. రెండో చోట నుంచి కూడా పోటీ చేయాలనే డిమాండ్ ఉందన్నారు.

    బీ-ఫామ్‌ల కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చని చెప్పారు.

    అవసరమైతే తన భర్త అనిల్, తల్లి విజయమ్మ ఇద్దరూ పోటీ చేస్తారని చెప్పారు.

    వైఎస్ షర్మిల
  6. చికెన్ బిర్యానీ 100, మటన్ బిర్యానీ 150.. తెలంగాణలో అభ్యర్థుల ఖర్చుల్లో అంతకంటే తక్కువ చూపించడానికి వీల్లేదు

  7. గుంటూరు జిల్లాలో ‘యూదులు’.. ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంపై వీరు ఏమంటున్నారు?

  8. హమాస్ దాడితో ‘పాలస్తీనా ప్రత్యేక దేశం’ కల చెదిరిపోతుందా?

  9. భారత్-పాకిస్తాన్ క్రికెట్: ఇరుజట్లు మైదానంలో బద్ధశత్రువులే, కానీ బయట మంచి మిత్రులు....

  10. 'ప్రతి హమాస్ సభ్యుడు చనిపోయిన వ్యక్తే'.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

    నెతన్యాహు

    ఫొటో సోర్స్, REUTERS

    ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

    తమ దృష్టిలో ప్రతి హమాస్ సభ్యుడు చనిపోయిన వ్యక్తేనని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు.

    ఇజ్రాయెల్ ఎమర్జెన్సీ గవర్నమెంట్ మొదటి సమావేశం అనంతరం ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

    ఇది యుద్ధానికి సమయమని ప్రధానితో పాటు, ప్రతిపక్ష నేత బెన్నీ గాంట్జ్ కూడా పిలుపునిచ్చారు.

    కొద్దిరోజులుగా సాగుతున్న హమాస్, ఇజ్రాయెల్ భీకర యుద్ధంలో గాజాలో 1,100 మంది, ఇజ్రాయెల్‌లో 1,200 మంది పౌరులు మరణించారు.

    ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ యుద్ధ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని నెతన్యాహుకు సూచించినట్లు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తెలిపారు. జెనీవా ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని కోరినట్లు ఆయన చెప్పారు.

  11. గాజాలో కరెంటు కోత: ‘వెలిగించడానికి కొవ్వొత్తులు కూడా లేవు, ఈ చీకటిలో ఎలా బతకాలి’

  12. అమిత్ షాను కలిసిన నారా లోకేశ్.. చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని హోంమంత్రికి ఫిర్యాదు

    అమిత్ షాను కలిసిన నారా లోకేశ్

    ఫొటో సోర్స్, ANI

    కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కలిశారు.

    బుధవారం రాత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిలతో కలిసి దిల్లీలో అమిత్ షాతో ఆయన భేటీ అయ్యారు.

    ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టు విషయాన్ని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు లోకేశ్ ట్విటర్‌లో పేర్కొన్నారు.

    'ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోంది, చంద్రబాబుపై ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని అమిత్ షాకు వివరించా. జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లా'' అని తెలిపారు లోకేశ్.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. పట్టాలు తప్పిన నార్త్‌ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్, నలుగురు మృతి

    రైలు

    ఫొటో సోర్స్, Getty Images

    దిల్లీ-కామాఖ్య నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం రాత్రి పట్టాలు తప్పింది.

    ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో 32 మంది గాయపడ్డారని తూర్పు మధ్య రైల్వే ప్రతినిధి బీబీసీకి తెలిపారు.

    బిహార్‌లోని బక్సర్-అరా మధ్య రఘునాథ్‌పూర్ స్టేషన్‌ సమీపంలో బుధవారం రాత్రి 9:53 గంటల ప్రాంతంలో ఈ రైలు ప్రమాదానికి గురవడంతో 23 కోచ్‌లు పట్టాలు తప్పాయి.

    ప్రయాణికులను తెల్లవారుజామున 3 గంటలకు ప్రత్యేక రైలులో కామాఖ్యకు పంపారు.

    క్షతగాత్రులను పట్నాలోని ఎయిమ్స్‌తో పాటు అర్రా, బక్సర్ జిల్లాల్లోని వివిధ ఆసుపత్రులలో చేర్చారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. ప్రపంచ దృష్టి దినోత్సవం: ఇలా చేస్తే మీ కంటి ఆరోగ్యం గురించి తెలుస్తుంది

  15. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

  16. చలపతి రావు ఇక లేరు... మూడు తరాల కథానాయకులతో నటించిన వైవిధ్య నటుడు

  17. కైకాల సత్యనారాయణ: ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్ వంటి హీరోలతో తెరపై పోరాడిన విలన్

  18. దేశంలో కరోనా మృతుల సంస్మరణ కోసం ఆన్‌లైన్ మెమోరియల్