వన్డే వరల్డ్ కప్‌లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ

వన్డే వరల్డ్ కప్‌లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త రికార్డు సృష్టించాడు.

లైవ్ కవరేజీ

  1. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ ఇంతటితో ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. అఫ్గానిస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో భారత్ విజయం, 63 బంతుల్లోనే రోహిత్ సెంచరీ

    రోహిత్ శర్మ

    ఫొటో సోర్స్, Gett

    ప్రపంచ కప్‌లో భాగంగా దిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

    వన్డే వరల్డ్ కప్‌లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త రికార్డు సృష్టించాడు.

    రోహిత్ శర్మ కేవలం 84 బంతుల్లోనే 131 స్కోర్‌ను కొట్టడంతో అఫ్గాన్ నిర్దేశించిన 273 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయసంగా ఛేదించింది.

    సెంచరీని 63 బంతుల్లోనే రోహిత్ శర్మ పూర్తిచేశాడు. దీంతో ప్రపంచ కప్‌లో వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

    తాజా మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (55 నాటౌట్) కూడా హాఫ్ సెంచరీ చేశాడు. ఇషాన్ కిషన్ మూడు పరుగుల్లో అర్ధ శతకాన్ని మిస్సయ్యాడు.

    వరల్డ్ కప్ టోర్నీలో భారత్‌కు ఇది రెండో విజయం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానంలో ఉంది.

    వన్డే వరల్డ్ కప్‌లలో అత్యధిక సెంచరీలు (7) కొట్టిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించినట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    వన్డే ప్రపంచ కప్‌లలో అత్యధిక సెంచరీల రికార్డు ఇప్పటివరకు భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ (ఆరు) పేరిట ఉంది.

  3. పాకిస్తాన్: మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనడం సిగ్గు చేటా? ఒకప్పుడు బెల్లీ డ్యాన్సర్ల ప్రదర్శనలు జరిగిన దేశంలో ఇప్పుడు ఎందుకింత వివక్ష?

  4. సిక్కింలో ఆనకట్ట తెగేంత వరద ఎందుకు వచ్చింది? మంచు సరస్సుల్లో ఏం జరుగుతోంది?

  5. ఎంఎల్ఏ అభ్యర్థిగా పోటీ చేయడం ఎలా... కావల్సిన అర్హతలేంటి?

  6. వివో కంపెనీకి చెందిన చైనా ఉద్యోగిని అరెస్టు చేసిన భారత్!

    వివో

    ఫొటో సోర్స్, Getty Images

    వీవో కంపెనీ తమ సంస్థకు చెందిన చైనా ఉద్యోగి ఆండ్రూ కువాంగ్‌ను భారత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసినట్లు ప్రకటించింది.

    అయితే, ఉద్యోగి అరెస్టుపై చట్టపరంగా ముందుకెళతామని వీవో తెలిపింది. ఈ అరెస్టుపై ఈడీ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

    మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద మంగళవారం ఈ అరెస్టు జరిగినట్లు లీగల్ కంపెనీ 'ఖైతాన్' సీనియర్ పార్ట్‌నర్ అతుల్ పాండే తెలిపారు.

    న్యూస్ క్లిక్ వార్తాసంస్థకు అక్రమంగా నిధులు బదిలీ చేయడంలో వివో సాయం చేసిందని పోలీసులు ఆరోపించినట్లు గతవారం రాయిటర్స్ కథనం ప్రచురించింది. వివోపై కస్టమ్స్ ఎగవేత ఆరోపణలు సైతం ఉన్నాయి.

    భారత్ నుంచి చైనాకు వివో సంస్థ అక్రమంగా నిధులు పంపిస్తోందని గతేడాది భారత అధికారులు వివో కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.

    రీసెర్చ్ సంస్థ కౌంటర్‌ పాయింట్ ప్రకారం దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్ తర్వాత వివో 17 శాతం మార్కెట్ వాటాతో భారతదేశంలో రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీగా ఉంది.

  7. చెంగ్ లీ: ఆస్ట్రేలియా జర్నలిస్టుని విడుదల చేసిన చైనా

    చెంగ్ లీ

    ఫొటో సోర్స్, NICK COYLE

    ఆస్ట్రేలియాకు చెందిన జర్నలిస్టు చెంగ్ లీని చైనా విడుదల చేసింది. ఆమె మూడేళ్ల నుంచి చైనాలో నిర్బంధంలో ఉన్నారు.

    చైనా ప్రభుత్వ ఆధీనంలోని ఇంగ్లీష్ టీవీ స్టేషన్ సీజీటీఎన్‌లో చెంగ్ లీ బిజినెస్ రిపోర్టర్‌గా పని చేసేవారు.

    స్టేట్ రహస్యాలను విదేశాలకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలతో 2020 ఆగస్టు 13న చెంగ్ లీను నిర్బంధంలోకి తీసుకుంది చైనా.

    అయితే, ఆమెకు ఎలాంటి శిక్ష విధించలేదు. మూడేళ్ల తర్వాత విడుదల చేసింది.

    "విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ చెంగ్ లీని విమానాశ్రయంలో కలుసుకున్నారు" అని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ చెప్పారు.

    చెంగ్ లీ తన పిల్లలను కలుసుకున్నారని ఆల్బనీస్ తెలిపారు.

  8. సైబర్ నేరాలు: ఆన్‌లైన్‌ దొంగలు మీ డబ్బు కొట్టేస్తే తిరిగి పొందడం సాధ్యమేనా?

  9. బీబీసీ ఐ పరిశోధన: న్యూడ్ ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేసే లోన్ యాప్‌‌ల తెర వెనుక ఏం జరుగుతుంది?

  10. హమాస్ బందీల కథలు: ‘నా భార్యాబిడ్డలను వాళ్లు ఎత్తుకు పోయారు’

  11. మియన్మార్‌: శరణార్ధి శిబిరంపై ఫిరంగి దాడి, 29 మంది మృతి

    మియన్మార్

    ఫొటో సోర్స్, SUPPLIED

    ఈశాన్య మియన్మార్‌లోని శరణార్థి శిబిరంపై జరిగిన ఫిరంగి దాడిలో చిన్నారులతో సహా 29 మంది మరణించారు.

    మరో 56 మంది గాయపడ్డారు. వీరిలో 44 మంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

    లైజా సమీపంలో గల ఈ శరణార్థి శిబిరం కచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ (KIA) నియంత్రణలో ఉంది.

    మరణించిన వారిలో 11 మంది చిన్నారులు ఉన్నట్లు కచిన్ అధికారులు తెలిపారు.

    మియన్మార్‌లోని అత్యంత శక్తివంతమైన తిరుగుబాటు గ్రూపులలో కచిన్ ఒకటి, ఇది ఏళ్లుగా సైన్యంతో ఘర్షణ పడుతోంది.

    అయితే ఈ దాడులతో తమకు సంబంధం లేదని మియన్మార్ సైన్యం ప్రకటించింది.

  12. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.