ఫోన్ల స్వాధీనంపై సీజేఐకి 'జర్నలిస్టు సంఘాల' లేఖ

భారత్‌లో జర్నలిస్టుల పట్ల దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ దేశంలోని జర్నలిస్టు సంఘాలు, ప్రెస్ క్లబ్‌లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు బుధవారం లేఖ రాశాయి.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. ఫోన్ల స్వాధీనంపై సీజేఐకి 'జర్నలిస్టు సంఘాల' లేఖ

    జర్నలిస్టులు

    భారత్‌లో జర్నలిస్టుల పట్ల దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ దేశంలోని జర్నలిస్టు సంఘాలు, ప్రెస్ క్లబ్‌లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు బుధవారం లేఖ రాశాయి.

    అక్టోబర్ 3న 46 మంది జర్నలిస్టులు, సంపాదకులు, రచయితలు, ప్రొఫెషనల్స్‌పై దిల్లీ పోలీసులు తనిఖీలు జరిపారని ఈ లేఖలో పేర్కొన్నాయి.

    ఈ తనిఖీల్లో పలువురు జర్నలిస్టుల ఎలక్ట్రానిక్ పరికరాలనూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు.

    జర్నలిస్టుల సామగ్రిని అధికారులు ఇష్టానుసారం స్వాధీన పరుచుకుంటున్నారని, వాటిలో జర్నలిస్టుల వ్యక్తిగత సమాచారం కూడా ఉంటుందని లేఖలో సీజేఐ దృష్టికి తెచ్చారు.

    ఇలాంటి చర్యలు, విచారణ పద్దతులపై మార్గదర్శకాలు రూపొందించాలని కోరాయి జర్నలిస్టు సంఘాలు.

    జర్నలిస్టులకు వ్యతిరేకంగా చట్టాన్ని అతిక్రమించిన లేదా ఉద్దేశపూర్వకంగా న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించే ప్రభుత్వ సంస్థలు, అధికారుల్లో జవాబుదారీతనం కోసం మార్గాలను కనుగొనాలని లేఖలో కోరారు.

    జర్నలిస్టులను తీవ్రవాదుల కోణంలో విచారణ చేయరాదని కోరారు.

  3. శ్రీదేవి ఉప్పు తినకపోవడం వల్లే చనిపోయారా? బోనీ కపూర్ ఏమన్నారు?

  4. అమెరికా ప్రజల ఆయుర్దాయం ఎందుకు తగ్గిపోతోంది? అక్కడేం జరుగుతోంది?

  5. పెండ్యాల రాఘవరావు: ఒకేసారి 3 స్థానాల్లో గెలిచిన నేత.. ఆయన తర్వాత ఇది ఎన్టీఆర్‌కే సాధ్యమైంది

  6. క్వాంటం డాట్స్ ఆవిష్కర్తలకు నోబెల్ బహుమతి

    టీవీ

    ఫొటో సోర్స్, Getty Images

    రసాయన శాస్త్రంలో మౌంగి జీ బవెండి, లూయిస్ ఈ బ్రూస్, అలెక్సీ ఐ ఎకిమోవ్‌లకు ఈ ఏడాది నోబెల్ పురస్కారం లభించింది.

    నానో టెక్నాలజీకి సంబంధించి క్వాంటం డాట్స్ ఆవిష్కరణల్లో పరిశోధనలకు గానూ ఈ ముగ్గురు శాస్త్రవేత్తలను అవార్డు వరించింది.

    ఈ ముగ్గురు అమెరికాలో నివసిస్తున్నారు.

    ఈ క్వాంటం డాట్‌లను టీవీలు, మెడికల్ ఇమేజింగ్, శస్త్రచికిత్సలు తదితర వాటిల్లో వాడుతున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. దిల్లీ: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను అరెస్టు చేసిన ఈడీ

    సంజయ్ సింగ్

    ఫొటో సోర్స్, ANI

    దిల్లీ మద్యం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది.

    బుధవారం ఉదయం సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు జరిపింది.

    కొన్ని గంటల విచారణ అనంతరం సంజయ్ సింగ్‌ను అరెస్టు చేసినట్లు వార్తాసంస్థ పీటీఐ తెలిపింది.

    ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సత్యేంద్ర కుమార్ జైన్, మనీష్ సిసోడియాలు అరెస్టై, జైల్లో ఉన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. ఏసియన్ గేమ్స్: జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రాకు స్వర్ణం

    నీరజ్ చోప్రా

    ఫొటో సోర్స్, ANI

    చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఏసియన్ గేమ్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా స్వర్ణం సాధించాడు.

    జావెలిన్‌ను నీరజ్ 88.88 మీటర్లు విసిరి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు.

    భారత్‌కే చెందిన కిషోర్ జెనా రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెలిచాడు.

    మరోవైపు పురుషుల 4x400 మీటర్ల రిలే రేసులో భారత రన్నర్లు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.

    రిలే రేసులో రాజేష్ రమేష్, మొహమ్మద్ అనాస్, అమోల్ జాకబ్, మహ్మద్ అజ్మల్‌ల బృందం విజేతలుగా నిలిచారు.

    ఏసియన్ గేమ్స్‌లో ఇప్పటివరకు భారత్ 18 స్వర్ణాలు, 31 రజతాలు, 32 కాంస్యాలతో మొత్తం 81 పతకాలు సాధించింది. పతకాల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. ఏసియన్ గేమ్స్ - హాకీ: ఫైనల్ చేరిన భారత జట్టు

    భారత హాకీ జట్టు

    ఫొటో సోర్స్, ANI

    చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఏసియన్ గేమ్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు 5-3తో దక్షిణ కొరియాను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. దీంతో భారత్‌కు కనీసం రజత పతకం ఖాయమైంది.

    సెమీ ఫైనల్ మ్యాచ్ తొలి క్వార్టర్‌లో టీమిండియా 3-0తో ముందంజలో ఉంది. అయితే హాఫ్ టైం వరకు స్కోరు 4-2కు చేరింది.

    అనంతరం రెండో అర్ధ భాగంలో దక్షిణ కొరియా పెనాల్టీ కార్నర్ ద్వారా స్కోరును 4-3కి తీసుకొచ్చింది. అయితే 54వ నిమిషంలో భారత్‌ మరో గోల్‌ కొట్టి 5-3తో మ్యాచ్ ముగించి, ఫైనల్‌కు దూసుకెళ్లింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. మలేరియా జ్వరానికి కొత్త వ్యాక్సీన్ ఎలా పనిచేస్తుందంటే..

  11. కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలకు ఎవరు బాధ్యులు? తల్లిదండ్రులా? కోచింగ్ సెంటర్లా? – బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

  12. పవన్ కల్యాణ్‌కు ఏపీ పోలీసుల నోటీసులు

    పవన్ కల్యాణ్

    ఫొటో సోర్స్, JanaSena Party/FB

    జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

    పెడన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పేరుతో సీఆర్పీసీ సెక్షన్ 149 కింద నోటీసులు జారీ అయ్యాయి.

    పెడనలో ‘వారాహి యాత్ర’ సందర్భంగా తనపై దాడికి పాల్పడేందుకు కుట్ర పన్నుతున్నారంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు చూపాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.

    ‘వారాహి యాత్ర’ సందర్భంగా పెడనలో తనపై దాడికి 2 వేల మందిని రంగంలో దించారంటూ పవన్ కల్యాణ్ ఆరోపించారు.

    మచిలీపట్నంలో జరిగిన జనవాణి కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

    అయితే, తాము జారీ చేసిన నోటీసులకు పవన్ కల్యాణ్ నుంచి సమాధానం రాలేదని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా చెప్పారు.

  13. బంగారం కొనాలా? బంగారం బాండ్లు కొనాలా? ఏది లాభం?

  14. అమెరికా స్పీకర్‌గా మెకార్తీ తొలగింపు

    మెకార్తీ

    ఫొటో సోర్స్, Reuters

    అమెరికాలో రిపబ్లికన్ల తిరుగుబాటు ఫలితంగా యూఎస్ హౌస్ స్పీకర్ కెవిన్ మెకార్తీ తన పదవిని కోల్పోయారు. అవిశ్వాస తీర్మానంలో ఆయన ఓటమి పాలయ్యారు.

    యుఎస్ దిగువసభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో స్పీకర్ కెవిన్ మెకార్తీ తొలగింపునకు అనుకూలంగా 216, మద్దతుగా 210 ఓట్లు వచ్చాయి.

    ప్రభుత్వ సంస్థలకు నిధులు విడుదల చేసే విషయంలో శనివారం మెకార్తీ డెమొక్రాట్లతో ఒప్పందం చేసుకోవడంపై రిపబ్లికన్లలోని అతివాదులు తిరుగుబాటు చేశారు.

  15. నాందేడ్: ‘డాక్టర్లు లేరు, మెషీన్లు ఆగిపోయాయి.. పిల్లలు చనిపోయాక మా సంతకాలు తీసుకున్నారు’

  16. ఆసియా క్రీడలు: ఆర్చరీలో జ్యోతి సురేఖ-ఓజస్ జంటకు స్వర్ణం

    ఆర్చరీ

    ఫొటో సోర్స్, SAI

    చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌కు బుధవారం ఆర్చరీలో స్వర్ణ పతకం లభించింది.

    ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఈవెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ-ఓజస్ ప్రవీణ్ జంట విజేతగా నిలిచి బంగారు పతకాన్ని అందుకుంది.

    హాంగ్జౌ క్రీడల్లో భారత్ ఇప్పటివరకు 16 స్వర్ణాలు, 26 రజతాలు, 28 కాంస్యాలతో ఓవరాల్‌గా 70 పతకాలను సాధించింది.

    మంగళవారం మహిళల 5,000 మీ. పరుగులో భారత్‌కు చెందిన పారుల్ చౌదరీ చాంపియన్‌గా నిలిచి స్వర్ణాన్ని గెలిచారు. మహిళల జావెలిన్ ఈవెంట్‌లో అన్ను రాణి కూడా స్వర్ణాన్ని అందుకున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  17. 23 మంది ఆర్మీ జవాన్లు గల్లంతు

    జవాన్లు

    ఫొటో సోర్స్, ANI

    సిక్కింలో వచ్చిన ఆకస్మిక వరదల్లో 23 మంది ఆర్మీ జవాన్లు గల్లంతు అయినట్లుగా తెలుస్తోందని గువాహటికి చెందిన డిఫెన్స్ పీఆర్‌వో వెల్లడించారు.

    క్లౌడ్ బస్ట్ కారణంగా లాచెన్ వ్యాలీలోని తీస్తా నదిలో వరద పోటెత్తింది. దిగువన ఉన్న సింగటం ప్రాంతంలోని వీధులను వరద ముంచెత్తింది.

    లోయ పొడవునా ఉన్న ఆర్మీ స్థావరాలపై వరద ప్రభావం పడిందని ఏఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఛుంగ్ తాండ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడం వల్ల దిగువన ఉన్న ప్రాంతాల్లో 15 నుంచి 20 మీటర్ల వరకూ వరద పోటెత్తిందని గుహవాటి డిఫెన్స్ పీఆర్వో వెల్లడించారు.

    సింగటం ప్రాంతానికి దగ్గర్లో ఉండే బర్దాంగ్‌లో పార్క్ చేసిన చాలా వాహనాలు కొట్టుకుపోయాయని, సహాయక చర్యలు చేపట్టినట్లు డిఫెన్స్ పీఆర్వో తెలిపారు.

    జవాన్లు

    ఫొటో సోర్స్, ANI

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  18. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ సోదాలు

    ఈడీ సోదాలు

    ఫొటో సోర్స్, ANI

    ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.

    దిల్లీలోని ఆయన ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  19. ఫోన్ల స్వాధీనంపై సీజేఐకి 'జర్నలిస్టు సంఘాల' లేఖ