ఆకస్మిక వరదలతో న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ

భారీ వర్షాలకు ఆకస్మిక వరదలకు న్యూయార్క్‌లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. నగరంలోని సబ్‌వేలు, వీధులు, హైవేలపై వరద నీరు చేరుకుంది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.

    మళ్లీ తాజా వార్తలతో రేపు ఉదయం కలుద్దాం.

  2. ఏషియన్ గేమ్స్: పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించి సెమీస్‌కు చేరిన భారత హాకీ జట్టు

    ఏషియన్ గేమ్స్: పాకిస్తాన్‌పై విజయం సాధించి సెమీస్‌కు చేరిన భారత హాకీ జట్టు

    ఫొటో సోర్స్, ANI

    ఏషియన్ గేమ్స్‌లో భారత హాకీ జట్టు 10-2 తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి సెమీ ఫైనల్‌కు చేరుకుంది.

    భారత్ తరఫున మన్‌దీప్ సింగ్ మ్యాచ్ తొలి క్వార్టర్ ఎనిమిదో నిమిషంలో తొలి గోల్ చేశాడు. 11వ నిమిషంలో భారత్‌కు పెనాల్టీ స్ట్రోక్‌ను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలిచాడు.

    రెండో క్వార్టర్‌ 17వ నిమిషంలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ మళ్లీ గోల్‌ చేశాడు.

    30 నిమిషాల ఆట ముగిసే సమయానికి భారత్ 4-0 ఆధిక్యంలో నిలిచింది.

    మూడో క్వార్టర్ 33వ నిమిషంలో పాకిస్తాన్ చేసిన ఫౌల్ కారణంగా భారత్‌కు పెనాల్టీ స్ట్రోక్ లభించగా, దానిని కెప్టెన్ గోల్‌గా మలిచి మ్యాచ్‌లో హ్యాట్రిక్ పూర్తి చేశాడు.

    మరుసటి నిమిషంలోనే కెప్టెన్ మరో గోల్ చేశాడు.

    నాలుగు నిమిషాల తర్వాత సుఫియాన్ మహ్మద్ పాకిస్తాన్ తరఫున తొలి గోల్ చేశాడు.

    41వ నిమిషంలో భారత్ గోల్ చేయగా, ఈ క్వార్టర్ చివరి నిమిషంలో పాక్ స్కోరు 7-2గా ఉంది.

    చివరి క్వార్టర్‌లో భారత్ మరో రెండు గోల్స్ చేసింది.

    భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాలుగు గోల్స్ చేయగా, వరుణ్ రెండు గోల్స్, లలిత్, మన్‌దీప్, సుమిత్, షంషేర్ ఒక్కో గోల్ చేశారు.

    భారత్ తన పూల్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది.

    అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత జట్టు ఈ టోర్నీలో ఇప్పటి వరకు 46 గోల్స్ చేసి రికార్డు సృష్టించింది.

  3. హైదరాబాద్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఎలాంటి భోజనం వడ్డిస్తున్నారు? సోషల్ మీడియాలో చర్చకు కారణం ఏంటి?

  4. కేటీఆర్ పర్యటన సందర్భంగా విషాదం, డ్రైనేజీలో పడి చనిపోయిన కానిస్టేబుల్

    కేటీఆర్ పర్యటన సందర్భంగా విషాదం, డ్రైనేజీలో పడి చనిపోయిన కానిస్టేబుల్

    ఫొటో సోర్స్, UGC

    భద్రాచలంలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా విషాదం చోటుచేసుకుంది.

    బందోబస్తు డ్యూటీ కోసం వచ్చిన మహిళా హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి డ్రైనేజీ కాలువలో పడి చనిపోయారు.

    పార్కింగ్ స్థలం నుంచి వర్షం నీటితో నిండిపోయిన అన్నదాన సత్రం రోడ్డు వైపు నడిచి వెళ్తుండగా ప్రమాదవశాత్తు డ్రైనేజీ కాలువలో జారిపడిపోయి శ్రీదేవి కొట్టుకుపోయారు.

    ప్రత్యక్షసాక్షులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు, సహాయ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

    గోదావరి కరకట్ట సమీపంలో శ్రీదేవి మృతదేహం లభ్యమైంది. మృతురాలు కొత్తగూడెం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

    భారీ వర్షాల కారణంగా మంత్రి కేటీఆర్ పర్యటన రద్దయ్యింది.

  5. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు

    ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు

    ఫొటో సోర్స్, TDP

    ఫొటో క్యాప్షన్, నారా లోకేశ్‌కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన వీడియోను టీడీపీ విడుదల చేసింది.

    ఇన్నర్‌ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

    అక్టోబర్ 4న సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

    దిల్లీలోని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో ఉన్న నారా లోకేశ్‌కు సీఐడీ అధికారులు నోటీసులు అందించారు.

    ‘ఆయనకు నోటీసులు ఇచ్చాం. అక్టోబర్‌ 4న విచారణకు వస్తానన్నారు’ అని సీఐడీ డీసీపీ చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు
  6. హైకున్: చైనా నుంచి తైవాన్‌ను ఈ సబ్‌మెరైన్ కాపాడగలదా?

  7. ఆసియా క్రీడలు: పాకిస్తాన్‌ను ఓడించి స్వర్ణం సాధించిన భారత స్క్వాష్ పురుషుల జట్టు

    భారత స్క్వాష్ పురుషుల జట్టు

    ఫొటో సోర్స్, Twitter/SAI Media

    చైనాలోని హాంగ్జౌ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది.

    స్క్వాష్ క్రీడాంశంలో సౌరవ్ ఘోషాల్, అభయ్ సింగ్, మహేశ్ మంగాంకర్, హరీందర్ సంధులతో భారత పురుషుల జట్టు విజేతగా నిలిచింది.

    శనివారం ఉత్కంఠభరితంగా జరిగిన పురుషుల టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత్ 2-1తో పాకిస్తాన్‌పై గెలుపొందింది.

    2018 జకార్తా ఆసియా క్రీడల్లో కాంస్యాన్ని సాధించిన భారత్, ఈ ఎడిషన్‌లో బంగారు పతకంతో మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది.

    దీంతో భారత్ ఖాతాలో 10వ స్వర్ణం చేరింది. 13 చొప్పున రజత, కాంస్యాలతో మొత్తంగా ఇప్పటివరకు భారత్ 36 పతకాలు సాధించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. వాఛాతీ: 30 ఏళ్ళనాటి ఈ రేప్ కేసులో అసలేం జరిగింది? పోలీసులకు వేసిన శిక్షలపై హైకోర్టు ఏం చెప్పింది?

  9. ఆకస్మిక వరదలతో న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ

    న్యూయార్క్ వరదలు

    ఫొటో సోర్స్, Nicki Vleisides

    భారీ వర్షాలకు ఆకస్మిక వరదలకు న్యూయార్క్‌లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. నగరంలోని సబ్‌వేలు, వీధులు, హైవేలపై వరద నీరు చేరుకుంది. లా గార్డియా విమానాశ్రయంలో ఒక టెర్మినల్ పూర్తిగా మూసివేశారు.

    నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

    “న్యూయార్క్ నగరంలో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నాను. భారీ వర్షాల కారణంగా లాంగ్ ఐలండ్, హడ్సన్ వ్యాలీ ప్రాంతాల్లోనూ ఎమర్జెన్సీ అమల్లో ఉంటుంది.” అని గవర్నర్ హోచుల్ ఎక్స్‌లో ప్రకటించారు.

    “వరద నీరు ఉన్న ప్రాంతాల్లో ప్రయాణాలు చేయకండి” అని ఆమె నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

    వరదల కారణంగా న్యూయార్క్ భూగర్భ రైల్వే వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. కొన్ని స్టేషన్లు పూర్తిగా నీట మునిగాయి.

    అనేక స్టేషన్లను మూసివేశామని, కొన్ని మార్గాల్లో రాకపోకల్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ ఏజెన్సీ తెలిపింది.

    నగరంలో అనేక జాతీయ రహదారులను మూసివేశామని, వాటిపై పోలీసుల పహరా కొనసాగుతోందని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది.

    మన్ హట్టన్ తూర్పు ప్రాంతంలో చాలా చోట్ల ట్రాఫిక్ నిలించిపోయింది.

    ఈ నెలలో న్యూయార్క్ నగరంలో 35 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.

    నేషనల్ వెదర్ సర్వీస్ డేటా ప్రకారం 1882 తర్వాత సెప్టెంబర్‌లో ఇంత భారీగా వర్షం కురవడం ఇదే తొలిసారి.

  10. ఏసియన్ గేమ్స్‌: టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌కు స్వర్ణం

    ఏసియన్ గేమ్స్

    ఫొటో సోర్స్, Twitter/Media_sai

    ఫొటో క్యాప్షన్, రుతుజా, బోపన్న

    చైనాలో జరుగుతున్న ఏసియన్ గేమ్స్‌లో శనివారం టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత్ స్వర్ణం సాధించింది.

    రోహన్ బోపన్న, రుతుజా బోసలే జోడీ ఈ పతకం గెలిచింది. చైనీస్ తైపీ జంటపై 2-6, 6-3, 10-4 తేడాతో భారత జోడీ విజయం సాధించి, స్వర్ణం గెలిచింది.

    ఏసియన్ గేమ్స్‌లో ఇప్పటివరకు భారత్ మొత్తం 9 స్వర్ణాలు, 13 రజతాలు, 13 కాంస్యాలతో 35 పతకాలు సాధించింది. పతకాల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  11. డీజే: డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటుతో యువకుల మృతికి భారీ శబ్దాలే కారణమా? చెవికి, గుండెకు సంబంధం ఏమిటి?

  12. తెలిసిన ముఖాలను గుర్తుపట్టలేకపోతున్నారా? చికిత్స లేని ఈ వ్యాధిని ఎదుర్కోవడం ఎలా?

  13. ‘స్పందన’ ఫిర్యాదుతో అంతర్జాతీయ బెట్టింగ్ ముఠాను విశాఖ పోలీసులు ఎలా పట్టుకున్నారు?

  14. క్రికెట్ వరల్డ్ కప్-1996: ఈడెన్ గార్డెన్స్‌లో వేలాది మంది ప్రేక్షకుల ముందు వినోద్ కాంబ్లీ ఎందుకు ఏడ్చారు... శ్రీలంక చేతిలో భారత్ అప్పుడు ఎలా ఓడిపోయంది?

  15. ఏసియన్ గేమ్స్: 100 మీ. హర్డిల్స్‌లో ఫైనల్ చేరిన తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ

    జ్యోతి యర్రాజీ

    ఫొటో సోర్స్, M NARAYANA RAO

    ఫొటో క్యాప్షన్, జ్యోతి యర్రాజీ

    చైనాలోని హాంగ్జౌ‌లో జరుగుతున్న ఏసియన్ గేమ్స్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్ విభాగంలో భారత అథ్లెట్ జ్యోతి యర్రాజీ ఫైనల్లోకి ప్రవేశించారు. హీట్‌లో 13.03 సెకన్లలో జ్యోతి పరుగు పూర్తి చేశారు.

    మొత్తంగా ఆమె మూడో స్థానంలో నిలిచి, ఫైనల్‌లోకి ప్రవేశించారు.

    జ్యోతి యర్రాజీది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం.

    అంతేకాదు 25వ ఏసియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100 మీ. హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌ జ్యోతి యర్రాజీ.

    జాతీయస్థాయిలో 100 మీ. హర్డిల్స్ రేసులో 12.82 సెకన్ల రికార్డు జ్యోతి పేరిట ఉంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  16. అలర్ట్: రూ.2,000 నోటు మార్చుకోవడానికి నేడే ఆఖరి రోజు

    నోట్ల రద్దు

    ఫొటో సోర్స్, Getty Images

    దేశంలో రూ. 2,000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి లేదా మార్చుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన గడువు నేటితో ముగియనుంది.

    ఈ గడువు పొడిగింపుపై ఇప్పటివరకైతే ఆర్‌బీఐ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

    రూ.2 వేల నోటును చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ మే 19న ప్రకటించింది. ప్రజలు సెప్టెంబర్ 30 వరకు వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపింది.

    బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేయడానికి ఎటువంటి పరిమితినీ ఆర్‌‌బీఐ పెట్టలేదు. ఇప్పటికే ఉన్న చట్టాలు వర్తిస్తాయి.

    కానీ, నోట్లు మార్చుకోవడానికి షరతులను విధించింది.

    ఆర్‌బీఐ షరతులేంటి?

    రూ. 2 వేల నోట్లను ఏ బ్యాంక్‌లో అయినా మార్చుకోవచ్చు.

    ఏ బ్యాంకు శాఖలోనైనా ఒకసారి రూ. 20,000 వరకు మాత్రమే రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చు.

    ఇందుకు సంబంధించి ఆర్‌బీఐ అన్ని బ్యాంకులకు మార్గదర్శకాలు పంపింది.

    బ్యాంకులు 2,000 రూపాయల నోట్ల జారీ కూడా నిలిపివేశాయి.

    దీని గురించి మరింత తెలుసుకోవడానికి సంస్థ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు అందించినట్లు ఆర్‌బీఐ తెలిపింది.

  17. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.