టీమిండియా: వరల్డ్ కప్ జట్టులో స్వల్ప మార్పులు
అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
ఇక్కడితో లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
మళ్లీ తాజా వార్తలతో రేపు ఉదయం కలుద్దాం.
మణిపుర్: మాయమైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాల ఫొటోలు బయటకు రావడంతో ఇంఫాల్‌లో నిరసనలు
టీమిండియా: వరల్డ్ కప్ జట్టులో స్వల్ప మార్పులు

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, రవిచంద్రన్ అశ్విన్ వరల్డ్ కప్ క్రికెట్-2023 కోసం ప్రకటించిన జట్టులో చిన్న మార్పులు జరిగాయి. ఈ మేరకు ఐసీసీ సమాచారం ఇచ్చింది. ఆసియా కప్ సందర్భంగా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ గాయమైంది. దీంతో అతను టోర్నీకి అందుబాటులోకి రాలేని పరిస్థితి ఉంది. అతని స్థానంలో బౌలర్ ఆర్.అశ్విన్‌కు జట్టులో చోటు కల్పించారు.
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్)
హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్)
శుభ్‌మన్ గిల్
విరాట్ కోహ్లీ
శ్రేయస్ అయ్యర్
కె.ఎల్. రాహుల్
రవీంద్ర జడేజా
శార్ధూల్ ఠాకూర్
జస్‌ప్రీత్ బుమ్రా
మొహమ్మద్ సిరాజ్
కుల్దీప్ యాదవ్
మొహమ్మద్ షమీ
ఇషాన్ కిషన్
సూర్యకుమార్ యాదవ్
ఆర్. అశ్విన్
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.
ఆతిథ్య భారత్ తన తొలి మ్యాచ్‌ని అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో చెన్నైలో ఆడుతుంది.
46 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు 10 నగరాల్లోని స్టేడియాలను ఎంపిక చేశారు.
ఈ స్టేడియాలులున్న 9 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, దిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి.
సుదీర్ఘ కాలం అంతరిక్షంలో గడిపి క్షేమంగా భూమికి చేరిన అమెరికా వ్యోమగామి

ఫొటో సోర్స్, Getty Images
సుదీర్ఘకాలం అంతరిక్షంలో గడిపిన అమెరికా వ్యోమగామి ఫ్రాంక్ రూబియో సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. రికార్డు స్థాయిలో ఆయన అంతరిక్షంలో 371 రోజులు గడిపారు.
రూబియోతోపాటు మరో ఇద్దరు రష్యా వ్యోమగాములు కూడా ప్రస్తుతం సురక్షితంగా ల్యాండ్ అయ్యారు.
మొదటగా 180 రోజులకు మాత్రమే రూబియోను అంతరిక్షంలోకి పంపారు. కానీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల దీన్ని 371 రోజులకు పొడిగించాల్సి వచ్చింది.
సుదీర్ఘకాలం అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండే వాతావరణంలో ఉండటంతో వీరి ఆరోగ్యం ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది.
సుదూర అంతరిక్ష యాత్రలకు వ్యోమగాములను పంపేందుకు తాజా పరిశోధనల డేటా ఉపయోగపడే అవకాశముంది.
‘విరాట్ కోహ్లీ నా అల్లుడు లాంటోడు’ అని షారుఖ్ ఖాన్ ఎప్పుడు అన్నారు?
ఉజ్జయిని: రక్తమోడుతూ రోడ్డుపై తిరిగిన ఆ బాలిక ఎవరు, అసలేం జరిగింది?
విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: పెట్టుబడులపై 6 నెలల కిందట జగన్ ప్రభుత్వం ఏం చెప్పింది? ఇప్పటివరకు ఏం జరిగింది?
చంద్రముఖి సినిమాతో చంద్రముఖి 2 పోటీ పడగలిగిందా?
స్కంద రివ్యూ: బోయపాటి ఎలివేషన్లు, హీరోయిజం మళ్లీ పనిచేశాయా? ఇద్దరు సీఎంలలో ఎవరు గెలుస్తారు?
వరంగల్: ఈ హోటల్లో ఆర్డర్ చేసిన ఆహారం అంతా తినాల్సిందే, లేదంటే జరిమానా కట్టాల్సిందే
హైదరాబాద్: ఉత్సాహంగా వినాయక నిమజ్జనం యాత్రలు

ఫొటో క్యాప్షన్, ఖైరతాబాద్ వినాయకుడి ఊరేగింపు ప్రారంభమైంది. హైదరాబాద్ వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధమయింది. భారీ విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు కదులుతున్నాయి. నిమజ్జన యాత్రలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగుతున్నాయి.
నిమజ్జన కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం 40 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసింది. 3 వేల మంది పారిశుద్ధ్య కార్మికులను, 36 క్రేన్లను ఏర్పాటు చేసింది.
ఖైరతాబాద్ వినాయకుడి యాత్ర నడుస్తోంది. మధ్యాహ్నంలోపు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం పూర్తవుతుంది.
ఇక బాలాపూర్ వినాయకుడి ఊరేగింపు ఆ గ్రామంలో పూర్తయ్యాక అక్కడే లడ్డూ వేలం పాట నిర్వహించారు. యాత్రగా హుస్సేన్ సాగర్‌కు వస్తున్నారు.
శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఇవాళ జరగాల్సిన మిలాద్-ఉన్-నబీ యాత్రను రేపు నిర్వహిస్తున్నారు ముస్లింలు.
భక్తుల సౌకర్యం కోసం ఇవాళ హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు అర్థరాత్రి ఒంటి గంట వరకూ నడుపుతున్నారు. ఆర్టీసీ కూడా అదనపు బస్సులు నడపుతోంది.
కేసీఆర్‌ను ఓడించిన ఒకే ఒక్కడు
వన్డే ప్రపంచకప్: హైదరాబాద్ చేరుకున్న పాకిస్తాన్ క్రికెట్ టీం

ఫొటో సోర్స్, Twitter/TheRealPCB
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి జరగబోయే వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ కోసం ఒక్కొక్కటిగా ఆయా జట్లు ఇండియా చేరుకుంటున్నాయి.
బాబర్ ఆజం నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంది.
టోర్నీకి ముందు ఆయా జట్లు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. పాకిస్తాన్ జట్టు ఉప్పల్ స్డేడియంలో రేపటి నుంచి ఈ మ్యాచ్‌లు ఆడనుంది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఏసియన్ గేమ్స్: షూటింగ్‌లో భారత్‌కు మరో స్వర్ణం

ఫొటో సోర్స్, Twitter/Media_SAI
చైనాలో జరుగుతున్న ఏసియన్ గేమ్స్‌లో గురువారం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణం సాధించింది.
సరబ్జోత్ సింగ్, అర్జున్ సింగ్ చీమా, శివ నర్వాల్ త్రయం ఈ పతకం గెలిచింది.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
అంతేకాదు వుషు మహిళల 60 కేజీల విభాగంలో రోషిబినా దేవి నౌరెమ్ రజతం సాధించారు. ఈ సందర్భంగా ఆమెను కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అభినందించారు.
ఏసియన్ గేమ్స్‌లో ఇప్పటివరకు భారత్ మొత్తం 6 స్వర్ణాలు, 8 రజతాలు, 10 కాంస్యాలతో 24 పతకాలు సాధించింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మైతీ విద్యార్థుల హత్యతో మణిపుర్‌లో మళ్లీ చెలరేగిన అల్లర్లు

ఫొటో సోర్స్, Getty Images
మణిపుర్‌లో జులైలో అదృశ్యమైన ఇద్దరు మైతీ విద్యార్థులు హత్యకు గురైనట్లు సీఎం బీరెన్ సింగ్ బుధవారం ప్రకటించడంతో రాజధాని ఇంఫాల్‌లో హింస, నిరసనలు మళ్లీ తీవ్రమయ్యాయి.
పెద్ద సంఖ్యలో నిరసనకారులు వీధుల్లోకి వచ్చి ఇంఫాల్‌లోని ఓ రాజకీయ నాయకుడి ఇంటిపై దాడికి ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసు వాహనానికి నిప్పు పెట్టి, వారిని కొట్టి ఆయుధాలను లాక్కున్నారు.
“ఒక రాజకీయ నాయకుడి ఇంటిపై అల్లరి మూక దాడి చేయడానికి ప్రయత్నించింది. భద్రతా దళాలు టియర్ గ్యాస్ షెల్స్ పేల్చి గుంపును చెదరగొట్టాయి. నిరసనకారులు పోలీసు జిప్సీకి నిప్పు పెట్టారు, పోలీసుపై దాడి చేసి, ఆయుధాన్ని లాక్కున్నారు. అలాంటి చర్యలను ఖండిస్తున్నాం. నిందితులను పట్టుకొని, ఆయుధాలను స్వాధీనం చేసుకోవడానికి కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాం'' అని మణిపుర్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
