ఏసియన్ గేమ్స్: 50 మీటర్ల రైఫిల్ షూటింగ్‌లో భారత్‌కు గోల్డ్ తెచ్చిన సిఫత్ కౌర్

చైనాలో జరుగుతున్న ఏసియన్ గేమ్స్‌లో బుధవారం 50 మీటర్ల రైఫిల్ షూటింగ్‌లో సిఫత్ కౌర్ పసిడి పతకం సాధించింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. INDvsAUS: మూడో వన్డేలో భారత్‌పై 66 పరుగులతో ఆస్ట్రేలియా గెలుపు

    భారత్, ఆస్ట్రేలియా మూడో వన్డే

    ఫొటో సోర్స్, ANI

    ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన చివరిదైన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ 66 పరుగులతో ఓటమి పాలైంది.

    రాజ్‌కోట్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది.

    టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 352 పరుగులు చేసింది.

    డేవిడ్ వార్నర్ (34 బంతుల్లో 56; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), స్టీవెన్ స్మిత్ (61 బంతుల్లో 74; 8 ఫోర్లు, 1 సిక్స్), మార్నస్ లబ్‌షేన్ (58 బంతుల్లో 72; 9 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు.

    మిచెల్ మార్ష్ 84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 96 పరుగులు చేసి కొద్దిలో సెంచరీని చేజార్చుకున్నాడు.

    భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.

    టాపార్డర్ బ్యాట్స్‌మెన్ మెరుగ్గా ఆడటంతో ఆస్ట్రేలియా, భారత్‌కు 353 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

    అయితే, భారత్ 49.4 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది.

    కెప్టెన్ రోహిత్ శర్మ 57 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లి (56) అర్ధసెంచరీ సాధించాడు. శ్రేయస్ అయ్యర్ (48), రవీంద్ర జడేజా (35) రాణించారు.

    ప్రత్యర్థి బౌలర్లలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు.

    మూడు వన్డేల ఈ సిరీస్‌ను భారత్ 2-1తో గెలుచుకుంది.

    ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టి20 సిరీస్ నవంబర్ 23న మొదలవుతుంది. తొలి టి20 (నవంబర్ 23న) విశాఖపట్నంలో, చివరి టి20 (డిసెంబర్ 3న) హైదరాబాద్ వేదికగా జరుగుతాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. ఖమ్మం రాజకీయాలు: పాలేరు మీదే అందరి చూపు ఎందుకు?

  4. ‘హర్‌దీప్ సింగ్ హత్య కేసులో ఆధారాలు ఉంటే ఇవ్వండి. పరిశీలిస్తాం’ -కెనడాను కోరిన భారత్

  5. ‘‘ఈ చిన్ని టర్బైన్‌తో మీ కరెంట్ బిల్లు జీరో....20 ఏళ్ల వరకు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు’’

  6. భారత్-కెనడా: 38 ఏళ్ల కిందటి ‘కనిష్క’ విమానంపై దాడి భారతీయులను ఎలా వెంటాడుతోంది?

  7. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా

    చంద్రబాబు

    ఫొటో సోర్స్, Getty Images

    చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 3కు వాయిదా వేసింది.

    బుధవారం ఈ పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణకు రాగా, తొలుత తెలుగు జడ్జి జస్టిస్ ఎస్‌వీఎస్ భట్టి దీనిపై విచారించేందుకు విముఖత చూపారు.

    ఆ తర్వాత చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లుథ్రా ఈ కేసును సుప్రీం కోర్టు సీజేఐ ముందు ప్రస్తావించి, తక్షణమే ఈ కేసును లిస్టింగ్ చేయాలని కోరారు.

    ఈ కేసును త్వరగా లిస్ట్ చేయడంతో పాటు, తన క్లయింటుకు మధ్యంతర ఉపశమనం కలిగించాలని సీజేఐను సిద్ధార్థ్ లుథ్రా విజ్ఞప్తి చేశారు.

    17ఏ అనేది మూలాల నుంచి చర్చించాల్సిన అంశం అంటూ తన వాదనలు వినిపించారు.

    అయితే, ఈ కేసు విషయంలో ట్రయల్ జడ్జి నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని వ్యాఖ్యానించిన సీజేఐ తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.

    స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని చంద్రబాబు ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు.

    క్వాష్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ శుక్రవారం ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ శనివారం సుప్రీం కోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు.

  8. చంద్రబాబు ఎస్‌ఎల్‌పీ పిటిషన్‌ విచారణకు జస్టిస్ ఎస్‌వీఎస్ భట్టి విముఖత

    నారా చంద్రబాబు నాయుడు

    ఫొటో సోర్స్, Getty Images

    తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) విచారణ సుప్రీం కోర్టులో మొదలైంది.

    సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ పిటిషన్‌ బుధవారం విచారణకు రాగా, జస్టిస్ ఎస్‌వీఎస్ భట్టి విచారణ చేపట్టేందుకు విముఖత చూపారు.

    జస్టిస్ ఎస్‌వీఎస్ భట్టి, ఆంధ్రపదేశ్‌కు చెందినవారు.

    పిటిషన్ విచారించేందుకు భట్టి తిరస్కరించడంతో, ఈ కేసును ఈరోజు తక్షణమే విచారించాలని సీజేఐ ముందు ప్రస్తావించేందుకు తనకు అనుమతి ఇవ్వాలని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోర్టును విజ్ఞప్తి చేశారు.

    దీంతో ఈ కేసు తిరిగి సుప్రీం కోర్టు సీజేఐ ముందుకు వెళ్లింది. మరో బెంచ్‌కు ఈ కేసును సీజేఐ సిఫార్సు చేయనున్నారు.

    స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అవినీతి జరిగిందంటూ సీఐడీ సెప్టెంబర్ 9న చంద్రబాబును అదుపులోకి తీసుకుంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. గురుద్వారాలో స్వలింగ సంపర్క జంట ‘వివాహం’...ఇది సంప్రదాయ విరుద్ధమన్న సిక్కు పెద్దలు

  10. చిత్తూరు: మైనర్ బాలిక మృతి మిస్టరీ ఏమిటి? రేప్ చేసి, చంపేశారనేది నిజమేనా? పోస్టుమార్టం రిపోర్టులో ఏముంది?

  11. ఏసియన్ గేమ్స్‌: 50 మీటర్ల రైఫిల్ షూటింగ్‌లో సిఫత్ కౌర్‌కు గోల్డ్, జాహ్నవీ మూలే, బీబీసీ ప్రతినిధి

    సిఫత్ కౌర్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, సిఫత్ కౌర్

    చైనాలో జరుగుతున్న ఏసియన్ గేమ్స్‌లో బుధవారం 50 మీటర్ల రైఫిల్ షూటింగ్‌లో సిఫత్ కౌర్ పసిడి పతకం సాధించింది.

    పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌కు చెందిన ఆమె వయసు 21 సంవత్సరాలు.

    ఆసియా క్రీడల్లో నాలుగో రోజైన బుధవారం ఇప్పటివరకు భారత్ రెండు బంగారు పతకాలు సాధించింది. మొత్తమ్మీద భారత్ గెలిచిన పసిడి పతకాల సంఖ్య ఐదుకు పెరిగింది.

    ఈ ఏడాది మార్చిలో జరిగిన ISSF వరల్డ్ కప్ ఛాంపియన్ షిప్‌లో 50 మీటర్ల రైఫిల్ షూటింగ్‌లో సిఫత్ కౌర్ కాంస్య పతకం సాధించారు.

    రైఫిల్ షూటింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలు సొంతం చేసుకున్న సిఫత్ కౌర్ ఇప్పటివరకు 1 బంగారు, 2 వెండి, 1 కాంస్య పతకాలు గెలుచుకున్నారు.

    ‘‘పతకాలు సాధించడం మొదలయ్యాక ఆటపై నా ఏకాగ్రత మరింత పెరిగింది” అని ఆమె బీబీసీతో చెప్పారు.

    “మా జిల్లాలో ఒక్క షూటింగ్ రేంజ్ శిబిరం మాత్రమే ఉంది. కొన్ని కారణాల వల్ల నేను అక్కడికి వెళ్లి, ప్రాక్టీస్ చేయలేకపోయాను. అందుకని మా నాన్నే సొంతంగా డబ్బు ఖర్చు పెట్టి, నా కోసం ఇంటి దగ్గరే షూటింగ్ రేంజ్‌ను ఏర్పాటు చేశారు” అని తన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.

  12. మణిపుర్: జులై నుంచి కనిపించకుండాపోయిన ఇద్దరు విద్యార్థులను హత్య చేశారన్నసీఎం

    మణిపుర్ హింస

    ఫొటో సోర్స్, Getty Images

    మణిపుర్‌లో జులై 6 నుంచి కనిపించకుండాపోయిన ఇద్దరు విద్యార్థులు చనిపోయారని, వారు హత్యకు గురయ్యారని ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ చెప్పారు.

    ప్రభుత్వ విచారణలో ఈ విషయం బయటపడిందని తెలిపారు.

    ఈ కేసుపై ఇక సీబీఐ దర్యాప్తు చేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.

    దర్యాప్తును ముమ్మరం చేసేందుకు సీబీఐ డైరెక్టర్, ప్రత్యేక బృందం బుధవారం ప్రత్యేక విమానంలో ఇంఫాల్ చేరుకొంటారని ఆయన మంగళవారం రాత్రి సోషల్ మీడియా నెట్‌వర్క్ ‘ఎక్స్’(ట్విటర్)లో చెప్పారు.

    17 ఏళ్ల హిజామ్ లింతోయిన్‌గాంబీ, 20 ఏళ్ల ఫిజామ్ హెంజీలు ఇంఫాల్‌కు చెందినవారు. ఈ విద్యార్థుల హత్య వెనక కుకీ అతివాదులు ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయని ప్రభుత్వం మంగళవారం చెప్పింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. ఏసియన్ గేమ్స్: షూటింగ్‌లో భారత మహిళల జట్టుకు స్వర్ణం

    ఏసియన్ గేమ్స్

    ఫొటో సోర్స్, Twitter/@ianuragthakur

    చైనాలో జరుగుతున్న ఏసియన్ గేమ్స్‌లో బుధవారం భారత మహిళా షూటింగ్ జట్టు స్వర్ణం సాధించింది.

    మహిళల 25 మీటర్ల పిస్టల్ టీం ఈవెంట్‌లో మను భాకర్, ఇషా సింగ్, రిథమ్ సాంగ్వాన్ త్రయం 1,759 స్కోరుతో స్వర్ణం గెలుచుకుంది.

    ఈ గేమ్‌లో చైనా జట్టు రజతం గెలుచుకోగా, దక్షిణ కొరియా కాంస్యం సాధించింది.

    కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. దీపేంద్ర సింగ్: 9 బంతుల్లో హాఫ్ సెంచరీ, నేపాల్ క్రికెటర్ ప్రపంచ రికార్డు

    ఏసియన్ గేమ్స్

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ ఐరీ

    ఏసియన్ గేమ్స్‌లో భాగంగా నేపాల్, మంగోలియాల మధ్య బుధవారం జరిగిన టీ20 మ్యాచ్‌లో ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి.

    మంగోలియా జట్టుపై నేపాల్ 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 314 పరుగులు సాధించి, ప్రపంచ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచిందని వార్తాసంస్థ ఏఎన్ఐ తెలిపింది.

    అంతేకాదు 'ఫాస్టెస్ట్ ఫిఫ్టీ' రికార్డు కూడా నేపాల్ ప్లేయర్ బద్దలు కొట్టాడు. ఆల్‌రౌండర్ దీపేంద్ర సింగ్ ఐరీ కేవలం 9 బంతుల్లోనే ( 8 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు.

    అంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ (12 బంతులు) పేరిట ఉండేది.

    ఇదే మ్యాచ్‌లో మరో నేపాలీ బ్యాటర్ కుశాల్ మల్లా 34 బంతుల్లోనే సెంచరీ సాధించి, మరో ప్రపంచ రికార్డు (ఫాస్టెస్ట్ సెంచరీ) నెలకొల్పాడు.

    అంతకుముందు ఈ రికార్డు భారత బ్యాటర్ రోహిత్ శర్మ, దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌ (35 బంతుల్లో సెంచరీ) పేరిట ఉండేది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. ఏసియన్ గేమ్స్‌: నేడు నిఖత్ జరీన్ బౌట్, మహిళల హాకీ మ్యాచ్

    ఏసియన్ గేమ్స్

    ఫొటో సోర్స్, Getty Images

    బాక్సింగ్‌: నిఖత్‌ జరీన్‌ (50 కిలోలు) రౌండ్‌ 16 బౌట్‌ (సాయంత్రం 5:15 గంటలకు)

    శివ థాపా (63.5 కిలోలు) రౌండ్‌ 16 బౌట్‌ (మధ్యాహ్నం 1:15 గంటలకు)

    సంజీత్‌ (92 కిలోలు) రౌండ్‌ 16 బౌట్‌ (మధ్యాహ్నం 1:30 గంటలకు)

    మహిళల హాకీ: (ఉదయం 10:00) భారత్, సింగపూర్‌ మ్యాచ్‌

    చెస్‌: మధ్యాహ్నం 12:30 గంటలకు

    టేబుల్‌ టెన్నిస్‌: ఆకుల శ్రీజ-హర్మీత్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ రౌండ్‌ 32 (సాయంత్రం 4:25 గంటలకు)

    మనికా బాత్రా-సాథియన్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ రౌండ్‌ 32 (సాయంత్రం 3:50 గంటలకు)

    టెన్నిస్‌: సాకేత్‌-రామ్‌కుమార్‌, డబుల్స్‌ క్వార్టర్స్‌

    రోహన్‌ బోపన్న-రుతుజ మిక్స్‌డ్‌ డబుల్స్‌ రౌండ్‌ 16

    సుమిత్‌, సింగిల్స్‌ క్వార్టర్స్‌

    అంకిత, సింగిల్స్‌ క్వార్టర్స్‌

  16. ఇరాక్: పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం, 100 మంది మృతి

    ఇరాక్‌లో అగ్ని ప్రమాదం

    ఫొటో సోర్స్, Getty Images

    ఇరాక్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో 100 మందికి పైగా మరణించారు. మరో 150 మంది గాయపడినట్లు అక్కడి మీడియా తెలిపింది.

    ఉత్తర నినెవే ప్రావిన్స్‌లోని అల్-హమ్దానియా జిల్లాలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.

    మంటలు చెలరేగడానికి కారణమేమిటనేది స్పష్టంగా తెలియలేదు, అయితే, బాణాసంచా కాల్చిన తర్వాత మంటలు చెలరేగాయని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి.

    "అధికంగా మండే సామగ్రిని హాల్‌లో ఉపయోగించడం వల్ల ఆ ప్రాంతంలో నిమిషాల వ్యవధిలో మంటలు వ్యాపించాయి, దీంతో హాల్ పైభాగం కూలిపోయింది" అని ఒక ఇరాక్ అధికారి వార్తాసంస్థ నీనాతో చెప్పారు.

    బాధితుల్లో వధువు, వరుడు కూడా ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.

  17. డెంగీ రెండోసారి వస్తే మరింత ప్రాణాంతకమా? అంత మంది చనిపోతున్నా ఈ వైరస్‌కు సరైన టీకా ఎందుకు రాలేదు?

  18. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి