ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు వహీదా రెహమాన్ ఎంపికయ్యారని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, United Nations
కొన్ని దేశాలు అజెండాను నిర్ణయిస్తే, ఇతరులు దాన్ని అనుసరించే రోజులు పోయాయని భారత విదేశాంగ శాఖమంత్రి ఎస్.జైశంకర్ అన్నారు.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు.
‘‘తూర్పు-పశ్చిమ దేశాల పోలరైజేషన్ కారణంగా ఉత్తర దక్షిణ ధృవాల మధ్య విభజన తీవ్రంగా ఉన్న సమయంలో చర్చలే దేనికైనా పరిష్కారం చూపుతాయని భారత్ సూచించింది. ఇటీవలి దిల్లీ శిఖరాగ్ర సమావేశం కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది’’ అని ఆయన అన్నారు.
న్యూదిల్లీలో జరిగిన జీ-20 సదస్సులో ఏం నిర్ణయించామో, రానున్న రోజుల్లో అది ప్రతి ఫలిస్తుందని జైశంకర్ అన్నారు. అలీనోద్యమ యుగం నుండి, మనమంతా ఇప్పుడు స్నేహితులుగా మారిపోయామని, కొన్ని దేశాలు ఒక ఎజెండాను నిర్దేశించుకుని, దానిని ఇతరుల మీద రుద్దే ప్రయత్నాలు ఇకపై చెల్లవని జైశంకర్ అన్నారు.
కొందరు ఇంకా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయిని, ఇది ఎంతో కాలం సాగదని ఆయన స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, TDP
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశారు తెలుగుదేశం పార్టీ నేతలు.
మంగళవారం నాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్‌లు రాష్ట్రపతిని కలిశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీని వేధించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని వారు రాష్ట్రపతికి వివరించారు.
చంద్రబాబుపై కూడా ఇలాగే అక్రమ కేసులు పెట్టారని, ఆధారాలు లేకుండా కేసులు పెట్టి జైలులో బంధించారని ద్రౌపది ముర్ముకు వివరించినట్లు సమావేశం అనంతరం లోకేశ్ మీడియాకు వెల్లడించారు.

ఫొటో సోర్స్, WANG ZHAO/AFP via Getty Images
ఆసియా క్రీడల్లో భారత్ మూడో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఈక్వెస్ట్రియన్ ఈవెంట్‌లో మంగళవారం టీమిండియా విజేతగా నిలిచి 41 ఏళ్ల తర్వాత బంగారు పతకాన్ని అందుకుంది.
ఈక్వెస్ట్రియన్ డ్రస్సేజ్ ఈవెంట్ మిక్సడ్ టీమ్ విభాగంలో హృదయ్, అనూష్, దివ్యాకృతి సింగ్, సుదీప్తి హజేలాలతో కూడిన భారత బృందం 209.205 పాయింట్లతో విజేతగా నిలిచింది.
ఈ విభాగంలో చైనా రజతాన్ని, హాంకాంగ్ కాంస్యాన్ని అందుకుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు వహీదా రెహమాన్ ఎంపికయ్యారని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.
“భారతీయ సినిమాకు ఆమె చేసిన కృషికి ఈ గుర్తింపు దక్కింది. ఆమె అనేక సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు. అందులో ప్యాసా, కాగజ్‌కే పూల్, చౌదావికా చాంద్, సాహెబ్ బీవీ ఔర్ గులామ్, ఖామోష, గైడ్ లాంటివి కొన్ని.
ఆమె జాతీయ చలనచిత్ర అవార్డుతోపాటు పద్మ భూషణ్ అవార్డు కూడా అందుకున్నారు. భారతీయ మహిళ తన కృషి, అకింతభావంతో ఉన్నత స్థాయికి ఎదగగలరని ఆమె నిరూపించారు. ఆమెకు హృదయ పూర్వక అభినందనలు” అని ఆయన ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Reuters
వివాదాస్పద నగార్నో-కరాబక్ ప్రాంతంలో మరోసారి పరిస్థితులు తీవ్రంగా మారాయి.
నగార్నో-కరాబక్ ప్రాంతాన్ని గత వారం అజర్‌బైజాన్ స్వాధీనం చేసుకున్నప్పటి తర్వాత ఇక్కడి నుంచి పెద్ద సంఖ్యలో అర్మేనియా శరణార్థులు పారిపోతున్నారు.
గత వారం అజర్‌బైజాన్ ప్రభుత్వం నగార్నో-కరాబక్ సరిహద్దును మూసివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆ ప్రాంతంలోని అర్మేనియన్లు సరిహద్దులు దాటుతున్నారు.
అర్మేనియాలోని యెరేవన్‌లో ప్రభుత్వ యంత్రాంగం నగార్నో-కరాబక్ ప్రాంతంలోని అర్మేనియన్లను పోరాటం చేసైనా సరే, తమ దేశానికి తీసుకువస్తామని ప్రకటించడంతో ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది.
గత వారం రోజుల్లో నగార్నో-కరాబక్ సరిహద్దు దాటుతున్న అర్మేనియన్ల సంఖ్య పెరిగింది. ఇప్పటివరకు 6,500 మంది సరిహద్దు దాటినట్లు అంచనా వేస్తున్నారు. నగార్నో-కరాబక్ ప్రాంతంలో 1,20,000 మంది అర్మేనియన్లు ఉన్నట్లు అంచనా.

ఫొటో సోర్స్, Getty Images
దీనిపై అర్మేనియా ప్రధాని స్పందించారు. అజర్‌బైజాన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేస్తోందని ఆరోపించారు.
అజర్‌బైజాన్ ప్రభుత్వం మాత్రం శాంతి స్థాపన, ఉగ్రవాద సంస్థలను నిర్మూలించే లక్ష్యంతో నగార్నో-కరాబక్‌లో ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లుగా చెప్పింది.
కరాబక్‌లోని ప్రధాన నగరమైన స్టెపనాకెర్ట్‌లోని పెట్రోల్ స్టేషన్‌లో పేలుడు సంభవించి 200 మంది వరకు తీవ్రంగా గాయపడ్డట్లు అక్కడి మానవ హక్కుల ప్రతినిధి గెగ్హం స్టెపన్యాన్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అయితే పేలుడుకు కారణం ఇంకా తెలియలేదు.
అజర్‌బైజాన్, అర్మేనియా మధ్య శాంతిని నెలకొల్పడానికి యూరోపియన్ యూనియన్ చొరవతో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అజర్‌బైజాన్, అర్మేనియా దేశాల ప్రతినిధులు బ్రస్సెల్స్ చేరుకున్నారు. మొదట నగార్నో-కరాబక్ సరిహద్దుల మూసివేతపై చర్చించనున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు పూల్-ఏ మ్యాచ్‌లో సింగపూర్‌ను 16-1 తేడాతో ఓడించింది.
గత రెండు మ్యాచుల్లో కలిపి భారత జట్టు 32 గోల్స్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సోమవారం భారత మహిళల క్రికెట్ జట్టు స్వర్ణ పతకం సాధించింది.
శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో ఇప్పటివరకు 2 స్వర్ణాలు, మూడు రజతాలు సహా మొత్తం 11 పతకాలు ఉన్నాయి.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.