ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌లో భారత దేశం రెండు స్వర్ణ పతకాలు గెలిచింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్‌లో మొదటి స్వర్ణాన్ని, మహిళల క్రికెట్‌లో రెండో స్వర్ణాన్ని గెలుచుకుంది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
భారత మహిళల క్రికెట్ జట్టు, ఆసియా క్రీడల్లో విజేతగా నిలవడంతో భారత్ ఖాతాలో సోమవారం రెండో స్వర్ణం చేరింది.
శ్రీలంకతో సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు చేసింది.
స్మృతి మంధాన (46) టాప్ స్కోరర్ కాగా, జెమీమా రోడ్రిగ్స్ (42) రాణించింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 97 పరుగులు చేసింది.
ఆఖరి ఓవర్‌లో విజయానికి శ్రీలంక 25 పరుగులు చేయాల్సి ఉండగా, కేవలం 5 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో శ్రీలంక రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
భారత బౌలర్లలో టిటస్ సాధు 3 వికెట్లు, రాజేశ్వరీ గైక్వాడ్ 2 వికెట్లు పడగొట్టారు.
ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో ఇప్పటివరకు 2 స్వర్ణాలు, మూడు రజతాలు సహా మొత్తం 11 పతకాలు ఉన్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, X / Raghav Chadha
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధా, సినీ నటి పరిణీతి చోప్రాల పెళ్లి సెప్టెంబరు 24న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగింది.
తమ పెళ్లి ఫొటోలను వారు సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, UGC
సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ కార్యకర్తలు సోమవారం ఆందోళనలకు పూనుకున్నారు. దీంతో ఎక్కడికక్కడ అంగన్వాడీలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు.
విజయవాడలోని ధర్నా చౌక్‌లో నిరసన కార్యక్రమం చేపట్టాలని సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూకు చెందిన యూనియన్లు ఉమ్మడిగా నిర్ణయించాయి. అంగన్వాడీలను పోలీసులు కట్టడి చేసేందుకు ప్రయత్నం చేశారు. ఎటువంటి ఆందోళనలకు అనుమతి లేదని, ఆదేశాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు.

ఫొటో సోర్స్, UGC
అయినప్పటికీ పోలీసు ఆంక్షలను అధిగమించి, విజయవాడ చేరుకున్న వందల మంది అంగన్వాడీ కార్యకర్తలను రైల్వే స్టేషన్ సహా వివిధ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో పోలీసులకు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. అరెస్ట్ చేసిన అంగన్వాడీలను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌కు తరలించి, అక్కడ నిర్బంధించారు. ఈ అరెస్టులను వివిధ కార్మిక సంఘాల నేతలు, విపక్ష నేతలు ఖండించారు.
అంగన్వాడీల వేతనాలు పెంచకుండా, నెలల తరబడి బిల్లులు కూడా పెండింగ్ లో పెట్టి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం వేధిస్తోందని, నిరసన తెలిపే హక్కు లేకుండా గొంతు నొక్కుతోందని వారు విమర్శించారు.

ఫొటో సోర్స్, Rudrankksh/India_AllSports
చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌లో భారత దేశం తొలి స్వర్ణ పతకం గెలిచింది.
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం ఈవెంట్‌లో ముగ్గురితో కూడిన భారత షూటర్ల బృందం 1893.7 పాయింట్లు సాధించి బంగారు పతకం గెలిచింది. ఈ ప్రదర్శనతో ఒక ప్రపంచ రికార్డును కూడా బద్దలు కొట్టింది.
ప్రపంచ ఛాంపియన్ రుద్రాక్ష్ పాటిల్, ఒలింపియన్ దివ్యాన్ష్ పన్వార్, ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్‌ల జట్టు క్వాలిఫికేషన్ రౌండ్‌లో 1893.7 స్కోరు సాధించి, చైనా స్కోరు 1893.3ను అధిగమించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
పురుషుల ఫోర్ రోయింగ్ ఈవెంట్‌లో భారత్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
జస్వీందర్, భీమ్, పునీత్, ఆశిష్‌ల జట్టు 6:10.81 నిమిషాల టైమ్‌లో ఈ విజయాన్ని సాధించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.