భారత్ vs ఆస్ట్రేలియా: 99 పరుగులతో భారత్ ఘన విజయం, సిరీస్ కైవసం

ఇండోర్ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో అంచనాలకు తగినట్లుగా ఆడిన టీమిండియా 99 పరుగులతో భారీ విజయాన్ని అందుకుంది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుసుకుందాం.

  2. భారత్ vs ఆస్ట్రేలియా: 99 పరుగులతో భారత్ ఘన విజయం, సిరీస్ కైవసం

    మ్యాచ్

    ఫొటో సోర్స్, Getty Images

    ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌ను ప్రపంచకప్ సన్నాహాలను పరీక్షించేందుకు కొలమానంగా భావిస్తే, ప్రపంచాన్ని షేక్ చేసేందుకు భారత జట్టు సిద్ధమైందని చెప్పవచ్చు.

    ఇండోర్ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో అంచనాలకు తగినట్లుగా ఆడిన టీమిండియా 99 పరుగులతో భారీ విజయాన్ని అందుకుంది.

    ఆస్ట్రేలియాకు ముందుగా 400 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించిన భారత జట్టు... తొలి రెండు ఓవర్లలోనే ఆసీస్‌కు చెందిన 2 వికెట్లను పడగొట్టింది.

    మాథ్యూ షాట్ (9), కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (0)లను ప్రసిధ్ కృష్ణ ఆరంభంలోనే వెనక్కి పంపాడు.

    ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఓవర్ల తర్వాత వర్షం కారణంగా ఆట నిలిపివేయాల్సి వచ్చింది.అప్పటికి ఆస్ట్రేలియా 9 ఓవర్లలో 2 వికెట్లకు 56 పరుగులు చేసింది.

    తర్వాత డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 పరుగులుగా కుదించారు.

    ఆట మొదలైన కాసేపటికే అశ్విన్, ఆస్ట్రేలియాను దెబ్బతీశాడు. తక్కువ ఓవర్ల వ్యవధిలోనే మార్నస్ లబ్‌షేన్ (27), డేవిడ్ వార్నర్ (53), జోష్ ఇంగ్లీష్ (6 పరుగులు) వికెట్లు పడగొట్టాడు.

    ఆ తర్వాత రవీంద్ర జడేజా మొదట అలెక్స్ క్యారీ (14), తర్వాత ఆడమ్ జంపా (5)లను అవుట్ చేశాడు. కామెరూన్ గ్రీన్ (19) రనౌట్ అయ్యాడు. చివర్లో సీన్ అబాట్, జోష్ హాజల్ వుడ్ పోరాడినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది.

    అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 399 పరుగులు చేసింది.

  3. టార్గెట్ కిల్లింగ్స్ మీద అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి?

  4. రాజమండ్రి సెంట్రల్ జైల్: ముగ్గురు మాజీ సీఎంలు ఖైదీలుగా గడిపిన ఈ జైలు ప్రత్యేకతలు ఏంటి?

  5. భారత్X ఆస్ట్రేలియా: గిల్, అయ్యర్ సెంచరీల మోతతో భారత్ భారీ స్కోరు... చివర్లో సూర్య కుమార్ మెరుపులు

    గిల్

    ఫొటో సోర్స్, Getty Images

    ప్రపంచకప్ టోర్నీకి సన్నాహకంగా భావిస్తోన్న ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో చెలరేగారు.

    వీరిద్దరితో పాటు కేఎల్ రాహుల్, చివర్లో సూర్యకుమార్ యాదవ్ ధాటిగా ఆడటంతో ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 399 పరుగులు సాధించింది.

    గిల్ 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 104 పరుగులు చేయగా, శ్రేయస్ అయ్యర్ 90 బంతుల్లో 105 పరుగులు సాధించాడు. అయ్యర్ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.

    సూర్యకుమార్

    ఫొటో సోర్స్, Getty Images

    కెప్టెన్ కేఎల్ రాహుల్ 38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ (31) రాణించాడు.

    ఇక చివర్లో సూర్యకుమార్ యాదవ్ 37 బంతుల్లో అజేయంగా 72 పరుగులు చేసి భారత్‌కు భారీ స్కోరును అందించాడు. సూర్యకుమార్ 6 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. రవీంద్ర జడేజా (13 నాటౌట్) కూడా రాణించాడు.

    ఆసీస్ బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 2 వికెట్లు తీశాడు. జోష్ హాజెల్‌వుడ్, సీన్ అబాట్, ఆడమ్ జంపా తలా ఓ వికెట్ పడగొట్టారు.

  6. పాకిస్తాన్ సైన్యం నుంచి తప్పించుకొని కాలి నడకన భారత్ చేరిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ కథ..

  7. 'రా' ఏజెంట్లను ఎలా ఎంపిక చేస్తారు? ఎలాంటి శిక్షణ ఇస్తారు?

  8. కెనడాలో హిందువులపై అక్కడి పార్టీల వైఖరి ఏమిటి?

  9. ఏసియన్ గేమ్స్: ఐదు పతకాలు సాధించిన భారత్

    ఏసియన్ గేమ్స్

    ఫొటో సోర్స్, SAI

    చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఏసియన్ గేమ్స్‌లో భారత అథ్లెట్స్ సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకు ఐదు పతకాలు సాధించారు.

    మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో ఇండియా రజత పతకం గెలుచుకుంది. భారత్‌కు చెందిన మెహులీ ఘోష్, రమితా జిందాల్, ఆషి చౌక్సేలు 1,886 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచారు.

    ఇక లైట్ వెయిట్ డబుల్ స్కల్స్‌ రోయింగ్‌ విభాగంలో భారత ప్లేయర్స్ అర్జున్ లాల్, అరవింద్ సింగ్ రజత పతకాన్ని గెలుచుకున్నారు.

    పురుషుల కాక్స్డ్ 8 ఈవెంట్‌లో భారత్ రజత పతకం సాధించింది.

    పురుషుల కాక్‌లెస్ పెయిర్ ఈవెంట్‌లో లేఖ్ రామ్, బాబు లాల్ యాదవ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

    మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో రమిత కాంస్యం సాధించింది.

  10. తెలంగాణ: '10 నెలలుగా మాకు జీతాల్లేవ్, నాన్న వికలాంగ పెన్షనే మాకు దిక్కు’ అంటున్న ఉత్తమ ఉద్యోగి.. వీఆర్‌వో వ్యవస్థ రద్దు తర్వాత వారి పరిస్థితి ఇదీ

  11. రైలు ప్రమాదాలు: బాధితులకు పరిహారాన్ని 10 రెట్లు పెంచిన రైల్వే బోర్డు.. నిబంధనలు ఇవీ

  12. ఏసియన్ గేమ్స్‌: ఫైనల్ చేరిన భారత్, సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై ఘన విజయం

    క్రికెట్

    ఫొటో సోర్స్, Getty Images

    ఏసియన్ గేమ్స్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌ చేరింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 52 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

    మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 51 పరుగులకే ఆలౌటైంది.

    బంగ్లా జట్టులో కెప్టెన్ నిగర్ సుల్తానా అత్యధికంగా 12 పరుగులు చేసింది. భారత జట్టులో పూజా వస్త్రాకర్ నాలుగు వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 8.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

    టీమిండియా జట్టులో జెమిమా రోడ్రిగ్స్ 20 పరుగులు, షెఫాలీ వర్మ 17 పరుగులు చేశారు.

    కాగా, సెమీస్ మ్యాచ్‌కు స్మృతి మంధాన నాయకత్వం వహించింది.

    జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ఈ మ్యాచ్‌లో ఆడలేదు. బంగ్లాదేశ్‌ సిరీస్‌లో ఆమె ప్రవర్తన కారణంగా రెండు మ్యాచ్‌ల నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ తిరిగి జట్టులోకి రానున్నారు.

  13. బ్రేకింగ్ న్యూస్, హాంగ్జౌ ఏసియన్ గేమ్స్: బోణీ చేసిన భారత్.. రెండు రజత పతకాలు కైవసం

    ఏసియన్ గేమ్స్

    ఫొటో సోర్స్, SAI

    చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఏసియన్ గేమ్స్‌లో భారత్ బోణీ కొట్టింది.

    మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో ఇండియా రజత పతకం గెలుచుకుంది. భారత్‌కు చెందిన మెహులీ ఘోష్, రమితా జిందాల్, ఆషి చౌక్సీలు 1,886 పాయింట్లు సాధించి, రెండో స్థానంలో నిలిచారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    మరోవైపు లైట్ వెయిట్ డబుల్ స్కల్స్‌ రోయింగ్‌ విభాగంలో భారత ప్లేయర్స్ అర్జున్ లాల్, అరవింద్ సింగ్ రజత పతకాన్ని సాధించారు. ఇద్దరూ తమ రేసును ఆరున్నర నిమిషాల్లోపే పూర్తి చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  14. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

  15. 'రేప్ పోర్న్‌': ఆ అమ్మాయి బట్టలు చింపుతున్న వీడియోను మీరెందుకు చూశారు?