మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

డివిజన్ పద్ధతి ఓటింగ్‌లో ప్రతి ఎంపీకి ఒక స్లిప్ ఇస్తారు. స్లిప్‌కు ఒకవైపు మద్ధతు తెలిపే వారి కోసం ఆకుపచ్చ రంగు, రెండో వైపున వ్యతిరేకత తెలపాలనుకున్న వారి కోసం ఎరుపు రంగు ఉంటుంది. ఓటింగ్ ఇష్టం లేనివారు ఎల్లో స్లిప్ తీసుకోవాలి.

లైవ్ కవరేజీ

  1. ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ ‘నిద్ర’ లేవకపోతే ఏమవుతుంది? వాటి ‘రహస్యాలను’ ఇతర దేశాలు తెలుసుకుంటాయా?

  2. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్

  3. మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం... ఈ బిల్లు గురించి తెలుసుకోవాల్సిన 6 కీలక అంశాలు

  4. బ్రేకింగ్ న్యూస్, మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

    మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 454 మంది, వ్యతిరేకంగా ఇద్దరు సభ్యులు తమ ఓటును నమోదు చేశారు. దీంతో ఈ బిల్లు 454/2 ఓట్ల తేడాతో నెగ్గినట్లయింది.

    ఓటింగ్‌ను డివిజన్ పద్ధతిలో నిర్వహించారు. ఈ విధానంలో ప్రతి ఎంపీకి ఒక స్లిప్ ఇస్తారు. ఆ పేపర్‌పై తాము ఈ బిల్లుకు మద్ధతు తెలుపుతున్నామో లేదో ఎంపీలు తెలపాల్సి ఉంటుంది. స్లిప్‌కు ఒకవైపు మద్ధతు తెలిపే వారి కోసం ఆకుపచ్చ రంగు, రెండో వైపున వ్యతిరేకత తెలపాలనుకున్న వారి కోసం ఎరుపు రంగు ఉంటుంది.

    మద్ధతిచ్చేవారు ఆకుపచ్చ రంగువైపున తమ సంతకం, పేరు, ఐడీ కార్డ్ నంబర్, నియోజక వర్గం, రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతం, తేదీని పేర్కొనాల్సి ఉంటుంది.

    ఓటింగ్‌‌కు దూరంగా ఉండాలనుకున్న సభ్యులు ప్రత్యేక విజ్ఞాపన ద్వారా పసుపు రంగు స్లిప్‌ను అడిగి తీసుకోవచ్చు.

    ప్రతి ఒక్కరు తమ అభిమతాన్ని స్లిప్ మీద పేర్కొన్న తర్వాత వాటిని తమ దగ్గరకు వచ్చే డివిజన్ అఫీషియల్‌కు అందిస్తారు. ప్రతి ఒక్కరికి ఒక స్లిప్ మాత్రమే ఇస్తారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. చంద్రయాన్3: ఈ మిషన్‌తో చంద్రుడి గురించి కొత్తగా తెలిసిన విషయాలేంటి... అవి భవిష్యత్తును మార్చేస్తాయా?

  6. లోకేష్ అరెస్టయితే పార్టీని బ్రాహ్మణి నడిపిస్తారు: అయ్యన్నపాత్రుడు

    అయ్యన్న పాత్రుడు

    ఫొటో సోర్స్, AyyannaPatrudu/FB

    ఫొటో క్యాప్షన్, అయ్యన్న పాత్రుడు

    ఏపీ పోలీసులు లోకేష్‌ను అరెస్ట్ చేస్తే బ్రాహ్మణి పార్టీని నడిపిస్తారని, ఈ విషయాన్ని తాను లోకేష్‌తో చెప్పినట్లు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మీడియాతో చెప్పారు.

    నాలుగు రోజుల క్రితం లోకేష్‌తో పాటు దిల్లీకి వచ్చిన అయ్యన్న పాత్రుడు...చంద్రబాబు అరెస్టుకి వ్యతిరేకంగా టీడీపీ నేతలతో కలిసి రాజ్‌ఘాట్ వద్ద జరిగిన నిరసనలో పాల్కొన్నారు. ఆ సమయంలో తమ మధ్య లోకేష్ అరెస్టుకు సంబంధించిన సంభాషణ జరిగిందని చెప్పారు. ఆ సమయంలో తన అభిప్రాయాన్ని లోకేష్‌కి చెప్పానన్నారు.

    “ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో ఈ పార్టీ పెట్టారో కానీ ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి. అయినా పార్టీ నిలబడింది. దానికి కారణం కార్యకర్తలే. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఒక వేళ అదే పరిస్థితి వస్తే..ఆ దుర్మార్గుడు ఇలా చేస్తే ( మిమ్మల్ని జైల్లో పెడితే) మన మేడం ఉన్నారు..లోకేష్ గారి మిస్సెస్ బ్రాహ్మణిగారు ఉన్నారు. ఆ అమ్మాయిని తీసుకుని మిగతా కార్యక్రమం అంతా మేము పూర్తి చేస్తాం. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎంతమందిని జైల్లో పెట్టినా పర్వాలేదు” అని తాను లోకేష్‌తో అన్నట్లు అయ్యన్న మీడియాతో చెప్పారు.

  7. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎదురయ్యే అడ్డంకులు ఇవే...

  8. కామెన్వెల్త్‌ గేమ్స్‌లో అద్భుతంగా ఆడిన భారత మహిళల హాకీ జట్టు ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధిస్తుందా?

  9. వృద్ధ నాయకులు అధికారంలో ఉంటే ఆ దేశం ఏమవుతుంది... సైన్స్ ఏం చెబుతోంది?

  10. కెనడాలోని భారతీయ పౌరులు, విద్యార్థులకు భారత ప్రభుత్వ సూచనలు

    భారత్ కెనడా

    ఫొటో సోర్స్, Getty Images

    కెనడాలో నివసిస్తున్న భారతీయ పౌరులు, విద్యార్థుల భద్రత కోసం భారత ప్రభుత్వం సూచనలను జారీ చేసింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వెల్లడించారు.

    కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు,రాజకీయ ప్రేరేపిత ద్వేషం, హింస పెరుగుతున్న దృష్ట్యా, అక్కడ నివసిస్తున్న లేదా అక్కడికి వెళ్లాలనుకునే భారతీయులందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు భారత ప్రభుత్వం తన హెచ్చరికల్లో పేర్కొంది

    ‘‘భారత వ్యతిరేక ఎజెండాకు వ్యతిరేకంగా తమ స్వరాన్ని లేవనెత్తిన భారతీయ దౌత్యవేత్తలు, భారతీయ కమ్యూనిటీ సభ్యులను లక్ష్యంగా చేసుకుని కెనడాలో ఇటీవల బెదిరింపులు జరుగుతున్నాయి. అందువల్ల, కెనడాలోని ఇటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశమున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని భారతీయ పౌరులకు సూచిస్తున్నాం’’ అని భారత విదేశాంగ శాఖ సూచించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  11. ఏపీ కేబినెట్ సమావేశం: ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు చేయాలని నిర్ణయం

    ఏపీ క్యాబినెట్ సమావేశం

    ఫొటో సోర్స్, APCMO

    ఫొటో క్యాప్షన్, కేబినెట్ సమావేశం

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 49 అంశాలపై చర్చించారు.

    జీపీఎస్ అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలపడంతో రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. సీపీఎస్ స్థానంలో కొత్త విధానం అమల్లోకి రానుంది.

    ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసే సమయానికి వారికి ఇంటి స్థలం ఉండి ఉండాలని, అలా లేని వారికి కచ్చితంగా స్థలం ఇవ్వాలని, ఇది ప్రభుత్వ బాధ్యతని కేబినెట్ నిర్ణయించింది.

    రిటైర్ అయిన వారి పిల్లలకు కచ్చితంగా ఆరోగ్యశ్రీ వర్తింప జేయాలని కూడా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

    మరోవైపు కేబినెట్ నిర్ణయం మీద సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి, జీపీఎస్ పేరుతో మరింత అన్యాయం చేస్తున్నారని ఉద్యోగుల సంఘం నాయకుడు రవి కుమార్ ఆరోపించారు.

    ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం పిలుపునిచ్చింది.

  12. మహిళా రిజర్వేషన్ బిల్లు - సోనియా గాంధీ: ‘‘నాలో భావోద్వేగం నింపిన క్షణమిది, రాజీవ్ కల ఇది’’

    సోనియా

    ఫొటో సోర్స్, Getty Images

    చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన 'నారీ శక్తి వందన-2023' బిల్లుకు కాంగ్రెస్ మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ అగ్రనేత సోనియా‌ గాంధీ లోక్‌సభలో ప్రకటించారు.

    మహిళా రిజర్వేషన్ బిల్లుపై బుధవారం దిగువ సభలో చర్చ జరుగుతోంది.

    ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున సోనియా గాంధీ మాట్లాడారు.

    ''నారీ శక్తి వందన బిల్లుకు కాంగ్రెస్ మద్దతిస్తోంది. పొగతో నిండిన వంటింటి నుంచి వెలుగులతో మెరిసిపోయే వేదికల వరకూ భారత మహిళ ప్రయాణం సుదీర్ఘమైనది. చివరికి ఆమె తను తన గమ్యాన్ని చేరుకోగలిగింది. ఆమె జన్మనిచ్చింది, కుటుంబాన్ని నడిపింది. పురుషుల మధ్య పరుగులు పెట్టింది. తరచూ ఓడిపోతూనే చివరికి విజయం అందుకుంది. భారత మహిళ హృదయంలో మహా సముద్రమంత ధైర్యం ఉంది. అయితే, ఆమె తనకు జరిగిన అన్యాయం గురించి ఏనాడూ ఫిర్యాదు చేయలేదు. తన ప్రయోజనాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నదిలా అందరి మంచి కోసం పనిచేసింది. ఆమె విశ్రాంతి తీసుకోవడం ఎరుగదు. ఆమెకు అలసట తెలీదు. స్త్రీ కృషి, గౌరవం, త్యాగాలు గుర్తించినపుడే మనం మనిషి కాగలం.

    రాజీవ్ గాంధీ కల

    నా జీవితంలో భావోద్వేగం నింపిన క్షణమిది. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్త్రీల భాగస్వామ్యం కోసం నా జీవిత భాగస్వామి రాజీవ్ గాంధీ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. అది రాజ్యసభలో ఏడు ఓట్ల తేడాతో ఓడిపోయింది. తర్వాత ప్రధాని పీవీ నర్సింహారావు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీనే దాన్ని ఆమోదించింది. ఇప్పుడు దాని ఫలితంగానే దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా 15 లక్షల మంది మహిళలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. రాజీవ్ గాంధీ కల సగమే నెరవేరింది. ఈ బిల్లు ఆమోదంతో అది పూర్తవుతుంది.

    13 ఏళ్లుగా భారత మహిళలు ఈ బిల్లు కోసం వేచిచూస్తున్నారు. ఈ బిల్లును వెంటనే అమల్లోకి తీసుకురావాలి. కులగణన కూడా నిర్వహించి మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి. దీని అమలును ఆలస్యం చేయడమంటే, అది దేశానికి అన్యాయం చేయడమే. అన్ని అడ్డంకులను అధిగమించి వీలైనంత త్వరగా నారీ శక్తి వందన చట్టం అమలు చేయాలని కాంగ్రెస్ తరఫున కోరుతున్నా'' అని సోనియా చెప్పారు.

  13. నవాజ్ షరీఫ్: 'భారత్ చంద్రుడిపైకి చేరుకుంది, పాకిస్తాన్ మాత్రం డాలర్లు అడుక్కుంటోంది’

  14. అనీ బిసెంట్: నాస్తికత నుంచి తాత్వికత వైపు మళ్లి, హిందూ మతంపై ప్రసంగాలు ఇచ్చిన బ్రిటిష్ మహిళ

  15. సిక్కు నేత నిజ్జర్ హత్య: ఇండియా, కెనడా గొడవతో అమెరికా ఎందుకు టెన్షన్ పడుతోంది?

  16. నారీ శక్తి వందన: నేడు లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ

    మహిళలు

    ఫొటో సోర్స్, Getty Images

    మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై నేడు లోక్‌సభలో చర్చ జరగనుంది. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే ఈ బిల్లును మంగళవారం దిగువ సభలో ప్రవేశపెట్టారు.

    మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్రం 'నారీ శక్తి వందన' అనే పేరు పెట్టింది.

    బుధవారం అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ బిల్లుపై సభలో మాట్లాడనున్నారు.

    కాంగ్రెస్‌ తరపున చర్చకు సోనియా గాంధీ నాయకత్వం వహించే అవకాశం ఉందని వార్తాసంస్థ ఏఎన్ఐ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  17. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

  18. నారీ శక్తి వందన: ‘దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ సమావేశాల్లో ఆమోదిస్తాం’

  19. ప్రతి 10 మందిలో ఒకరికి 80 ఏళ్లు పైనే.. జపాన్ చరిత్రలో తొలిసారి

  20. హైదరాబాద్ ‘మిస్సింగ్’ మహిళ మిస్టరీ: మతం మార్చుకుని, రెండో పెళ్లి చేసుకొని గోవాలో జీవనం.. ఐదేళ్ల తర్వాత ఎలా గుర్తించారు?