ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై వివాదం ముదురుతోంది. మోదీ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రులు కొందరు ఈ వివాదంపై తీవ్రంగా స్పందించారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్

ఫొటో సోర్స్, ANI
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రభుత్వంలోని డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై వివాదం ముదురుతోంది. గురువారం మోదీ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రులు ఈ వివాదంపై స్పందించారు.
‘‘డీఎంకే, దాని మిత్రపక్షమైన కాంగ్రెస్ నేతలు మొదటి నుంచీ హిందూ వ్యతిరేక వాదులు. వారు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ను తప్పుబట్టేవారు. కానీ, ముస్లిం లీగ్‌ను, జమాత్-ఏ-ఇస్లామీని వారెప్పుడూ ఏమీ అనలేదు. ఓటు బ్యాంకు కోసం వారు దేశ ద్రోహానికి పాల్పడగలరు. ఇది హిందూ మెజార్టీ దేశం. ఒకవేళ వారి మతాన్ని అవమానిస్తే వారసలు మర్చిపోరు’’ అని కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘‘ఈ కూటమి నాయకుల అహంకారాన్ని తగ్గించాలని నేను ఇవాళ దేవుడిని ప్రార్థిస్తాను. వారి ఆలోచనను కాస్త మెరుగుపర్చాలని, వారికి మంచి బుద్ధి ఇవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే, వారు అహంకార భావంతో ఇలాంటి దిగజారుడు ప్రకటనలు చేస్తున్నారు. హిందువులను, సనాతన ధర్మాన్ని అవమానించేలా ఇది చేస్తుంది. రాహుల్ గాంధీ ద్వేషపూరిత దుకాణంలో ఈ నాయకులు ద్వేషపూరిత వస్తువులనే అమ్ముతున్నారు’’ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘‘సనాతన ధర్మం గురించి, భారత సంస్కృతి, నాగరికత గురించి ఎవరైతే ఇలాంటి కామెంట్లు చేస్తారో వారు సిగ్గుచేటుగా భావించాలి. ఇలాంటి ప్రకటనలపై దేశమంతా, భారతీయులందరూ నిరాసక్తి వ్యక్తం చేశారు. ప్రజల ముందుకు వచ్చి వారు సమాధానం చెప్పాల్సి ఉందని నాకనిపిస్తుంది’’ అని మరో కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
‘‘సనాతన ధర్మంపై ఇండియా కూటమి చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయి. దేశ వినాశన దిశగా తీసుకెళ్తున్నాయి, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తున్నాయి. ఇదీ ఇండియా కూటమి అసలైన ముఖం’’ అని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం కుల వివక్ష నిషేధ బిల్లును ఆమోదించింది.
దీంతో అమెరికాలో ఇలాంటి నిషేధం అమలుకు బిల్లును ఆమోదించిన తొలి చట్ట సభగా కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ గుర్తింపు పొందింది.
ఈ బిల్లు ఆమోదం సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. తమ పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారన్న దక్షిణాసియా సంతతి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఇకపై వీలుపడుతుందని అన్నారు.
మంగళవారం ఈ బిల్లుపై ఓటింగ్ జరగ్గా 31-5 ఓట్ల తేడాతో ఆమోదం దక్కింది.
డెమొక్రటిక్ పార్టీ సెనేటర్ అయిషా వహాబ్ దీనిపై మాట్లాడుతూ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న వివక్షల నుంచి రక్షణ చట్టంలో జెండర్, రేస్, రెలిజియన్, డిజేబులిటీకి అదనంగా కులం కూడా జోడించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుందని చెప్పారు.
కాగా, అసెంబ్లీ ఆమోదం పొందడంతో ఇప్పుడు ఈ బిల్లు చట్టరూపం దాల్చడానికి గవర్నరు దానిపై సంతకం చేయాల్సి ఉంది.
ఇంతకుముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో సీటెల్ నగరంలోనూ కుల వివక్షను నిషేధించారు.

ఫొటో సోర్స్, FACEBOOK/UDHAYANIDHI STALIN
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల తరువాత అయోధ్యకు చెందిన సాధువు పరమహంస ఆచార్య స్పందిస్తూ ఉదయనిధి తలను తెచ్చినవారికి రూ. 10 కోట్ల బహుమానం ఇస్తానంటూ ప్రకటన చేశారు.
దీంతో తమిళనాడులో ఆయనపై కేసు నమోదైంది.
మదురైకి చెందిన డీఎంకే న్యాయ విభాగ సమన్వయకర్త జె.దేవసేనన్ దీనిపై మాట్లాడుతూ మదురై క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారని చెప్పారు.
పరమహంస ఆచార్య చేసిన ప్రకటన తమిళనాడులో సామరస్యాన్ని దెబ్బతీసిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేసియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ‘ఏసియాన్-భారత్, తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం’లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన సదస్సులో మాట్లాడుతూ భారత్, ఏసియాన్ భాగస్వామ్యం నాలుగో దశాబ్దానికి చేరిందని.. ఈ సదస్సుకు సహ అధ్యక్షత వహించడం తనకు దక్కిన గౌరవం అని అన్నారు.
ఈ సదస్సును నిర్వహిస్తున్నందుకు ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడోను మోదీ అభినందించారు.
‘మన చరిత్ర, భౌగోళికతలే ఏసియాన్, భారత్‌లను కలిపి ఉంచుతాయి. దాంతో పాటు ఉమ్మడి విలువలు, ప్రాంతీయ సమగ్రత, శాంతి విషయంలో ఉమ్మడి విశ్వాసాలు, సుసంపన్నత, బహుధ్రువ ప్రపంచం మనల్ని ఏకతాటిపై ఉంచుతాయి’ అని మోదీ తన ప్రసంగంలో అన్నారు.
మానవ జాతి ప్రగతికి తోడ్పడే భవిష్యత్ రంగాల విషయంలో వివిధ దేశాల నేతలతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు మోదీ తెలిపారు.
గ్లోబల్ సౌత్ నినాదాన్ని గట్టిగా వినిపించాలని మోదీ అన్నారు.
ఇటీవల బాధ్యతలు చేపట్టిన కంబోడియా నూతన ప్రధాని హునె మనెత్‌ను మోదీ అభినందించారు. ఏసియాన్ కంట్రీ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న సింగపూర్‌ను, 2024లో ఏసియాన్ సదస్సుకు అధ్యక్షత వహించనున్న లావోస్‌కు ఆయన అభినందనలు తెలిపారు.
అంతకుముందు జకార్తా విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. ఏసియా సదస్సు వేదిక వద్ద ప్రధాని మోదీకి ఇండోనేసియా అధ్యక్షుడు జోకో స్వాగతం పలికారు.
జకార్తా చేరుకోగానే మోదీ.. ‘ఇండోనేసియా చేరుకున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. వివిధ ఆసియా దేశాల నేతలతో కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నానన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
జకార్తాలో ప్రధాని మోదీకి భారత సంతతి ప్రజలు సాదర స్వాగతం పలికారు.
అక్కడి భారతీయుల నుంచి మర్చిపోలేని స్వాగతం లభించిందంటూ నరేంద్ర మోదీ ఆ ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేశారు.
‘ఏసియాన్-భారత్, తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం’లో పాల్గొన్న తరువాత గురువారం రాత్రికి మోదీ తిరిగి దిల్లీ చేరుకుంటారు.
ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్ కారణంగా నేతలెవరితోనూ ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొనబోరని అధికారులు వెల్లడించారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసంఇక్కడక్లిక్ చేయండి.