'రేపో, ఎల్లుండో నన్ను కూడా అరెస్ట్ చేస్తారేమో' : చంద్రబాబు

"జగన్ పాలనలో అంతా అరాచకమే. అందరినీ బెదిరిస్తున్నారు. చంపేస్తారని భయపడి చాలామంది తమ ఆస్తులను కూడా అప్పగించేస్తున్నారు.’’ అని విమర్శించారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్

  2. ఆంధ్రప్రదేశ్: కంచె కోసం కాశీ నుంచి తెచ్చిన మొక్క లక్షలు తెచ్చిపెడుతోంది

  3. వివాహం: సహజీవనంలో ఉండే మహిళకు చట్టంలో రక్షణ ఉండదా?

  4. ఇండియా-భారత్: గత వందేళ్లలో ప్రపంచంలోని అనేక దేశాలు పేర్లు ఎలా మార్చుకున్నాయంటే...

  5. శ్రీకృష్ణుడి ద్వారక కోసం సముద్రం అడుగుకి వెళ్లిన సబ్‌మెరైన్స్, అక్కడ ఏముంది?

  6. 'రేపో, ఎల్లుండో నన్ను కూడా అరెస్ట్ చేస్తారేమో' : చంద్రబాబు

    ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు

    ఫొటో సోర్స్, TDP

    రేపో, ఎల్లుండో తనను అరెస్ట్ చేస్తారేమో అని టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాయదుర్గంలో 'పల్లె ప్రగతి కోసం ప్రజా వేదిక' పేరుతో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    ''నేను నిప్పులా బతికాను, 45 ఏళ్లలో ఎవ్వరూ ధైర్యం చేసి నా మీద కేసు పెట్టలేదు. ఎక్కడా సాక్ష్యాధారాలు కానీ లేవు. రాజశేఖర్ రెడ్డి నామీద 26 ఎంక్వైరీలు వేశారు, ఏం చేశారు? ఏం చేయలేకపోయారు'' అని అన్నారు చంద్రబాబు.

    "జగన్ పాలనలో అంతా అరాచకమే. అందరినీ బెదిరిస్తున్నారు. చంపేస్తారని భయపడి చాలామంది తమ ఆస్తులను కూడా అప్పగించేస్తున్నారు. కొత్త కొత్త నేరాలతో ఆస్తులు కొల్లగొట్టేశారు. రైతులకు చెప్పకుండా భూములు తవ్వేస్తున్నారు. తప్పులను ప్రశ్నిస్తే వేధిస్తున్నారు. ఎన్జీటీలో కేసు వేసినందుకు నాగేంద్రను ఇబ్బందులు పెడుతున్నారు. ఇసుక తవ్వకాలు అక్రమం, పర్మిషన్ లేకుండా తవ్వుతున్నారని ఫిర్యాదు చేస్తే ఆయన మీద కేసు పెట్టారు. రేపో ఎల్లుండో నన్ను కూడా అరెస్ట్ చేస్తారు. లేదంటే దాడి చేస్తారు. ఎన్ని అరాచకాలు చేయాల్నో చేస్తారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వాడిని" అని చంద్రబాబు తెలిపారు.

    న్యాయాన్ని కాపాడేందుకు తన పోరాటం సాగుతుందని తెలిపారు.

  7. చంద్రయాన్-3: నాసా కెమెరాతో తీసిన ‘విక్రమ్’ ల్యాండర్ ఫోటోలు ఎలా ఉన్నాయంటే....

  8. కుంభమేళా: యాంటీబయాటిక్స్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా కోటి మంది చనిపోతారా, డబ్ల్యూహెచ్‌వో ఎందుకు హెచ్చరించింది?

  9. ASEAN సదస్సు నోట్‌లో ‘ప్రైమ్ మినిష్టర్ ఆఫ్ భారత్’ అని ఉండడంపై కాంగ్రెస్ ఏమంటోందంటే..

    jairam ramesh

    ఫొటో సోర్స్, ANI

    జీ20 సమావేశాల విందు ఆహ్వానాలలో రాష్ట్రపతిని ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా పేర్కొన్న తరువాత ఇప్పుడు ప్రధానిని మరో అంతర్జాతీయ సదస్సుకు సంబంధించిన పత్రంలో ‘ప్రైమ్ మినిష్టర్ ఆఫ్ భారత్’గా పేర్కొనడం చర్చనీయమవుతోంది.

    ఇండోనేసియాలో జరిగే ‘అసోసియేషన్ ఆఫ్ సౌత్ఈస్ట్ ఏసియన్ నేషన్స్’(ASEAN) సమావేశానికి సంబంధించిన నోట్స్‌లో భారత ప్రధానిని ‘ప్రైమ్ మినిష్టర్ ఆఫ్ భారత్’ అని ప్రస్తావించినట్లుగా ఉన్న డాక్యుమెంట్‌ను బీజేపీ నేత సంబిత్ పాత్రొ ట్విటర్‌లో షేర్ చేశారు.

    కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ కూడా ఇది ట్విటర్‌లో షేర్ చేస్తూ విపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టినందుకు బీజేపీ ఈ నాటకం అంతా మొదలుపెట్టిందని విమర్శించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. చంద్రుడిపై స్థలాన్ని కొనుక్కోవచ్చా?

  11. తల్లిదండ్రులకు భయపడి కుక్క కరిచిన విషయం దాచిన విద్యార్థి.. రేబిస్‌తో మృతి

    dog

    ఫొటో సోర్స్, Getty Images

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో 14 ఏళ్ల బాలుడు కుక్క కాటుతో మృతి చెందాడు.

    ఎనిమిదో తరగతి చదివే ఆ బాలుడిని కొద్ది వారాల కిందట కుక్క కరవగా తల్లిదండ్రులకు చెబితే ఏమంటారో అన్న భయంతో విషయం దాచి పెట్టాడని, పోమవారం ఆ విద్యార్థి మరణించాడని స్థానిక పోలీసులు తెలిపారు.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజియాబాద్‌లోని చరణ్ సింగ్ కాలనీకి చెందిన 14 ఏళ్ల షావాజ్‌ను నెల పదిహేను రోజుల కిందట పొరుగింటివారి కుక్క కరిచింది.

    కానీ తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడి షావాజ్ ఆ విషయం దాచిపెట్టాడు.

    అయితే, సెప్టెంబర్ 1 నుంచి షావాజ్ ప్రవర్తన అసాధారణంగా మారిపోయింది. దాంతో బాలుడిని ఏం జరిగిందో చెప్పమని తల్లిదండ్రులు అడగడంతో కుక్క కరిచిన విషయం అప్పుడు చెప్పాడు.

    దాంతో తల్లిదండ్రులు ఆయన్ను దిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, అక్కడ వారు చేర్చుకోలేదు. ఆ తరువాత బులంద్‌శహర్‌లో ఆయుర్వేద వైద్యం కోసం తీసుకెళ్లారు.

    బులంద్‌శహర్ నుంచి గాజియాబాద్ తిరిగి తీసుకొస్తుండగా అంబులెన్సులోనే షావాజ్ చనిపోయాడని పోలీసులు చెప్పారు.

    ఈ ఘటనపై కేసు నమోదైందని, కుక్క యజమానులపై చర్య తీసుకుంటామని ఏసీపీ నిమిష్ పటేల్ చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. గుడ్ మార్నింగ్.

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసంఇక్కడక్లిక్ చేయండి.

  13. డి.డి.కోశాంబి: చరిత్రను పక్కదారి పట్టనివ్వలేదు.. కొత్తదారి చూపించారు