తల్లిదండ్రులకు భయపడి కుక్క కరిచిన విషయం దాచిన విద్యార్థి.. రేబిస్‌తో మృతి

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో 14 ఏళ్ల బాలుడు కుక్క కాటుతో మృతి చెందాడు.
ఎనిమిదో తరగతి చదివే ఆ బాలుడిని కొద్ది వారాల కిందట కుక్క కరవగా తల్లిదండ్రులకు చెబితే ఏమంటారో అన్న భయంతో విషయం దాచి పెట్టాడని, పోమవారం ఆ విద్యార్థి మరణించాడని స్థానిక పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజియాబాద్‌లోని చరణ్ సింగ్ కాలనీకి చెందిన 14 ఏళ్ల షావాజ్‌ను నెల పదిహేను రోజుల కిందట పొరుగింటివారి కుక్క కరిచింది.
కానీ తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడి షావాజ్ ఆ విషయం దాచిపెట్టాడు.
అయితే, సెప్టెంబర్ 1 నుంచి షావాజ్ ప్రవర్తన అసాధారణంగా మారిపోయింది. దాంతో బాలుడిని ఏం జరిగిందో చెప్పమని తల్లిదండ్రులు అడగడంతో కుక్క కరిచిన విషయం అప్పుడు చెప్పాడు.
దాంతో తల్లిదండ్రులు ఆయన్ను దిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, అక్కడ వారు చేర్చుకోలేదు. ఆ తరువాత బులంద్‌శహర్‌లో ఆయుర్వేద వైద్యం కోసం తీసుకెళ్లారు.
బులంద్‌శహర్ నుంచి గాజియాబాద్ తిరిగి తీసుకొస్తుండగా అంబులెన్సులోనే షావాజ్ చనిపోయాడని పోలీసులు చెప్పారు.
ఈ ఘటనపై కేసు నమోదైందని, కుక్క యజమానులపై చర్య తీసుకుంటామని ఏసీపీ నిమిష్ పటేల్ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది



