లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు రోజర్ బిన్నీ నేతృత్వంలోని అధికారుల బృందం, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాలు అట్టారి-వాఘా బోర్డర్ దాటి పాకిస్తాన్‌కు వెళ్లారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.

ఫొటో సోర్స్, Getty Images
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు రోజర్ బిన్నీ నేతృత్వంలోని అధికారుల బృందం, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాలు అట్టారి-వాఘా బోర్డర్ దాటి పాకిస్తాన్‌కు వెళ్లారు.
లాహోర్‌లో జరగబోయే ఆసియా కప్ మ్యాచ్‌కు వీరు హాజరు కాబోతున్నారు.
ఏఎన్‌ఐ విడుదల చేసిన వీడియోలో, ఈ ఇద్దరు అధికారులు ఫొటోలకు ఫోజులిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘‘బీసీసీఐ తరఫున ప్రతినిధుల బృందం పాకిస్తాన్ వెళ్తోంది. రోజర్ బిన్నీ, నా నేతృత్వంలో ఇదొక గుడ్‌విల్ విజిట్. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ బీసీసీఐ సెక్రటరీ. అంతకుముందు మేం ఆతిథ్య దేశం శ్రీలంక వెళ్లాం. ఇప్పుడు పాకిస్తాన్ వెళ్తున్నాం. అక్కడ మూడు టీమ్‌లు ఉంటాయి. వాటిని మేం కలుస్తాం’’ అని ఈ సందర్భంగా రాజీవ్ శుక్లా చెప్పారు.
మ్యాచ్‌ను చూసేందుకు తాము పాకిస్తాన్ వెళ్తున్నట్లు రోజర్ బిన్నీ కూడా చెప్పారు. అంతకుముందు తాము శ్రీలంక వెళ్లినట్లు తెలిపారు.
చివరిసారి 2004-05లో తాను పాకిస్తాన్ వెళ్లినట్లు గుర్తుకు చేసుకున్నారు.
మంగళవారం అఫ్గానిస్తాన్, శ్రీలంక మధ్యలో మ్యాచ్ ఉంది. అక్కడే బుధవారం ‘గ్రూప్ బీ’కి చెందిన రెండో టీమ్, పాకిస్తాన్ మధ్యలో మరో మ్యాచ్ జరగనుంది.

ఫొటో సోర్స్, ISRO
చంద్రయాన్-3 మిషన్‌లోని ల్యాండర్ విక్రమ్‌ను చంద్రుడి ఉపరితలంపై మరోసారి ‘సాఫ్ట్ ల్యాండింగ్’ చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సోమవారం తెలిపింది.
విక్రమ్ తన లక్ష్యాలను అధిగమించినట్లు సోషల్ మీడియా నెట్‌వర్క్ X (ట్విటర్) లో ఇస్రో తెలిపింది.
జులైలో ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్ ఆగస్టు 23న చంద్రుడి ధ్రువ ప్రాంతంలో సురక్షితంగా దిగింది.
ల్యాండర్ విక్రమ్‌ను ఇస్రో సెప్టెంబరు 2న స్లీప్ మోడ్‌లోకి పంపింది.
తాజాగా ల్యాండర్ ఇంజిన్లను స్టార్ట్ చేసి, ఇంచుమించు 40 సెంటీమీటర్ల ఎత్తుకు లేపి, 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో తిరిగి సురక్షితంగా ల్యాండ్ చేశామని ఇస్రో తెలిపింది. దీనిని ‘హాప్ ఎక్స్‌పరిమెంట్’ అంటారు. భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష యాత్రలకు ఈ ‘కిక్-స్టార్ట్’ ప్రయోగం ముఖ్యమని ఇస్రో చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ISRO
ల్యాండర్ ఉన్న ప్రాంతంలో సెప్టెంబరు 22న తిరిగి సూర్యరశ్మి పడనుంది. అప్పటి వరకు ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ నిద్రాణ స్థితిలో ఉంటాయి. మైనస్ 200 డిగ్రీల ఉష్ణోగ్రతలను ల్యాండర్ తట్టుకోగలదా, లేదా అనేది సెప్టెంబరు 22న తెలుస్తుందని ఇస్రో చెప్పింది. సెప్టెంబరు 22 తర్వాత ల్యాండర్‌ను మళ్లీ యాక్టివేట్ చేయగలమనే విశ్వాసంతో ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్‌ను అధ్యక్షుడు యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమీర్ జెలియన్‌స్కీ తప్పించారు.
ఆయన స్థానంలో రుస్తెమ్ ఉమెరోవ్‌ను నామినేట్ చేశారు.
2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలుకాక ముందు నుంచే రెజ్నికోవ్ యుక్రెయిన్ రక్షణ మంత్రిగా ఉన్నారు. ఆయన్ను తొలగిస్తున్నట్లు అధ్యక్షుడు జెలియన్‌స్కీ ఆదివారం రాత్రి ప్రకటన చేశారు.
రక్షణ మంత్రిత్వ శాఖలో ‘కొత్త విధానాల’ను అనుసరించాల్సిన సమయం వచ్చిందని ఆయన చెప్పారు. ఉమెరోవ్ ప్రస్తుతం యుక్రెయిన్ స్టేట్ ప్రాపర్టీ ఫండ్ సారథిగా ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రెజ్నికోవ్ బ్రిటన్‌లో యుక్రెయిన్ రాయబారిగా బాధ్యతలు చేపట్టొచ్చని యుక్రెయిన్ మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయి.
బ్రిటన్ సీనియర్ రాజకీయ నాయకులతో రెజ్నికోవ్ మంచి సంబంధాలు ఏర్పరచుకున్నారు.

ఫొటో సోర్స్, Reuters
రెజ్నికోవ్ వయసు 57 సంవత్సరాలు. రష్యా-యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
పాశ్చాత్య దేశాలతో యుక్రెయిన్ చర్చల్లో రెజ్నికోవ్ పాల్గొంటూ వచ్చారు. రష్యాతో తలపడేందుకు అదనపు రక్షణ సామగ్రి కోసం లాబీయింగ్ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
రక్షణ మంత్రి పదవి నుంచి ఆయన్ను తప్పించవచ్చని ఇంతకుముందే వార్తలు వచ్చాయి.