భారత్ అంటే 100 కోట్ల ఆకలి కడుపులు కాదు.. ఆకాంక్షలు నిండిన 100 కోట్ల మెదళ్లు: మోదీ

దిల్లీలో జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశాలకు కొద్దిరోజుల ముందు ప్రధాని పీటీఐ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం.

    మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్

  2. చంద్రయాన్-3: రోవర్‌ను స్లీప్ మోడ్‌లోకి ఎందుకు పంపించారు? మళ్లీ ఇది పనిచేస్తుందా

  3. పిల్లలను కిడ్నాప్ చేసి కొట్టి చంపే సీరియల్ కిల్లర్స్ ఈ మహిళలు - ఎలా దొరికారంటే

  4. ఏమిటీ భయంకరమైన ప్రాణి.. ఎక్కడుంటుంది ఇది

  5. ఉదయనిధి స్టాలిన్: సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎందుకు వివాదంగా మారాయి?

  6. జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ మృతి

    heath streak

    ఫొటో సోర్స్, Getty Images

    జింబాబ్వే క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కోచ్ హీత్ స్ట్రీక్ మరణించారు.

    49 ఏళ్ల స్ట్రీక్ చాలాకాలంగా కొలోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.

    జింబాబ్వే తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా హీత్ స్ట్రీక్ పేరిటి రికార్డ్ ఉంది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లొ ఒకసారి 87 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసి మంచి ప్రదర్శన ఇచ్చారు స్ట్రీక్.

    క్రికెట్‌లొ అవినీతి ఆరోపణల కారణంగా 2021లో ఆయనపై ఎనిమిదేళ్ల నిషేధం విధించారు.

    ఆదివారం వేకువన ఆయన మరణించినట్లు భార్య నదైన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

    హీత్ స్ట్రీక్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

    జింబాబ్వే తరఫున 65 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన స్ట్రీక్ 216 వికెట్ తీశారు. 189 వన్డేలు ఆడి 239 వికెట్లు తీశారు.

    2016లో జింబాబ్వే హెడ్ కోచ్‌గా ఎంపికైన ఆయన 2019లో ఆ జట్టు ప్రపంచ కప్‌కు అర్హత సాధించలేకపోవడంతో బాధ్యత వహిస్తూ ఆ పదవికి రాజీనామా చేశారు.

    2018 ఐపీఎల్ సహా మరికొన్ని టోర్నీలలో మ్యాచ్‌లకు సంబంధించిన విషయాలను బయటపెట్టారన్న ఆరోపణలతో ఐసీసీ ఆయనపై ఎనిమదేళ్ల నిషేధం విధించింది.

    తాను మ్యాచ్ ఫిక్సింగ్‌కు ఎన్నడూ పాల్పడలేదని.. కానీ, మ్యాచ్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఇతరులతో పంచుకున్నానని.. అది బెట్టింగ్‌లకు సహాయపడితే పడి ఉండొచ్చని ఆయన అంగీకరించారు.

    కాగా హీత్ స్ట్రీక్ మృతి పట్ల జింబాబ్వే క్రికెట్ సంతాప ప్రకటన విడుదల చేసింది.

  7. నిగర్ షాజీ: సూర్యుడిపైకి రాకెట్ పంపిన 'ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని' కథ

  8. IPC 498: గృహహింస చట్టాన్నిమహిళలు దుర్వినియోగం చేస్తూ 'లీగల్ టెర్రర్' సృష్టిస్తున్నారా?

  9. భారత్ అంటే 100 కోట్ల ఆకలి కడుపులు కాదు.. ఆకాంక్షలు నిండిన 100 కోట్ల మెదళ్లు: మోదీ

    Modi

    ఫొటో సోర్స్, ani

    భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అప్పటికి దేశంలో అవినీతి, కుల మతతత్వాలూ కనుమరుగవుతాయని చెప్పారు. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక అంశాలపై మాట్లాడారు.

    దిల్లీలో జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశాలకు కొద్దిరోజుల ముందు ప్రధాని ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

    ప్రపంచ సంక్షేమానికి ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ మార్గదర్శకమవుతుందని ఆయన అన్నారు.

    ‘ఒకప్పుడు భారత్ అంటే 100 కోట్ల ఆకలి కడుపులు అన్నట్లుగా చూసేవారు. ఇప్పుడు అదే భారత్ అంటే ఆకాంక్షలు నిండిన 100 కోట్ల మెదళ్లుగా, నైపుణ్యాలు నింపుకొన్న 200 కోట్ల చేతులుగా చూస్తున్నారు’ అని మోదీ చెప్పారు.

    అదేసమయంలో కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్‌లలో జీ20 సదస్సులు నిర్వహించడంపై చైనా, పాకిస్తాన్‌లు అభ్యంతరాలు వ్యక్తంచేయడంపై ఆయన స్పందిస్తూ భారత్‌లో ఎక్కడైనా నిర్వహిస్తామన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. ముద్దు రేపిన దుమారం, స్పెయిన్ ఫుట్‌బాల్ క్రీడాకారిణి పెదాలపై ముద్దు పెట్టి సస్పెండైన ఫెడరేషన్ ప్రెసిడెంట్... అసలేం జరిగింది?

  11. రిలయన్స్‌: ముకేశ్ అంబానీ తరువాత ఈ లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసులు ఎవరు?

  12. గదర్-2: రూ.500 కోట్ల క్లబ్‌లోకి సన్నీ దేవోల్ తాజా చిత్రం

    గదర్ 2 సినిమా

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    సన్నీ దేవోల్ నటించిన గదర్-2 సినిమా వరుసగా నాలుగో వారం కూడా బాక్సాఫీసు వద్ద సందడి చేస్తోంది.

    ఆగస్ట్ 11న ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదలైంది.

    అప్పటి నుంచి ఈ సినిమా సెప్టెంబర్ 2(శనివారం) వరకు రూ.493.4 కోట్ల వసూళ్లను రాబట్టింది.

    అడ్వాన్స్ బుకింగ్ స్టేటస్‌ను లెక్కలోకి తీసుకుంటే, ఈ సినిమా విడుదలైన 24వ రోజుకి అంటే ఇవాల్టికి రూ.500 కోట్ల మార్కును ఇది క్రాస్ చేస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

    షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా తర్వాత రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన రెండో సినిమా గదర్ 2.

    గదర్ 2 సినిమా విడుదలైన తొలి వారంలోనే రూ.285 కోట్లను రాబట్టింది. రెండో వారంలో రూ.134 కోట్లను, మూడో వారంలో రూ.63 కోట్లను వసూలు చేసింది.

    నాలుగో వారంలో శుక్రవారం రూ.5.2 కోట్లను, శనివారం రోజు రూ.5.7 కోట్లను రాబట్టిందని సినీ వర్గాలు చెప్పాయి.

    ఆదివారం రూ.7 కోట్లకు పైగా రాబడుతుందని అంచనాలున్నాయి. ఇలా రూ.500 కోట్ల క్లబ్‌లోకి ఇది చేరుతుందని అంచనావేస్తున్నారు.

    2001లో బ్లాక్ బాస్టర్ అయిన ‘గదర్: ఏక్ ప్రేమ్ కహాని’కి సీక్వెల్‌గా విడుదలైంది. ఈ సినిమాకు అనిల్ శర్మ దర్శకత్వం వహించారు.

    రెండు దశాబ్దాల తర్వాత విడుదలైన సీక్వెల్‌కి కూడా ప్రజల నుంచి ఈ స్పందన రావడం చాలా అరుదైన విషయం.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. ఒడిశాలో పిడుగుపాటుకు 10 మంది మృతి

    పిడుగుపాటు

    ఫొటో సోర్స్, ANI

    ఒడిశాలో పిడుగుపాటుకు 10 మంది మృతి చెందినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

    ఒడిశా రాష్ట్రంలో శనివారం చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

    ఆరు జిల్లాల్లో పిడుగుపాటుకు 10 మంది మరణించినట్లు పీటీఐ తెలిపింది.

    స్పెషల్ రిలీఫ్ కమిషనర్ కార్యాలయం ప్రకారం, ఖోర్ధా జిల్లాలో నలుగురు, బాలంగీర్ జిల్లాలో ఇధ్దరు మృతి చెందారు.

    అంగుల్, బౌధ్, జగత్‌సింగ్‌పూర్, ధెంకనల్ జిల్లాలలో ఒకరి చొప్పున చనిపోయారు.

    ఖోర్ధా జిల్లాలో ముగ్గురు గాయాలు పాలైనట్లు వార్తలు కూడా వస్తున్నాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాల కోసం ఈ పేజీని చూడండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.