ఆసియా కప్ - ఇండియా vs పాకిస్తాన్: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు

ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 48.5 ఓవర్లలో 266 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్

  2. మోటార్లు లేకుండా గ్రావిటీతో నీరిచ్చే ప్రాజెక్ట్

  3. కోరుట్ల: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దీప్తి హత్య కేసులో ఆమె చెల్లెలు చందన, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఉమర్ షేక్ ఎలా దొరికిపోయారంటే

  4. భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్, వర్షం కారణంగా మ్యాచ్ రద్దు

    హార్దిక్ పాండ్యా

    ఫొటో సోర్స్, Getty Images

    ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 48.5 ఓవర్లలో 266 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది.

    భారత్ బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ 22 బంతులు ఆడి 11 పరుగులు చేసి షహీన్ అఫ్రిదీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. విరాట్ కోహ్లీ కూడా 4 పరుగులు చేసి షహీన్ అఫ్రిదీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. శుభమన్ గిల్ 10 పరుగులకే అవుటయ్యాడు. ఆ వెంటనే శ్రేయాస్ అయ్యర్ 14 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు.

    ఇలా టాప్ ఆర్డర్ ఒకరి తరువాత ఒకరు అవుట్ అయిన తరువాత ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యాలు క్రీజులో నిలదొక్కుకోవడంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ సాధించడానికి అవకాశమేర్పడింది.

    ఇషాన్ 82 పరుగులు చేయగా, హార్దిక్ 87 పరుగులు చేశారు.

    అనంతరం రవీందర్ జడేజా, 14, శార్దూల్ ఠాకుర్ 3, కుల్దీప్ జాదవ్ 3, బుమ్రా 16 పరుగులకు వరుసగా అవుట్ కావడంతో భారత జట్టు 48.5 ఓవర్లలో 266 పరుగులకు అవుటైంది.

    పాకిస్తాన్ బౌలర్లలో అఫ్రిదీ 10 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకోగా ససీమ్ షా 8.5 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి 3 వికెట్లు, హారిస్ రవూఫ్ 9 ఓవర్లలో 58 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నారు.

    అయితే, పాకిస్తాన్ ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి ఉండగా, వర్షం రావడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

  5. థర్మన్ షణ్ముగరత్నం: చైనీయులను వెనక్కి నెట్టి భారత సంతతి వ్యక్తి సింగపూర్ అధ్యక్షుడెలా అయ్యారు

  6. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ కమిటీలో సభ్యులు వీరే

    ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ సాధ్యాసాధ్యాల పరిశీలనకు భారత ప్రభుత్వం 8 మంది సభ్యులతో కమిటీని నియమించింది.

    మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో కమిటీ వేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించగా శనివారం కమిటీ సభ్యుల పేర్లను వెల్లడించింది.

    కమిటీ చైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వ్యవహరిస్తారు.

    కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధురి, రాజ్యసభలో విపక్ష మాజీ నేత గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్ కే సింగ్, లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాశ్ కశ్యప్, సీనియర్ అడ్వొకేట్ హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. చర్మానికి సరిపడే సరైన సన్‌స్క్రీన్, క్లెన్సర్, మాయిశ్చరైజర్‌లను ఎలా ఎంచుకోవాలి

  8. ఆసియా కప్: శ్రేయాస్ అయ్యర్ అవుట్

    శ్రేయాస్ అయ్యర్

    ఫొటో సోర్స్, Getty Images

    వర్షం వల్ల మరోసారి మ్యాచ్‌కు స్వల్ప అంతరాయం కలిగింది.

    అయితే, మళ్లీ మొదలైన తర్వాత 14 రన్లు కొట్టిన శ్రేయాస్ అయ్యర్ అవుట్ అయ్యాడు. హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో ఫఖర్ జమాన్‌కు శ్రేయాస్ క్యాచ్ ఇచ్చాడు.

    మొత్తంగా 11 ఓవర్లు ముగిసేనాటికి 51 రన్లను తీసిన భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ క్రీజులో ఉన్నారు.

  9. వేరొకరితో జీవిస్తోందని భార్యను దుస్తులు విప్పించి ఊరేగించిన భర్త - రాజస్థాన్‌లో అమానుషం

  10. ఆసియా కప్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అవుట్

    విరాట్, రోహిత్

    ఫొటో సోర్స్, Getty Images

    వర్షం వల్ల మ్యాచ్‌కు స్వల్ప అంతరాయం కలిగింది. అయితే, ఆ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన రోహిత్ శర్మ 11 రన్లకే అవుట్ అయ్యాడు.

    రోహిత్ శర్మ వికెట్‌ను షహీన్ షా అఫ్రీదీ తీశాడు. ఆ తర్వాత నాలుగు రన్లకే విరాట్ కోహ్లీ కూడా అవుట్ అయ్యాడు.

    6.4 ఓవర్లకు 29 రన్లు కొట్టిన భారత్ రెండు వికెట్లను కోల్పోయింది.

  11. ఆసియా కప్:టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

    భారత్, పాకిస్తాన్

    ఫొటో సోర్స్, Getty Images

    ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కాసేపట్లో మొదలుకాబోతోంది.

    టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌ను భారత్ ఎంచుకుంది. శ్రీలంకలోని కైండీలో ఈ మ్యాచ్ జరుగుతోంది.

    తెల్లవారి నుంచి ఇక్కడ మేఘాలు కమ్ముకోవడం, చినుకులు పడటంతో అసలు మ్యాచ్ జరుగుతుందా? అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి.

    కానీ, మ్యాచ్ సమయానికి పరిస్థితులు మెరుగుపడ్డాయి.

    జట్టులో ఎవరెవరు ఉన్నారు?

    భారత్: రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్ యాదవ్, శార్దూల్ ఠాకుర్

    పాకిస్తాన్: ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్, ఆగా సల్మాన్, ఇఫ్తిఖార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, నసీమ్ షా, షాహీన్ షా అఫ్రీదీ, హారిస్ రవుఫ్

  12. చంద్రయాన్-3: సెంచరీ కొట్టిన ప్రజ్ఞాన్ రోవర్

    ఇస్రో

    ఫొటో సోర్స్, ISRO

    భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శనివారం మధ్యాహ్నం రెండు ప్రధానమైన అప్‌డేట్‌లను షేర్ చేసింది.

    దీనిలో మొదటిది సూర్యుడిపైకి పంపిన ఆదిత్య-ఎల్1కు సంబంధించిన అప్‌డేట్. ఈ వ్యోమనౌక సూర్యుడి దిశగా విజయవంతంగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టినట్లు ఇస్రో తెలిపింది.

    అనంతరం కొద్దిసేపటికే చంద్రయాన్-3కి సంబంధించిన మరో అప్‌డేట్‌ను కూడా ఇస్రో పంచుకుంది.

    చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్‌ దగ్గర నుంచి ప్రజ్ఞాన్ రోవర్ 101 మీటర్లు విజయవంతంగా ముందుకు వెళ్లిందని, ఈ యాత్ర ఇంకా కొనసాగుతోందని ఇస్రో తెలిపింది.

    ప్రజ్ఞాన్ రోవర్ యాత్రకు క్రికెట్‌తో ముడిపెడుతూ.. ‘‘అన్‌బీటెన్ సెంచరీ’’ అని ఇస్రో వ్యాఖ్యానించింది.

    చంద్రుడి దక్షిణ ధ్రువం పరిసరాల్లో ఆగస్టు 23న చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. ఆదిత్య-ఎల్1: శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని మోదీ

    ఆదిత్య-ఎల్1

    ఫొటో సోర్స్, Getty Images

    ఆదిత్య-ఎల్1 విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది. నిర్దేశిత కక్ష్యలోకి ఈ వ్యోమనౌక చేరుకున్నట్లు తెలిపింది.

    ‘‘సూర్యుడు, భూమి మధ్యలోని నిర్దేశిత లక్ష్యమైన ఎల్-1 పాయింట్ దిశగా భారత తొలి సోలార్ అబ్జర్వేటరీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది’’ అని ఇస్రో వెల్లడించింది.

    ఈ ప్రయోగంపై శాస్త్రవేత్తలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు.

    ‘‘చంద్రయాన్-3 విజయం తర్వాత, భారత అంతరిక్ష యాత్ర కొనసాగుతోంది. భారత తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1ను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలకు అభినందనలు’’ అని మోదీ ట్వీట్ చేశారు.

    ‘‘అవిశ్రాంతంగా శాస్త్రవేత్తలు చేస్తున్న కృషితో అందరికీ మేలు జరుగుతుంది’’ అని ఆయన అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    చంద్రయాన్-3 ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువం పరిసరాల్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆ తర్వాత దీని నుంచి రోవర్ ప్రజ్ఞాన్ కూడా బయటకు వచ్చి, అక్కడ పరిశోధనలు చేపడుతోంది.

    మరోవైపు శాస్త్రవేత్తలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా అభినందించారు.

    ‘‘అంధకారంలో వీరు మనకు వెలుగుచూపుతున్నారు. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ఇతర సిబ్బందికి మనం రుణపడి ఉంటాం’’ అని ఆయన అన్నారు. అంతేకాదు కాంగ్రెస్ కాలం నాటి ప్రయోగాలను కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.

  14. ఆదిత్య-ఎల్1 విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి

    ఆదిత్య-ఎల్1

    ఫొటో సోర్స్, ISRO

    ఆదిత్య-ఎల్1 వ్యోమనౌకను పీఎస్‌ఎల్‌వీ-సీ57 సాయంతో విజయవంతంగా నింగిలోకి ప్రయోగించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వెల్లడించింది.

    నిర్దేశిత కక్ష్యలోకి ఆదిత్య-ఎల్1 వెళ్లినట్లు ఇస్రో తెలిపింది.

    సూర్యుడు-భూమి మధ్యనుండే ఎల్-1 పాయింట్ దిశగా ఆదిత్య-ఎల్1 ప్రయాణం విజయవంతంగా మొదలైనట్లు ఇస్రో తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. చేతిలో కొబ్బరికాయ, చెంబులో నీళ్లు భూమి లోపల నీటి జాడను పసిగడతాయా... సైన్స్ ఏం చెబుతోంది?

  16. ఆసియా కప్: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందుగా వాతావరణం ఎలా ఉంది?

    భారత్, పాక్ మ్యాచ్

    ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్‌కు ముందుగా వాతారణ పరిస్థితులను క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా గమనిస్తున్నారు.

    శ్రీలంకలోని కైండీలో మ్యాచ్ జరుగుతున్న చోట వర్షం పడే అవకాశం 81 శాతం వరకూ ఉన్నట్లు వాతావరణ విభాగం అంచనా వేసింది.

    స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు 64 శాతం, 3.30 గంటలకు 81 శాతంగా వర్షం పడే అవకాశాన్ని వాతావరణ విభాగం అంచనా వేసింది.

    రాత్రి పది గంటల వరకూ వర్షం పడే అవకాశాన్ని 35 శాతంగా పేర్కొంది. శనివారం ఉదయం నుంచే ఇక్కడ దట్టమైన మేఘాలు కనిపించాయి.

    ఈ మ్యాచ్ కోసం భారత్, పాక్ క్రికెట్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అయితే, వారి ఆశలపై వర్షం నీళ్లు జల్లేలా కనిపిస్తోంది.

    టాస్ సమయంలోనూ వర్షం పడే అవకాశం 40 నుంచి 60 శాతం వరకూ ఉన్నట్లు యాక్యూవెదర్ సంస్థ అంచనా వేసింది.

  17. ఆదిత్య-ఎల్1: భారత తొలి 'సన్ మిషన్' ప్రయోగించిన ఇస్రో... ఈ మిషన్ లక్ష్యం ఏంటంటే?

  18. బ్రేకింగ్ న్యూస్, ఆదిత్య-ఎల్1ను ప్రయోగించిన ఇస్రో

    ఇస్రో

    ఫొటో సోర్స్, ISRO

    సూర్యుడిపై పరిశోధనకు భారత్ తొలి వ్యోమనౌకను శనివారం ఉదయం ప్రయోగించింది.

    ఆంధ్రప్రదేశ్‌ శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది.

    సూర్యుడిపై ఈ వ్యోమనౌక ప్రయోగాలు చేపట్టనుంది.

    ఇది సూర్యుడిపైకి భారత్ పంపుతున్న తొలి వ్యోమనౌక. ఇప్పటికే చాలా దేశాలు ఇలాంటి ప్రోబ్‌లను పంపించాయి.

    ఈ వ్యోమనౌక సూర్యుడి సమీపంలోకి వెళ్లనుంది.

    భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించి ఆదిత్య-ఎల్1 అక్కడికి చేరుకోనుంది. ఇది భూమి చంద్రుల మధ్య దూరం కంటే నాలుగు రెట్లు ఎక్కువ.

    భూమి సూర్యుల మధ్య దూరం 151 మిలియన్ కి.మీ.లు.

  19. Aditya-L1 launch LIVE: శ్రీహరికోటలో ఏం జరుగుతోంది?

    ఆదిత్య-ఎల్1

    ఫొటో సోర్స్, isro

    ఆదిత్య-ఎల్1 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్‌కు ప్రజలు భారీగా తరలివచ్చినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    లాంచ్‌కు ముందుగా ఇస్రోలోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్ డైరెక్టర్ అనీల్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడారు. ‘‘సూర్యుడిపై అధ్యయనం కోసం చేపడుతున్న ఈ ప్రయోగం ప్రత్యేకమైనది. దీనిలో భాగంగా సూర్యుడి కక్ష్యలో ఆదిత్య-ఎల్1 వ్యోమనౌకను ప్రవేశపెట్టబోతున్నాం. అక్కడికి వ్యోమనౌక చేరుకోవడానికి నాలుగు నెలలు పడుతుంది. అక్కడకు పరీక్షలు చేపట్టడానికి మరో నెల సమయం అదనంగా పట్టొచ్చు. అసలు సూర్యుడి మీద ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది’’ అని ఆయన చెప్పారు.

    సూర్యుడిపై భారత్‌ చేపడుతున్న తొలి ప్రయోగం ఇది. ఇప్పటికే చాలా దేశాలు సూర్యుడిపై పరిశోధన చేపట్టేందుకు ప్రోబ్‌లను పంపించాయి.

    ఈ మిషన్ గురించి అంతరిక్ష నిపుణుడు ఆర్‌సీ కపూర్ కూడా ఏఎన్ఐతో మాట్లాడారు. ‘‘పీఎస్‌ఎల్‌వీ రాకెట్ సాయంతో సూర్యుడు, భూమి మధ్యలోని గురుత్వాకర్షణ శక్తి సమానంగా ఉండే లాంగ్రేజ్ పాయింట్ దగ్గర ఈ ప్రోబ్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ పాయింట్‌నే ఎల్1గా పిలుస్తున్నారు. అక్కడ చాలా పరిశోధనలను ఆదిత్య-ఎల్1 చేపట్టబోతోంది. వీటిలో సూర్యుడి వెలుపలి ప్రాంతమైన కరోనాపై పరిశోధన ముఖ్యమైనది’’ అని ఆయన చెప్పారు.

  20. ఆసియా కప్ 2023: పాకిస్తాన్ పేస్ అటాక్‌ను విరాట్ కోహ్లీ, రోహిత్, గిల్ చిత్తు చేస్తారా?