బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజ్ అప్డేట్లను ఇంతటితో ముగిస్తున్నాం.
రేపు కలుద్దాం.
ఏదైనా పెళ్లిని హిందూ వివాహ చట్టం-1955 ప్రకారం చెల్లదని ప్రకటించినా, అలాంటి పెళ్లి వల్ల పుట్టిన పిల్లలకు కూడా వారి తల్లిదండ్రుల వారసత్వ ఆస్తిలో హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజ్ అప్డేట్లను ఇంతటితో ముగిస్తున్నాం.
రేపు కలుద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
ఏదైనా పెళ్లిని హిందూ వివాహ చట్టం-1955 ప్రకారం చెల్లదని ప్రకటించినా, అలాంటి పెళ్లి వల్ల పుట్టిన పిల్లలకు కూడా వారి తల్లిదండ్రుల వారసత్వ ఆస్తిలో భాగం ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పింది.
అలాంటి పిల్లల హక్కులను గుర్తిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం కీలక ఉత్తర్వు ఇచ్చింది.
ఉమ్మడి కుటుంబం ఆస్తులకు సంబంధించి ‘మితాక్షర లా’ను అనుసరించే హిందూ కుటుంబాలకు ఈ ఉత్తర్వు వర్తిస్తుంది.
గతంలో ఇదే అంశంపై రెండు సుప్రీంకోర్టు ధర్మాసనాలు రెండు వేర్వేరు నిర్ణయాలను ప్రకటించాయి.
ఇప్పుడు త్రిసభ్య ధర్మాసనం దీనిపై స్పష్టత ఇచ్చింది.

ఫొటో సోర్స్, NURPHOTO
‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల వర్గాల ద్వారా తెలిసినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.
మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నట్లు పీటీఐతోపాటు ఎన్డీటీవీ కూడా నివేదించింది.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఈ కమిటీ ఏర్పాటును ధృవీకరించారు. కమిటీ వేశామని, నివేదిక వస్తే చర్చిస్తామని జోషి చెప్పారు.
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించిన ఒక్క రోజులోనే ఈ కమిటీ ఏర్పాటైంది.
ఈ ప్రత్యేక సమావేశాల నిర్ణయం వెలువడినప్పటి నుంచి ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ బిల్లు కూడా పార్లమెంట్ ముందుకు వస్తుందని ఊహాగానాలున్నాయని, అయితే, ఈ విషయాన్ని ఏ ప్రభుత్వ అధికారులు ధ్రువీకరించలేదని ఎన్‌డీటీవీ రిపోర్ట్ చేసింది.
‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అంటే దేశవ్యాప్తంగా లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించడం.
‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు, భారతీయ జనతా పార్టీ కూడా పలుసార్లు ప్రస్తావించింది.
2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ మేనిఫెస్టోలో కూడా ఈ అంశం ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాల కోసం ఈ పేజీని చూడండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.