తొలి త్రైమాసికంలో 7.8 శాతంగా భారత వృద్ధి రేటు

2023-24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంటే ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో భారత్ 7.8 శాతం ఆర్థిక వృద్ధిని సాధించిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్(ఎన్‌ఎస్‌వో) తెలిపింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. అదానీ గ్రూపును చుట్టుముట్టిన మరో వివాదం.. ‘స్టాక్‌ మాన్యుపులేషన్‌’పై ఓసీసీఆర్‌పీ ఆరోపణలు

  3. వీర్యం ఉత్పత్తికి కారణమయ్యే ‘వై క్రోమోజోమ్’ రహస్యాలను ఛేదించారు.. పురుషుడు నిర్వీర్యం అవుతాడా?

  4. ‘మోదీయే 80 శాతం మంది భారతీయుల తొలి ప్రాధాన్యం’.. ప్యూ రీసర్చ్ సెంటర్ నివేదికలో ఇంకా ఏముంది?

  5. తొలి త్రైమాసికంలో 7.8 శాతంగా భారత వృద్ధి రేటు

    నిర్మలా సీతారామన్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

    2023-24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంటే ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో భారత్ 7.8 శాతం ఆర్థిక వృద్ధిని సాధించిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్(ఎన్‌ఎస్‌వో) గురువారం తెలిపింది.

    గడిచిన ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ వృద్ధి రేటు 13.1 శాతంగా నమోదైందని పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.

    ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతోంది.

    భారీ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన చైనాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 6.3 శాతంగా నమోదైంది.

    పొలంలో పనిచేస్తున్న మహిళ

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, 2023-24 తొలి క్వార్టర్‌లో భారత వ్యవసాయ రంగ వృద్ధి రేటు 3.5 శాతంగా ఉంది.

    ఎన్‌ఎస్‌వో డేటా ప్రకారం, 2023-24 తొలి క్వార్టర్‌లో భారత వ్యవసాయ రంగ వృద్ధి రేటు 3.5 శాతంగా ఉంది. 2022-23 మొదటి త్రైమాసికంలో ఇది 2.4 శాతంగానే ఉంది.

  6. పప్పు: ఇండియా మెచ్చిన శుద్ధ శాకాహార పోషకాహార వంటకం.. నోరూరించేలా వండడం ఇలా

  7. సెప్టెంబరు 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు

    పార్లమెంటు

    ఫొటో సోర్స్, ANI

    సెప్టెంబరు 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం తెలిపారు.

    మొత్తంగా ఐదు రోజులపాటు ఈ సమావేశాలు కొనసాగుతాయి.

    దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. దక్షిణాఫ్రికా: జోహన్నెస్‌బర్గ్‌లోని ఓ భవనంలో అగ్నిప్రమాదం, 73 మంది మృతి

    దక్షిణాఫ్రికాలో అగ్ని ప్రమాదం

    ఫొటో సోర్స్, Reuters

    దక్షిణాఫ్రికాలోని సెంట్రల్ జోహన్నెస్‌బర్గ్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో 73 మంది మరణించారు.

    గురువారం మార్షల్ టౌన్‌లోని ఐదంతస్తుల భవనంలో ఈ ఘటన జరిగింది. 52 మందికి పైగా గాయాలయ్యాయని, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదం ఘటనతో చాలామంది భవనంలో నుంచి కిందకి దూకడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

    కాగా, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

  9. ఎన్టీఆర్ స్మారక నాణెం: పురందేశ్వరి సొంత డబ్బుతో తయారు చేయించారా, ఇలా ఎవరైనా నాణేల ముద్రణకు ఆర్డర్ ఇవ్వొచ్చా?

  10. సొంత కంపెనీల షేర్ల కొనుగోలు ఆరోపణలను తోసిపుచ్చిన అదానీ గ్రూప్

    అదానీ

    ఫొటో సోర్స్, Getty Images

    అదానీ గ్రూప్‌తో సంబంధం ఉన్న కంపెనీలు భారతీయ స్టాక్ మార్కెట్‌లో మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టి తమ సొంత కంపెనీ షేర్లను కొనుగోలు చేశాయన్న ఆరోపణలను అదానీ గ్రూప్ తోసిపుచ్చింది.

    జార్జ్ సోరోస్ సంస్థ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ఒక రిపోర్టులో ఈ ఆరోపణలను చేసింది. ‘‘మేం ఈ నివేదికలోని ఆరోపణలను తిరస్కరిస్తున్నాం’’ అని అదానీ గ్రూప్ ప్రకటించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

    ‘‘ఇది హిండెన్‌బర్గ్ నివేదికకు మద్ధతుగా నిలిచేందుకు జార్జ్ సోరోస్, ఆయన ఫండింగ్‌తో నడుస్తున్న విదేశీ మీడియా కంపెనీలు చేస్తున్న ప్రయత్నం’’ అని అదానీ గ్రూప్ ఒక ప్రకటనలో పేర్కొంది.

    "మా లావాదేవీలు చట్టానికి లోబడి ఉన్నాయని ఒక స్వతంత్ర న్యాయనిర్ణయాధికార సంస్థ, ఒక అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇంతకు ముందే ధృవీకరించాయి." అని ఆ సంస్థ వెల్లడించింది.

    ఫైనాన్షియల్ టైమ్స్, ది గార్డియన్‌ ప్రచురించిన వార్తా కథనం ప్రకారం, అదానీ గ్రూప్‌తో సంబంధమున్న కంపెనీలు కొన్నేళ్లుగా అదానీ గ్రూప్ షేర్లను రహస్యంగా కొనుగోలు చేస్తూ ఉన్నాయి.

    ఈ ఏడాది జనవరిలో, న్యూయార్క్‌కు చెందిన ఫైనాన్షియల్ సంస్థ హిండెన్‌బర్గ్ కూడా ఒక రిపోర్టును విడుదల చేసింది. అందులో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన అదానీ గ్రూప్‌లోని 7 ప్రధాన కంపెనీల షేర్లకు అధిక విలువను ప్రకటించాయని రిపోర్ట్ పేర్కొంది.

    ఈ రిపోర్టు వెలువడిన వెంటనే అదానీకి చెందిన కంపెనీ షేర్లు వేగంగా పతనమయ్యాయి. దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఉన్న గౌతమ్ అదానీ కూడా ర్యాంకులో వెనుకబడ్డారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  11. ఇజ్రాయెల్ అథ్లెట్‌తో కరచాలనం చేసినందుకు తన అథ్లెట్‌పై నిషేధం విధించిన ఇరాన్

    ఇరాన్ అథ్లెట్

    ప్రపంచ మాస్టర్స్ ఛాంపియన్‌షిప్‌లో ఇజ్రాయెల్ అథ్లెట్‌తో మాట్లాడి, కరచాలనం చేసినందుకు తన అథ్లెట్‌ ముస్తఫా రాజైపై ఇరాన్ జీవితకాల నిషేధం విధించింది.

    పోలండ్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో ఇరాన్ వెయిట్‌లిఫ్టర్ ముస్తఫా రాజై (40) రజతం గెలుచుకున్నారు. అదే పోటీల్లో కాంస్య పతకం గెలిచిన ఇజ్రాయెల్ అథ్లెట్‌తో ముస్తఫా కరచాలనం చేశారు. దీంతో ఇరాన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ముస్తఫాపై నిషేధం విధించింది.

    తమ అథ్లెట్లు ఇజ్రాయెల్‌కు చెందిన అథ్లెట్లతో నేరుగా పోటీలో పాల్గొనరాదని ఇరాన్ గతంలో ఆదేశించింది.

    పతకాలు అందుకున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రత్యర్థులతో కరచాలనం చేయవద్దని 2021లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అథ్లెట్లను కోరారు.

    అథ్లెట్ "ఇస్లామిక్ రిపబ్లిక్ నిర్దేశించిన పరిమితులను ఉల్లంఘించారని" ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఇర్నా తెలిపింది.

    అయితే, ఈ నిబంధనను వ్యతిరేకించిన కొంతమంది ఇరాన్ క్రీడాకారులు దేశం విడిచి వెళ్లిపోయారు. వారిలో ప్రముఖ చెస్ ప్లేయర్ అలిరెజా ఫిరుజా కూడా ఉన్నారు.

  12. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాల కోసం ఈ పేజీని చూడండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి