జీ20: కోతులను భయపెట్టేందుకు దిల్లీలో కొండముచ్చుల కటౌట్లు

సెప్టెంబర్‌ 9, 10 తేదీలలో నిర్వహించనున్న జీ 20 సమావేశాల నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు సాగుతున్నాయి.

లైవ్ కవరేజీ

  1. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్డేట్స్‌ ఇంతటితో ముగిస్తున్నాం.

    రేపు కలుద్దాం.

  2. ‘మీ దయవల్లే బతికున్నా, సార్’.. 9 ఏళ్ల కిందట ప్రాణాలు కాపాడిన పోలీసు అధికారికి చేతులెత్తి మొక్కిన పేద మహిళ

  3. జీ20: కోతులను భయపెట్టేందుకు దిల్లీలో కొండముచ్చుల కటౌట్లు

    Monkey

    ఫొటో సోర్స్, ANI

    సెప్టెంబర్‌ 9, 10 తేదీలలో నిర్వహించనున్న జీ 20 సమావేశాల నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు సాగుతున్నాయి.

    వివిధ దేశాల నేతలు ఈ సమావేశాలలో పాల్గొననున్నారు.

    ఈ సందర్భంగా దిల్లీలోని అనేక ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్న కటౌట్లు చర్చనీయమవుతున్నాయి.

    ఈ కటౌట్లన్నీ కొండముచ్చుల బొమ్మలతో ఉంటున్నాయి. నగరంలోని కోతులను భయపెట్టేందుకు ఇలా కొండముచ్చుల ఫొటోలతో కటౌట్లు ఏర్పాటుచేస్తున్నారు.

    కోతులు ఎక్కువగా తిరిగే ప్రాంతాలలో కొండముచ్చుల కటౌట్లు ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారంటూ పీటీఐ వార్తాసంస్థ వెల్లడించింది.

    మరోవైపు కొండముచ్చుల్లా అరిచేందుకు సుమారు 40 మందికి శిక్షణ కూడా ఇచ్చి, కోతులను భయపెట్టేందుకు కొండముచ్చుల్లా అరిచే పనిలో నియమించినట్లు పీటీఐ తెలిపింది.

  4. ‘శివ శక్తి, తిరంగా’ పేర్లకు ఐఏయూ ఒప్పుకుంటుందా? చంద్రుడిపై ప్రదేశాలకు పేర్లు ఎలా పెడతారు?

  5. కొబ్బరి ధరలపై ఆంధ్రప్రదేశ్ రైతులు ఎందుకు ఆగ్రహంగా ఉన్నారు, ప్రభుత్వం ఏం చెబుతోంది?

  6. గుండెపోటు వచ్చిన వ్యక్తికి సీపీఆర్ చేసి, ప్రాణాలు కాపాడిన హైదరాబాద్ పోలీసులు.. ఈ అత్యవసర చికిత్స చేయడం ఎలా?

  7. చేతులతో మానవ మలమూత్రాలను ఎత్తిపోసే వ్యవస్థను రేపట్లోగా నిర్మూలించడం సాధ్యమేనా?

  8. ది ఇండియా క్లబ్: లండన్‌లో భారతీయ రుచులకు పేరుగాంచిన 70 ఏళ్ల ఈ రెస్టారెంట్ ఎందుకు మూతపడుతోంది?

  9. రష్యాకు అణుబాంబు ఫార్ములాను చేరవేసిన అమెరికన్ శాస్త్రవేత్త....తెలిసినా ఆ దేశం ఎందుకు శిక్షించలేకపోయింది?

  10. 'చైనా మ్యాప్ చాలా సీరియస్ అంశం, ప్రధాని స్పందించాలి': రాహుల్ గాంధీ

    రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, Getty Images

    అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్‌లోని కొన్ని ప్రాంతాలను చైనా తన భూభాగాలుగా గుర్తిస్తూ కొత్త మ్యాప్ విడుదల చేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.

    బుధవారం ఉదయం రాహుల్ మీడియాతో మాట్లాడారు. ఇది చాలా సీరియస్ అంశమని అన్నారు.

    ''లద్దాఖ్‌లో అంగుళం భూమి కూడా పోలేదని ప్రధాని మోదీ అంటున్నది అబద్ధమని ఏళ్లుగా చెబుతూనే ఉన్నాను. మన భూమిని చైనా లాక్కుందని లద్దాఖ్ మొత్తానికి తెలుసు. చైనా మ్యాప్ అంశం చాలా తీవ్రమైనది. వాళ్లు భూమిని తీసుకున్నారు. ప్రధాని స్పందించాలి'' అని రాహుల్ గాంధీ మీడియాతో అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  11. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాల కోసం ఈ పేజీని చూడండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.