వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.200 తగ్గింపు

గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల వంటగ్యాస్ సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం రూ.200 ధర తగ్గించింది. ఎల్‌పీజీ వినియోగదారులందరికీ ఇది వర్తిస్తుంది.

లైవ్ కవరేజీ

  1. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్డేట్స్‌ ఇంతటితో ముగిస్తున్నాం.

    రేపు కలుద్దాం.

  2. చంద్రుడిపై సల్ఫర్, ఆక్సిజన్ కనుగొన్న ప్రజ్ఞాన్ రోవర్.. ఇస్రో ప్రకటన

  3. గీతిక శ్రీవాస్తవ: పాకిస్తాన్‌లో భారత హైకమిషన్ బాధ్యతలు తొలిసారి మహిళ చేతికి.. ఆమె నేపథ్యం ఏమిటి?

  4. వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.200 తగ్గింపు.. ప్రకటించిన కేంద్ర మంత్రి

    అనురాగ్ ఠాకూర్

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, అనురాగ్ ఠాకూర్

    గృహ అవసరాలకు వినియోగించే 14.2 కేజీల వంటగ్యాస్ సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం రూ.200 ధర తగ్గించింది. ఎల్‌పీజీ వినియోగదారులందరికీ ఇది వర్తిస్తుంది.

    దేశంలో 33 కోట్ల కనెక్షన్లు ఉన్నాయని ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఒక ప్రకటనలో తెలిపింది.

    ధర తగ్గింపుపై కేంద్ర సమాచార, ప్రసారశాఖల మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం మీడియా సమావేశంలో ప్రకటన చేశారు.

    ఓనం, రాఖీ పండగ సందర్భంగా ఈ నిర్ణయంతో దేశంలోని సోదరీమణులందరికీ ప్రధాన నరేంద్ర మోదీ గిఫ్ట్ ఇచ్చారని అనురాగ్ వ్యాఖ్యానించారు.

    వంటగ్యాస్
    ఫొటో క్యాప్షన్, వంటగ్యాస్

    ప్రస్తుతం దిల్లీలో 1,103 రూపాయలుగా ఉన్న సిలిండర్ ధర తాజా నిర్ణయంతో రూ.903కు దిగి వస్తుంది.

    ఉజ్వల్ పథకం కింద రూ.200 రాయితీ అందుకుంటున్న వినియోగదారులకు ఆ రాయితీ కొనసాగుతుంది. అలాగే ధర తగ్గింపు కూడా వర్తిస్తుంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. శత్రు భీకరమైన నేపాలీ గూర్ఖాలు ఇక భారత సైన్యంలో చేరరా?

  6. మహిళ మెదడులో ప్రాణంతో ఉన్న మూడు అంగుళాల పాము... కనీవినీ ఎరుగని విచిత్రం

  7. భారత్ నుంచి కోళ్ల అక్రమ రవాణా... ఆపేయాలని వార్నింగ్ ఇచ్చిన నేపాల్

  8. గర్భ నిర్ధారణకు మూత్ర పరీక్ష చేయడం 4,500 ఏళ్ళ కిందటే మొదలైందా... ఇదీ ప్రెగ్నెన్సీ టెస్టుల చరిత్ర

  9. అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలో భూభాగంగా కొత్త మ్యాప్ విడుదల చేసిన చైనా

    భారత ప్రధాని, చైనా అధ్యక్షుడు

    ఫొటో సోర్స్, Getty Images

    చైనా తమ దేశం కొత్త మ్యాప్‌ను సోమవారం విడుదల చేసింది. ఇది తమ దేశ ‘‘ప్రామాణిక మ్యాప్’’గా చైనా చెప్పింది.

    ఈ మ్యాప్‌లో మరోసారి అరుణాచల్‌ ప్రదేశ్, అక్సాయ్ చిన్‌లను తమ సొంత ప్రాంతాలుగా చైనా చెప్పుకుంది.

    చైనా విడుదల చేసిన ఈ మ్యాప్‌లో, దక్షిణ చైనా సముద్ర ప్రాంతం, తైవాన్‌లను కూడా తనలో భాగంగానే పేర్కొంది.

    ‘‘చైనా 2023 ప్రామాణిక మ్యాప్‌ను సోమవారం విడుదల చేసింది. సహజ వనరుల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌పై ఈ మ్యాప్‌ను లాంచ్ చేసింది. చైనా, ప్రపంచంలోని ఇతర దేశాల మ్యాప్ డ్రాయింగ్ విధానాలకు అనుగుణంగా దీన్ని రూపొందించింది’’ అని చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ పత్రికగా చెప్పే ఇంగ్లీష్ పత్రిక గ్లోబల్ టైమ్స్ తన సోషల్ మీడియాలో రాసింది.

    సుబ్రమణియన్ స్వామి

    ఫొటో సోర్స్, Facebook/Dr. Subramanian Swamy

    చైనా విడుదల చేసిన ఈ కొత్త మ్యాప్‌పై బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి వ్యంగ్యంగా స్పందించారు.

    ‘‘మోదీకి చెప్పండి, కొన్ని ఒత్తిళ్ల చేత భారతమాతను మీరు కాపాడలేకపోతే, కనీసం ఆ పదవి నుంచి తొలగి, మార్గదర్శక్ మండల్‌కి వెళ్లండి. అబద్ధాలతో భారత్‌ను కాపాడలేరు. మరో నెహ్రూను భరించే ఓపిక భారత్ వద్ద లేదు’’ అని సుబ్రమణియన్ స్వామి అన్నారు.

    బ్రిక్స్ సమావేశాల కోసం ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశమైన నేపథ్యంలో చైనా ఈ కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది.

    సరిహద్దు వివాదంపై ఇరు దేశాల అధినేతలు ఈ సమావేశంలో చర్చించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    అంతకుముందు 2023 ఏప్రిల్‌లో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన 11 ప్రాంతాల పేర్లను మార్చేందుకు చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.

    అరుణాచల్ ప్రదేశ్‌లోని 90 వేల చదరపు కి.మీల భూమిని తనదేనని చైనా చెప్పుకుంటోంది.

    పశ్చిమంలో ఉన్న అక్సాయ్ చిన్‌కి చెందిన 38 వేల చదరపు కి.మీ ప్రాంతాన్ని కూడా చైనా అక్రమంగా స్వాధీనం చేసుకుందని భారత్ చెబుతోంది.

  10. ఇరాక్: 2016 బాంబు దాడి ఘటనలో ముగ్గురికి ఉరిశిక్ష

    ఇరాక్‌ బాంబు దాడి

    ఫొటో సోర్స్, AFP VIA GETTY IMAGES

    బాగ్దాద్‌లో వెహికిల్ బాంబు దాడిలో ప్రమేయమున్న ముగ్గురికి ఉరిశిక్ష వేసినట్లు ఇరాక్ ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.

    2016లో జరిగిన ఈ బాంబు దాడిలో 300 మందికి పైగా మరణించగా, వందలాది మందికి గాయాలయ్యాయి.

    2003లో అమెరికా ఆక్రమణ తర్వాత ఇరాక్‌లో జరిగిన అతిపెద్ద మారణహోమం ఇది.

    ఈ దాడిని తామే చేశామని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్(ఐఎస్) అప్పట్లో ప్రకటించింది.

    అయితే, ప్రస్తుతం ఉరితీసిన వ్యక్తుల ఎవరు, వారికి ఎప్పుడు ఈ శిక్ష విధించారన్నది మాత్రం ప్రధాన మంత్రి మహమ్మద్ షియా అల్-సుడానీ కార్యాలయం తెలుపలేదు.

    ఆదివారం, సోమవారం వారికి ఉరిశిక్షలు వేసినట్లు పేర్కొంది.

    ఉగ్రవాద బాంబు దాడిలో ప్రమేయమున్నట్లు గుర్తించిన ముగ్గురు కీలక నేరగాళ్లకు మరణ శిక్షే సరైనదని ప్రధానమంత్రి కార్యాలయం బాధిత కుటుంబాలకు తెలిపింది.

    ఇరాక్ రాజధానిలోని షియా ముస్లింలు ఎక్కువగా ఉండే కరదాలోని రద్దీగల షాపింగ్ సెంటర్‌ పరిధిలో 2016 జూలై 3న పేలుడు పదార్థాలతో ఉన్న వెహికిల్‌‌ను పేల్చారు.

    పవిత్రమైన రంజాన్ నెలలో ఉపవాసం చేసి, రాత్రిపూట ఉపసవాసాన్ని విరమించేందుకు చాలా మంది అక్కడికి వచ్చారు.

    ఆ సమయంలో ఈ బాంబు దాడి జరగడంతో, పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయి.

  11. ఆహారం పాడైపోయిందో లేదో తెలుసుకోవడానికి వాసన ఒక్కటే సరిపోతుందా?

  12. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాల కోసం ఈ పేజీని చూడండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.