లద్దాఖ్: లోయలో పడిన ఆర్మీ వాహనం, 9 మంది సైనికులు మృతి

లద్ధాఖ్‌లోని కియారీ పట్టణానికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9మంది జవాన్లు మరణించారని ఆర్మీ అధికారులు తెలిపినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్

  2. లద్దాఖ్: లోయలోపడ్డ ఆర్మీ వాహనం, 9 మంది మృతి

    లద్ధాఖ్‌లోని కియారీ పట్టణానికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9మంది జవాన్లు మరణించారని ఆర్మీ అధికారులు తెలిపినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

    ఆర్మీ సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని, ఈ ఘటనలో మరికొందరు జవాన్లు గాయపడ్డారని వెల్లడించింది.

    కరు గ్యారిసన్ నుంచి లేహ్ పట్టణానికి సమీపంలోని కియారీ టౌన్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  3. మైఖేల్ జాక్సన్: అబ్బాయిలపై లైంగిక ఆరోపణల కేసులను పునరుద్ధరించవచ్చన్న కాలిఫోర్నియా కోర్టు

    మైఖేల్ జాక్సన్

    ఫొటో సోర్స్, Getty Images

    పాప్‌ సింగర్ మైఖేల్ జాక్సన్ తమను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణల చేసిన ఇద్దరు వ్యక్తులు కోర్టులో తమ పిటిషన్‌ను పునరుద్ధరించుకోవచ్చని వేసుకోవచ్చని అమెరికా కోర్టు స్పష్టం చేసింది.

    40 ఏళ్ల వయసున్న వేడ్ రాబ్సన్, జేమ్స్‌ సేఫ్‌చక్‌లు తాము చిన్నతనంలో ఉండగా మైఖేల్ జాక్సన్ తమను లైంగికంగా వేధించాడని ఆరోపించారు. 1980, 1990లలో నెవర్‌ల్యాండ్ ర్యాంచ్‌లో ఉన్నప్పుడు తమపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని 2019లో విడుదలైన లీవింగ్ నెవర్‌ల్యాండ్ అనే డాక్యుమెంటరీలో వారు ఆరోపించారు.

    మైఖేల్ జాక్సన్

    ఫొటో సోర్స్, CHANNEL 4

    ఈ ఆరోపణలపై జాక్సన్ కంపెనీల మీద వీరిద్దరు 2020, 2021లలో పిటిషన్‌లు వేయగా, ఆయన కంపెనీలపై కేసు వేయడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది.

    ఇప్పుడు కాలిఫోర్నియా కోర్టు వీరిని కేసు పునరుద్ధరణకు అనుమతి ఇస్తూ, ఈ ఆరోపణలు అబద్ధమని నిరూపించాల్సిన బాధ్యత జాక్సన్ కంపెనీలపైనే ఉంటుందని కోర్టు పేర్కొంది.

  4. ఎంటర్ ది డ్రాగన్‌కు 50 ఏళ్లు: విడుదలకు ముందే బ్రూస్ లీ ఎలా మరణించారు, ఈ చిత్రం సినిమా చరిత్రను ఎలా మార్చింది?

  5. మేడ మీద చేపల పెంపకం - ఆదాయం ఎంతో తెలుసా

  6. తిరుమల నడకదారిలో క్రూరమృగాలు ఎందుకొస్తున్నాయి

  7. మేడ్ ఇన్ హెవెన్: అట్టహాసంగా జరిగే వివాహ వేడుకల వెనుక దాగిన చేదు నిజాలు

  8. చంద్రుడు లేకపోతే భూమికి ఏమవుతుంది?

  9. ఆరోగ్యంగా ఉండాలంటే ఏ ఉప్పు తినాలి, ఎంత తినాలి?

  10. మణిపుర్‌: మళ్లీ చెలరేగిన ఘర్షణలు.. కాల్పుల్లో ముగ్గురు యువకులు మృతి

    మణిపుర్

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    మణిపుర్‌లో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి.

    ఉఖ్రుల్ జిల్లా కుకీలు నివసించే తోవాయి గ్రామంలో శుక్రవారం జరిపిన కాల్పుల్లో ముగ్గురు యువకులు మరణించారని అధికారులు తెలిపినట్లు న్యూస్ ఏజెన్సీ పీటీఐ రిపోర్ట్ చేసింది.

    తంగ్‌ఖుల్ నాగాలు ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఉఖ్రుల్ జిల్లాలో హింసాత్మక ఘటనలు ఇక్కడ చెలరేగడం ఇదే తొలిసారి.

    లిటన్ పోలీసు స్టేషన్ పరిధిలోకి వచ్చే తోవాయి గ్రామం నుంచి శుక్రవారం తెల్లవారుజామున పెద్ద పెద్ద తుపాకీ కాల్పుల శబ్దం వినిపించిందని అధికారులు చెప్పారు.

    మణిపుర్‌లో గత మూడు నెలలుగా జాతి హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి.

    మణిపుర్‌లో మే నెలలో మెయితెయ్ వర్గానికి చెందిన పురుషులు ఇద్దరు కుకి మహిళలను వివస్త్రులను చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన భయానక వీడియో బయటికి వచ్చిన తర్వాత, దేశవ్యాప్తంగా దీనిపై నిరసనలు వ్యక్తమయ్యాయి.

    దీనిపై ప్రధానమంత్రి పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని కూడా విపక్షాలు పట్టుబట్టాయి. పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు ఆందోళన చేపట్టాయి.

  11. స్విగ్గీ, జొమాటో వెల్ఫేర్ బోర్డ్: తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం 'గిగ్ వర్కర్స్'కు మేలు చేస్తుందా?

  12. ఎక్స్‌ (ట్విటర్‌)పై బ్లాక్ ఫీచర్‌ త్వరలోనే తీసేస్తామన్న ఎలాన్ మస్క్

    ఎలన్ మస్క్ ఎక్స్ ప్లాట్‌ఫామ్

    ఫొటో సోర్స్, Gettyimages

    త్వరలోనే తమ ప్లాట్‌ఫామ్ నుంచి బ్లాక్ ఫీచర్‌ను తొలగించనున్నట్లు ఎక్స్(ట్విటర్) కొత్త యజమాని ఎలాన్ మస్క్ ప్రకటించారు.

    ఈ ఫీచర్‌కి అసలు అర్థమే లేదని మస్క్ అన్నారు. డైరెక్ట్ మెసేజ్‌లను బ్లాక్ చేసే సౌకర్యం కొనసాగుతుందని మస్క్ చెప్పారు.

    ఈ ఫీచర్‌ను తొలగించిన తర్వాత హానికరమైన, అవమానకరమైన పోస్ట్‌లను తమ టైమ్‌లైన్ నుంచి తొలగించడం కష్టతరమవుతుందని చాలా మంది యూజర్లు సోషల్ మీడియాపై తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.

    ప్రస్తుతం ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై ఏదైనా అకౌంట్‌ను బ్లాక్ చేస్తే, వారి పోస్ట్‌లు యూజర్ల టైమ్‌లైన్‌పైకి రావు.

    బ్లాక్ అయిన వ్యక్తి ఆ అకౌంట్‌కు సంబంధించిన ఏ పోస్ట్‌ను చూడలేరు. అంతేకాక, వారికి నేరుగా మెసేజ్ పంపలేరు.

    ప్లాట్‌ఫామ్ నుంచి బ్లాక్ ఫీచర్‌ను తొలగించడం ద్వారా ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ నియమ, నిబంధనలను ఉల్లంఘించినట్లు అవ్వనుంది.

    బెదిరింపులు లేదా వేధింపులు కలిగించే పోస్ట్‌లను ఫిల్టర్ చేసుకునే అవకాశాన్ని సోషల్ మీడియా యాప్‌లు తమ యూజర్లకు కల్పించాలని ఈ రెండు యాప్ స్టోర్ల నియమ, నిబంధనలు చెబుతున్నాయి.

  13. వరల్డ్ ఫోటోగ్రఫీ డే: అందమైన, అరుదైన, అపురూప చిత్రాలు

  14. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమాచారంతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలను మీకు అందిస్తుంది బీబీసీ తెలుగు లైవ్ పేజీ.

    నిన్నటి లైవ్ పేజీకోసం ఇక్కడ క్లిక్ చేయండి.