పాకిస్తాన్ ప్రధానమంత్రికి ప్రత్యేక సహాయకురాలిగా యాసిన్ మలిక్ భార్య

జమ్మూ, కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ భార్య మిశాల్ హుస్సేన్ మలిక్‌, పాకిస్తాన్ తాత్కాలిక ప్రధానమంత్రి అన్వరుల్ హక్ కాకర్‌కు ప్రత్యేక సహాయకురాలిగా నియమితులయ్యారు

లైవ్ కవరేజీ

  1. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం.

    రేపు మళ్లీ కలుద్దాం.

  2. భారత విద్యార్థులను అమెరికా ఎందుకు తిప్పి పంపుతోంది? స్టూడెంట్స్ ఏం చేయాలి? ఏం చేయకూడదు?

  3. గ్రీన్ ట్యాక్స్: తెలంగాణలో 500.. ఆంధ్రపదేశ్‌లో 6,660. ఏపీలో భారీ పన్నులపై వాహనదారుల గగ్గోలు

  4. పీఎం విశ్వకర్మ పథకం: 5 శాతం వడ్డీకి రూ.మూడు లక్షల వరకు రుణం.. ఏ వృత్తుల వారు అర్హులంటే..?

  5. టమోటా: మొన్న మెక్‌డొనాల్డ్స్, ఇప్పుడు బర్గర్ కింగ్ ఏం చేశాయంటే..

  6. ‘ప్రేమ్ కుమార్‌’ సినిమా రివ్యూ: పీట‌ల‌ మీద పెళ్లి ఆగిపోయిన కుర్రాడి పరిస్థితి ఏంటి?

  7. పీరియడ్స్‌ సమయంలో అథ్లెట్ల శిక్షణ ఎలా కొనసాగుతుంది... వారు ఎదుర్కొనే సమస్యలేంటి?

  8. పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రత్యేక సహాయకురాలిగా యాసిన్ మలిక్ భార్య

    యాసిన్ మలిక్ భార్య మిషాల్ హుస్సేన్ మలిక్‌

    జమ్మూ, కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ భార్య మిశాల్ హుస్సేన్ మలిక్‌, పాకిస్తాన్ తాత్కాలిక ప్రధానమంత్రి అన్వరుల్ హక్ కాకర్‌కు ప్రత్యేక సహాయకురాలిగా నియమితులయ్యారు.

    పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో, మిశాల్ హుస్సేన్ మలిక్‌ ‘మానవ హక్కుల, మహిళా సాధికారత’కు ప్రత్యేక సహాయకురాలిగా పనిచేస్తారని తెలిపింది.

    మిశాల్ పాకిస్తాన్ పౌరురాలు. ఆమె అక్కడే నివసిస్తున్నారు.

    పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయ ప్రకటన

    ఫొటో సోర్స్, PM Pakistan

    ఉగ్రవాదులకు నిధులు అందించే ఆరోపణలకు సంబంధించిన కేసులలో గత ఏడాది మే నెలలో ఎన్ఐఏ కోర్టు యాసిన్ మలిక్‌కు జీవిత ఖైదు శిక్ష విధించింది.

    దేశానికి వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రోత్సహించడం, క్రిమినల్ కుట్ర, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో ప్రమేయం వంటి తీవ్రమైన ఆరోపణలు యాసిన్ మలిక్‌ ఎదుర్కొంటున్నారు.

    కోర్టులో ఆయన తన మీద వచ్చిన ఆరోపణలన్నింటినీ అంగీకరించారు.

  9. చంద్రయాన్-3 Vs. లూనా-25 : ‘మినీ స్పేస్ రేస్’ అనడం కరెక్టేనా... ఇస్రో ఏమంటోంది?

  10. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

    మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితా ప్రకటన

    ఫొటో సోర్స్, ANI

    మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నెలలు సమయం ఉండగానే భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఈ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.

    ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌, డిసెంబర్‌లో జరగనున్నాయి.

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశ రాజధాని దిల్లీలో జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ అభ్యర్థుల జాబితాను ఖరారు చేశారు.

    ఈ సమావేశానికి అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రెండు రాష్ట్రాల సీనియర్ నేతలు పాల్గొన్నారు.

    230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి 39 సీట్లలో పోటీచేసే అభ్యర్థులను, 90 సభ్యులున్న చత్తీస్‌గఢ్ అసెంబ్లీకి 21 సీట్లలో పోటీచేసే అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది.

    అయితే, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీట్లలన్నింటిలో పార్టీ ఓడిపోయింది.

    మునపటి ఎన్నికల రికార్డు, బీజేపీ పార్టీ బలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ సీట్లు ‘సీ’, ‘డీ’ కేటగిరీకి చెందినవి. అంటే ఇక్కడి నుంచి రెండు కంటే ఎక్కువ సార్లు బీజేపీ ఓడిపోవడం లేదా అసలు ఈ స్థానాల్లో గెలవకపోవడం జరిగింది.

    అయితే, ఇప్పటి వరకు ఈ రెండు రాష్ట్రాలకు ఇంకా అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించలేదు.

    బలహీనమైన స్థానాల్లో ముందుగా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా, స్థానికంగా ఉన్న సవాళ్లను అభ్యర్థులు ముందుగా తెలుసుకునేందుకు వారికి సరైన సమయం దొరుకుతుందని బీజేపీ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

  11. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమాచారంతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలను మీకు అందిస్తుంది బీబీసీ తెలుగు లైవ్ పేజీ.

    నిన్నటి లైవ్ పేజీకోసం ఇక్కడ క్లిక్ చేయండి.