ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
గ్రూప్-1 అధికారుల ఎంపిక కోసం నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 110 మంది ఉన్నట్లు కమిషన్ చైర్మన్ గౌతమ్ సవాంగ్ చెప్పారు.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, APPSC
గ్రూప్-1 అధికారుల ఎంపిక కోసం నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 110 మంది ఉన్నట్లు కమిషన్ చైర్మన్ గౌతమ్ సవాంగ్ చెప్పారు.
మొత్తం 111 గ్రూప్-1 ఉద్యోగాలకు రాతపరీక్షల తర్వాత 259 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. మొత్తం 16 విభాగాల్లో 110 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తూ ఏపీపీఎస్సీ తుది ఫలితాలను విడుదల చేసింది. స్పోర్ట్స్ కోటాలో ఒక పోస్టు నియామకానికి సంబంధించి కసరత్తు పూర్తికాలేదని, త్వరలో ఫలితం ప్రకటిస్తామని గౌతమ్ సవాంగ్ తెలిపారు.
తొలి మూడు ర్యాంకులూ మహిళలే సాధించారు. మొదటి పది స్థానాల్లో ఆరుగురు మహిళలే ఉన్నారు.
భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష టాప్ ర్యాంకర్‌గా నిలిచారు. భూమిరెడ్డి భూమిరెడ్డి పావని, కంబాలకుంట లక్ష్మీ ప్రసన్న, కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కెనడా వాయువ్య ప్రాంతంలో కార్చిచ్చుల కారణంగా వేలాది మంది ఇళ్లను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు.
జ్వాలలు తీవ్రతరం కావడంతో ఈ వారాంతానికి యెల్లోనైఫ్ నగరానికి వ్యాపిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
హే రివర్ ప్రాంతంలో మరో దావానలం కూడా ఆందోళనకు గురిచేస్తోంది.
కాగా ఈ మంటల నుంచి తప్పించుకునేందుకు ఇళ్లను వీడి వెళ్తున్నవారిలో ఓ మహిళ తన అనుభవాన్ని చెప్పారు.
ప్రాణాలు కాపాడుకునేందుకు కారులో అక్కడి నుంచి వెళ్లిపోతున్నప్పుడు నిప్పుల మధ్యలోంచి వెళ్తుంటే ఆ వేడికి కారు బాడీ కూడా కరిగిపోవడం మొదలైందని ఆమె చెప్పారు.
ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు కారులో తన కుటుంబమంతా బయలుదేరి వెళ్తున్నామని.. దారిలో హైవేకు అత్యంత సమీపంలో మంటలు ఉండడంతో పొగ కారణంతో ఏమీ కనిపించలేదని.. రోడ్డుపక్కనే నిప్పులు ఉండడంతో కారు బాడీ కరగడం మొదలైందని, తాము ప్రాణాలతో బయటపడతామని అనుకోలేదని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Supreme Court Of India
మహిళలను కించపరిచే, చులకన చేసేలా వాడుకలో ఉన్న కొన్ని అనుచిత పదాలను పరిహరించేందుకు సూచనలతో సుప్రీంకోర్టు ఒక హ్యాండ్ బుక్ విడుదల చేసింది.
కోర్టులలో వాదనలు, విచారణలు, ఆదేశాలు, తీర్పులలో అలాంటి పదాలను పరిహరించాలని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్ బుధవారం సూచించారు.
ప్రత్యామ్నాయ పదాలు, వివరణలను ఈ హ్యాండ్‌బుక్‌లో పొందుపరిచారు.
న్యాయమూర్తులు, ఇతర న్యాయసంబంధిత వ్యవహారాలలో ఉండేవారికి ఇది ఉఫయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంతకాలం కోర్టు వ్యవహారాలలో అనేక సందర్భాలలో ఉపయోగిస్తూ వచ్చిన పదాలు, పదబంధాలు.. వాటిస్థానంలో ఇకపై ఉపయోగించదగ్గ పదాలు, పదబంధాలు ఈ హ్యాండ్‌బుక్‌లో ఉన్నాయి.
మొత్తం 30 పేజీల ఈ పుస్తకంలో.. మహిళలను అగౌరవపరిచే మూసతరహా పదాల స్థానంలో వివక్ష లేని, గౌరవ ప్రదమైన పదాలు, వివరణలు వాడేలా ప్రత్యామ్నాయాలు సూచించారు.
ఇందులో హౌస్‌వైఫ్, అఫైర్, కీప్, ఈవ్ టీజింగ్, ఇండియన్ ఉమెన్, మేరేజబుల్ ఏజ్, మిస్ట్రెస్ వంటి అనేక పదాలను ప్రస్తావించారు.
వీటి స్థానంలో ఇకపై ఎలాంటి పదాలు, వివరణలు వాడాలన్నది ఈ హ్యాండ్‌బుక్‌లో సూచించారు.

ఫొటో సోర్స్, Reuters
పశ్చిమ ఆఫ్రికాలోని కేప్ వెర్డ్ సమీపంలో వలసదారులతో వెళ్తున్న బోటు సముంద్రంలో మునిగిపోవడంతో 60 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదం నుంచి 38 మందిని రక్షించినట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రెంట్స్ తెలిపింది.
ప్రమాద సమయంలో సుమారు 100 మంది బోటులో ఉన్నారని, వారిలో అత్యధికులు సెనెగల్, సియెరా లియాన్‌కు చెందినవారని అక్కడి అధికార వర్గాలు చెప్పాయి.
ప్రమాదానికి గురైన బోటు సుమారు నెల రోజులుగా సముద్రంలోనే ఉంది.
ఈ ప్రమాదం ఎన్ని రోజుల కిందట జరిగిందనేది కూడా ఇంకా స్పష్టంగా తెలియడం లేదు.
సాల్ ఐలాండ్‌కు 320 కిలోమీటర్ల దూరంలో సోమవారం ఈ బోటు మునిగిపోతున్న సమయంలో స్పెయిన్‌కు చెందిన ఫిషింగ్ బోట్‌లో ఉన్నవారు దీన్ని చూశారు.
వెంటనే వారు అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా ఈ బోట్ సెనెగల్ నుంచి జులై 10న 100 మంది ప్రయాణికులతో వెళ్లిందని సెనెగల్ విదేశీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ప్రమాదం నుంచి రక్షించినవారిని సెనెగల్‌కు తీసుకొచ్చేందుకు కేప్ వెర్డ్ ప్రభుత్వంలో మాట్లాడుతున్నట్లు సెనెగల్ విదేశీ మంత్రిత్వ శాఖ చెప్పింది.
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమాచారంతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలను మీకు అందిస్తుంది బీబీసీ తెలుగు లైవ్ పేజీ.
నిన్నటి లైవ్ పేజీకోసం ఇక్కడ క్లిక్ చేయండి.