నేపాల్ నుంచి భారత్‌కు టమోటా

ప్రస్తుతం నేపాల్ నుంచి అనధికారిక మార్గాలలో రోజుకు 70 వేల నుంచి 80 వేల కేజీల టమోటా భారత్‌లోకి వస్తోంది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. కేరళం: సామాజికంగా వెలి వేస్తారనే భయంతో చిన్నారికి ‘సెక్స్ మార్పిడి’ చేయించాలనుకుంటున్న పేరెంట్స్... కోర్టు ఏం చెప్పిందంటే..

  3. పాకిస్తాన్ తాత్కాలిక ప్రధానిగా అన్వరుల్ హక్ నియామకం

    అన్వరుల్ హక్

    ఫొటో సోర్స్, Getty Images

    పాకిస్తాన్ తాత్కాలిక ప్రధానమంత్రిగా బలూచిస్తాన్ అవామీ పార్టీకి చెందిన సెనెటర్ అన్వరుల్ హక్ కాకడ్ ఎన్నికయ్యారు.

    ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం శనివారం వెల్లడించింది.

    ఆపద్ధర్మ ప్రధానిగా అన్వరుల్ హక్ ఎన్నికపై ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రాజా రియాజ్ ఆమోదం తెలపడంతో తాత్కాలిక ప్రధాని పదవికి ఆయన పేరు ఖరారైంది.

    అన్వరుల్ హక్ నియామకానికి సంబంధించిన సిఫార్సును దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి పంపినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

    తాత్కాలిక ప్రధానమంత్రిగా అన్వరుల్ హక్ నియామకాన్ని అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ ఆమోదించారు.

    రాజ్యాంగంలోని ఆర్టికల్ 224A ప్రకారం తాత్కాలిక ప్రధాని నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు రాష్ట్రపతి కార్యాలయం ట్వీట్ ద్వారా తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. ఇందిరా గాంధీ మిజోరాం రాష్ట్రంపై దాడి చేయించారని ప్రధాని మోదీ ఎందుకన్నారు, చరిత్రలో ఏం జరిగింది?

  5. నేపాల్ నుంచి భారత్‌కు టమోటా, ఎగుమతి చేయడానికి మేం సిద్ధం అంటున్న పొరుగు దేశం

    Nepal Tomato

    ఫొటో సోర్స్, Getty Images

    భారత్‌లో టమోటాల ధరలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సాయపడేందుకు నేపాల్ సిద్ధమైంది. ఈ క్రమంలో భారత్‌కు టమోటాలు ఎగుమతి చేసేందుకు నేపాల్ సిద్ధమైంది.

    అయితే, భారత్‌కు దీర్ఘకాలం పాటు టమోటా సరఫరా చేయడానికి, అందుకు వీలుగా భారత్ మార్కెట్లకు నేపాల్ నుంచి యాక్సెస్ ఉండేలా చేయాలని, ఇతర సదుపాయాలు కల్పించాలని ఆ దేశం కోరుతోందని పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.

    కాగా నేపాల్ నుంచి టమోటా దిగుమతి చేసుకోవడం ఇప్పటికే ప్రారంభించినట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గురువారం పార్లమెంటులో చెప్పారు.

    దేశీయ మార్కెట్‌లో టమోటా లభ్యత పెంచేందుకు వీలుగా నేపాల్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు ఆమె చెప్పారు.

    నిర్మల సీతారామన్

    ఫొటో సోర్స్, twitter/ANI

    ఇండియాలో అధిక వర్షాలకు పంట దిగుబడులు తగ్గడంతో టమోటాకు డిమాండ్ పెరిగి ధరలు భారీగా పెరిగాయి.

    ఒక దశలో టమోటా ధర కిలో రూ. 300 వరకు పలికింది. ప్రస్తుతం రూ. 100 నుంచి రూ. 120 ధరల్లో విక్రయిస్తున్నారు.

    కాగా భారత్‌కు టమోటాలు, కూరగాయలు ఎగుమతి చేయడానికి తమ దేశం సిద్ధంగా ఉందని నేపాల్ వ్యవసాయ మంత్రి షబ్నం శివకోటిచెప్పారు. అయితే, పెద్ద ఎత్తున ఎగుమతి చేయడానికి సంబంధించి ఇతవరకు ఒప్పందమేమీ కుదరలేదని ఆమె తెలిపారు.

    భారీ మొత్తంలో నిత్యం ఎగుమతి చేయాలంటే ఇండియా మార్కెట్లకు తమకు సులభ యాక్సెస్ అవసరమని చెప్పారు.

    కాగా ప్రస్తుతం నేపాల్ నుంచి అనధికారిక మార్గాలలో రోజుకు 70 వేల నుంచి 80 వేల కేజీల టమోటా భారత్‌లోకి వస్తోంది.

  6. ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌లలో మార్పులు, రాజద్రోహం నేరం కాదు... ఇంకా ఏమేం మారుతున్నాయి?

  7. Gen Z: కార్పొరేట్ ప్రపంచంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి ‘జెనరేషన్ జీ’ సిద్ధంగా ఉందా?

  8. హవాయి చరిత్రలోనే ప్రాణాంతక విపత్తు.. కార్చిచ్చులో ఇప్పటివరకు 67 మంది మృతి

    హవాయిలో కాలిపోయిన కార్లు

    ఫొటో సోర్స్, Getty Images

    హవాయి ద్వీపంలో కార్చిచ్చు కారణంగా ఇప్పటివరకు 67 మంది ప్రాణాలు కోల్పోయారు.

    హవాయి చరిత్రలోనే ఇలాంటి ప్రాణాంతక విపత్తు ముందెన్నడూ లేదని స్థానికులు చెప్తున్నారు.

    ఇప్పటివరకు 67 మంది చనిపోగా ఆచూకీ తెలియనివారి సంఖ్య కూడా వందల్లో ఉంది.

    అంతకుముందు 1961లో సునామీ కారణంగా హవాయిలో 61 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మృతుల సంఖ్య అంతకంటే ఎక్కువ ఉంది. ఇది ఇంకా పెరగొచ్చని ఆందోళన చెందుతున్నారు.

    హవాయిలో నివాస ప్రాంతాలలో కాలిపోయిన ఇళ్లు, ఇతర నిర్మాణాలు, చెట్లు

    ఫొటో సోర్స్, Getty Images

  9. ఉత్తరాఖండ్: రుద్రప్రయాగలో కారుపై కొండరాళ్లు పడి అయిదుగురు మృతి

    రుద్రప్రయాగ జిల్లా గౌరీకుండ్ హైవేపై కొండచరియలు విరిగిపడడంతో సహాయ చర్యలు

    ఫొటో సోర్స్, ASIF ALI

    ఉత్తరాఖాండ్‌లోని రుద్రప్రయాగ జిల్లా గౌరీకుండ్ హైవేపై కొండచరియలు విరిగిపడ్డాయి.

    ఆ సమయంలో హైవేపై వెళ్తున్న ఓ కారుపై భారీ కొండ రాళ్లు పడడంతో కారులోని అయిదురు ప్రాణాలు కోల్పోయారు.

    పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడడంతో హైవేపై రాకపోకలు నిలిచిపోయాయి.

    హైవైపై భారీగా పోగయిన మట్టిపెళ్లలు, రాళ్లను తొలగించగా అందులో స్విఫ్ట్ డిజైర్ కారు ఒకటి ఉందని, అందులో అయిదు మృతదేహాలను బయటకు తీశామని రుద్రప్రయాణ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారి నందన్ సింగ్ రాజ్వార్ చెప్పారు.

  10. తిరుమల: ఎలుగుబంటి దాడిలో చిన్నారి మృతి

    ఎలుగుబంటి

    ఫొటో సోర్స్, Getty Images

    తిరుమల అలిపిరి నడక దారిలో ఎలుగుబంటి దాడి చేయడంతో ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు తిరుపతి జిల్లా అటవీ అధికారి తెలిపారు.

    శుక్రవారం రాత్రి 7.30 నుంచి 8 గంటల ప్రాంతంలో నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలేనికి చెందిన దినేశ్, శశికళలు తమ కుమార్తె లక్షితతో కలిసి తిరుమల దర్శనానికి అలిపిరి మెట్ల మార్గంలో కాలినకడకన బయలుదేరారు.

    నడకమార్గంలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సమీపానికి వెళ్లేసరికి అడవి జంతువు దాడి చేసి చిన్నారిని అడవిలోకి ఈడ్చుకెళ్లింది.

    తొలుత చిరుత దాడిచేసినట్లు భావించినప్పటికీ అది చిరుత కాదని.. ఎలుగుబంటి దాడిలో చిన్నారి మృతి చెందినట్లు జిల్లా అటవీ అధికారి చెప్పారు.

    తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ రాత్రి సమయం కావడంతో గాలింపు చర్యలు చేపట్టలేదు.

    శనివారం ఉదయం పోలీసులు అడవిలో గాలించగా లక్షిత మృతదేహం దొరికింది.

    కాగా ఇటీవల అలిపిరి నడక మార్గంలో ఓ బాలుడిపై చిరుత దాడి చేసింది.

  11. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌కి స్వాగతం.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈలింక్‌పైక్లిక్ చేయండి.

  12. మీ కారు, టూ వీలర్ టైర్ల తయారీకి ముందు జరిగిన దారుణ రక్త చరిత్ర గురించి మీకు తెలుసా?