మియాన్మార్: రోహింజ్యాలు ప్రయాణిస్తున్న పడవ మునక, 23 మంది మృతి, 30మంది గల్లంతు
50 మందికి పైగా ప్రయాణికులతో ఈ పడవ మలేషియా వెళ్తోందని ప్రమాదం నుంచి బయటపడిన ఒక వ్యక్తి చెప్పారు.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్
హవాయి- మౌవి కార్చిచ్చు: ‘మంటలు చుట్టుముడుతున్నాయి. బతకాలంటే సముద్రంలోకి పరుగెత్తాల్సిందే’
మియాన్మార్: రోహింజ్యాలు ప్రయాణిస్తున్న పడవ మునక, 23 మంది మృతి, 30మంది గల్లంతు

ఫొటో సోర్స్, Getty Images
రోహింజ్యా ముస్లింలతో మియాన్మార్‌లోని రఖైన్ రాష్ట్రం నుంచి మలేషియాకు వెళుతున్న పడవ మునిగి పోవడంతో 23 మరణించారు. 30మంది గల్లంతయ్యారు.
ఇప్పటి వరకు 23 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు రిలీఫ్ అండ్ రెస్క్యూ టీమ్ వెల్లడించింది. వీరిలో 13 మంది మహిళలు, 10 మంది పురుషులు ఉన్నారు. 30 మంది గల్లంతు కాగా, 8మంది తప్పించుకున్నారు.
50 మందికి పైగా ప్రయాణికులతో ఈ పడవ మలేషియా వెళ్తోందని ప్రమాదం నుంచి బయటపడిన ఒక వ్యక్తి చెప్పారు.
మియన్మార్‌లో వేధింపుల నుంచి బయటపడటానికి రోహింజ్యా ముస్లింలు తరచూ ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తూ ప్రమాదాలకు గురికావడం పరిపాటిగా మారింది.
లూనా-25: చంద్రయాన్-3 తర్వాత నెలకు ప్రయోగించిన రష్యా మిషన్, చంద్రుడిని ముందే ఎలా చేరుకుంటుంది?
తెలంగాణ: పెరట్లో ఎద్దులు మేసాయని దళిత రైతును గుంజకు కట్టేశారు.. ‘‘ఆ పెరడు రెడ్లదని ఎద్దులకు తెలియదు కదా’’
ఖుదీరామ్ బోస్: స్వాతంత్ర్య పోరాటంలో 18 ఏళ్లకే ఉరికంబం ఎక్కిన యోధుడు
చంద్రుడిపైకి విజయవంతంగా రష్యా లునా-25 లాంచ్, శుభాకాంక్షలు తెలిపిన ఇస్రో

రష్యా చంద్రుడిపైకి చేపట్టిన మిషన్ లునా-25ను విజయవంతంగా లాంచ్ చేయడంపై రష్యన్ స్టేట్ స్పేస్ కార్పొరేషన్ రొస్కోస్మోస్‌కి భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) శుభాకాంక్షలు తెలిపింది.
లునా-25 విజయవంతంగా లాంచ్ చేసినందుకు రొస్కోస్మోస్‌కి శుభాకాంక్షలు, అంతరిక్ష ప్రయాణాల్లో మనకు మరో మీటింగ్ పాయింట్ ఉండటం అద్భుతమని ఇస్రో శుక్రవారం ట్వీట్ చేసింది.
చంద్రయాన్-3, లునా-25 మిషన్లు తమ లక్ష్యాలను చేరుకుంటాయని ఆశిస్తున్నామని పేర్కొంది.
రష్యా తన లునార్ మిషన్‌ను 47 ఏళ్లలో తొలిసారి లాంచ్ చేసింది. రష్యాలోని వోస్తోక్నీ లాంచ్ కేంద్రం నుంచి లునా-25 చంద్రుడిపైకి వెళ్లింది.
శుక్రవారం స్థానిక సమయం ప్రకారం ఉదయం 8.10 గంటలకు లునా 25ను లాంచ్ చేశారు.
ఐదున్నర రోజుల్లోనే రష్యా చేపట్టిన లునా-25 చంద్రుడిపైన దిగనుంది.
భోళాశంకర్ రివ్యూ: యాక్షన్, ఎంటర్టైన్‌మెంట్, కామెడీ అన్నీ ఉన్న వేదాళంను రీమేక్ చేసినా..
ప్రకృతిలో అయిదో శక్తి.. ఇప్పటివరకు తెలియని రహస్యాన్ని సైంటిస్ట్‌లు కనుగొనబోతున్నారా
ఎన్టీఆర్ తరువాత కీలక రెవెన్యూ సంస్కరణలు తెచ్చిన కేసీఆర్.. కొత్త వ్యవస్థలో ఆ 5 పనులు ఎవరు చేస్తారు
రోజులో ఎప్పుడు, ఎంత తినాలి?
హవాయి దీవుల్లో కార్చిచ్చు.. ఇప్పటి వరకు 53 మంది మృతి

ఫొటో సోర్స్, Reuters
హవాయి దీవుల్లో ఒకటైన మౌవీ కౌంటీలో మొదలైన కార్చిచ్చు కారణంగా ఇప్పటికి 53 మంది చనిపోయారని ఆ దేశ అధికారులు వెల్లడించారు.
విపరీతంగా వీస్తున్న గాలుల కారణంగా ఈ మంటలు వేగంగా విస్తరిస్తున్నాయని వారు తెలిపారు.
ఈ ప్రకృతి సంక్షోభం వల్ల సుమారీ వెయ్యి మంది ఆచూకీ తెలియడం లేదని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ కార్చిచ్చుతో లహైనా నగరం ఎక్కువగా ప్రభావితమైంది.
అగ్నికీలల కారణంగా వందలాది ఇళ్లు కాలిపోయాయని, చాలా నివాసాలు కూలిపోయాయని అధికారులు వివరించారు.
మంటలు విస్తరిస్తున్న కారణంగా వేలమందిని ఇళ్ల నుంచి బయటకు రావాల్సిందిగా అధికారులు సూచించారు. అయితే, వారి కోసం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలు ఇప్పటికే కిక్కిరిసిపోతున్నాయి.
గుడ్ మార్నింగ్
బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌కి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈలింక్‌పైక్లిక్ చేయండి.
