హవాయి ద్వీపంలో కార్చిచ్చు, 36 మంది మృతి
అనేకమందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించగా, చాలామంది ఆచూకి లభించడం లేదని స్థానికులు చెబుతున్నారు.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్
ఎలిఫెంట్ విస్పరర్స్: ఆస్కార్ గెలిచిన డాక్యుమెంటరీ దర్శక, నిర్మాతలపై కేసు వేసిన బొమ్మన్, బెల్లీ జంట.. ఏమిటీ వివాదం?
వీగిన అవిశ్వాస తీర్మానం.. మణిపుర్ మహిళలపై జరిగిన నేరాల గురించి ప్రధాని మోదీ ఏమన్నారు?
‘వశిష్ఠ 360’ వంశీకృష్ణ ఇంటర్వ్యూ: ఒకప్పుడు స్కూల్ డ్రాపవుట్.. ఇప్పుడు లక్షల మందికి ఇంగ్లిష్ పాఠాలు
వీగిన విపక్షాల అవిశ్వాసం: లోక్‌సభలో ప్రధాని మోదీ సమాధానం ఏమిటి?

ఫొటో సోర్స్, YT/Sansad
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ప్రధాని సమాధానం తర్వాత స్పీకర్ దీనిపై మూజువాణి ద్వారా ఓటింగ్ నిర్వహించారు. అనంతరం ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్ ప్రకటించారు.
అంతకు ముందు ప్రభుత్వం మీద విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై మూడు రోజులపాటు సుదీర్ఘంగా సాగిన చర్చ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ చర్చకు లోక్‌సభలో సమాధానం ఇచ్చారు.
దేశం ప్రజలు తమ ప్రభుత్వం మీద పదే పదే విశ్వాసం ప్రకటిస్తూనే ఉన్నారని ప్రసంగం ఆరంభంలో మోదీ అన్నారు.
భగవంతుడు గొప్పవాడని, మనం ఏదైనా కోరుకుంటే ఏదో ఒక రూపంలో ఆయన దానిని నెరవేరుస్తారని మోదీ అన్నారు.
తాను భగవంతుడి ఆశీర్వాదం కోరారని, విపక్షాల రూపంలో ఆయన తనకు దాన్ని ప్రసాదించారని మోదీ అన్నారు.
ప్రధాని ప్రసంగంలో ఏముంది?
మణిపుర్ అంశంపై అవిశ్వాస తీర్మానం పై చర్చ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని, దాదాపు గంటన్నరపాటు కాంగ్రెస్, ఇతర పక్షాలను విమర్శించడంపై దృష్టి సారించారు. దీనిపై ఆగ్రహించిన విపక్షాలు, ప్రధాని ప్రసంగాన్ని నిరసిస్తూ వాకౌట్ చేశాయి.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ కల్పించుకుని, మణిపుర్ అంశంపై ప్రశ్నలు అడిగిన ప్రతిపక్షాలకు సమాధానాలు వినే ధైర్యం లేదని విమర్శించారు.
మణిపుర్‌లో మళ్లీ శాంతి నెలకొంటుందని, ఆ రాష్ట్రం మళ్లీ అభివృద్ధిలో దూసుకుపోతుందని మోదీ అన్నారు. దీనికోసం ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలి పెట్టబోమని మోదీ చెప్పారు.
కొందరు ఇక్కడ జరుగుతున్న ఘటనలను భారత మాత మరణంలో సమానమంటూ వ్యాఖ్యలు చేశారని, తద్వారా దేశాన్ని అవమానిస్తున్నారని పరోక్షంగా రాహుల్ గాంధీని విమర్శించారు మోదీ.
మణిపుర్‌లో పరిస్థితులు కుదుటపడేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని, అక్కడ అరాచకం సృష్టిస్తున్నవారిని కఠినంగా శిక్షించడం ఖాయమని అన్నారు.
దేశ ప్రజలంతా మణిపుర్ వాసులకు అండగా ఉన్నారని అన్న మోదీ, మణిపుర్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనన్ని అనేక అభివృద్ధి పథకాలను తీసుకొస్తోందని మోదీ అన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మణిపుర్ ప్రస్తావన ఏదీ?
అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీ ప్రసంగంపై విమర్శలు చేసింది. ఆయన ప్రసంగంలో దాదాపు తొలి గంటన్నర సమయాన్ని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలను విమర్శించడానికే కేటాయించడంపై విమర్శలు చేసింది.
‘‘ఇప్పటి వరకు 50 నిమిషాలు గడిచాయి, ఇంత వరకు మణిపుర్ గురించి ఒక్క మాట కూడా లేదు. ఎందుకిలా నరేంద్రమోదీ? అంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
విపక్షాల వాకౌట్ తర్వాత ప్రధాని మణిపుర్ అంశంపై ప్రసంగం కొనసాగించారు.
రోజూ 4 వేల అడుగులు నడిచినా అకాల మరణాన్ని తప్పించుకోవచ్చా?
అవిశ్వాస తీర్మానం అంటే ఏమిటి? ఓటింగ్ ఎలా జరుగుతుంది?
హవాయి ద్వీపంలో కార్చిచ్చు, 36మంది మృతి

ఫొటో సోర్స్, EPA
హవాయి ద్వీపాలలో ఒకటైన మౌవీ ఐలాండ్‌లో మొదలైన కార్చిచ్చుకు కనీసం 36మంది చనిపోయారని ఆ దేశ అధికారులు వెల్లడించారు.విపరీతంగా వీస్తున్న గాలుల కారణంగా ఈ మంటలు వేగంగా విస్తరిస్తున్నాయని వారు తెలిపారు.
ఈ అగ్నికీలల కారణంగా వందలాది ఇళ్లు కాలిపోయాయని, చాలా నివాసాలు కూలిపోయాయని కూడా వారు వివరించారు. మంటలు విస్తరిస్తున్న కారణంగా వేలమందిని ఇళ్ల నుంచి బయటకు రావాల్సిందిగా అధికారులు సూచించారు. అయితే, వారి కోసం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలు ఇప్పటికే కిక్కిరిసిపోతున్నాయి.

ఫొటో సోర్స్, REUTERS
అనేకమందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించగా, చాలామంది ఆచూకి లభించడం లేదని స్థానికులు చెబుతున్నారు. కనిపించకుండా పోయిన వారికోసం భారీ ఎత్తున సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది.
ఈ ప్రాంతానికి టూరిస్ట్ స్పాట్‌గా ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉండగా, ఇప్పుడు ఎవరూ ఇటువైపు రావొద్దని హెచ్చరికలు జారీ చేస్తోంది ఆ దేశ ప్రభుత్వం.‘‘ఈ ప్రాంతం ఎంత మాత్రం సేఫ్ కాదు’’ అని హవాయి లెఫ్టినెంట్ గవర్నర్ సిల్వియా ల్యూక్ అన్నారు.
మంటలను ఆర్పడానికి హెలీకాప్టర్ల ద్వారా నీరు చల్లుతూ ఫైర్ ఫైటర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్: ఇంగ్లండ్‌లో జరిగే అంధుల క్రికెట్ పోటీల్లో ఆడనున్న ఉత్తరాంధ్ర బాలికల కథ
జైలర్ రివ్యూ: రజనీకాంత్ కనిపించాడు కానీ..
టైటానిక్, బ్రిటానిక్: మునిగిపోతున్న ఓడల నుంచి మూడు సార్లు ప్రాణాలతో బయటపడిన నర్స్.. ‘క్వీన్ ఆఫ్ ద సింకింగ్ షిప్స్’
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ: పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం

ఫొటో సోర్స్, Getty Images
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
బుధవారం జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో భారత్ 4-0తో పాకిస్తాన్‌పై ఏకపక్ష విజయాన్ని సాధించింది.
భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (15వ ని., 23వ ని.) రెండు గోల్స్ చేశాడు. జగ్రాజ్ సింగ్ (36వ ని.), ఆకాశ్‌దీప్ సింగ్ (55వ ని.) చెరో గోల్ సాధించారు.
గ్రూప్ దశలో ఆడిన అయిదు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచిన భారత్ ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. మొత్తం 13 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
పాకిస్తాన్ పార్లమెంట్ రద్దు

ఫొటో సోర్స్, Twitter/PressOfPakistan
ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దు అయింది. ప్రధాని షాబాజ్ షరీఫ్ సలహా మేరకు ఆగస్టు 9న అంటే బుధవారం దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ, జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 58-1 ప్రకారం జాతీయ అసెంబ్లీని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ రద్దు చేశారు.
దీంతో ప్రధాని షాబాజ్ షరీఫ్ కేబినెట్ రద్దు అయింది. ఆపద్ధర్మ ప్రధానిని నియమించేవరకు ఆయనే ప్రధాని పదవిలో కొనసాగనున్నారు.
నిజానికి పాకిస్తాన్ పార్లమెంట్ పదవీకాలం ఆగస్ట్ 12తో ముగియాల్సి ఉంది. కానీ, మూడు రోజుల ముందే అక్కడ ప్రభుత్వాన్ని రద్దు చేశారు.
90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, అప్పటివరకు అక్కడ తాత్కాలిక ప్రభుత్వం కొనసాగనుంది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
చిరంజీవి: ‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం’ వ్యాఖ్యలకు కారణమేంటి? భీమ్లా నాయక్, బ్రో సినిమాల తరువాత వివాదాలు ఎందుకు రాజుకున్నాయి
అమెరికా అధ్యక్షుడిని చంపుతానని బెదిరించిన వ్యక్తి, ఎఫ్‌బీఐ దాడిలో హతం

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు మాన్‌మట్టన్ జిల్లా అటార్నీ అల్విన్ బ్రాగ్‌లను చంపుతానని ఫేస్‌బుక్‌లో బెదిరింపులకు పాల్పడిన క్రెయిగ్ రాబర్ట్‌సన్, ఎఫ్‌బీఐ దాడిలో చనిపోయారు.
యూటా రాష్ట్రంలో అధ్యక్షుడు జో బైడెన్ పర్యటనకు కొన్ని గంటల ముందుగా ఎఫ్‌బీఐ అధికారులు క్రెయిగ్ రాబర్ట్‌సన్ ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు.
స్థానిక కాలమానం ప్రకారం బుధవారం 6:15 గంటలకు ఎఫ్‌బీఐ ఆయన ఇంటిపై రైడ్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఎఫ్‌బీఐ ఇంకా విడుదల చేయలేదు.
‘‘బైడెన్, యూటాకు వస్తున్నట్లు నాకు తెలిసింది. నా గిలీ సూట్‌తో పాటు ఎం24 స్నైపర్ రైఫిల్ దుమ్మును శుభ్రం చేస్తున్నా’’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో పాటు గన్ ఫొటోలను కూడా క్రెయిగ్ పంచుకున్నారు.
ఇలా ఆయన డజన్ల కొద్ది బెదిరింపు మెసేజ్‌లను, ఆయుధాల ఫొటోలను ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేశారు.
గుడ్ మార్నింగ్
బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌కి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌పైక్లిక్ చేయండి.
