గద్దర్ మృతి పట్ల రాహుల్ గాంధీ సహా వివిధ పార్టీల నేతలు, ప్రముఖుల సంతాపం

గద్దర్ మృతికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, టీడీపీ నేత చంద్రబాబు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీపీఐ నేత నారాయణ, సినీ నటులు చిరంజీవి, బాలకృష్ణ సంతాపం తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే, సీనియర్ నేత వి. హనుమంతరావు, మల్లు రవి, ఎమ్మెల్యే సీతక్క తదితరులు గద్దర్ కుటుంబసభ్యులను పరామర్శించారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్‌కు సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

    ధన్యవాదాలు.

  2. ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు

    గద్దర్ అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.

    ఈ మేరకు ఆయన సీఎస్ శాంతికుమారిని ఆదేశించినట్లుగా సీఎంవో వెల్లడించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా? బీర్ ఒంటికి చలువ చేస్తుందా

  4. గద్దర్ చివరి లేఖ: ‘నా ఒంట్లో ఇరుక్కున్న తూటా వయసు 25 ఏళ్లు’ – లెటర్ రాసిన ఆరు రోజులకే మృతి, ఇంతకీ అందులో ఏముంది?

  5. ఫ్రెండ్స్‌తో ఎక్కువగా గడిపితే ఆరోగ్యంగా ఉంటామా

  6. మీ శరీరం నుంచి చెమట వాసన వస్తోందా? తగ్గాలంటే ఏం తినాలి.. ఏం తినకూడదు

  7. గద్దర్ మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ సంతాపం

    Gaddar

    ఫొటో సోర్స్, BRS/facebook

    గద్దర్ మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

    ‘తెలంగాణ పాటకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన ప్రజా వాగ్గేయకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో తన పాటద్వారా పల్లె పల్లెనా భావజాలవ్యాప్తి చేసిన వ్యక్తి గద్దర్’ అని ఆయన అన్నారు.

    తెలంగాణ కోసం తన ఆట పాటలతో ప్రజల్లో స్వరాష్ట్ర చైతన్యాన్ని రగిలించిన గద్దర్ ప్రజాయుద్దనౌకగా ప్రజల హృదయాల్లో నిలిచారని కేసీఆర్ అన్నారు.

    ప్రజలకోసం తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేసి ప్రజలకోసమే బతికారని, గద్దర్ మరణంతో యావత్ తెలంగాణ గొప్ప ప్రజా కవిని కోల్పోయిందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

    తెలంగాణ కోసం గద్దర్ చేసిన సాంస్కృతిక పోరాటాన్ని, ఆయనతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

    సాధారణ బుర్రకథ కళాకారుడుగా ప్రారంభమైన గద్దర్ కళాజీవితం, విప్లవ రాజకీయాలతో మమేకమై, అనంతర కాలంలో తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమంలో సాంస్కృతిక పోరాటంలో ఉన్నతస్థాయికి చేరిందన్నారు.

    కవిగా గదర్ ప్రజా కళలకు, ఉద్యమాలకు చేసిన సేవలు మరుపురానివని, వారు లేని లోటు పూడ్చలేనిదని కేసీఆర్ అన్నారు. ప్రజా కళాకారులకు కవులకు మరణం ఉండదనీ, ప్రజాకళలు వర్ధిల్లినంతకాలం ఆయన పేరు అజరామరంగా నిలిచి ఉంటుందని సీఎం తెలిపారు. గద్దర్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు.

    ఏపీ సీఎం జగన్ ఏమన్నారంటే..

    ప్రజా కవి గద్దర్ మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

    ‘ప్రజా కవి - గాయకుడు, బడుగు, బలహీనవర్గాల విప్లవ స్ఫూర్తి గద్దర్. గద్దర్ పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణల పాటే. ఆయన నిరంతరం సామాజిక న్యాయం కోసమే బతికారు. ఆయన మరణం ఊహించనిది. సామాజిక న్యాయ ప్రవక్తల భావాలు, మాటలు, వారి జీవితాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ జీవించే ఉంటాయి. గద్దర్ గారికి మొత్తంగా తెలుగు జాతి సెల్యూట్ చేస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో మనమంతా బాసటగా ఉందాం’ అని జగన్ అన్నారు.

  8. ఎల్‌బీ స్టేడియానికి గద్దర్ మృతదేహం

    LB stadium దగ్గర జనం

    గద్దర్ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం కొద్దిసేపటి కిందట ఎల్‌బీ స్టేడియానికి తరలించారు.

    అక్కడ గద్దర్ మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు.

    పెద్దసంఖ్యలో ఆయన అభిమానులు, నాయకులు, ప్రజలు వస్తున్నారు.

    ప్రజా సంఘాలకు చెందినవారు, గాయకులు అక్కడే పాటలు పాడుతూ గద్దర్‌కు నివాళులర్పిస్తున్నారు.

    గద్దర్‌కు ఉన్న ప్రజాదరణ నేపథ్యంలో పెద్దసంఖ్యలో ఆయన అభిమానులు వస్తుండడంతో పోలీసు శాఖ భద్రత ఏర్పాట్లు చేసింది.

    పవన్ కల్యాణ్, గద్దర్

    ఫొటో సోర్స్, janasena

    ఫొటో క్యాప్షన్, జులై 28న అపోలో ఆసుపత్రిలో గద్దర్‌ను పరామర్శించిన పవన్ కల్యాణ్

    గద్దర్ మృతికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీపీఐ నేత నారాయణ, సినీ నటులు చిరంజీవి, బాలకృష్ణ సంతాపం తెలిపారు.

    తన గళంతో కోట్ల మంది ప్రజలను గద్దర్ ఉత్తేజపరిచారని, ఆయన మరణం బాధాకరమని కేటీఆర్ అన్నారు. కవిగా, గాయకుడిగా తన ఆటపాటలతో లక్షలాది మంది అభిమానాన్ని చూరగొన్నారని , ప్రజలలను చైతన్యవంతులను చేశారన్నారు. గద్దర్ కుటుంబ సభ్యులకు మంత్రి కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

    ప్రజా సాహిత్యంలో, ప్రజా ఉద్యమాలలో గద్దర్ లేని లోటు ఎప్పటికీ పూడ్చలేరని సీపీఐ నారాయణ అన్నారు.

    గద్దర్ మృతికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటించారు.

  9. గద్దర్ మృతికి రాహుల్ గాంధీ, రేవంత్, చంద్రబాబు, తలసాని సహా పలువురు నేతల సంతాపం

    గద్దర్ కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న కాంగ్రెస్ నేతలు

    అపోలో ఆసుపత్రిలో గద్దర్ భౌతిక కాయానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. వ

    టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే, సీనియర్ నేత వి. హనుమంతరావు, మల్లు రవి, ఎమ్మెల్యే సీతక్క తదితరులు గద్దర్ కుటుంబసభ్యులను పరామర్శించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    గద్దర్ మృతికి తెలంగాణ మంత్రి శ్రీనివాసయాదవ్, ఇతర టీఆర్ఎస్ నేతలు సంతాపం ప్రకటించారు.

    ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలు కూడా సంతాపం తెలిపారు.

  10. పాకిస్తాన్‌లో రైలు ప్రమాదం: పట్టాలు తప్పిన హజారా ఎక్స్‌ప్రెస్, 15 మందికి పైగా మృతి

    పట్టాలు తప్పిన హజారా ఎక్స్‌ప్రెస్

    ఫొటో సోర్స్, EDHI

    పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో హజారా ఎక్స్‌ప్రెస్‌కు జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది చనిపోయినట్లు ఆ దేశ రైల్వే మంత్రి సాద్ రఫీక్ ధ్రువీకరించారు.

    ‘‘సంఘార్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో 15 మంది చనిపోయారు. చాలా మంది గాయాలు పాలయ్యారు’’ అని మంత్రి తెలిపారు.

    ఈ రైలు ప్రమాదంపై సాద్ రఫీక్ లాహోర్‌లో పత్రికా సమావేశం నిర్వహించారు.

    రైలు గంటకు 45 కి.మీల స్పీడ్‌లోనే ఉందని తెలిపారు.

    అత్యధిక వేగం కారణం చేత ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అంతకుముందు భయపడినట్లు చెప్పారు.

    సింధ్ ప్రావిన్స్‌లోని సంఘార్ జిల్లో సర్హారి పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది.

    అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదంలో హజారా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి.

    ఈ బోగీల్లో చిక్కుకుని పోయిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు అధికారులు.

    ‘‘కోచ్‌ల కిందనే చాలా మంది ప్రయాణికులు సమాధులయ్యారు. కొంత మంది పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంది’’ అని ఘటన స్థలి వద్దనున్న మొహమ్మద్ ఉస్మాన్ మల్లా బీబీసీకి తెలిపారు.

    చాలా మంది స్థానికులు ఈ సంఘటన స్థలికి చేరుకుని, ప్రయాణికులను బయటికి వచ్చేందుకు సాయపడుతున్నారని అన్నారు.

  11. గద్దర్ మృతి: రాడికల్ ఉద్యమాల నుంచి రాజకీయ పార్టీల వరకు

  12. గద్దర్‌ : 'ఓటు కూడా ఒక పోరాట రూపమే' - తొలిసారి ఓటు వేసిన సందర్భంగా 2018లో బీబీసీ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారంటే

  13. బ్రేకింగ్ న్యూస్, గద్దర్ మృతి

    గద్దర్
    ఫొటో క్యాప్షన్, గద్దర్

    తెలంగాణకు చెందిన ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు.

    హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం ఆయన మరణించారు.

    గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

    గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. మెదక్ జిల్లా తూప్రాన్‌లో 1949లో ఆయన జన్మించారు.

    తన పాటలతో గద్దర్ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.

    GADDAR

    ఇంజనీరింగ్ చదివే రోజుల్లో గద్దర్ నక్సలైట్ విప్లవోద్యమానికి ఆకర్షితులయ్యారు.

    సాయుధ పోరాటం ఒక ఉద్యమ రూపం మాత్రమేనని, ప్రజల్లో భావ విప్లవం తీసుకువచ్చేందుకే తాను సాంస్కృతిక ఉద్యమం వైపు మళ్లినట్లు గద్దర్ గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

    దళిత ఉద్యమం, స్త్రీ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం.. ఇలా ఎన్నో ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారు.

    కార్ల్ మార్క్స్ జ్ఞాన సిద్ధాంతంతోపాటు పూలే, అంబేడ్కర్‌ల భావాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఆయన కృషి చేశారు.

    పార్లమెంటరీ రాజకీయాలను వ్యతిరేకించే నక్సలైట్ పార్టీ నుంచి వచ్చిన గద్దర్ 70 ఏళ్ల జీవితంలో 2018లోనే తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

    యాభై ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రయాణం, 32 కేసులు, 6 తుపాకీ గుండ్లు, అజ్ఞాతవాసం, జైలు జీవితం.

    ఈ యంగ్ ఇండియాలో ఒకవైపు తిరుగుబాటు, రెండో వైపు ఓటు కూడా ఉండాలని గద్దర్ విశ్వసించేవారు.

  14. తల్లిపాలు: మందులు వాడే తల్లులు బిడ్డకు పాలివ్వకూడదా... 7 అపోహలు, వాస్తవాలు

  15. నూహ్: 'నల్హర్ ఆలయంలో మహిళలపై అత్యాచారం వార్త'లపై పోలీసుల ప్రకటన

    ఆలయం

    హరియాణాలోని నూహ్‌లో మత ఘర్షణ చెలరేగిన సమయంలో అక్కడి నల్హర్ దేవాలయంలో మహిళలపై లైంగిక వేధింపులు జరిగాయనే ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను పోలీసులు ఖండించారు.

    “నల్హర్ ఆలయంలో ఒంటరిగా ఉన్న మహిళా భక్తులపై అత్యాచారాలు జరిగాయని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కథనాలు నడుస్తున్నాయి. ఇవి పూర్తిగా అబద్ధం, పుకార్లు. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నా. అలాంటి సంఘటన ఏదీ జరగలేదు" అని అడిషనల్ డీజీపీ మమతా సింగ్ వార్తాసంస్థ ఏఎన్ఐతో తెలిపారు.

    మత సామరస్యాన్ని చెడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వదంతులు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మమతా సింగ్ హెచ్చరించారు.

    కాగా, ఆగస్టు 5 శనివారం వరకు రాష్ట్రంలో దాదాపు 104 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని ఏడీజీపీ తెలిపారు. ఇందులో 216 మందిని అరెస్టు చేశామని, 83 మందిని ప్రివెంటివ్ కస్టడీలో ఉంచామని మమతా సింగ్ చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  16. బరువు పెరగాలంటే ఇలా చేయండి...

  17. హరియాణా ఘర్షణలు: నూహ్‌లో ఆగస్టు 8 వరకు ఇంటర్నెట్ బంద్

    హరియాణా

    ఫొటో సోర్స్, Getty Images

    హరియాణాలోని నూహ్ జిల్లాలో జూలై 31న చోటుచేసుకున్న మత ఘర్షణల కారణంగా ఆ ప్రాంతంలో ఆగస్టు 8 వరకు ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేస్తున్నట్లు హరియాణ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

    నుహ్ పరిధిలో వాయిస్ కాల్స్ మినహా మొబైల్ ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎంఎస్ మొదలైన సేవల సస్పెన్షన్ 2023 ఆగస్టు 8 వరకు పొడిగిస్తున్నట్లు ఈ ప్రకటనలో తెలిపారు.

    మరోవైపు హింసాకాండకు పాల్పడిన నిందితుల అరెస్ట్‌ కొనసాగుతోంది. అంతేకాదు నుహ్ మత ఘర్షణలో పాల్గొన్న నిందితుల అక్రమ కట్టడాలను అధికారులు బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు.

  18. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి