చంద్రయాన్-3: విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి చేరిన అంతరిక్ష నౌక

బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్క్(ఐఎస్‌టీఆర్ఏసీ)లోని మిషన్ ఆపరేషన్ కాంప్లెక్స్ నుంచి ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తిచేసినట్లు ఇస్రో తెలిపింది.

లైవ్ కవరేజీ

  1. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్డేట్స్ ఇంతటితో ముగిస్తున్నాం.

    థాంక్స్.

  2. చిత్తూరు: భార్యతో ఉన్నప్పుడు పురుషుడు.. బాయ్‌ఫ్రెండ్‌ను కలిస్తే మహిళ

  3. పార్వతీపురం: ఫిట్స్ వచ్చిన కూతురిని రక్షించుకోవడానికి ప్రాణాలకు తెగించి నది దాటిన తల్లిదండ్రులు

  4. చంద్రుడి కక్ష్యలోకి చేరిన చంద్రయాన్-3

    Chandrayaan 3

    ఫొటో సోర్స్, ISRO

    చంద్రయాన్-3 చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించినట్లు ఇస్రో వెల్లడించింది.

    బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్క్(ఐఎస్‌టీఆర్ఏసీ)లోని మిషన్ ఆపరేషన్ కాంప్లెక్స్ నుంచి ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తిచేసినట్లు ఇస్రో తెలిపింది.

    ఆగస్ట్ 6 రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో తదుపరి ఆపరేషన్ ‘రిడక్షన్ ఆఫ్ ఆర్బిట్’ చేపట్టనున్నారు.

    కాగా చంద్రయాన్-3ని జులై 14న భూకక్ష్యలోకి పంపించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. టమాటా ఆరోగ్యానికి మంచిదా కాదా?

  6. డీఎన్ఏ టెస్ట్: ఆయన భార్యలకు 25 మంది పిల్లలు.. పరీక్ష చేయిస్తే 15 మందే ఆయనకు జన్మించినట్లు తేలింది

  7. పాకిస్తాన్: అరెస్టుకు ముందు ఇమ్రాన్ ఖాన్ విడుదల చేసిన వీడియోలో ఏముంది?

    ఇమ్రాన్ ఖాన్

    ఫొటో సోర్స్, ANI

    పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వీడియో సందేశం విడుదల చేశారు.

    లండన్ పథకం ప్రకారమే ఇదంతా జరుగుతోందని ఇమ్రాన్ ఆ వీడియలో ఆరోపించారు.

    ఇమ్రాన్ ఈ వీడియోలో "ఈ సందేశం మీకు చేరే సమయానికి నన్ను అరెస్టు చేసి, జైల్లో పెట్టొచ్చు. మీరు ఇంట్లో నిశ్శబ్ధంగా కూర్చోవద్దు. నా కోసం, నా కులం కోసం నేనిది చేయడం లేదు. నా కమ్యూనిటీ కోసం చేస్తున్నా. మీ కోసం, మీ పిల్లల కోసం పని చేస్తున్నా'' అని తెలిపారు.

    ప్రజలు తమ హక్కుల కోసం ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఇమ్రాన్ సూచించారు.

    తన అరెస్టుకు ముందు ఈ వీడియో రికార్డు చేశానని చెప్పిన ఇమ్రాన్... ట్విటర్‌లో వీడియోను పోస్ట్ చేస్తూ రాసిన మాటల్లో మాత్రం పార్టీ కార్యకర్తలందరూ శాంతియుతంగా ఉండాలని కోరారు.

    ఇమ్రాన్‌ను ఇస్లామాబాద్‌లోని డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు తోశాఖానా కేసులో దోషిగా నిర్ధరిస్తూ మూడేళ్ల జైలు శిక్ష విధించింది.ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేశారు.

  8. బేబీ లాస్ ఇన్ ప్రెగ్నెన్సీ: గర్భంలోనే చనిపోయిన శిశువుల అవశేషాలు భద్రపరిచేందుకు ఏర్పాట్లు

  9. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్... తోషాఖానా కేసులో మూడేళ్ల జైలు శిక్ష

    ఇమ్రాన్ ఖాన్

    ఫొటో సోర్స్, Getty Images

    పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. తోషాఖానా కేసులో శనివారం ఇస్లామాబాద్‌లోని డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ఇమ్రాన్ ఖాన్‌ను దోషిగా తేల్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.

    కోర్టు శిక్ష విధించడంతో ఇమ్రాన్ ఖాన్ వచ్చే ఐదేళ్లపాటు ఎన్నికల్లో పాల్గొనడానికి అనర్హుడని పాకిస్థాన్ ఎన్నికల సంఘం న్యాయవాది అమ్జద్ పర్వేజ్ తెలిపారు.

    తోషఖానా ప్రభుత్వ శాఖ. ప్రధాని, రాష్ట్రపతి లేదా ఇతర సీనియర్ అధికారులు తమ పర్యటనల సందర్భంగా అందుకున్న విలువైన బహుమతులు తోషాఖానాలో జమ చేస్తారు.

    ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్నప్పుడు తనకు వచ్చిన బహుమతుల గురించి అధికారులకు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో పాటు వాటిని విక్రయించడం ద్వారా సంపాదించిన డబ్బు లెక్కలను చూపనందుకు ఆయన్ను కోర్టు దోషిగా తేల్చింది. మూడేళ్ల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించింది.

    అంతేకాదు, ఇమ్రాన్‌ను తక్షణమే అరెస్టు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. లాహోర్‌లో ఇమ్రాన్ ను అదుపులోకి తీసుకున్నారని ఆయన న్యాయవాది ఇంతజార్ హుస్సేన్ రాయిటర్స్ వార్తాసంస్థకు తెలిపారు. అయితే కోర్టు తీర్పుపై ఇమ్రాన్ ఖాన్ అప్పీల్‌కు వెళ్లనున్నట్లు సమాచారం.

  10. మణిపుర్‌‌లో కొనసాగుతున్న ఘర్షణలు... ముగ్గురు మృతి

    మణిపుర్

    ఫొటో సోర్స్, ANI

    మణిపుర్‌లో తాజాగా చెలరేగిన హింసలో ముగ్గురు మృతి చెందారు. పలు ఇళ్లు మంటల్లో కాలిపోయాయి.

    ఈ ఘటన బిష్ణుపూర్ జిల్లాలో చోటుచేసుకున్నట్లు స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

    ఈ ఏడాది మే నెలలో మణిపుర్‌లో హింస ప్రారంభమైనప్పటి నుంచి 180 మందికి పైగా మరణించారు. వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది.

    తాజా హింసాకాండపై ప్రస్తుతానికి వ్యాఖ్యానించలేమని కుకీ సివిల్ సొసైటీ గ్రూప్ ప్రతినిధి చెప్పారు.

  11. మోను మానేసర్: గోసంరక్షకుడిని అని చెప్పుకునే ఈ 28 ఏళ్ల యువకుడే నూహ్ మత అల్లర్లకు కారణమా?

  12. రష్యా: పుతిన్ విమర్శకుడు అలెక్సీ నావల్నీ జైలు శిక్ష 19 సంవత్సరాలకు పొడిగింపు

    అలెక్సీ నావల్నీ

    ఫొటో సోర్స్, EPA

    ఫొటో క్యాప్షన్, అలెక్సీ నావల్నీ

    రష్యా ప్రతిపక్ష నేత, పుతిన్ విమర్శకుడు అలెక్సీ నావల్నీకి జైలు శిక్షను 19 ఏళ్లకు పొడిగించారు. అయితే, దీనిపై నిరసన కొనసాగించాలని అలెక్సీ తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.

    ఆయన తీవ్రవాద నెట్‌వర్క్‌ను సృష్టించారని,టెర్రరిస్టు కార్యకలాపాలకు ఆర్థికంగా సాయం చేశారని దోషిగా నిర్దారించారు. అయితే, ఈ ఆరోపణలను ఆయన ఖండించారు.

    పెరోల్ ఉల్లంఘన, మోసం, కోర్టు ధిక్కారం కింద ఇప్పటికే ఆయనకు తొమ్మిదేళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం నావల్నీ జైలులో ఉన్నారు. తాజాగా ఆ శిక్షను మరో పదేళ్లకు పొడిగించింది కోర్టు.

    47 ఏళ్ల అలెక్సీ నావల్నీ రష్యా ప్రతిపక్షంలో అత్యంత ప్రముఖమైన వ్యక్తి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌‌కు బద్ధ వ్యతిరేకి. దశాబ్దానికి పైగా రష్యాలో అధికారంలో ఉన్న పుతిన్ పార్టీ అవినీతిని బట్టబయలు చేశారని ఆయనకు పేరుంది.

    2020 ఆగస్టులో నావల్నీపై విషప్రయోగం జరిగింది. దీనికోసం నోవిచోక్ అనే నర్వ్ ఏజెంట్ (నాడీకణ వ్యవస్థపై ప్రభావం చూపే పదార్థం)ను ఉపయోగించారని దర్యాప్తులో తేలింది.

  13. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    నిన్నటి లైవ్ పేజ్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.