పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్షపై సుప్రీంకోర్టు స్టే
గుజరాత్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కోర్టు స్టే విధించింది.
లైవ్ కవరేజీ
లైవ్ పేజీ అప్డేట్స్ ఇంతటితో ముగిస్తున్నాం.
శనివారం కలుద్దాం. థాంక్స్.
'మాంసాహారం, శాకాహారంలో ఒకే చెంచాలు వాడతారేమోనని నాకు భయం' - సుధా మూర్తి వ్యాఖ్యలపై విమర్శలకు కారణమేంటి?
అదానీ గంగవరం పోర్ట్: ‘కనీస వేతనాలు లేవు, హక్కులు లేవు’ అంటున్న కార్మికులు.. ఏమిటీ వివాదం?
చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనలో ఉద్రిక్తత, రాళ్లురువ్వుకున్న టీడీపీ, వైసీపీ వర్గీయులు

ఫొటో సోర్స్, UGC
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లులో చంద్రబాబు రాకతో టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకి చేరుకున్నారు. అయితే వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకొని ‘చంద్రబాబు, గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో పోలీసులను భారీగా మోహరించినప్పటికీ, చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.
దీంతో ఎన్ఎస్జీ కమాండోలు చంద్రబాబుకు రక్షణగా నిలిచారు. ఘర్షణల విషయం తెలిసి పుంగనూరు బైపాస్ దగ్గర ఉన్న టీడీపీ కార్యకర్తలు పట్టణంలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. చంద్రబాబు టూర్ షెడ్యూల్లో పుంగనూరు లేకపోవడం వల్ల వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీ ఛార్జి చేయడంతో టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు.

ఫొటో సోర్స్, UGC
కార్యకర్తలు రాళ్ల దాడికి దిగడంతో పోలీసులు వెనక్కు తగ్గారు. అదే సమయంలో పోలీసుల వాహనాలకు కొందరు నిప్పు పెట్టారు. తర్వాత పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. చంద్రబాబు అంగళ్లు నుంచి వెళ్లిపోయిన తర్వాత కాన్వాయ్ వెంట వెళ్తున్న వాహనాలపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టారు.
చంద్రబాబు బందోబస్తు కోసం వచ్చిన పోలీసులపైనే టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి చెప్పారు.
దాదాపు గంటపాటు రాళ్లు రువ్వుకోవడం కొనసాగడంతో 13 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని, వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. మొత్తం దాదాపు 50 మందికి రాళ్ల గాయాలు అయ్యాయన్నారు. దాడుల్లో పాల్గొన్న వారిని గుర్తించామని, వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు.
రాహుల్ గాంధీకి జైలు శిక్షపై సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 2024 ఎన్నికల్లో ఆయన పోటీ చేయొచ్చా?
1904 నాటి పుస్తకంలో భారత ‘చీజ్‌కేక్’ రహస్యాలు
చిత్తూరు జిల్లా: రహస్యంగా స్వలింగ సంపర్కంలో పాల్గొనే ఇద్దరు మగవాళ్ల కథలు
బ్రేకింగ్ న్యూస్, పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్షపై సుప్రీంకోర్టు స్టే

ఫొటో సోర్స్, FB/RahulGandhi
మోదీ ఇంటి పేరు పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి గుజరాత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించింది.
సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించగా, ఆయన దాన్ని గుజరాత్ హైకోర్టులో సవాల్ చేశారు. అయితే, గుజరాత్ హైకోర్టు ఈ శిక్షను సమర్ధిస్తూ రాహుల్ గాంధీ పిటిషన్‌ను కొట్టివేసింది.
దీంతో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకెక్కారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు జైలు శిక్షపై స్టే విధించింది.
మెక్సికో: లోయలో పడిన బస్సు, 18 మంది మృతి, భారతీయులు కూడా ఉన్నట్లు వార్తలు

ఫొటో సోర్స్, Getty Images
మెక్సికోలోని 131 అడుగుల లోతైన లోయలో బస్సు అదుపుతప్పి పడటంతో అందులో ప్రయాణిస్తున్న 18 మంది మరణించారు. ఈ ఘటన గురువారం నయారిత్‌లో చోటుచేసుకుంది.
బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారని, అందులో భారత్, ఆఫ్రికా దేశాల పౌరులు కూడా ఉన్నట్లు వార్తాసంస్థ రాయిటర్స్ తెలిపింది. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది విదేశీయులేనని అధికారులు తెలిపారు.
బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ అతివేగంతో బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలానికి అంబులెన్స్‌లు చేరుకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఓవర్‌సీస్ హైవే: ‘‘నేనిప్పుడు సంతోషంగా చనిపోతాను, నా కోరిక నెరవేరింది’’
ఉత్తర్‌ప్రదేశ్: జ్ఞానవాపీ మసీదులో పురావస్తు శాఖ సర్వే, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, జ్ఞానవాపీ మసీదు వారణాసిలోని జ్ఞానవాపీ మసీదులో శుక్రవారం భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) బృందం సర్వే చేపట్టడానికి సిద్ధమైంది. సున్నితమైన ప్రాంతం కావడంతో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం పరిసర ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.
జ్ఞానవాపీ వెళ్లే అన్ని రహదారులు, వాటికి ఆనుకుని ఉన్న వీధుల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాశీ కారిడార్‌కు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ పూర్తిగా నిషేధించారు. కొన్ని ఇళ్ల పైకప్పులపై కూడా భద్రతా సిబ్బందిని మోహరించారు.
పీఏసీ, ఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్, కమాండోలు, అల్లర్ల నియంత్రణ విభాగం, సాయుధ భద్రతా బలగాలతో పాటు పోలీసు సిబ్బంది ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారు.
అంతేకాదు ఆగస్టు 4 నుంచి 7 వరకు కాశీ విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం ఉంటుందని వారణాసి డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గుడ్ మార్నింగ్
బీబీసీ తెలుగు లైవ్ పేజ్‌కు స్వాగతం
నిన్నటి లైవ్ పేజ్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
