మణిపుర్: మహిళలను నగ్నంగా నడిపించిన కేసు ప్రధాన నిందితుడి అరెస్ట్

“సమీప గ్రామంలోని ప్రజల ఇళ్లను మొయితే తెగకు చెందినవారు తగలబెడుతున్నారని మాకు తెలిసింది. భయంతో మేం పారిపోయే ప్రయత్నం చేశాం. ఒక గుంపు మమ్మల్ని చూసింది. వాళ్లు మాపై దాడి చేయడం మొదలు పెట్టారు. దుస్తులు విప్పకపోతే చంపేస్తామని అన్నారు.’’

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. కేసీఆర్ చెప్పినట్లు మూసీ నదిలో బోటు షికారుకి వెళ్లొచ్చా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్‌లో ఏం తేలిందంటే

  3. ఈ హైవేపై 6 నెలల్లో 615 యాక్సిడెంట్లు.. 88 మంది మృతి.. ఏం జరుగుతోంది

  4. మణిపుర్: మహిళలను నగ్నంగా నడిపించిన కేసు నిందితులలో ఒకరి అరెస్ట్

    మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో నిందితుడు

    ఫొటో సోర్స్, ANI

    మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా నడిపించిన కేసులో ఆ రాష్ట్ర పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు.

    ప్రధాన నిందితుడు హుయిరేమ్ హెరోదాస్ మైతేయీని గురువారం ఉదయం అరెస్టు చేసినట్లు వార్తాసంస్థలు ఏఎన్ఐ, పీటీఐలు తెలిపాయి.

    నగ్నంగా ఉన్న ఇద్దరు మహిళలను బహిరంగ మైదానానికి ఓ గుంపు తీసుకెళుతున్న ఓ వీడియో వైరల్ కావడం, దేశవ్యాప్తంగా ఆ ఘటనపై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తడం తెలిసిందే.

    నగ్నంగా ఉన్న మహిళ శరీరాన్ని తాకుతూ వీడియోలో కనిపించిన ఇద్దరు పురుషులలో హుయిరేమ్ హెరోదాస్ ఒకరు.

    మే 4న మణిపుర్‌లో హింస ప్రారంభమైనప్పుడు ఈ ఘటన జరిగింది. ఈ వ్యవహారంపై మే 18న ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

    అయితే ఈనెల 19న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో (78 రోజుల తర్వాత) ఘటనపై విమర్శలు తలెత్తాయి. దీంతో గురువారం ఈ కేసులో మొదటి అరెస్టు జరిగింది.

  5. మణిపుర్‌: ఎటుచూసినా కాలిపోయిన ఇళ్లు, ఖాళీ ఊళ్లు.. ఈ ఈశాన్య రాష్ట్రంలో ఆగ్రహం, అపనమ్మకం, అంతులేని భయానికి కారణమేంటి – గ్రౌండ్ రిపోర్ట్

  6. డీప్‌ఫేక్‌: ఒక్క రోజులోనే వందల వీడియోలు క్రియేట్ చేయొచ్చా? సెలబ్రిటీలు, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెర్స్ రహస్యం ఇదేనా

  7. సింగిల్ ఫాదర్: భార్య లేకుండానే ఇద్దరు పిల్లలకు తండ్రయ్యారు, ఇకపై అందరికీ ఇది సాధ్యం కాదా?

  8. మణిపుర్‌: ఇద్దరు మహిళలను నగ్నంగా వీధుల్లో నడిపించిన ఘటనపై దేశం ఎలా రగులుతోంది, సుప్రీం కోర్టు ఏమన్నది?

  9. మణిపుర్ ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్

    మణిపుర్ మహిళలు

    ఫొటో సోర్స్, Getty Images

    మణిపుర్ ఘటనను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది.

    తక్షణమే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మణిపుర్ డీజీపీని ఆదేశించింది.

    వివిధ పార్టీల నేతలు కూడా మణిపుర్ ఘటనను ఖండించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఇది అత్యంత హేయమైన చర్య అని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ అన్నారు.

    నిందితులను గుర్తించి అత్యంత కఠినంగా శిక్షించాలన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  10. మణిపుర్ మహిళల నగ్న వీడియో: దేశం అవమానానికి గురైంది, నిందితులను వదిలిపెట్టొద్దు: ప్రధాని నరేంద్ర మోదీ

    మణిపుర్ నగ్న వీడియో

    ఫొటో సోర్స్, parliament

    మణిపుర్‌లో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి వీధిలో నడిపించారన్న ఘటనకు సంబంధించి వీడియో వైరల్ కావడంతో దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. పార్లమెంటు సమావేశాలకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.

    మణిపుర్ ఘటన గురించి విన్నాక తన హృదయం బాధతో నిండిపోయిందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఘటన సిగ్గు చేటన్న ఆయన, దీనివెనక ఉన్నవారు దేశం మొత్తాన్ని అవమానించారని, వారిని చూసి 140 కోట్లమంది భారతీయులు సిగ్గుపడుతున్నారని అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఇలాంటి ఘటనలు ఏ రాష్ట్రంలో జరిగినా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి సూచించారు. ఇలాంటి విషయాలలో పార్టీలకు అతీతంగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

    ‘‘ఈ తరహా ఘటనలకు పాల్పడిన వారినెవరినీ విడిచిపెట్టబోమని దేశ ప్రజలకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాను’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.

    రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మణిపూర్‌లను ఇలా ఏ రాష్ట్రమైనా ఎక్కడైనా సరే నిందితులను వదిలిపెట్టవద్దని ముఖ్యమంత్రులకు సూచించారు.

    ‘‘రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలు మహిళల గౌరవం కోసం పని చేయండి’’ అని మోదీ అన్నారు.

  11. మణిపుర్: ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి వీధిలో నడిపించిన మూక వీడియో వైరల్

    మణిపుర్

    ఫొటో సోర్స్, Getty Images

    మణిపుర్‌లో ఇద్దరు మహిళలను కొందరు పురుషులు వివస్త్రలను చేసి రోడ్డుపై నడిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మహిళల్లో ఒకరిపై సామూహిక అత్యాచారం కూడా జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.

    ఈ ఘటన మే 4న జరిగిందని మణిపుర్ పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులపై కిడ్నాప్, సామూహిక అత్యాచారం, హత్యయత్నం ఆరోపణలతో దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ అఘాయిత్యానికి పాల్పడింది ఎవరు అన్నది మాత్రం ఇంకా గుర్తించలేదు.

    నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరు మహిళల్లో 21 ఏళ్ల మహిళపై అత్యాచారం కూడా జరిగిందని న్యూస్ వెబ్‌సైట్ ‘స్క్రోల్’ రిపోర్ట్ చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఆ ఇద్దరు మహిళల్లో ఒకరితో స్క్రోల్ వెబ్‌సైట్ ప్రతినిధులు మాట్లాడారు. “సమీప గ్రామంలోని ప్రజల ఇళ్లను మొయితే తెగకు చెందినవారు తగలబెడుతున్నారని మాకు తెలిసింది. భయంతో మేం పారిపోయే ప్రయత్నం చేశాం. ఒక గుంపు మమ్మల్ని చూసింది. వాళ్లు మాపై దాడి చేయడం మొదలు పెట్టారు. దుస్తులు విప్పకపోతే చంపేస్తామని అన్నారు.’’ అని ఆ మహిళ వెల్లడించింది.

    ‘‘మా ప్రాణాలను కాపాడుకోవడానికి, మేము దుస్తులును విప్పేయాల్సి వచ్చింది. ఆ సమయంలో అక్కడున్న మగవాళ్లు మమ్మల్ని కొట్టారు. ఒక వ్యక్తి నన్ను సమీపంలోని పొలంలోకి తీసుకెళ్లాడు. అదృష్టం కొద్దీ నాపై అత్యాచారం జరగలేదు’’ అని ఆమె వెల్లడించింది.

    ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

  12. అహ్మదాబాద్: జనం మీదకు అతివేగంతో దూసుకెళ్లిన జాగ్వార్ కారు, 9 మంది మృతి

    జాగ్వార్

    ఫొటో సోర్స్, ANI

    గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు.

    గురువారం తెల్లవారుజామున సర్ఖేజ్-గాంధీనగర్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది.

    ‘‘ఇస్కాన్ వంతెనపై అర్ధరాత్రి రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదాన్ని చూసేందుకు కొందరు అక్కడ గుమిగూడారు. ప్రమాదస్థలంలో ఉన్న ఈ వ్యక్తుల మీదకు గంటకు 100 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్న జాగ్వార్ కారు దూసుకెళ్లింది. దీంతో 9 మంది మృతి చెందారు, 12 మందికి గాయాలు అయ్యాయని’’ పోలీస్ అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    అహ్మదాబాద్‌లో ట్రాఫిక్ డీసీపీ నీతా దేశాయ్ మాట్లాడుతూ, “నిన్న రాత్రి జాగ్వార్ కారు ఢీకొన్న ఘటనలో తొమ్మిది మంది మరణించారు.ప్రస్తుతం జాగ్వార్‌ డ్రైవర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులను సంప్రదించి డ్రైవర్‌ను అరెస్టు చేస్తామని’’ అన్నారు.