మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే భేటీ

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌‌తో మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే ముంబయిలో బుధవారం భేటీ అయ్యారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. ఎమర్జింగ్ ఆసియా కప్‌: సాయి సుదర్శన్ సెంచరీతో పాక్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ విజయం

    సాయి సుదర్శన్

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, ఓపెనర్ సాయి సుదర్శన్ (104) సెంచరీతో భారత్ జట్టు పాక్‌పై విజయం సాధించింది.

    ఎమర్జింగ్ ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ యువ జట్టుపై భారత్ యువ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.

    శ్రీలంకలోని కొలంబో వేదికగా భారత్-ఏ, పాకిస్తాన్-ఏ జట్లు బుధవారం తలపడ్డాయి.

    టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ ఎదుట 206 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

    అయితే, ఓపెనర్ సాయి సుదర్శన్ (104) సెంచరీతో భారత్ జట్టు పాక్‌పై విజయం సాధించింది.

    భారత్-ఏ జట్టుకు ఇది హ్యాట్రిక్ విజయం. ఇదివరకు యూఏఈ, నేపాల్‌లపైనా భారత్ విజయాలు నమోదుచేసింది.

  3. ఇండియా, ఎన్డీఏ: ఏ కూటమిలో ఏ పార్టీలు ఉన్నాయి? ఎవరికి ఎంతమంది ఎంపీలు ఉన్నారు

  4. తీస్తా సీతల్వాడ్‌కి సాధారణ బెయిల్

    తీస్తా సీతల్వాడ్

    ఫొటో సోర్స్, ANI

    మానవ హక్కుల కార్యకర్త తీస్తా సీతల్వాడ్‌కి సుప్రీం కోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేసింది.

    గోద్రా అల్లర్ల కేసులో ఫోర్జరీ పత్రాలు సృష్టించారని, సాక్షులను ప్రభావితం చేశారని నమోదైన కేసులో ఆమెకు న్యాయస్థానం ఊరట కల్పించింది.

    తీస్తా సీతల్వాడ్‌పై చార్జిషీట్ దాఖలైంది. కస్టడీ విచారణ కూడా పూర్తవడంతో ఆమెకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు వ్యాఖ్యానించింది.

    బెయిల్‌పై ఉన్న సమయంలో ఆమె సాక్షులను ప్రభావితం చేయకూడదని, ఒకవేళ అలా చేస్తే ఆమె బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ప్రాసిక్యూషన్ వారు నేరుగా తమ దృష్టికి తీసుకురావొచ్చని సుప్రీం కోర్టు తెలిపింది.

    అంతకుముందు, గుజరాత్ హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయడంతో పాటు వెంటనే లొంగిపోవాలని ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.

    ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృ‌త్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

    2002లో గుజరాత్‌లో జరిగిన గోద్రా అల్లర్ల కేసులో బాధితుల తరఫున తీస్తా సీతల్వాడ్ న్యాయపోరాటం చేస్తున్నారు. 'సిటిజెన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్' సంస్థ ద్వారా 68 కేసుల్లో 170 మందికి శిక్ష పడేలా చేశారు.

  5. గర్భనిరోధక మాత్రలు వాడితే మొటిమలు వస్తాయా? వీటితో ప్రయోజనాలేంటి? నష్టాలేంటి

  6. చమోలి: విద్యుత్ షాక్‌‌తో 15 మంది మృతి.. ప్రమాదం ఎలా జరిగిందంటే

  7. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే భేటీ

    మహారాష్ట్ర

    ఫొటో సోర్స్, ANI

    మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌‌తో మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే ముంబయిలో బుధవారం భేటీ అయ్యారు.

    శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నుంచి తన వర్గం ఎమ్మెల్యేలతో ఇటీవల బయటికొచ్చేసిన అజిత్ పవార్, బీజేపీ - శివసేన(శిందే) సారథ్యంలోని ప్రభుత్వంలో చేరారు.

    మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే క్యాబినెట్‌లో డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.

    2022లో అప్పటి ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేపై శివసేనలో కీలక నేతగా ఉన్న ఏక్‌నాథ్ శిందే తిరుగుబాటు చేయడంతో ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం శిందే బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

    అంతకు ముందు, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేసింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం బీజేపీని కాదని ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

    2019లో ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మూడేళ్ల తర్వాత శిందే నేతృత్వంలో శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో ఉద్దవ్ ప్రభుత్వం పడిపోయింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. సేంద్రీయ వరి సాగు నిజంగా లాభదాయకమా? తమిళనాడు అనుభవాలు ఏమిటి?

  9. సంక్షోభం నుంచి శ్రీలంక నిజంగానే కోలుకుందా?

  10. విశాఖపట్నం: బోరు కోసం వందల అడుగులు తవ్వితే సముద్రపు నీరు వచ్చేస్తుందా? అప్పుడేమవుతుంది?

  11. హైదరాబాద్: రాజీవ్‌ గాంధీ ఎయిర్‌పోర్ట్‌లో కోటి రూపాయల బంగారం పట్టివేత

    బంగారం

    ఫొటో సోర్స్, ANI

    హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయల విలువ చేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

    జులై 17న ఇద్దరు ప్రయాణికుల నుంచి 1.725 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది. దాని విలువ రూ. 1.03 కోట్లు ఉంటుందని చెప్పింది.

    మొదటి కేసులో కువైట్ నుంచి దుబయ్ మీదుగా హైదరాబాద్ వచ్చిన ఒక ప్యాసింజర్ నుంచి రూ. 72.55 లక్షల విలువ చేసే 1.255 కేజీలు బంగారం లభ్యమైంది.

    కస్టమ్స్ చట్టం ప్రకారం ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.

    బంగారం

    ఫొటో సోర్స్, ANI

    రెండో కేసులో కువైట్ నుంచి దోహా మీదుగా హైదరాబాద్ చేరుకున్న మరో ప్యాసింజర్ నుంచి రూ. 30.51 లక్షల విలువ చేసే 500 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించినట్లు ఏఎన్‌ఐ తెలిపింది.

    దీనిపై విచారణ జరుగుతున్నట్లు చెప్పింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. గర్భిణులు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే పిల్లలు ఎర్రగా పుడతారా? చర్మం రంగు ఎలా ఏర్పడుతుందో తెలుసా?

  13. ఆస్ట్రేలియా బీచ్‌కు కొట్టుకొచ్చిన ఈ శకలం భారత రాకెట్‌దేనా? ఇస్రో చీఫ్ సోమనాథ్ ఏమన్నారు?