ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాలతో రేపు మళ్లీ కలుద్దాం...గుడ్ నైట్
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ గాయాలు కాలేదని రైల్వే అధికారులు చెప్పారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాలతో రేపు మళ్లీ కలుద్దాం...గుడ్ నైట్
మధ్యప్రదేశ్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు బ్యాటరీ బాక్సులో మంటలు చెలరేగాయి.
దీంతో రైలును వెంటనే నిలిపి మంటలను ఆర్పివేశారు.
ఈ ఘటన కుర్వాయి కెథోరా స్టేషన్‌లో జరిగింది.
ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు చెప్పారు.
మంటలు ఆర్పేశాక క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రైలును నడుపుతామని భారత రైల్వే తెలిపింది.
వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో స్పెయిన్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ కొత్త చాంపియన్‌గా అవతరించాడు.
ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అల్కరాజ్, అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జొకోవిచ్‌ను ఓడించి చరిత్ర సృష్టించాడు.
పురుషుల సింగిల్స్ ఫైనల్లో వరల్డ్ నంబర్‌వన్, టాప్ సీడ్ ప్లేయర్ అల్కరాజ్ 1-6, 7-6 (8-6), 6-1, 3-6, 6-4తో రెండో సీడ్ జొకోవిచ్(సెర్బియా)పై గెలుపొందాడు.
ఈ ఓటమితో వరుసగా అయిదోసారి వింబుల్డన్ టైటిల్, ఓవరాల్‌గా 24వ గ్రాండ్‌స్లామ్‌ను గెలవాలనుకున్న జొకోవిచ్‌కు నిరాశ ఎదురైంది.
నిరుడు యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకోవడం ద్వారా కార్లోస్ అల్కరాజ్ ప్రపంచ నంబర్-1గా నిలిచాడు.
జొకోవిచ్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లను గెలుచుకొని, రాఫెల్ నాదల్ 22 గ్రాండ్‌స్లామ్ విజయాల రికార్డును అధిగమించి, పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించిన ఆటగాడిగా అవతరించాడు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం