వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బ్యాటరీ బాక్సులో మంటలు

ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ గాయాలు కాలేదని రైల్వే అధికారులు చెప్పారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాలతో రేపు మళ్లీ కలుద్దాం...గుడ్ నైట్

  2. టమాటా ధరలు మండిపోవడానికి కారణాలివే...

  3. పశ్చిమ దేశాలను హడలెత్తిస్తున్న ఎండలు, భారత్, దక్షిణ కొరియాల్లో వరదలు.....

  4. బెంగళూరు సమావేశం: విపక్షాల్లో ఇన్ని సమస్యలుంటే మోదీని ఎదుర్కోవడం సాధ్యమేనా?

  5. పిల్లలే పుట్టరనుకున్న ఆ నటికి సాధారణ గర్భం, ఎలా సాధ్యమైంది

  6. వలసలు : అర్ధరాత్రి అక్రమంగా పడవ ప్రయాణం, నడిసముద్రంలో పెట్రోల్ అయిపోయింది. తర్వాత ఏం జరిగిందంటే...

  7. హైదరాబాద్‌లో కూరగాయల ధరలు పెరిగిపోవడానికి కారణం ఇదేనా

  8. ఇందిరా గాంధీని వాజ్‌పేయి దుర్గతో పోల్చారనేది నిజమేనా?

  9. ‘10 లక్షలు పెట్టుబడి పెడితే సంవత్సరానికి కోటి రూపాయలు వస్తుందన్నారు.. నగలు తాకట్టుపెట్టి ఇచ్చాను’

  10. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బ్యాటరీ బాక్సులో మంటలు

    వందే భారత్ ఎక్స్‌ప్రెస్

    ఫొటో సోర్స్, ANI

    మధ్యప్రదేశ్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు బ్యాటరీ బాక్సులో మంటలు చెలరేగాయి.

    దీంతో రైలును వెంటనే నిలిపి మంటలను ఆర్పివేశారు.

    ఈ ఘటన కుర్వాయి కెథోరా స్టేషన్‌లో జరిగింది.

    ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు చెప్పారు.

    మంటలు ఆర్పేశాక క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రైలును నడుపుతామని భారత రైల్వే తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  11. వింబుల్డన్‌: ఫైనల్లో జొకోవిచ్‌కు షాక్, కొత్త చాంపియన్ కార్లోస్ అల్కరాజ్

    కార్లోస్ అల్కరాజ్

    ఫొటో సోర్స్, Getty Images

    వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో స్పెయిన్‌ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ కొత్త చాంపియన్‌గా అవతరించాడు.

    ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అల్కరాజ్, అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జొకోవిచ్‌ను ఓడించి చరిత్ర సృష్టించాడు.

    పురుషుల సింగిల్స్ ఫైనల్లో వరల్డ్ నంబర్‌వన్, టాప్ సీడ్ ప్లేయర్ అల్కరాజ్ 1-6, 7-6 (8-6), 6-1, 3-6, 6-4తో రెండో సీడ్ జొకోవిచ్(సెర్బియా)పై గెలుపొందాడు.

    ఈ ఓటమితో వరుసగా అయిదోసారి వింబుల్డన్ టైటిల్‌, ఓవరాల్‌గా 24వ గ్రాండ్‌స్లామ్‌ను గెలవాలనుకున్న జొకోవిచ్‌కు నిరాశ ఎదురైంది.

    నొవాక్ జొకోవిచ్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ఫైల్ ఫొటో

    నిరుడు యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకోవడం ద్వారా కార్లోస్ అల్కరాజ్ ప్రపంచ నంబర్-1గా నిలిచాడు.

    జొకోవిచ్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లను గెలుచుకొని, రాఫెల్ నాదల్ 22 గ్రాండ్‌స్లామ్ విజయాల రికార్డును అధిగమించి, పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించిన ఆటగాడిగా అవతరించాడు.

  12. యూఏఈ: ఈ అరబ్ దేశంలో ప్రధాని మోదీ అన్నిసార్లు ఎందుకు పర్యటించారు?