దక్షిణ కొరియా: సొరంగంలోకి భారీగా వరద నీరు, తొమ్మిది మృతదేహాలు లభ్యం

అయితే, ఇంకా ఎంతమంది లోపల ఉన్నారన్నది స్పష్టమైన వివరాలు లేవు. 15 వరకు వాహనాలు చిక్కుకుని ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. నేపాల్ మీదుగా భారత్‌లోకి టమాటాల స్మగ్లింగ్, ఇది ఎలా జరుగుతోందంటే....

  3. డాక్టర్‌కే మా బంధం అర్ధం కాలేదు, సామాన్యులకు ఎలా తెలుస్తుంది?: కేరళ యువతుల ఆవేదన

  4. గిన్నిస్ రికార్డు కోసం 7 రోజులు ఏడ్చాడు, చివరకు ఏమైందంటే....

  5. అస్పర్టేమ్ : టూత్‌పేస్ట్ నుంచి కోక్ వరకు... అనేక పదార్ధాల్లో ఉండే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం తేల్చింది?

  6. చెన్నై: బుకింగ్ క్యాన్సిల్ చేస్తే ఓలా, ఉబర్ ట్యాక్సీ డ్రైవర్లకు జరిమానా

    ట్యాక్సి బుకింగ్

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    ట్యాక్సిలు, ఆటోలు బుక్ అయి తర్వాత క్యాన్సిల్ చేస్తే డ్రైవర్లపై జరిమానా విధించడం ప్రారంభించారు చెన్నై మెట్రోపాలిటన్ ట్రాఫిక్ పోలీసులు.

    ఒకవేళ డ్రైవర్ బుకింగ్‌ను క్యాన్సిల్ చేస్తే, సమీపంలోని పోలీసు స్టేషన్‌లో ప్రయాణికులు ఫిర్యాదు చేయొచ్చని చెన్నై ట్రాఫిక్ పోలీసు జాయింట్ కమిషనర్ చెప్పారు.

    అయితే, ప్రస్తుతం దీనిపై ఎన్ని ఫిర్యాదులు నమోదయ్యాయో తన వద్ద డేటా లేదన్నారు.

    గత నెలలో కేవలం ఐదుగురు డ్రైవర్లపైనే ఈ జరిమానా విధించామని ట్రాఫిక్ పోలీసు అధికారులు చెప్పారు.

    ఫిర్యాదు అందిన తర్వాత డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

    వాహన సవరణ చట్టం ప్రకారం, రైడ్‌కు నిరాకరించే టూవీలర్లు, త్రీవీలర్లపై జరిమానా విధించే ప్రొవిజన్ ఉందని చెన్నై మెట్రోపాలిటన్ ట్రాఫిక్ పోలీసు ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ చెప్పారు.

  7. దక్షిణ కొరియా: సొరంగంలోకి భారీగా వరద నీరు, తొమ్మిది మృతదేహాలు లభ్యం

    దక్షిణ కొరియాలో భారీ వర్షాలు

    ఫొటో సోర్స్, Reuters

    దక్షిణ కొరియాలో కుండపోతగా కురుస్తోన్న వర్షాలతో ఒక్కసారిగా సొరంగంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.

    ఈ వరద నీటితో 685 మీటర్ల పొడవైన ఈ టన్నెల్‌లో చాలామంది చిక్కుకుపోయారు.

    ఇందులో నుంచి ఇప్పటి వరకు తొమ్మిది మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు.

    అయితే, ఇంకా ఎంతమంది లోపల ఉన్నారన్నది స్పష్టమైన వివరాలు లేవు.

    15 వరకు వాహనాలు చిక్కుకుని ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.

    గత కొన్ని రోజులుగా దక్షిణ కొరియాలో కురుస్తున్న భారీ వర్షాలతో, చాలా ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడుతున్నాయి.

    ఈ వర్షాల వల్ల ఇప్పటి వరకు 26 మంది చనిపోయారు. 10 మంది వరద నీటిలో గల్లంతయ్యారు.

  8. పార్కిన్సన్స్ వ్యాధి: లక్షణాలు కనిపించడానికి ఏడేళ్ల ముందే స్మార్ట్ వాచ్‌లు చెప్పేస్తాయా?

  9. మ‌హిళ‌ల‌కు, ఎస్సీ, ఎస్టీలకు రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల లోన్ - ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

  10. విశాఖపట్నం: రొయ్యల ధరలు ఎందుకు తగ్గిపోతున్నాయి

  11. ‘వెయిట్ లాస్’ ఇంజెక్షన్ల వల్ల ఇలా జరుగుతుందా?

  12. నేడు భారతరత్న అరుణా అసఫ్ అలీ జయంతి

    అరుణా అసఫ్ అలీ

    ఫొటో సోర్స్, National Book Trust

    అరుణా అసఫ్ అలీ

    ఫొటో సోర్స్, National Book Trust

    అరుణా అసఫ్ అలీ

    ఫొటో సోర్స్, Getty Images

    అరుణా అసఫ్ అలీ

    ఫొటో సోర్స్, National Book Trust

    అరుణా అసఫ్ అలీ

    ఫొటో సోర్స్, National Book Trust

  13. సంభోగం తరువాత ఆడ అనకొండ మగపామును ఎందుకు చంపుతుంది?

  14. రివెంజ్ పోర్న్ కేసులో దోషికి 'ఎవరికీ వేయని శిక్ష' వేసిన కోర్టు

  15. సంగీతా ఫోగట్: జంతర్ మంతర్ వద్ద ఆందోళనల్లో పాల్గొన్న రెజ్లర్‌కు బుడాపెస్ట్ ర్యాంకింగ్ సిరీస్‌లో కాంస్య పతకం

    సంగీతా ఫోగట్

    ఫొటో సోర్స్, @sangeeta_phogat

    శనివారం బుడాపెస్ట్ ర్యాంకింగ్ సిరీస్‌లో 59 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సంగీతా ఫోగట్ కాంస్య పతకం సాధించారు.

    హంగేరీ రెజ్లర్ విక్టోరియా బోరోస్‌ను 6-2 తేడాతో ఓడించి ఆమె ఈ పతకం దక్కించుకున్నారని ఏఎన్‌ఐ వార్తాసంస్థ తెలిపింది.

    రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు నిర్వహించిన రెజ్లర్లలో ఆమె ఒకరు.

    సంగీత లోగడ రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్స్ గెలిచారు.

    బుడాపెస్ట్ ర్యాంకింగ్ సిరీస్‌లో తొలి రౌండ్‌లో అమెరికా రెజ్లర్ జెన్నిఫర్ పేజ్ రోజర్స్ చేతిలో ఓడిపోయిన సంగీత, తర్వాత పుంజుకున్నారు. అయితే సెమీ ఫైనల్స్‌లో ఆమెను పోలండ్‌ క్రీడాకారిణి మాగ్దలీనా యుర్స్‌జులా గ్లోడెక్ 6-4 తేడాతో ఓడించారు.

    అనంతరం సంగీత కాంస్య పతకం కోసం హంగేరీ రెజ్లర్‌ విక్టోరియా బోరోస్‌తో తలపడ్డారు.

    బుడాపెస్ట్ ర్యాంకింగ్ సిరీస్‌ను ‘పోల్యక్ ఇమ్రే అండ్ వార్గా జనోస్ మెమోరియల్ రెజ్లింగ్ టోర్నమెంట్‌’గా కూడా పిలుస్తారు.