శాఫ్ ఫుట్‌బాల్ చాంపియన్‌గా తొమ్మిదోసారి భారత్, పెనాల్టీ షూటౌట్‌లో కువైట్‌పై గెలుపు

దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌ (శాఫ్)లో భారత్ తొమ్మిదోసారి విజేతగా నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో భారత్ 5-4తో కువైట్‌పై పెనాల్టీ షూటౌట్‌లో గెలిచింది.

లైవ్ కవరేజీ

  1. ‘ఎంతోమంది పెళ్లి కొడుకులు నన్ను తిరస్కరించారు.. కట్నం ఇవ్వబోమని చెప్పడమే దానికి కారణం’

  2. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  3. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న అజిత్ పవార్

    అజిత్ పవార్

    ఫొటో సోర్స్, YEARS

    అజిత్ పవార్ జూలై 2న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

    ఆయనతో పాటు 8 మంది ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు.

    జూన్ 30న అజిత్ పవార్ 40 మంది ఎమ్మెల్యేల సంతకాలతో ఒక లేఖను తీసుకున్నారు. ఈ లేఖను అజిత్ పవార్ గ్రూప్ తరఫున ఎన్నికల సంఘానికి పంపారు.

    ఎన్‌సీపీ ఎన్నికల గుర్తు గడియారంగా పేర్కొంటూ అజిత్ పవార్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి జూలై 5న ఒక లేఖ అందింది.

    అంతేకాక, ఎన్‌సీపీ అధ్యక్షుడిగా అజిత్ పవార్‌ నియామకంపై కూడా ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

    ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రమాణం స్వీకారం చేయడానికి రెండు రోజుల ముందు అజిత్ పవార్ తరఫున ఎన్నికల సంఘానికి ఈ పిటిషన్‌ను సమర్పించారు.

    అజిత్ పవార్ తరఫున ఎన్నికల సంఘానికి అందిన ఈ పిటిషన్‌లో ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఉంది.

  4. జార్ఖండ్: తబ్రేజ్ అన్సారీ మూక హత్య కేసులో 10 మంది దోషులకు పదేళ్ల జైలు శిక్ష

  5. ఉమ్మడి పౌర స్మృతిని బీజేపీ మిత్రపక్షాలు ఏ రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తున్నాయి?

  6. వరంగల్ జిల్లా: ప్రేమించి పెళ్ళి చేసుకున్న యువకుడి ఇంటిని రాత్రికి రాత్రే తగులబెట్టారు...

  7. భూమి అక్షం 80 సెంటీమీటర్లు తూర్పు వైపు వంగిపోయింది... ఎందుకిలా జరిగింది, దీని వల్ల ఏమవుతుంది?

  8. ఇజ్రాయెల్-పాలస్తీనా: జెనిన్ శరణార్థి శిబిరం ఎక్కడుంది? దీనిపై ఇజ్రాయెల్ ఎందుకు దాడికి దిగింది?

  9. సినిమాల్లో నటించే జంతువులను ఎలా ఎంపిక చేస్తారు? వీటికి రోజుకు ఎంతిస్తారు?

  10. నిర్మల్ కొయ్య బొమ్మలకు ప్రాణం పోసే ఆ చెట్టు ఏమిటి? నంబర్లు వేసి కాపాడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది?

  11. ఫిలడెల్ఫియా: సాయుధుడి కాల్పుల్లో అయిదుగురు మృతి, ఇద్దరు పిల్లలకు గాయాలు, గ్యారెత్ ఎవాన్స్, మ్యాక్స్ మట్జా, బీబీసీ న్యూస్

    ఫిలడెల్ఫియా

    ఫొటో సోర్స్, Getty Images

    అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో 40 ఏళ్ల సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు.

    ఈ ఘటనలో అయిదుగురు వ్యక్తులు చనిపోగా, ఇద్దరు పిల్లలు గాయాల పాలయ్యారు.

    బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి కాల్పులకు పాల్పడిన అనుమానితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

    అతని వద్ద ఏఆర్-15 రైఫిల్‌తో పాటు ఒక హ్యాండ్‌గన్, స్కానర్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

    మృతుల వయస్సు 15 నుంచి 59 ఏళ్ల మధ్య ఉంటుందని, వారితో నిందితుడికి ఎలాంటి పరిచయం లేదని పోలీసులు చెప్పారు.

    స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8:40 గంటలకు ఈ ఘటన జరిగింది.

  12. శాఫ్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్: తొమ్మిదోసారి విజేతగా భారత్

    శాఫ్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్

    ఫొటో సోర్స్, ANI

    శాఫ్ పుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో సునీల్ ఛెత్రి సారథ్యంలోని భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది.

    బెంగళూరులో మంగళవారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 5-4తో కువైట్‌పై పెనాల్టీ షూటౌట్‌లో విజయం సాధించింది.

    దీంతో భారత్ తొమ్మిదోసారి శాఫ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను అందుకుంది.

    మ్యాచ్‌లో నిర్ణీత సమయానికి భారత్, కువైట్ జట్లు చెరో గోల్ చేసి 1-1తో సమంగా నిలిచాయి.

    మొదట కువైట్ జట్టు గోల్ చేసి ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్ 14వ నిమిషంలో కువైట్ తరఫున అల్‌బలూషి గోల్ చేశాడు.

    మ్యాచ్ 39వ నిమిషంలో భారత ఆటగాడు లాలియన్‌జులా గోల్ చేయడంతో స్కోరు సమమైంది. తర్వాత ఇది పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది.

    పెనాల్టీ షూటౌట్‌లో నిర్ణీత అయిదు షాట్‌ల తర్వాత ఇరు జట్లు 4-4తో సమంగా నిలిచాయి. ఆరో షాట్‌లో భారత్ గోల్ చేయడంతో పాటు కువైట్ గోల్‌ను సమర్థంగా అడ్డుకుంది. దీంతో విజయం భారత్ సొంతమైంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది