తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, ఏపీ పార్టీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పురందేశ్వరిలను నియమిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రకటించారు.
లైవ్ కవరేజీ
లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ఆదివాసీ యువకుడిపై మూత్రం పోసిన వ్యక్తి అరెస్ట్... వైరల్ వీడియోపై తీవ్రంగా స్పందించిన మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్
శ్రీకాళహస్తి పాలకోవా టేస్టే వేరు... ఇది ఎందుకంత స్పెషల్?
బిహార్‌లోని ఈ రెడ్ లైట్ ఏరియా ఎందుకు వార్తల్లోకెక్కింది?
ట్విటర్ Vs. థ్రెడ్స్: ఎలాన్ మస్క్ ట్రిక్స్ ఎందుకు పారడం లేదు... మెటా యజమాని జుకర్‌బర్గ్ కొత్త యాప్‌తో పోటీ ఎలా ఉండబోతోంది?
ముస్లిం పాలకులు విదేశీయులైతే మరి మౌర్యులు ఎవరు?
హిట్లర్ నరమేధం నుంచి తప్పించుకున్న ఈ ముగ్గురు అమ్మాయిలు ఎవరు? 84 ఏళ్ల తర్వాత వీడిన ఫోటో మిస్టరీ
తెలంగాణ, ఏపీ బీజేపీ అధ్యక్షులుగా కిషన్ రెడ్డి, పురందేశ్వరి

ఫొటో సోర్స్, FACEBOOK
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి జీ కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి పురందేశ్వరి నియమితులయ్యారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుపుతూ భారతీయ జనతా పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.
వీరితో పాటు జార్ఖాండ్ రాష్ట్ర అధ్యక్ష పదవికి మాజీ సీఎం బాబులాల్ మరాండిని నియమించగా, పంజాబ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సునిల్ జాకఢ్ నియమితులయ్యారు.
దగ్గుపాటి పురందేశ్వరి గతంలో యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.
2014లో పురందేశ్వరి బీజేపీలో చేశారు. ప్రస్తుతం సోము వీర్రాజు స్థానంలో పురందేశ్వరిని నియమించింది బీజేపీ పార్టీ.
వీరి నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలుపుతూ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
వీరితో పాటు ఈటల రాజేందర్‌ను తెలంగాణలో ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా నియమించారు.
టీ గ్లాసులు కడిగే యంత్రం
ఆంబర్‌గ్రీస్: చనిపోయిన తిమింగలం కడుపులో బయటపడ్డ ఈ రాయి విలువ రూ.4 కోట్లు.. దీనికి ఎందుకంత ధర?
తల్లి ప్రాణాన్ని ఆరేళ్ల చిన్నారి రెండుసార్లు అలెక్సా సాయంతో ఎలా కాపాడింది?
మహిళలకు 3 లక్షల రుణం.. దళితులకు వడ్డీ కూడా ఉండదు.. ఈ కేంద్ర పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
శాన్ ఫ్రాన్సిస్కో: భారత కాన్సులేట్‌పై ఖలిస్తాన్ మద్దతుదారుల దాడి, ఖండించిన అమెరికా

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ (ఫైల్ ఫొటో) అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న భారత కాన్సులేట్‌పై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఈ దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది.
కొంతమంది వ్యక్తులు కాన్సులేట్‌లో నిప్పు పెడుతున్న వీడియోను స్థానిక టీవీ చానెల్ దియా టీవీ షేర్ చేసింది.
ఆ వీడియోను ఖలిస్తాన్ మద్దతుదారులే విడుదల చేసినట్లు దియా టీవీ పేర్కొంది.
బీబీసీ స్వతంత్రంగా ఈ వీడియోను ధ్రువీకరించలేకపోయింది.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 1:30-2:30 గంటల మధ్య జరిగింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు.
ఈ ఘటనలో పెద్దగా నష్టం జరగలేదని, సిబ్బందికి గాయాలేమీ కాలేదనే వార్తలు వచ్చాయి.
దీనిపై అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందించారు. భారత కాన్సులేట్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
దౌత్య కార్యాలయాలు, విదేశీ దౌత్య ప్రతినిధులపై దాడికి దిగడం, హింసకు పాల్పడటం అమెరికాలో నేరంగా పరిగణిస్తామని ఆయన ట్వీట్ చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
