ఎన్సీపీలో తిరుగుబాటు నేతలపై శరద్ పవార్ చర్యలు

ఇలాంటి చర్యలు ప్రతిపాదించినందుకు జయంత్ పాటిల్, జితేంద్ర అవహద్‌ల సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా తాను స్పీకర్‌కు విజ్ఞప్తి చేసినట్లు అజిత్ పవార్ వెల్లడించారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం.

    మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....

    గుడ్ నైట్.

  2. ఫ్రాన్స్: వీధుల్లోని నిరసనకారులు ఎందుకు వెనక్కి తగ్గడం లేదు?

  3. ముంబయి: భూగర్భంలో 30 మీటర్ల లోతున మెట్రో పనులు

  4. ట్విటర్‌‌కు రూ.50 లక్షల జరిమానా విధించిన కర్ణాటక హైకోర్టు, ఈ తీర్పు వాక్‌ స్వాతంత్ర్యాన్ని దెబ్బతీస్తుందా?

  5. ఎన్సీపీలో తిరుగుబాటు నేతలపై శరద్ పవార్ చర్యలు

    శరద్ పవార్

    ఫొటో సోర్స్, ANI

    ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తమ పార్టీలో తిరుగుబాటు చేసి ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతిస్తున్న నేతలపై చర్యలు ప్రారంభించారు.

    ఎంపీలు ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరేలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు శరద్ పవార్ ట్విటర్‌లో తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకే వీరిపై చర్యలు తీసుకున్నట్లు పవార్ తెలిపారు.

    కొద్ది రోజుల కిందటే ప్రఫుల్ పటేల్‌ను ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పవార్ నియమించారు.

    వీరిద్దరిపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్సీపీ నేత, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే సోమవారంనాడు శరద్ పవార్‌కు లేఖ రాశారు.

    మరోవైపు, అజిత్ పవార్ సహా తిరుగుబాటు ఎమ్మెల్యేలపై చర్యలకు సిఫారసు చేస్తూ ఎన్సీపీ మహారాష్ట్ర క్రమశిక్షణా కమిటీ తీర్మానం చేసింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఎన్సీపీ మహారాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ ఒక ప్రకటన విడుదల చేశారు.

    "వీరంతా జూలై 2న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు, పార్టీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు" అని పేర్కొన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    జయంత్ పాటిల్‌పై చర్యలు తీసుకుంటాం: అజిత్ పవార్

    ఈ వ్యవహారంపై స్పందించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, తమ 9 మంది ఎమ్మెల్యేలపై ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ క్రమశిక్షణా చర్యలను ప్రతిపాదించినట్లు తనకు మీడియా రిపోర్టుల ద్వారా తెలిసిందని అన్నారు.

    ఇలాంటి చర్యలు ప్రతిపాదించినందుకు జయంత్ పాటిల్, జితేంద్ర అవహద్‌ల సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా తాను స్పీకర్‌కు విజ్ఞప్తి చేసినట్లు అజిత్ పవార్ వెల్లడించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  6. వెయిట్‌ లాస్: బరువు తగ్గించుకునే విషయంలో 10 అపోహలు, వాస్తవాలు ఇవే...

  7. ముత్తురాజా: వేధించారంటూ శ్రీలంకకు గిఫ్ట్‌గా ఇచ్చిన ఏనుగును వెనక్కి తీసుకున్న థాయ్‌లాండ్, ఏమిటీ వివాదం

  8. యూనిఫామ్ సివిల్ కోడ్: విపక్షాల ఐక్యతను మోదీ ఈ వ్యూహంతో దెబ్బతీస్తారా?

  9. ఫోన్ వేడెక్కితే ఏమవుతుంది? వేడెక్కకూడదంటే ఏంచేయాలి?

  10. కారు ఆపనందుకు ఫ్రాన్స్ పోలీసులు కాల్చిచంపిన 17 ఏళ్ల నహెల్ ఎవరు? అతడు ఏం చేస్తుండేవాడు?

  11. భారత్‌లో కొత్త రమ్ వెల్లువెత్తనుందా? రుచి కోసం ఏం చేస్తున్నారు?

  12. యాషెస్ సిరీస్: రెండో టెస్టులో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా గెలుపు

    బెన్ స్టోక్స్

    ఫొటో సోర్స్, Getty Images

    యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు జోరు కొనసాగించింది.

    లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌పై 43 పరుగులతో గెలుపొందింది.

    ఈ విజయంతో సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

    ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకుంది.

    తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 416 పరుగులకు ఆలౌటైంది.

    స్టీవ్ స్మిత్ (184 బంతుల్లో 110; 15 ఫోర్లు) సెంచరీ చేశాడు. డేవిడ్ వార్నర్ (66; 8 ఫోర్లు, 1 సిక్స్), ట్రావిస్ హెడ్ (77; 14 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు.

    అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 325 పరుగులకు ఆలౌటైంది.

    బెన్ డకెట్ (98) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.

    రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 279 పరుగులకు ఆలౌటవ్వడంతో, ఇంగ్లండ్ ముందు 371 పరుగుల లక్ష్యం నిలిచింది.

    లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 327 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియాకు 43 పరుగులతో గెలుపు దక్కింది.

    ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 214 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 155 పరుగులు చేశాడు.

    బెన్ డకెట్ (83; 9 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు.

    ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, జోష్ హాజెల్‌వుడ్ తలా మూడు వికెట్లు తీసుకున్నారు.

    యాసెస్ సిరీస్‌లో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఉన్నాయి.

  13. వెస్టిండీస్: ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఈ జట్టు వరల్డ్ కప్‌ 2023కి ఎందుకు అర్హత సాధించలేకపోయింది?