ఇది గూగ్లీ కాదు, దోపిడీ: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్

తిరుగుబాటు నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలంతా కలిసి నిర్ణయం తీసుకుంటారని పవార్ అన్నారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్

  2. అజిత్ పవార్ తిరుగుబాటు: శరద్ పవార్ మరో ఉద్ధవ్ ఠాక్రే అవుతారా?

  3. ఫ్రాన్స్: అల్లర్లు, అరెస్టులు, హింసాకాండకు 3 ప్రధాన కారణాలివే...

  4. ఇది గూగ్లీ కాదు, దోపిడీ: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్

    శరద్ పవార్

    ఫొటో సోర్స్, ANI

    ఏక్‌నాథ్ శిందే ప్రభుత్వంలో అజిత్ పవార్ వర్గం చేరడంపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. ఇది గూగ్లీ అయితే కాదని, దోపిడీ అని అన్నారు. ఇది చిన్న విషయమేం కాదన్నారు పవార్.

    ''రెండు రోజుల కిందటే ప్రధాని నరేంద్ర మోదీ ఎన్సీపీ గురించి రెండు విషయాలు చెప్పారు. సాగునీటి రంగంలో ఫిర్యాదులు, అవినీతి ఆరోపణలను ఆయన ప్రస్తావించారు. ఎన్సీపీ 'అంతమైపోయిన పార్టీ' అన్నారు.

    మోదీ ప్రకటన తరువాత కొంతమందిలో అసౌకర్యం మొదలైంది. వారిలో కొందరు ఈడీ చర్యలను కూడా ఎదుర్కొంటున్నారు. నా సహచరులు కొందరు ప్రమాణ స్వీకారం చేసినందుకు సంతోషిస్తున్నా. దీన్నిబట్టి (ఎన్డీయే ప్రభుత్వంలో చేరడం) ఆరోపణలన్నీ క్లియర్ అయినట్లు స్పష్టమవుతోంది. మోదీకి కృతజ్ఞతలు. ఈ సమస్య నా ఇంటికి సంబంధించినది కాదు, ఇది ప్రజల సమస్య. వెళ్లిపోయిన వారి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నా'' అని శరద్ పవార్ తెలిపారు.

    తిరుగుబాటు నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలంతా కలిసి నిర్ణయం తీసుకుంటారని పవార్ అన్నారు.

    ''నేను అధ్యక్షుడిగా ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరేలను నియమించాను. కానీ వారు తమ బాధ్యతలను సరిగా నిర్వహించలేదు. వారిపై చర్యలు తీసుకోవాలి'' అని అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. ఎన్సీపీ పార్టీగానే మేం ఈ ప్రభుత్వంలో భాగమయ్యాం: అజిత్ పవార్

    అజిత్ పవార్

    ఫొటో సోర్స్, ANI

    అభివృద్ధి కోసమే ప్రధాని మోదీకి మద్దతిస్తున్నామని ఎన్సీపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు.

    ''ఈ రోజు మాలో కొంతమంది ప్రమాణం స్వీకారం చేశారు. మరోసారి మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. మరికొందరు ప్రమాణ స్వీకారం చేస్తారు. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి ప్రధాని మోదీ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతివ్వాలని మేం అనుకున్నాం. శుక్రవారం ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశాను. నా పార్టీ మీటింగ్‌లో పార్టీ కోసం నా ఉద్దేశాలను స్పష్టంగా చెప్పాను. మేం మహారాష్ట్రలో సమ్మిళిత అభివృద్ధిని కోరుకుంటున్నాం. ఈ నిర్ణయానికి పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది మద్దతిచ్చారు. ఎన్సీపీ పార్టీగా మేం ఈ ప్రభుత్వంలో భాగమయ్యాం. వచ్చే ఎన్నికల్లో ఎన్సీపీ సభ్యులుగా, ఎన్సీపీ పార్టీ గుర్తుపై పోటీ చేస్తాం'' అని అజిత్ పవార్ తెలిపారు.

    ''ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావడానికి ప్రయత్నిస్తున్నాయి, అయితే ఒక్కొక్కటి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ సమావేశాల ద్వారా వచ్చేదేం లేదు.'' అని అజిత్ పవార్ అన్నారు.

  6. ఓటొమన్: ఉంపుడుగత్తెలు, బానిసలు... ఈ రాజ్య వారసత్వ రక్త చరిత్రలో వీరిదే కీలక పాత్ర

  7. ఎలుగుబంటి ఎదురుపడితే ఏం చేయాలి?

  8. ఇది త్రిబుల్ ఇంజిన్ ప్రభుత్వం: సీఎం ఏక్‌నాథ్ శిందే

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    కేబినెట్‌లో సీట్ల పంపకంపై చర్చించేందుకు ఇంకా టైమ్ ఉందని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే అన్నారు.

    అజిత్ పవార్ ప్రభుత్వంలో చేరిన అనంతరం ఏక్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రను అభివృద్ధి చేసేందుకు వాళ్లు తమతో కలిసి వచ్చేందుకు సిద్ధమయ్యారని అజిత్ పవార్ వర్గాన్ని ఉద్దేశించి అన్నారు.

    లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు 4-5 సీట్లు వచ్చాయి, ఈసారి ఆ సీట్లు కూడా సాధించలేరని వ్యాఖ్యానించారు ఏక్‌నాథ్.

    తమ ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారని, డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఇప్పుడు త్రిబుల్ ఇంజిన్ గవర్నమెంట్ అయిందని ఆయన తెలిపారు.

    మరోవైపు, తమ ప్రభుత్వ బలం మరింత పెరుగుతుందని, ఎన్సీపీకి చెందిన మరింతమంది ఎమ్మెల్యేలు తమ ప్రభుత్వంలో చేరతారని ఏక్‌నాథ్ శిందే ప్రభుత్వంలోని మంత్రి ఉదయ్ సామంత్ వ్యాఖ్యానించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    అయితే, పార్టీలో చీలికలు వచ్చినంత మాత్రాన శరద్ పవార్ భయపడబోరని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన సంజయ్ రౌత్ అన్నారు.

    ఇలా పార్టీలను చీల్చి ప్రభుత్వాలను నిలబెట్టేకునే వారిని మహారాష్ట్ర ప్రజలు క్షమించబోరని ఆయన అన్నారు. శరద్ పవార్ తన పార్టీని త్వరలోనే పునర్నిర్మించుకోగలరని ఆయన వ్యాఖ్యానించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

  9. మహారాష్ట్ర: ఏక్‌నాథ్ శిందే ప్రభుత్వంలో చేరిన ప్రతిపక్ష ఎన్సీపీ నేత అజిత్ పవార్‌

    అజిత్ పవార్

    మహారాష్ట్రలో రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి. ప్రతిపక్ష నేత, ఎన్సీపీ సీనియర్ నాయకుడు శరద్ పవార్‌కు సోదరుడి కొడుకైన అజిత్ పవార్ పార్టీలో తిరుగుబాటు చేసి ఏక్‌నాథ్ శిందే ప్రభుత్వంలో చేరారు. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

    తన మద్ధతుదారులైన కొందరు ఎమ్మెల్యేలతో ఆయన ఆదివారం మధ్యాహ్నం రాజ్‌‌ భవన్‌కు చేరుకున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కూడా రాజ్‌భవన్‌కు వచ్చారు.

    ఒక్కసారిగా రాజకీయ నేతలు ఇలా రాజ్‌భవన్‌కు వెళ్లడం ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. అయితే, ఆ తర్వాత కొద్ది సేపటికే అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

    ఆయనతోపాటు మరో తిరుగుబాటు నేత, ఎన్సీపీ సీనియర్ నాయకుడు ఛగన్ భుజ్‌బల్ కూడా ప్రమాణం చేశారు. అజిత్ పవార్, భుజ్‌బల్‌ సహా మొత్తం 9 మంది ఎన్సీపీ‌కి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ‘అజిత్‌ పవార్‌కు పార్టీ అనుమతి లేదు’

    శిందే ప్రభుత్వంలో చేరడానికి పార్టీ నుంచి అజిత్ పవార్‌కు ఎలాంటి అధికారిక అనుమతి లేదని ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేశ్ చెచే అన్నారు. పార్టీకి చెందిన అన్ని పదవుల్లోని నేతలు, జిల్లా, తాలూకా అధ్యక్షులు, మహిళా నేతలంతా శరద్ పవార్ వెంటే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

    ఆపరేషన్ లోటస్‌లో భాగంగానే అజిత్ పవార్ పార్టీని ఎదిరించి ప్రభుత్వంలో చేరారని, ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయమని, పార్టీకి సంబంధం లేదని మహేశ్ అన్నారు.

  10. ఫ్రాన్స్‌: పారిస్ మేయర్ ఇంట్లోకి కారుతో గేటు ధ్వంసం చేస్తూ చొరబడిన నిరసనకారులు... అసలేం జరుగుతోంది?

  11. ఎలుగుబంటి ఎదురుపడితే బెదిరిపోకండి... ఇలా చేయండి

    ఎలుగుబంటి

    ఫొటో సోర్స్, Getty Images

    తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో ఎలుగుబంట్లు కనిపించడం సర్వసాధారణం.

    ఒక్కోసారి పరిసరాల్లోని పొలాలపైకి కూడా ఇవి వస్తుంటాయి. కొన్నిసార్లు కొందరిపై దాడులు కూడా చేస్తుంటాయి.

    మరి వీటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా?

  12. ట్విటర్ యూజర్లు చూసే ట్వీట్స్‌పై పరిమితి విధిస్తామన్న ఎలాన్ మస్క్

    ట్విటర్

    ఫొటో సోర్స్, Reuters

    ఇకపై యూజర్లందరూ అన్ని ట్వీట్‌లను చూసే వీల్లేకుండా ట్విటర్ కొత్త ఆంక్షలను తీసుకొచ్చింది. యూజర్లు నిర్దేశిత సంఖ్యలో మాత్రమే పోస్టులు చదవగలిగేలా తాత్కాలిక పరిమితి విధించింది.

    యూజర్లు ఒక రోజులో నిర్దేశిత సంఖ్యలోపు మాత్రమే ట్విటర్ పోస్టులను చదవగలిగేలా తాత్కాలికంగా పరిమితి విధించినట్లు సంస్థ యజమాని ఎలన్ మస్క్ తెలిపారు.

    అన్‌వెరిఫైడ్ అకౌంట్స్ ఉన్న యూజర్లు రోజుకి వెయ్యి పోస్టులను చదవగలరని, కొత్త అన్‌వెరిఫైడ్ అకౌంట్స్ యూజర్లు రోజుకి 500 పోస్టులను మాత్రమే చదవగలరని మస్క్ ట్వీట్ చేశారు.

    వెరిఫైడ్ అకౌంట్స్ ఉన్న యూజర్లకి రోజుకి 10 వేల పోస్టుల వరకూ చదివే అవకాశం ఉంది.

    మొదట ఇంకా కఠినమైన నిబంధనలు తెచ్చినప్పటికీ, కొత్త నిబంధనలను ప్రకటించడానికి ముందే కొద్దిగంటల వ్యవధిలోనే వాటిలో మార్పులు చేశారు.

    తీవ్రమైన డేటా స్క్రాపింగ్, సిస్టమ్ మ్యానిప్యులేషన్ వంటి సమస్యలను పరిష్కరించేందుకే తాత్కాలిక పరిమితులు విధిస్తున్నట్లు మస్క్ తెలిపారు.

    అయితే, ఇక్కడ సిస్టమ్ మ్యానిప్యులేషన్ ఎలా జరుగుతుందనే విషయాన్ని మస్క్ వివరించలేదు.

    దీన్ని తాత్కాలిక అత్యవసర చర్యగా అభివర్ణించారు.

    డేటా ఎక్కువగా వినియోగిస్తుండడం వల్ల సాధారణ యూజర్లకు సేవలు అందించడంలో సమస్యలు తలెత్తుతున్నాయని, చాలా మంది యూజర్లు లాగిన్ సమస్యలను ఎదుర్కొంటున్నారని మస్క్ వివరించారు.