నేను రాజీనామా చేయడం లేదు: మణిపుర్ సీఎం బీరేన్ సింగ్

‘ఇలాంటి క్లిష్ట సమయంలో నేనొక విషయం స్పష్టం చేయదలచుకున్నాను. ముఖ్యమంత్రి పదవికి నేను రాజీనామా చేయబోవడం లేదు’ అని మణిపుర్ సీఎం బీరేన్ సింగ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. బ్రెజిల్‌: బోల్సోనారోపై ఎనిమిదేళ్ల నిషేధం విధించిన సుప్రీం ఎలక్టోరల్ కోర్టు

    బోల్సోనారో

    ఫొటో సోర్స్, EPA

    బ్రెజిల్ మాజీ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో ఎనిమిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ దేశ 'సుప్రీం ఎలక్టోరల్ కోర్టు' నిషేధం విధించింది.

    నిరుడు అధ్యక్ష ఎన్నికలకు ముందు బోల్సోనారో 'అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న కేసు'లో ఎలక్టోరల్ కోర్టు ఆయన్ను దోషిగా తేల్చింది.

    ఎలక్ట్రానిక్ బ్యాలెట్‌లు హ్యాకింగ్, మోసానికి గురయ్యే అవకాశం ఉందని తప్పుడు ప్రచారం చేసి, బ్రెజిలియన్ ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

    ఈ నేపథ్యంలో కోర్టు ఆయనపై నిషేధం విధించింది. కాగా, తీర్పుపై బోల్సోనారో న్యాయవాదులు అప్పీల్ చేస్తారని భావిస్తున్నారు.

  3. జీవితాలతో ఆటాడుకుంటున్న ఆన్‌లైన్ గేమ్స్, రక్షించుకునేదెలా?

  4. కాలు కట్ చేసి మహిళను కాపాడారు.. ఎయిర్‌పోర్టు ట్రావెలేటర్‌లో ఇరుక్కుపోవడంతో ప్రమాదం

  5. డీఎంఆర్‌సీ: దిల్లీ మెట్రోలో ఇక మద్యం సీసాలు తీసుకెళ్లొచ్చు

    దిల్లీ మెట్రోలో ప్రయాణించేవారు ఇక నుంచి రెండు సీల్డ్ మద్యం బాటిళ్లు తీసుకొని వెళ్లేందుకు అనుమతి కల్పిస్తున్నట్లు దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) నిర్ణయించింది.

    ఈ మేరకు శుక్రవారం ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.

    గతంలో ఈ వెసులుబాటు దిల్లీ ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ లైన్‌లో మాత్రమే ఉంది.

    ఇపుడు దిల్లీ మెట్రో అంతటా వర్తింపజేసింది.

    సీఐఎస్ఎఫ్, డీఎంఆర్‌సీ అధికారుల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

    అయితే దిల్లీ మెట్రోలో మద్యం సేవించడం నిషేధం.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. ప్రధాని మోదీపై పొగడ్తల వర్షం కురిపించిన రష్యా అధ్యక్షుడు, సడెన్‌గా ఎందుకింత ప్రేమ?

  7. సాహితి ఫార్మా అగ్నిప్రమాదంలో ఇద్దరు మరణించారు: మంత్రి అమర్నాథ్

    Sahiti pharma fire accident

    అచ్చుతాపురం సెజ్‌లోని సాహితి ఫార్మాలో జరిగిన ప్రమాదంలో సత్తిబాబు, తిరుపతి అనే ఇద్దరు కార్మికులు మృతి చెందారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ చెప్పారు.

    మృతి చెందిన వారికి రూ. 25 లక్షలు చొప్పున నష్టపరిహారం అందిస్తామని, గాయపడి కేజీహెచ్‌లో చికిత్స తీసుకుంటున్న వారికి పూర్తి వైద్య సహాయం అందుతుందని తెలిపారు.

    ఫ్యాక్టరీలకు నెలనెలా సేఫ్టీ ఆడిటింగ్ నిర్వహిస్తున్నామని అయినప్పటికీ కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.

    ఉదయం 11 గంటలకు ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మాటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు.

    అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కలిసి చేసిన ప్రయత్నంతో మంటలు అదుపులోకి వచ్చాయి.

    ప్రస్తుతం ఫార్మాసిటీ చుట్టుపక్కల దట్టమైన పొగ అలముకొని ఉంది.

  8. పసూరీ: పాకిస్తాన్ పాటను బాలీవుడ్ సినిమాలో వాడడంపై భారత్‌లో ఏమంటున్నారు

  9. పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుంది? ఎవరెవరు లింక్ చేయాల్సిన అవసరం లేదు

  10. ఈటల రాజేందర్: ‘పార్టీ మారడంపై మళ్లీమళ్లీ అడగొద్దు.. కాంగ్రెస్, బీజేపీ రెండింట్లోనూ కేసీఆర్ కోవర్టులున్నారు’

    ‘పార్టీ మార్పుపై పదేపదే నాలాంటి వాడిని ప్రశ్నించకండి. పార్టీలు మార్చుడంటే బట్టలు మార్చినంత ఈజీ కాదు.

    వార్తలతో హైప్ క్రియేట్ చేసుకుంటే ప్రజల మద్దతు ఉన్నట్టు కాదు. అది నిజం అని కాంగ్రెస్ అనుకుంటే పొరబాటే.

    కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం.. దీన్ని ఎవరు సొమ్ము చేసుకుంటారో చూడాలి’ అన్నారు ఈటల రాజేందర్.

    కాంగ్రెస్, బీజేపీ రెండింటిలోనూ కేసీఆర్ కోవర్టులు ఉన్నారని ఈటల అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  11. బ్రేకింగ్ న్యూస్, బీరేన్ సింగ్: నేను రాజీనామా చేయను - తేల్చిచెప్పిన మణిపుర్ సీఎం

    biren singh

    ఫొటో సోర్స్, Getty Images

    మణిపుర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తాను రాజీనామా చేయబోవడం లేదని ప్రకటించారు.

    ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు.

    ‘ఇలాంటి క్లిష్ట సమయంలో నేనొక విషయం స్పష్టం చేయదలచుకున్నాను. ముఖ్యమంత్రి పదవికి నేను రాజీనామా చేయబోవడం లేదు’ అని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. బైజూస్: రాకెట్‌లా దూసుకెళ్లిన ఈ కంపెనీ ఎందుకింతలా పతనమైంది?

  13. పాన్‌ కార్డుతో ఆధార్‌ను రెండు నిమిషాల్లో లింక్ చేయండిలా...

  14. అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్‌లో అగ్నిప్రమాదం

    అచ్యుతాపురం సెజ్‌లో అగ్నిప్రమాదం

    అనకాపల్లిలోని అచ్యుతాపురం ఫార్మాసెజ్‌లో రియాక్టర్లు పేలాయి.

    ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిలో ఒకరిని అచ్యుతాపురం ప్రభుత్వం ఆసుపత్రిలో, మిగతా ఆరుగురిని అనకాపల్లి ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.

    గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉందని అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చెప్తున్నారు.

    ఈ ప్రమాదం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జరిగింది.

    ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇంకా మంటలు అదుపులోకి రాలేదు.

    మరికొన్ని ఫైర్ ఇంజన్లను సాహితీ ఫార్మాకు పంపిస్తున్నామని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు.

    మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పని చేస్తున్నాయి.

    ఇంకా మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్ లో 80 నుంచి 100 మంది వరకు కార్మికులు ఉంటారని సాహితీ ఫార్మాలో పని చేస్తున్న కార్మికులు చెప్తున్నారు.

    ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద శబ్ధం వచ్చిందని, దీంతో ప్లాంట్ లో ఉన్నవారంతా బయటకు పరుగులు తీశామని తెలిపారు.

    ప్రమాద సంఘటనతో సమీపంలో ఉన్న గ్రామాల్లోని ప్రజలు కూడా భయందోళనకు గురవుతున్నారు.

  15. 'కారు ఆపలేదని నా ఒక్కగానొక్క కుమారుడిని కాల్చి చంపేస్తారా?' - వీడియోలో పోలీసులను నిలదీసిన నహెల్ తల్లి

  16. తమిళనాడు: మంత్రిని డిస్మిస్ చేసిన గవర్నర్... వ్యతిరేకించిన సీఎం స్టాలిన్

    తమిళనాడు

    ఫొటో సోర్స్, ANI

    తమిళనాడు సీఎం స్టాలిన్ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న వి సెంథిల్ బాలాజీని మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఇచ్చిన ఉత్తర్వుల అమలు వాయిదా పడింది. ఈ నిర్ణయంతో బాలాజీ మంత్రివర్గంలో కొనసాగనున్నారు.

    అటార్నీ జనరల్‌ను సంప్రదించేందుకు గవర్నర్ గురువారం అర్ధరాత్రి తన ఉత్తర్వులను వాయిదా వేసినట్లు తెలిసిందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

    తన ఉత్తర్వులను నిలిపివేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు గవర్నర్ ఆర్ఎన్ రవి సమాచారం తెలియజేశారు.

    తన నిర్ణయంపై అటార్నీ జనరల్ సలహా తీసుకోనున్నట్లు సీఎం ఎంకే స్టాలిన్‌కు పంపిన లేఖలో గవర్నర్ తెలిపారని పీటీఐ పేర్కొంది.

    మంత్రి సెంథిల్ బాలాజీని మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేస్తూ గురువారం సాయంత్రం గవర్నర్ ఆర్ఎన్ రవి నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలతో మంత్రిని ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన గత రెండు వారాలుగా జైలులో ఉన్నారు.

    మంత్రి సెంథిల్ బాలాజీపై ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకోవడం, మనీలాండరింగ్ వంటి తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని రాజ్‌భవన్ అధికారిక ప్రకటనలో తెలిపింది.

    అయితే , గవర్నర్ నిర్ణయాన్ని డీఎంకే వ్యతిరేకించింది. మంత్రిని తొలగించే హక్కు రాజ్యాంగపరంగా గవర్నర్‌కు లేదని, న్యాయపరంగా ఎదుర్కొంటామని తెలిపింది.

    మరోవైపు గవర్నర్ నిర్ణయాన్ని బీజేపీ సమర్థిస్తోంది. మంత్రివర్గాన్ని నియమించే అధికారం ఉన్న గవర్నర్‌కు, తొలగించే అధికారం కూడా ఉందని చెబుతోంది.

  17. మణిపుర్‌లో మరోసారి చెలరేగిన హింస, ఇద్దరు మృతి

    మణిపుర్

    ఫొటో సోర్స్, ANI

    మణిపుర్‌లో మరోసారి హింస చెలరేగింది. గురువారం జరిగిన ఘర్షణల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గత రెండు నెలలుగా జరుగుతున్న ఈ ఘర్షణల్లో జూన్ 13 తర్వాత ప్రాణాలు కోల్పోయిన ఘటన మరోసారి చోటుచేసుకుంది.

    నిజానికి గురువారం ఉదయం 6 గంటల సమయంలో కాంగ్‌పోక్పి జిల్లాలోని తంగ్‌నౌమ్, హరోథెల్ గ్రామాల్లో కాల్పులు జరిగాయి. అనుమానిత తీవ్రవాదులు జరిపిన ఈ కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు గాయపడ్డారు.

    కాల్పుల్లో మెయితెయ్ తెగకు చెందిన ఇద్దరు చనిపోయారని తెలియడంతో నిరసనకారులు ఇంఫాల్‌లోని ఇమా మార్కెట్ వద్దకు చేరుకున్నారు.

    ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. గాల్లోకి కాల్పులు జరిపాయి.

    ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని కౌత్రుక్ చింగ్ లీకై, సెంజమ్ చిరాంగ్, ఖుర్ఖుల్ మనింగ్ లీకై ప్రాంతాల్లో అనుమానిత తీవ్రవాదులకు, గ్రామ రక్షక దళాలకు మధ్య కాల్పులు జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

    మణిాపుర్

    ఫొటో సోర్స్, ANI

    ''కాంగ్‌పోక్పిలో జరిగిన కాల్పుల్లో మెయితెయ్ తెగకు చెందిన వారు మరణించారని తెలియడంతో స్థానికులు ఇమా బజార్ వద్ద గుమిగూడారు. సాయంత్రం 5 గంటల తర్వాత చనిపోయిన వ్యక్తి మృతదేహంతో ఆందోళనకారులు ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ ఇంటికి బయలుదేరారు.'' అని మానవ హక్కుల కార్యకర్త కెకె ఒనిల్ చెప్పారు. ఆ వెంటనే భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయని ఆయన చెప్పారు.

    ''మరోవైపు కొందరు ఆందోళనకారులు బీజేపీ ప్రధాన కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ విధ్వంసం సృష్టించాలనే ఉద్దేశంతోనే అక్కడికి వెళ్లారు. కానీ భద్రతా దళాలు అప్రమత్తమై గాల్లో కాల్పులు జరిపాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు సుమారు 3 గంటల పాటు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించాయి." అని ఆయన అన్నారు.

    కుకీ, మెయితెయ్ తెగల మధ్య మే 3 నుంచి జరుగుతున్న ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకూ 130 మందికిపైగా మరణించారు. సుమారు 60 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

  18. లైవ్ పేజీకి స్వాగతం

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను చూడండి.

  19. అనుప్‌గిరి గోసైన్: ఈ నగ్న నాగా సాధువు ఒక 'భయంకర' యుద్ధ వీరుడు