ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్
రోస్తోవ్ నగరం తమ అధీనంలో ఉందని, మాస్కో మీదకూ వస్తామని 'ప్రైవేట్ సైన్యం' వాగ్నర్ చీఫ్ యెవ్‌జెనీ ప్రిగోజిన్ ప్రకటించిన తరువాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ టీవీలో మాట్లాడారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్
బీజేపీ నేత, రెజ్లర్ యోగేశ్వర్ దత్ తమ గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని రెజ్లర్లు వినేశ్ ఫోగాట్, సాక్షి మాలిక్, భజరంగ్ పూనియా ఆరోపించారు.
శనివారం ఫేస్‌బుక్ లైవ్‌లో ముగ్గురు రెజ్లర్లు మాట్లాడారు. ఒలింపిక్ క్వాలిఫికేషన్ కోసం ఒకే ట్రయల్స్‌లో పాల్గొంటామని ఒలింపిక్ అసోసియేషన్ అడ్ హక్ కమిటీకి తాము లేఖ ఇచ్చామనడం అవాస్తవం అన్నారు.
కేవలం సమయం మాత్రమే కావాలని కోరామని రెజ్లర్లు తెలిపారు.
యోగేశ్వర్ మాత్రం 'మేం లేఖ ఇచ్చామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు'' అని రెజ్లర్లు చెప్పారు.
యోగేశ్వర్ దత్ మహిళా వ్యతిరేకి అని రెజ్లర్లు ఆరోపించారు.
మహిళలకు మద్దతుగా ఆయన ఎప్పుడూ బహిరంగంగా ముందుకు రాలేదన్నారు.

ఫొటో సోర్స్, ani

ఫొటో సోర్స్, Reuters
ఇన్నాళ్లూ సైన్యంగా పనిచేసిన వాగ్నర్ గ్రూప్ ప్రభుత్వానికి ఎదురు తిరిగి రొస్తావ్ నగరంలోని మిలిటరీ స్థావరాన్ని అదుపులోకి తీసుకున్న ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై ఆయన టీవీ చానెల్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
కొందరు రష్యన్లు నేరపూరిత సాహసానికి ఒడిగట్టారని వాగ్నర్ గ్రూప్ పేరును ప్రస్తావించకుండానే పుతిన్ విమర్శించారు.
దీనిని వెన్నుపోటు అని అభివర్ణించిన ఆయన, తిరుగుబాటు నేత యెవ్‌జెనీ ప్రిగోజిన్ పేరు చెప్పకుండానే, మీ ఆశయాలు తీవ్ర రాజద్రోహం కిందకు వస్తాయని అన్నారు.
రష్యా సమాజాన్ని విడదీయాలని చూసేవారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు పుతిన్.
రాజధాని మాస్కోతోపాటు, పలు ప్రాంతాలో తీవ్రవాద వ్యతిరేక చర్యలు మొదలయ్యాయని పుతిన్ స్పష్టం చేశారు.
ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తాను అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పిన పుతిన్, ప్రసంగంలో ఎక్కడా తిరుగుబాటు నేత యెవ్‌జెనీ ప్రిగోజిన్ పేరునుగానీ, వాగ్నర్ గ్రూప్‌ను గానీ ప్రస్తావించ లేదు.
పైగా వారిని దేశం కోసం పోరాడుతున్న యోధులుగానే ప్రస్తావించారు.
వాగ్నర్ గ్రూప్ కార్యాలయాలపై దాడులు
పుతిన్ ప్రసంగం ముగిసిన మరుక్షణమే రష్యా ప్రభుత్వ శాంతి భద్రతల విభాగాలు రంగంలోకి దిగాయి.
సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని వాగ్నర్ కార్యాలయంపై దాడి చేసినట్లు తెలుస్తోందని స్థానిక వార్తా సంస్థ ఫోంటాంకా నివేదించింది.
"సెయింట్ పీటర్స్‌బర్గ్ జోల్నాయ స్ట్రీట్‌లో ఉన్న పీఎంసీ వాగ్నర్ సెంటర్‌లో ప్రభుత్వాధికారులు ప్రవేశించారు" అని ఆ వార్తా సంస్థ ప్రకటించింది.
అల్లర్లను నిరోధించే పోలీసు బృందాలు, నేషనల్ గార్డ్స్‌తో నిండిన రెండు బస్సులు వాగ్నర్ కార్యాలయానికి చేరుకున్నాయని, కొందరు వ్యక్తులు మఫ్టీలో వాగ్నర్ ఆఫీసులోకి అడుగుపెట్టినట్లు ఆ వార్తా సంస్థ వెల్లడించింది.
సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని బ్లాగోవెష్‌చెంస్కీ బ్రిడ్జ్ సమీపంలో "మాస్క్‌లు ధరించి, ఆటోమేటిక్ రైఫిల్స్ పట్టుకుని ఉన్న వ్యక్తులు" మోహరించారని, ఇక్కడ వాగ్నర్ అధిపతి యెవ్జెనీ ప్రిగోజిన్‌కు చెందిన ఒక హోటల్, రెస్టారెంట్ ఉన్నాయని వార్తా సంస్థ తెలిపింది.
వాగ్నర్ సెంటర్‌లోకి శాంతిభద్రతల అధికారులు ప్రవేశించినట్లు చూపే వీడియోలను, ప్రిగోజిన్ ఆస్తుల దగ్గర మోహరించిన సాయుధుల ఫొటోలను ఫోంటాంకా ఆ తర్వాత చూపించింది.

ఫొటో సోర్స్, Reuters
రోస్తోవ్-ఆన్-డోన్ నగరంలోని రష్యా దక్షిణ ప్రాంత సైనిక ప్రధాన కార్యాలయంలోకి వాగ్నర్ చీఫ్ యెవ్‌జెనీ ప్రిగోజిన్ అడుగు పెట్టినట్లు ఒక వీడియో వెలుగు చూసింది.
ఈ నగరాన్ని అదుపులోకి తీసున్నామని, మాస్కో వైపు వస్తామని చెబుతూ ప్రిగోజిన్ ఒక వీడియోలో కనిపించారు. రష్యా రక్షణ మంత్రి సెర్గెయ్ షోయిగు, జనరల్ వాలరీ గెరాసిమోవ్ తనను కలవడానికి రాకపోతే మాస్కోను ముట్టడిస్తామని ఆయన అన్నారు.
“మేం ఇక్కడికి వచ్చేశాం. ఆర్మీ చీఫ్‌తో పాటు షోయిగును మేం కలవాలనుకుంటున్నాం. వాళ్ళు కనుక రాకపోతే మేం రోస్తోవ్ నగరాన్ని దిగ్బంధం చేసి, మాస్కో వైపు వస్తాం”అని ప్రిగోజిన్ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, Reuters
ఒక వాగ్నర్-అనుకూల చానల్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఆయన ఇద్దరు జనరల్స్ మధ్యన కూర్చుని కనిపించారు. వారిలో ఒకరు ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ వ్లాదిమిర్ అల్కెయెవ్. ఈయనే అంతకుముందు వాగ్నర్ బాస్ వెనక్కి తగ్గాలని అర్థిస్తూ ఒక వీడియో విడుదల చేశారు.
ఈ వీడియోలను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.
“యెవ్‌జెనీ ప్రిగోజిన్ రష్యా సైనిక నాయకత్వానికి వ్యతిరేకంగా ముందుకు వెళ్ళడాన్ని దాదాపు సైనిక తిరుగుబాటు ప్రయత్నంగానే భావించాలి” అని యుక్రెయిన్‌లో అమెరికా మాజీ రాయబారి బిల్ టేలర్ బీబీసీతో అన్నారు.
ఇది పుతిన్‌కు సబంధించి చాలా తీవ్రమైన విషయమని బిల్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Reuters
మాస్కో వీధుల్లో మిలటరీ ట్రక్స్ కనిపిస్తున్నాయి. అలాగే, రష్యాలోని మరో ప్రముఖ నగరమైన రోస్తోవ్-ఆన్-డోన్ వీధుల్లో కూడా సైనిక శకటాలు తిరుగుతున్నాయి.
వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్‌జెనీ ప్రిగోజిన్ సైనిక తిరుగుబాటుకు ప్రయత్నిస్తున్నారని రష్యా అధికారులు ఆరోపణలు చేసిన తరువాత దేశంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ప్రభుత్వ భవనాలను సైనికులు చుట్టుముట్టిన ఫోటోలను రష్యాలోని రోస్టోవ్ నగరానికి చెందిన స్థానిక టెలిగ్రాం ఛానల్స్‌లో చూడొచ్చు.
అయితే, ఈ ఫుటేజీలను బీబీసీ ధ్రువీకరించడం లేదు.ఈ ఫుటేజీల్లో రెండు యుద్ధ ట్యాంకులు కనిపిస్తున్నాయి.
న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ప్రకారం, అక్కడ ఉన్నది పోలీసు ప్రధాన కార్యాలయం అని తెలిసింది.
ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని స్థానిక గవర్నర్ గోలుబెల్ సూచించారు.

ఫొటో సోర్స్, Reuters
వాగ్నర్ గ్రూప్ తనను తానొక ప్రైవేట్ ఆర్మీగా చెప్పుకుంటుంది. దీన్ని మొదటిసారిగా 2014లో గుర్తించారు. అప్పుడు తూర్పు యుక్రెయిన్‌లో రష్యా అనుకూల వేర్పాటువాదులకు ఇది మద్దతు ఇచ్చింది.
అప్పట్లో అది ఒక రహస్య సంస్థగా ఉండేది. ఎక్కువగా ఆఫ్రికా, మధ్యప్రాచ్యం వంటి చోట్ల తన కార్యకలాపాలు సాగించేది. రష్యా స్పెషల్ ఫోర్సెస్‌కు చెందిన మాజీలు ఎక్కువగా ఉండే ఈ సైనిక కూటమిలో మొత్తం 5 వేల మంది వరకూ ఫైటర్లు ఉండేవారని చెబుతారు.
అయితే, ఆ తరువాత దాని బలం గణనీయంగా పెరిగింది. యుక్రెయిన్ యుద్ధంలో రష్యా సేనలతో పాటుగా వాగ్నర్ ఫైటర్లు కూడా పోరాటంలోకి దిగారు. ఈ నెల ప్రారంభంలో బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ వాగ్నర్ గ్రూప్ గురించి చెబుతూ ప్రస్తుతం అందులో 50 వేల మంది ఫైటర్లు ఉన్నారని తెలిపింది.
బఖుమత్ నగరాన్ని రష్యా స్వాధీనం చేసుకోవడంలో ఈ గ్రూప్ ఎంతో కీలక పాత్ర పోషించింది.
మాస్కోలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో భద్రతను పెంచారు.
రాజధానిలో భద్రతను పటిష్టం చేసేందుకు తీవ్రవాద వ్యతిరేక చర్యలను చేపడుతున్నట్లు కూడా మాస్కో మేయర్ తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన ముగిసింది.
అమెరికా పర్యటన ముగించుకున్న మోదీ, ప్రస్తుతం ఈజిప్ట్‌లో పర్యటించేందుకు ఆ దేశ రాజధాని కైరో బయలుదేరి వెళ్లారు.
అమెరికా టూర్ తర్వాత, ప్రధానమంత్రి ఒక ప్రత్యేక వీడియోను ట్వీట్ చేశారు.
‘‘ఎంతో ప్రత్యేకమైన అమెరికా పర్యటన ముగిసింది. ఇండో-అమెరికా స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు,చర్చల్లో పాల్గొనే అవకాశం దక్కింది’’ అని మోదీ రాశారు.
రాబోయే తరాల వారికి ఉన్నతమైన ప్రపంచాన్ని అందించేందుకు తమ దేశాలు కలిసి పనిచేస్తాయని తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ప్రస్తుతం ఈజిప్ట్ బయలుదేరి వెళ్లిన మోదీ, ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్-ఫత్తా-అల్-సిసీతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.
అంతేకాక, అల్-హకీమ్ మసీదును కూడా ప్రధాని మోదీ సందర్శించనున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
గుడ్‌మార్నింగ్
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్‌డేట్స్ కోసం బీబీసీ తెలుగు లైవ్ పేజీని చూడండి.