ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్
పార్టీల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, ఈ పోరాటంలో కలిసి ముందుకెళ్తామని బిహార్‌లో జరిగిన విపక్ష పార్టీల సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్

ఫొటో సోర్స్, ANI
ప్రస్తుతం విపక్ష పార్టీలు చేస్తున్నది భావజాల పోరాటమని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు.
ఈ పార్టీల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, ఈ పోరాటంలో కలిసి ముందుకెళ్తామని బిహార్‌లో జరిగిన విపక్ష పార్టీల సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
"ఈరోజు లంచ్‌లో నితీష్ జీ మాకు బిహార్‌లోని లిట్టీ చోఖా నుంచి గులాబ్ జామూన్ వరకు అన్ని రకాల వంటకాలను తినిపించారు. అందుకు ధన్యవాదాలు.
బీజేపీ ప్రజాస్వామ్యంపై దాడి చేస్తోంది. నేను సమావేశంలో ఇది భావజాల పోరు అని చెప్పాను. మా మధ్య కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ మేమంతా కలిసి పనిచేస్తాం. ఈ రోజు మేం కలిసి పంచుకున్న చర్చలను, తీసుకున్న నిర్ణయాలను రాబోయే రోజుల్లో మరింత ముందుకు తీసుకెళ్తాం. మా చర్చలు చాలా తీవ్రంగా సాగుతున్నాయి’’ అని రాహుల్ గాంధీ చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
ఆ తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ, ‘‘విపక్ష నేతలంతా కలిసి ఉమ్మడి అజెండాను సిద్ధం చేసుకుంటున్నాం. జూలై 10 లేదా 12వ తేదీన సిమ్లా మళ్లీ మేమంతా కలుస్తాం. మా వ్యూహానికి సంబంధించిన అజెండాను అక్కడ సిద్ధం చేస్తాం. 2024లో మేం ఐక్యంగా పోరాడతాం. బీజేపీని అధికారం నుంచి తప్పించాలి. ఇందులో మేం కచ్చితంగా విజయం సాధిస్తాం’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, ANI
2024 ఎన్నికలల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీలు పట్నాలో సమావేశమయ్యాయి.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు.
ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తేజస్వినీ యాదవ్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పీడీఎఫ్ నాయకురాలు మెహబూబా ముఫ్తీ, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, వామపక్ష నేతలు ఏబీ బర్దన్, సీతారాం ఏచూరి తదితరులు హాజరయ్యారు.
అయితే, ఈ సమావేశంపై వ్యంగ్య విమర్శలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలు మాయావతి, ఈ పార్టీలన్నీ తమ లక్ష్యమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ప్రతిపక్షపార్టీల సమావేశంపై బీజేపీ స్పందించింది. మోదీకి పెరుగుతున్న జనాదరణను తట్టుకోలేకపోతోందని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసింది. బీజేపీని ఓడించే శక్తిలేక ప్రతిపక్షాలను కూడగట్టే ప్రయత్నాలు చేస్తోందని ఆ పార్టీ నాయకురాలు స్మృతీ ఇరానీ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో సోర్స్, Getty Images
టైటాన్ ప్రమాదంలో ఐదుగురు యాత్రికులు మరణించడంపై అమెరికా విచారం వ్యక్తం చేసింది.
‘‘చనిపోయిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’’ అని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.
‘‘టైటాన్ తప్పిపోయినప్పటి నుంచి ఆ కుటుంబాలు ఎంతో మనోవేదనను అనుభవించి ఉంటాయి. వారికిదే మా సానుభూతి’’ అని ఆ ప్రకటన పేర్కొంది.
సబ్ మెర్సిబుల్ సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నవారికి కూడా వైట్‌హౌస్ కృతజ్ఞతలు తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ శిథిలాలు చూడ్డానికి మినీ జలాంతర్గామి టైటాన్‌లో ప్రయాణించిన ఐదుగురూ మరణించారు.
అమెరికా కోస్ట్ గార్డ్ దీనిని ధ్రువీకరించింది. కోస్ట్ గార్డ్ రేర్ అడ్మిరల్ జాన్ మౌగర్ ఈ జలాంతర్గామికి చెందిన ఐదు భాగాలు టైటానిక్ నౌక ముందు భాగానికి 487 మీటర్ల దూరంలో లభించినట్లు చెప్పారు.
టైటాన్‌తో సంబంధాలు తెగిపోయిన తర్వాత దాని రెస్క్యూ ఆపరేషన్లో ఉన్న అమెరికా కోస్ట్ గార్డ్ సిబ్బందికి అది పేలిపోయినట్లు భారీ శబ్దం వినిపించింది.
గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జాన్ మౌగర్ ఈ శిథిలాలు టైటాన్ సబ్‌మెర్సిబుల్‌వి లాగే ఉన్నాయని చెప్పారు. టైటాన్ పేలుడుకు ఏది కారణం అనేది స్పష్టంగా తెలీడం లేదన్నారు.
ఈ సబ్‌లో ఓషన్ గేట్ సీఈఓ 61 ఏళ్ల స్టాక్టన్ రష్, 48 ఏళ్ల బ్రిటిష్ పాకిస్తానీ వ్యాపారవేత్త షహజాదా దావూద్, 19 ఏళ్ల ఆయన కొడుకు సులేమాన్, 58 ఏళ్ల బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్ ఉన్నారు. దీనిలోని ఐదో వ్యక్తి 77 ఏళ్ల పాల్ హెన్రీ నార్గోలెట్. ఆయన మాజీ ఫ్రెంచ్ నావీ డ్రైవర్, ప్రముఖ అన్వేషకులు.
టైటాన్‌లో ప్రయాణించిన తండ్రీకొడుకులు షహజాదా, సులేమాన్ దావూద్ మృతిపై వారి కుటుంబ సభ్యులు విషాదం వ్యక్తం చేశారు. టైటాన్ సబ్‌మెర్సిబుల్‌లో టైటానిక్ శిథిలాలు చూడ్డానికి వెళ్లిన వీరంతా గత ఆదివారం గల్లంతయ్యారు. తర్వాత టైటన్ అన్వేషణలో నౌకలతోపాటూ ఆర్ఓవీ, విమానాలను కూడా మోహరించారు. సముద్రంలో 10 వేల చదరపు మైళ్ల వరకూ అన్వేషణ కొనసాగించారు.
దానిని తీసుకెళ్లే పోలార్ ప్రిన్స్ నౌకతో టైటన్ సబ్‌మెర్సిబుల్ సంబంధాలు తెగిపోయాయి. ఆదివారం అది సముద్రంలోకి వెళ్లిన గంటా 45 నిమిషాల్లోనే దానితో సంబంధాలు తెగిపోయాయి.
టైటానిక్ శిథిలాలు కెనడాలోని న్యూఫౌండ్‌లాండ్‌లో సెయింట్ జాన్స్‌కు దక్షిణంగా 700 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. టైటాన్ అన్వేషణ కోసం జరిగిన ఆపరేషన్లను అమెరికా బోస్టన్ రేవు నుంచి నిర్వహించారు.
టైటాన్ సబ్‌మెర్సిబుల్‌లో మరణించిన ఐదుగురినీ నిజమైన అన్వేషకులని దానిని నిర్వహిస్తున్న ఓషన్ గేట్ సంస్థ చెప్పింది. వారి స్ఫుర్తి, సాహసం ఎంతో అరుదైనవని ఆ సంస్థ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.