లండన్: తెలుగమ్మాయి తేజస్వినీ రెడ్డి హత్య కేసులో మూడో అరెస్టు

ప్రస్తుతం తేజస్విని కుటుంబం హైదరాబాద్ శివారు తుర్కయాంజల్ లో నివాసం ఉంటోంది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మళ్లీ జాతీయ, అంతర్జాతీయ విశేషాలతో రేపు కలుసుకుందాం. గుడ్ నైట్.

  2. జోసెలిన్ చియా: ఈ స్టాండప్ కమెడియన్‌‌ కోసం ఇంటర్ పోల్ ఎందుకు వెతుకుతోంది?

  3. లండన్: తెలుగమ్మాయి తేజస్వినీ రెడ్డి హత్య కేసులో మూడో వ్యక్తి అరెస్ట్

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    చదువు కోసం లండన్ వెళ్లిన తేజస్విని రెడ్డి అనే తెలుగమ్మాయి మంగళవారం నాడు హత్యకు గురైంది. వెంబ్లీ ప్రాంతంలో నీల్డ్ క్రెసెంట్‌లోని ఆమె ఇంటి దగ్గరే దుండగులు కత్తితో దాడి చేసి చంపారు.

    ఆమెతో పాటు మరో 28 ఏళ్ల మహిళపై కూడా దాడి చేశారు. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఈ హత్యకు సంబంధించి మూడో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

    తేజస్వినీ అపార్ట్ మెంట్‌లోనే నివసిస్తున్న బ్రెజిల్‌కు చెందిన వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడని, కేసు విచారణ జరుగుతోందని పోలీసులు వెల్లడించినట్లు ఏఎన్ఐ తెలిపింది.

    అపార్ట్‌మెంట్లో ప్రతి ఒక్కరికీ వేరు వేరు రూమ్‌లు ఉంటాయని, కానీ, వాష్ రూం, కిచెన్ మాత్రం కలిపి ఉంటాయని, ఆ అబ్బాయి అక్కడికి వచ్చి ఉంటాడని, వాళ్లిద్దరు ఎక్కువగా మాట్లాడుకోరని తేజస్వినీ బంధువొకరు చెప్పారు.

  4. ఆమె అఫ్గానిస్తాన్‌లో సక్సెస్‌ఫుల్ లేడీ పోలీసాఫీసర్, ఇరాన్ క్రిమినల్ గ్యాంగ్‌లకు ఎలా చిక్కారు?

  5. తమిళనాడు: మంత్రి సెంథిల్‌ బాలాజీని అరెస్టు చేసిన ఈడీ, భయపడబోమన్న సీఎం స్టాలిన్

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖల మంత్రి వి.సెంథిల్ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అరెస్టు చేసింది.

    2011-15 సమయంలో ఏఐఏడీఎంకే ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా సెంథిల్ ఉన్నప్పుడు ఆ శాఖ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌లో స్కాం జరిగిందని, ఆయన మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

    అరెస్టు తర్వాత సెంథిల్ ఛాతీ నొప్పితో బాధపడుతూ తెల్లవారుజామున 2.30 గంటలకు చెన్నైలోని ఒమండురార్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఆసుపత్రికి వెళ్లి మంత్రిని పరామర్శించారు.

    సెంథిల్ బాలాజీకి సెషన్స్ కోర్టు జూన్ 28 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అంతకు ముందు సెషన్స్ కోర్టు ప్రిన్సిపల్ జడ్జి ఎస్.అలీ ఆసుపత్రిలో సెంథిల్‌ను కలిశారని పీటీఐ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    సెంథిల్ అరెస్టుపై స్టాలిన్ ట్విటర్‌లో స్పందించారు. ''విచారణకు పూర్తిగా సహకరిస్తానని మంత్రి సెంథిల్ బాలాజీ చెప్పిన తర్వాత కూడా ఛాతిలో నొప్పి వచ్చేలా చిత్రహింసలకు గురిచేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఉద్దేశం ఏంటి? చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మానవత్వం లేకుండా వ్యవహరించడం అవసరమా? బీజేపీ బెదిరింపులను డీఎంకే చూసుకుంటుంది. భయపడం. 2024 ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.'' అని అన్నారు.

    ''ఇలాంటి చర్యలు విపక్షాల నోరు మూయించలేవు, మోదీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజాస్వామిక పోరాటాన్ని కొనసాగిస్తాం'' అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఓ ప్రకటన విడుదల చేశారు. ''ఇది పూర్తిగా చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమైన అరెస్టు. దీనిపై న్యాయపరంగా పోరాడతాం'' అని డీఎంకే రాజ్యసభ ఎంపీ, సెంథిల్ లాయర్ ఎన్‌ఆర్‌ ఇళంగో అన్నారు.

    అయితే, సెంథిల్ బాలాజీ ఏఐఏడీఎంకేలో ఉండగా, ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ అవినీతి ఆరోపణలు చేసిన విషయాన్ని బీజేపీ నేత కె. అన్నామలై గుర్తు చేశారు. ఇప్పుడు ఆ ఆరోపణలను వెనక్కి తీసుకుంటున్నారా అని ఆయన తన ట్వీట్ లో ప్రశ్నించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

  6. జపాన్: సైన్యంలో చేరిన తర్వాత ఆమె కలలు ఎలా చెదిరిపోయాయి, ఆ రోజు ఏం జరిగింది?

  7. నిజామాబాద్ కుట్ర కేసులో పీఎఫ్ఐ 'ఆయుధ శిక్షకుడి'ని అరెస్టు చేసిన ఎన్ఐఏ

    నిజామాబాద్ కుట్ర కేసు

    ఫొటో సోర్స్, ANI

    'నిజామాబాద్ తీవ్రవాద కుట్ర' కేసులో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) సంస్థ ఆయుధ శిక్షణ మాస్టర్‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసినట్లు ఏఎన్ఐ తెలిపింది.

    33 ఏళ్ల నొస్సం మొహమ్మద్ యూనస్ అనే ఈ వ్యక్తి నకిలీ ఐడెంటిటీతో కర్ణాటకలో జీవిస్తున్నట్లు ఎన్ఐఏ బుధవారం వెల్లడించింది.

    తన సోదరుడికి చెందిన ఇన్వర్టర్ బిజినెస్‌లో యూనస్ పని చేస్తున్నారు. మంగళవారం ఆయన్ను అరెస్టు చేసింది ఎన్ఐఏ.

    పీఎఫ్‌ఐ కోసం ఎంపిక చేసిన ఏపీ, తెలంగాణ యువకులకు యూనస్ ఆయుధ శిక్షకుడని ఎన్ఐఏ తెలిపింది.

    భారత్‌లో ఇస్లామిక్ రాజ్యం తీసుకురావడమే లక్ష్యంగా కొందరు యువకులను తమ సంస్థలో చేర్చుకుని వారికి ఆయుధాలు సమకూర్చినట్లు పీఎఫ్ఐపై ఆరోపణలు ఉన్నాయి.

    గతేడాది నిజామాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. మణిపూర్‌ అల్లర్లలో మరో 9 మంది మృతి, 10 మందికి గాయాలు

    మణిపూర్: తూర్పు ఇంఫాల్‌లోని ఖమెన్‌లోక్ ప్రాంతంలో బుధవారం ఉదయం చెలరేగిన హింసలో 9 మంది మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారని వార్తాసంస్థ ఏఎన్ఐ తెలిపింది. మరో 10 మంది గాయపడినట్లు చెప్పింది.

    మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ జరుగుతోందని తూర్పు ఇంఫాల్ ఎస్పీ శివకాంత సింగ్ తెలిపారు.

    మణిపూర్‌లో గత కొంతకాలంగా హింసాత్మక ఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. బిపర్జోయ్ తుపాను: భారత్, పాకిస్తాన్‌లో వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

    తుపాన్

    ఫొటో సోర్స్, ANI

    అతి తీవ్ర తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో భారత్, పాకిస్తాన్‌లో అరేబియా సముద్రం తీర ప్రాంతాల నుంచి వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

    అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాన్ గురువారం సాయంత్రం గుజరాత్‌లోని కచ్ వద్ద తీరం దాటనుంది.

    పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌, కరాచీ పరిసర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

    తుపాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో భారత్‌లో ఏడుగురు చనిపోయారు.

    తీరప్రాంత జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి సుమారు 38 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం తెలిపింది.

    తుపాను నేపథ్యంలో రైలు సర్వీసులను నిలిపివేశామని, కండ్లా, ముంద్రా పోర్టుల్లోనూ కార్యకలాపాలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

    మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని, సందర్శకులు బీచ్‌లకు రావొద్దని సూచించారు.

  10. పవన్ కళ్యాణ్‌ విజయ వారాహి యాత్ర నేడు ప్రారంభం

    పవన్ కళ్యాణ్‌

    ఫొటో సోర్స్, JanaSena Party/Facebook

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ వారాహి యాత్ర కాకినాడ జిల్లాలో నేడు ప్రారంభంకానుంది. ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తొలిరోజు ఆయన పర్యటిస్తారు.

    అన్నవరం నుంచి ఈ యాత్ర మొదలవుతుంది. తరువాత కత్తిపూడిలో నిర్వహించే బహిరంగసభలో పాల్గొంటారు.

    యాత్రకు ముందు పవన్ కళ్యాణ్‌ అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గాల తర్వాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో యాత్ర సాగుతుంది.

    ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర, సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.

    ఈనెల 22కు యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం చేరుకుంటుంది.

    ఆ యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ పలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. వివిధ వర్గాల సమస్యలపై చర్చించబోతున్నట్టు జనసేన చెబుతోంది.

    పవన్ కళ్యాణ్‌

    ఫొటో సోర్స్, JanaSena Party/Facebook

    రాజకీయంగా ఇది కీలకయాత్రగా భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ప్రభావం ఎక్కువగా కనిపించిన ప్రాంతాల్లో ఈ యాత్ర సాగుతోంది.

    ఇప్పటికే జనసేన పార్టీ శ్రేణులు అన్నవరం చేరుకున్నాయి. ఓవైపు ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ వివిధ ప్రాంతాల నుంచి పవన్ అభిమానులు యాత్ర వెంబడి సాగేందుకు సిద్దమవుతున్నారు. దానికి తగ్గట్టుగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు కాకినాడ జిల్లా పోలీసులు చెబుతున్నారు.

    ఈ యాత్ర నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ నిన్న తన వాహనం వారాహికి పూజలు జరిపించారు.

  11. గాల్లో అదృశ్యమైన ఎంహెచ్370 విమానంపై జోకు వేసిన కమేడియన్ కోసం గాలింపు

    జోసెలిన్ చియా

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, జోసెలిన్ చియా

    న్యూయార్క్‌కు చెందిన ఒక కమెడియన్ మలేసియా విమానం ఎంహెచ్370పై జోక్ చేశారన్న కారణంగా ఆమెను పట్టుకోవడానికి మలేసియా పోలీసులు ఇంటర్‌పోల్ సహాయం కోరారు.

    2014 మార్చిలో కౌలాలంపూర్ నుంచి టేకాఫ్ అయిన ఎంహెచ్370 విమానం అదృశ్యమైంది. హిందూ మహాసముద్రంలో నాలుగేళ్లపాటు వెతికినా ఈ విమానం ప్రధాన భాగం దొరకలేదు. విమానంలో ఉన్న మొత్తం 239 మంది చనిపోయారని భావిస్తున్నారు.

    అమెరికాలో పుట్టి సింగపూర్‌లో పెరిగిన కమెడియన్ జోసెలిన్ చియాపై రెచ్చగొట్టడం, అభ్యంతరకరమైన ఆన్‌లైన్ కంటెంట్‌కు సంబంధించిన చట్టాల ప్రకారం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

    గతవారం ఆమె ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఒక జోక్‌పై మలేషియా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

    అయితే, సింగపూర్ ప్రభుత్వం అందుకు క్షమాణలు కోరింది. ఆమె సింగపూర్ వాసులకు ప్రతినిధి కారని స్పష్టం చేసింది.

    జోసెలిన్ చియా మాన్‌హాటన్ కామెడీ సెల్లార్ వెన్యూలో స్టాండ్ అప్ కామెడీ షో చేశారు. దాని వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

    మలేసియా విమానాలు ఎగరలేవని జోక్ చేస్తూ, "మలేసియా ఎయిర్‌లైన్స్ అదృశ్యమైపోవడం ఫన్నీగా లేదూ? కొన్ని జోక్స్ భూమి మీదకు దిగవు" అంటూ కామెడీ చేశారు.

    చారిత్రకంగా మలేసియా, సింగపూర్‌ల మధ్య శతృత్వం ఉంది. ఒకప్పుడు ఈ రెండు దేశాలు ఒకే దేశం కింద ఉండేవి. తరువాత, సింగపూర్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగింది. మలేసియా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉంది.

    ఈ నేపథ్యంలో ఆమె చేసిన కామెడీని మలేసియా తీవ్రంగా పరిగణిస్తోంది.

  12. నేను నిర్దోషిని.. రహస్య పత్రాలపై విచారణలో డోనాల్డ్ ట్రంప్

    డోనాల్డ్ ట్రంప్

    ఫొటో సోర్స్, Getty Images

    రహస్య పత్రాల కేసులో తాను నిర్దోషినని డోనాల్డ్ ట్రంప్ మయామి కోర్టులో వాదించారు.

    అమెరికాలో మాజీ లేదా ప్రస్తుత అధ్యక్షుల్లో క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్న మొదటి వ్యక్తి డోనాల్డ్ ట్రంప్.

    ట్రంప్ తన పదవీ కాలం ముగిసిన తరువాత కూడా అధికారిక రహస్య పత్రాలను తన వద్దే ఉంచుకున్నారని, వాటిని తీసుకోవడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నారనే అభియోగాలను ఎదుర్కొంటున్నారు.

    ఆ మేరకు ఆయనపై కేసు దాఖలైంది. మంగళవారం మయామి కోర్టులో ఈ కేసుపై విచారణ జరిగింది.

    ఇది అమెరికా చరిత్రలో చీకటి రోజని, తనపై ఆరోపణలు రాజకీయ కుట్ర అని ట్రంప్ ఇంతకుముందు పేర్కొన్నారు.

    మయామి కోర్టుకు హాజరయే ముందు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో "మన దేశానికి ఇంతటి విషాదమైన రోజున నాకు ఘన స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు" అని పోస్ట్ చేశారు.

    "ఈ కేసులో ట్రంప్ నిర్దోషి" అని కోర్టులో ఆయన తరపు లాయర్ వాదించారు.

  13. నమస్కారం

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ చూస్తుండండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.