ఆధీనం మఠం నుంచి సెంగోల్ స్వీకరించిన ప్రధాని మోదీ

దిల్లీలో కొత్త పార్లమెంట్ భవనంలో లోక్‌సభ స్పీకర్ సీటు దగ్గర ఈ సెంగోల్‌ను ఉంచనున్నారు.

లైవ్ కవరేజీ

  1. పటేల్‌ను కాదని నెహ్రూను గాంధీ ప్రధానిని చేశారు, ఎందుకు?

  2. కొత్త పార్లమెంటులో నేటి నుంచి సమావేశాలు, పాత భవనాన్ని ఏం చేస్తారు?

  3. ధన్యవాదాలు

    మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాలతో రేపు మళ్లీ కలుద్దాం....గుడ్ నైట్

  4. సూడాన్: అంతర్యుద్ధం కారణంగా ఆకలితో చనిపోయిన ఓ వృద్ధురాలు

  5. ఆధీనం మఠం నుంచి సెంగోల్ స్వీకరించిన ప్రధాని మోదీ

    సెంగోలు

    ఫొటో సోర్స్, ANI

    తమిళనాడులో తిరువావుడుదురై ఆధీనం మఠం నుంచి ప్రధాని నరేంద్రమోదీ సెంగోల్‌ను స్వీకరించారు. శనివారం మోదీ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌తో పాటు పలువురు ఆధీనం మఠం సభ్యులు హాజరయ్యారు.

    సెంగోల్‌కు గౌరవం ఇవ్వలేదు

    స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పవిత్ర సెంగోల్‌కు తగిన గౌరవం ఇచ్చి గౌరవప్రదమైన స్థానం కల్పించి ఉంటే బాగుండేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కానీ, ప్రయాగ్‌రాజ్‌లో ఈ సెంగోల్‌ను వాకింగ్ స్టిక్‌గా ఉంచారని మోదీ ఆరోపించారు.

    ''మీ సేవకుడు, మా ప్రభుత్వం ఆనంద్ భవన్ నుంచి సెంగోల్‌ను బయటకు తీసుకువచ్చాం" అని మోదీ తెలిపారు.

    “భారతీయ గొప్ప సంప్రదాయానికి ప్రతీక అయిన సెంగోల్‌ను కొత్త పార్లమెంట్ భవనంలో ప్రతిష్టించనుండటం సంతోషంగా ఉంది. మనం విధి మార్గంలో నడవాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఈ సెంగోల్ మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది" అని మోదీ అన్నారు.

    ఈ సందర్భంగా ప్రధాని మోదీ పీఠం సభ్యుల నుంచి ఆశీర్వాదాలు అందుకున్నారు. దిల్లీలో కొత్త పార్లమెంట్ భవనంలో లోక్‌సభ స్పీకర్ సీటు దగ్గర ఈ సెంగోల్‌ను ఉంచనున్నారు.

  6. మంత్రగాళ్లంటూ 11మందికి ఉరిశిక్ష - 370 ఏళ్ల తర్వాత నిర్దోషులుగా తీర్మానించిన చట్టసభ

  7. ఐపీఎల్‌ 2023: ఈ ఏడాది టీమిండియా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించే దేశవాళీ క్రికెటర్లు వీళ్లే...

  8. విశాఖ ఏజెన్సీ - రంగు రాళ్లు: ఐశ్వర్యా రాయ్ ఉంగరం పేరుతో ఇక్కడ రూ.కోట్ల వ్యాపారం ఎలా జరుగుతుందంటే....

  9. సివిల్స్ ర్యాంకర్ ఉమాహారతి: ఇలా చేస్తే విజయం ఖాయం

  10. నీళ్లలో పడిపోయిన ఫోన్ కోసం డ్యామ్‌ ఖాళీ చేయించిన అధికారి

  11. జ్వరం ఎందుకు వస్తుంది? ఎప్పుడు సీరియస్‌గా తీసుకోవాలి?

  12. 'సారే జహాన్ సే అచ్చా' గేయ రచయిత ఇక్బాల్‌ చాప్టర్‌ను తొలగిస్తున్న దిల్లీ వర్సిటీ

    దిల్లీ

    ఫొటో సోర్స్, Getty Images

    'సారే జహాన్ సే అచ్చా హిందుస్తాన్ హమారా' గేయ రచయిత మహ్మద్ ఇక్బాల్ చాప్టర్‌ను సిలబస్ నుంచి తొలగించేందుకు దిల్లీ యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.

    రాజనీతి శాస్త్రం (పొలిటికల్ సైన్స్) విభాగంలో పాకిస్తాన్ జాతీయ కవి మహ్మద్ ఇక్బాల్ చాప్టర్‌ను తొలగిస్తున్నట్లు కౌన్సిల్ సభ్యులు ధ్రువీకరించారు.

    మహ్మద్ ఇక్బాల్ అవిభక్త భారత్‌లోని సియాల్‌కోట్‌లో 1877లో జన్మించారు. సారే జహాన్ సే అచ్చా గేయాన్ని ఆయన రచించారు.

    దిల్లీ యూనివర్సిటీ అందిస్తున్న బీఏ కోర్సులో 'మోడరన్ ఇండియన్ పొలిటికల్ ఐడియాలజీ' పేపర్‌లో ఇక్బాల్ ప్రస్తావన ఉంది.

    ఈ అంశాన్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ముందు ఉంచుతామని కౌన్సిల్ తెలిపింది. దీనిపై ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోనుంది.

  13. ఐపీఎల్: శుభ్‌మన్ గిల్ భారీ సెంచరీతో ఫైనల్‌కు గుజరాత్.. అతడి ఆటపై రోహిత్ శర్మ ఏమన్నాడు?

  14. నమస్కారం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.