మలేషియా మాస్టర్స్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన పీవీ సింధు, ప్రణయ్

కౌలాలంపూర్‌లో జరుగుతున్న మలేషియా మాస్టర్స్ 2023 పోటీల్లో భారత షట్లర్లు పీవీ సింధు, ప్రణయ్ హెచ్ఎస్ సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగు పెట్టారు.

లైవ్ కవరేజీ

  1. ఈ నాలుగు సంకేతాలు కనిపిస్తే మీరు మీ కళ్లద్దాలు మార్చుకోవాలి

  2. మహేంద్ర సింగ్ ధోనీ: చెన్నై సూపర్ కింగ్స్ సక్సెస్ మంత్రం ఏమిటి?

  3. ధన్యవాదాలు

    బీబీసీ తెలుగు లైవ్ అప్డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం. రేపు ఉదయం తాజా అప్డేట్స్‌తో మళ్ళీ కలుసుకుందాం.

    నమస్తే. గుడ్ నైట్.

  4. కేరళ: ఏ తప్పూ చేయకున్నా 54 రోజులు జైలు... వ్యక్తి జీవితంతో ఆడుకున్న 'సీసీటీవీ ఫోటో'

  5. UPSC టాపర్ ఇషితా కిశోర్ సోషల్ మీడియాను ఎలా ఉపయోగించుకున్నారంటే...

  6. అరగంటలో అయిదుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

  7. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం చుట్టూ వివాదాలు... నిలువునా చీలిన ప్రతిపక్షాలు

  8. మలేషియా మాస్టర్స్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన పీవీ సింధు, ప్రణయ్

    బ్యాడ్మింటన్

    ఫొటో సోర్స్, ANI

    కౌలాలంపూర్‌లో జరుగుతున్న మలేషియా మాస్టర్స్ 2023 పోటీల్లో భారత షట్లర్లు పీవీ సింధు, ప్రణయ్ హెచ్ఎస్ సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్స్‌కి చేరినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.

    ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు జపాన్‌కి చెందిన అయా ఒహొరిపై 21-16, 21-11 తేడాతో సునాయాసంగా గెలిచింది. కేవలం 40 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది.

    క్వార్టర్ ఫైనల్స్‌లో చైనాకు చెందిన ఝాంగ్ యి మన్‌తో పోటీ పడనుంది.

    పురుషుల సింగిల్స్‌లో ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్, చైనాకు చెందిన లి షి ఫెంగ్‌‌ను ఓడించి ప్రణయ్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాడు.

    13-21, 21-16, 21-11తో ఫెంగ్‌పై విజయం సాధించాడు.

    మరో ఇద్దరు ప్లేయర్లు లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్ కూడా మలేషియా మాస్టర్స్‌లో తలపడుతున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. మహిళా ఎంపీలు జుట్లు పట్టుకుని మరీ కొట్టుకున్నారు

  10. రెండు కాళ్లు, ఒక చేయి లేకున్నా సివిల్స్ సాధించిన సూరజ్

    యూపీఎస్సీ

    ఫొటో సోర్స్, ANI

    ప్రమాదంలో అవయవాలు కోల్పోవడం తన విజయానికి ఏమాత్రం అడ్డుకాలేవని నిరూపించాడు ఉత్తరప్రదేశ్‌కి చెందిన సూరజ్ తివారి. కేవలం మూడు చేతి వేళ్లతోనే సివిల్స్ సాధించి అబ్బురపరిచాడు.

    రైలు ప్రమాదంలో రెండు కాళ్లు, ఒక చేయి కోల్పోయిన యూపీలోని మెయిన్‌పురికి చెందిన సూరజ్‌ తివారి సివిల్ సర్వీసెస్‌కి ఎంపికయ్యారని ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.

    ఘాజియాబాద్‌‌లోని దాద్రిలో 2017లో జరిగిన ఓ రైలు ప్రమాదంలో సూరజ్ తన రెండు కాళ్లు, కుడి చేతితో సహా రెండు ఎడమ చేతి వేళ్లు కోల్పోయారు.

    తమ కుమారుడు తమను గర్వపడేలా చేశాడని సూరజ్ తండ్రి రమేష్ కుమార్ తివారి సంతోషం వ్యక్తం చేశారు. విజయం సాధించేందుకు మూడు వేళ్లు సరిపోతాయని నిరూపించాడన్నారు.

    తన కుమారుడు చాలా ధైర్యవంతుడని సూరజ్ తల్లి చెప్పారు. జీవితంలో విజయం సాధించేందుకు చాలా కష్టపడ్డాడని ఆమె అన్నారు.

    కష్టపడాలని తన తోబుట్టువులకు కూడా ఎప్పుడూ చెబుతుంటాడని ఆమె చెప్పారు.

    సివిల్ సర్వీసెస్‌కి అర్హత సాధించిన 933 మంది జాబితాను యూపీఎస్సీ ఇటీవల ప్రకటించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  11. వాజ్‌పేయి శతజయంతి: హిందూ జాతీయవాద రాజకీయాలను ఆమోదయోగ్యంగా మార్చిన నాయకుడు

  12. సూరత్‌ ఆలయంలో నాలుగు తరాలుగా మహిళా పూజారులు

  13. రష్యా నుంచి చౌక చమురును దిగుమతి చేసుకునేందుకు భారత్ పోటీ పడుతోందా?

  14. భగత్ సింగ్‌ను ఉరితీసి, సగం కాలిన మృతదేహాన్ని బ్రిటిషర్లు నదిలోకి ఎందుకు విసిరేశారు?

  15. ఐపీఎల్ ఎలిమినేటర్‌లో ఆకాశ్ మధ్వాల్ మ్యాజిక్: "నేను ఇంజినీర్‌ను, త్వరగా నేర్చుకుంటా" - ముంబయి ఇండియన్స్ బౌలర్ వ్యాఖ్య

    ఐపీఎల్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ఆకాశ్ మధ్వాల్‌ను అభినందిస్తున్న సహచరులు

    ఐపీఎల్ 2023 ఎలిమినేటర్‌లో ఆకాశ్ మధ్వాల్ మ్యాజిక్‌తో ముంబయి ఇండియన్స్ లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 81 పరుగుల భారీ తేడాతో గెలిచింది.

    చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 182 పరుగులు చేసింది.

    కామెరాన్ గ్రీన్ 41 పరుగులు చేశాడు. లక్నో బౌలర్ నవీన్ ఉల్ హక్ 38 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

    183 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ ఘోరంగా ఓడిపోయింది. 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయింది.

    చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్‌లో ముంబయి పేసర్ ఆకాశ్ మధ్వాల్ విరుచుకుపడ్డాడు. కేవలం ఐదు పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

    లఖ్‌నవూ బ్యాట్స్‌మెన్ ప్రేరక్ మంకడ్, ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, రవి బిష్ణోయి, మొహిసిన్ ఖాన్‌ వికెట్లను ఆకాశ్ మధ్వాల్ పడగొట్టాడు.

    లఖ్‌నవూపై విజయంతో ముంబయి ఇండియన్స్ క్వాలిఫయర్ 2‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఇది శుక్రవారం అహ్మదాబాద్‌లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మే 28 ఆదివారం ఫైనల్‌లో చెన్నైతో తలపడుతుంది.

    ఆకాశ్ మధ్వాల్‌

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ఆకాశ్ మధ్వాల్‌

    ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 182 పరుగులు చేసిన తర్వాత కూడా లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ నిపుణులు అంచనా వేశారు.

    ముంబయి ఇండియన్స్ బౌలింగ్‌లో అంత బలంగా లేకపోవడమే దీనికి కారణమని, లఖ్‌నవూ గెలిచే అవకాశాలున్నాయంటూ పాత రికార్డులను కూడా గుర్తు చేశారు.

    అయితే, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఆకాశ్ మధ్వాల్ లఖ్‌నవూ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఐదు వికెట్లు వెంటవెంటనే తీసి లఖ్‌నవూను కోలుకోలేని దెబ్బకొట్టి ముంబయి ఇండియన్స్‌ ఫైనల్స్ ఆశలకు ఊపిరి ఊదాడు.

    సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నువ్వా నేనా అన్నట్టు జరిగిన మ్యాచ్‌లోనూ మధ్వాల్ నాలుగు వికెట్లు తీసి సత్తాచాటాడు. హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్ వంటి వికెట్లు పడగొట్టి ముంబయి జట్టుకు విజయం అందించాడు.

    మధ్వాల్ బౌలింగ్‌కు ఫిదా అయిపోయిన క్రికెట్ విశ్లేషకుడు హర్షా భోగ్లే లఖ్‌నవూ బ్యాట్స్‌మెన్ మొహిసిన్ ఖాన్ వికెట్ పడగొట్టిన తర్వాత ''ఆ పేరు గుర్తుంచుకోండి.. ఆకాశ్ మధ్వాల్'' అంటూ ట్వీట్ చేశారు.

    ముంబయి విజయం తర్వాత, ''ఇన్నాళ్లూ ఎక్కడున్నావు'' అంటూ మధ్వాల్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

    ''ప్రాక్టీస్ చేస్తున్నా. ఈ అవకాశం కోసం ఎదురుచూశా'' అని మధ్వాల్ బదులిచ్చాడు.

    ''ఇంజినీరింగ్ చేశాను. ఆ తర్వాత క్రికెట్‌పై ఇష్టం పెంచుకున్నా. అందుకోసం చాలా కష్టపడ్డా. ఇప్పుడు ఇక్కడి దాకా వచ్చా'' అని మధ్వాల్ చెప్పాడు. ఇంజినీర్లు త్వరగా నేర్చుకుంటారని కూడా ఆయన అన్నాడు.

    ఆకాశ్ నిజంగానే ‘క్విక్ లెర్నర్’ (త్వరగా నేర్చుకునే వ్యక్తి) .

    ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో 1993లో ఆకాశ్ మధ్వాల్ పుట్టాడు.

    ఇంజినీరింగ్ చదివిన మధ్వాల్ 23 ఏళ్ల వరకూ టెన్నిస్ బాల్‌తోనే క్రికెట్ ఆడాడు. ఆ తర్వాతే క్రికెట్ బాల్‌తో ఆడడం ప్రారంభించిన మధ్వాల్ తక్కువ కాలంలోనే ఐపీఎల్ వరకూ ఎదిగాడు.

    ఐపీఎల్‌లో మధ్వాల్ ఆడింది ఏడు మ్యాచ్‌లే.

  16. నమస్కారం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.