అసదుద్దీన్ ఒవైసీ: 'పార్లమెంట్ కొత్త భవనాన్ని లోక్‌సభ స్పీకర్ ప్రారంభించాలి'

పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధాని మోదీయే ప్రారంభించినట్లయితే తాను, తన పార్టీ సభ్యులు ఆ కార్యక్రమానికి హాజరుకాబోమని ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం. తాజా అప్డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుసుకుందాం.

    గుడ్ నైట్.

  2. సెంగోల్: పార్లమెంట్ కొత్త భవనంలో మోదీ ఆవిష్కరించనున్న ఈ బంగారు రాజదండం చరిత్ర ఏమిటి?

  3. కిటో: స్వలింగ సంపర్కులను ఆకర్షించి బ్లాక్‌మెయిల్ చేస్తున్న నైజీరియా మాఫియా గ్యాంగ్‌లు

  4. వైరస్‌లే లేకుంటే మనిషి మనుగడ ఇలా ఉండేది కాదా?

  5. ఆంధ్రప్రదేశ్: ఆత్రేయపురంలో నోరూరించే మామిడి తాండ్రను ఎలా చేస్తారో చూడండి...

  6. పార్లమెంటు కొత్త భవనాన్ని లోక్‌సభ స్పీకర్ ప్రారంభించాలి: అసదుద్దీన్ ఒవైసీ

    పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రధాని మోదీయే ప్రారంభించినట్లయితే తాను, తన పార్టీ సభ్యులు ఆ కార్యక్రమానికి హాజరుకాబోమని ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

    కొత్త భవనాన్ని స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించాలని.. అప్పుడే తాము హాజరవుతామని ఒవైసీ అన్నారు.

    అధికారాల విభజన సిద్ధాంతానికి ఇది విరుద్ధమని.. స్పీకర్ పరిధిలోకి చొరబడడమేనని ఒవైసీ అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    మిగతా కొన్ని విపక్షాలు రాష్ట్రపతి ప్రారంభించాలని కోరుతున్నాయని, కానీ, అది కూడా తప్పేనని ఒవైసీ అన్నారు.

    రాజ్యాంగంలోని ఆర్టికల్ 53 ప్రకారం రాష్ట్రపతి కూడా కార్యనిర్వాహక వ్యవస్థలో భాగమని.. కాబట్టి రాష్ట్రపతి కూడా ప్రారంభించరాదని, లోక్‌సభ స్పీకర్ ప్రారంభించాలని ఒవైసీ చెప్పారు.

    స్పీకర్ కనుక కొత్త భవనాన్ని ప్రారంభిస్తే తమ పార్టీ కచ్చితంగా హాజరవుతుందని చెప్పారు.

  7. శుభ్‌మన్ గిల్: సచిన్ తెందూల్కర్, విరాట్ కోహ్లీ‌ల తరువాత క్రికెట్ కింగ్ ఇతడేనా?

  8. సజావుగా రూ. 2 వేల నోట్ల ఉపసంహరణ: ఆర్‌బీఐ

    RBI Governor Shaktikanta Das

    ఫొటో సోర్స్, YEARS

    రూ. 2 వేల నోట్ల ఉపసంహరణ సజావుగా సాగేలా చూస్తామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం చెప్పారు.

    ఆర్‌బీఐ ఇదంతా క్రమంతప్పకుండా పర్యవేక్షిస్తోందని చెప్పారు.

    రూ. 2 వేల నోట్లను ఉపసంహకరించుకుంటున్నట్లు గత శుక్రవారం ఆర్‌బీఐ ప్రకటించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నామే కానీ రద్దు చేయడం లేదని ఆర్‌బీఐ ఇప్పటికే స్పష్టం చేసింది.

    బుధవారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన శక్తికాంత దాస్.. ‘‘రూ. 2 వేల నోట్ల ఉపసంహరణ ప్రక్రియ అంతా సజావుగా సాగేలా చూస్తాం. ఇందుకోసం ముందుగానే అన్నీ విశ్లేషించుకున్నాం’ అన్నారు.

    ఉపసంహరణ ప్రక్రియలో ఇంతవరకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తినట్లు తమ దృష్టికి రాలేదని, మొత్తం ప్రక్రియను నిశితంగా గమనిస్తున్నామని చెప్పారు.

    కాగా మంగళవారం నుంచి రూ. 2 వేల నోట్ల మార్పిడి మొదలైంది. బ్యాంకులలో వీటిని మార్చుకోవడం కానీ, డిపాజిట్ చేయడం కానీ చేయొచ్చు.. ఇందుకు ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఉంది.

  9. మహిళా రెజ్లర్లు: '#MeToo' నిరసనతో ఒలింపిక్ కలలు చెదిరిపోతాయా?

  10. జీ20 సదస్సు: కశ్మీర్‌లో ఆర్టికల్-370 రద్దు తర్వాత ఈ నాలుగేళ్ళలో ఏం మారింది?

  11. పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన 19 ప్రతిపక్షాలు.. హాజరుకానున్న వైసీపీ, టీడీపీ

    పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పక్కనపెట్టినందుకు నిరసనగా కాంగ్రెస్ సహా 18 ప్రతిపక్ష పార్టీలు ఆ వేడుకను బాయ్‌కాట్ చేస్తున్నట్టు తెలిపాయి.

    ఇది "ఉన్నతమైన రాష్ట్రపతి పదవికి అవమానం. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం" అని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఆ మేరకు 19 పార్టీలు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ప్రధాని స్వయంగా కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకోవడం "నేరుగా ప్రజాస్వామ్యంపై దాడి అని, దీనికి బదులు చెప్పాలి" అని ప్రతిపక్షాలు ఉమ్మడి లేఖలో డిమాండ్ చేశాయి.

    మే 28న జరగనున్న ప్రారంభోత్సవానికి వైసీపీ, టీడీపీ హాజరవుతాయని ఆ రెండు పార్టీల నేతలు ధ్రువీకరించినట్లు వార్తాసంస్థ ఏఎన్‌‌ఐ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

  12. ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ ఉద్యోగులు: 'జూన్ వస్తున్నా ఇంకా మార్చి జీతమే రాలేదు'

  13. పెంపుడు జంతువుల నుంచి ప్రాణాంతక ఇన్ఫెక్షన్లు సోకకుండా పాటించాల్సిన 5 జాగ్రత్తలు

  14. ఐపీఎల్ 2023: ఫోర్ కొడితే రూ.50 వేలు, సిక్స్ కొడితే రూ.లక్ష.. హైదరాబాద్‌లో బెట్టింగ్ ఇలా జరుగుతోంది

  15. వైట్ హౌస్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన తెలుగు కుర్రాడు అరెస్ట్

    వైట్ హౌస్

    ఫొటో సోర్స్, Getty Images

    అమెరికాలోని వైట్ హౌస్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన తెలుగు కుర్రాడిని యూఎస్ పోలీసులు అరెస్ట్ చేశారని అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) తెలిపింది.

    మిస్సోరీలో నివాసం ఉంటున్న కందుల సాయి వర్షిత్ (19) సోమవారం రాత్రి స్థానిక సమయం 10.00 గంటల ప్రాంతంలో యూ-హాల్ కంపెనీకి చెందిన ట్రక్‌తో వైట్ హౌస్ లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించాడు.

    లాఫయెట్ స్క్వేర్ ఉత్తరం వైపు వాహనంతో దూసుకెళ్లి, అక్కడ ఉన్న సెక్యూరిటీ బ్యారికేడ్లను గుద్దాడని పోలీసులు తెలిపినట్టు ఏపీ న్యూస్ వెల్లడించింది.

    వెంటనే పోలీసులు వర్షిత్‌ను అదుపులోకి తీసుకున్నారు.

    ట్రక్‌తో గుద్దిన తరువాత వర్షిత్ నాజీ జెండా బయటకు తీసి ఊపాడని యూఎస్ పార్క్ పోలీస్ అధికారులు తెలిపారు.

    ఉద్దేశపూర్వకంగానే వైట్ హౌస్ లోకి చొరబడినట్టు వర్షిత్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.

    కొన్ని నెలల పాటు ప్లాన్ చేసి, ఆ రాత్రి సెయింట్ లూయిస్ నుంచి వన్-వే టిక్కెట్ తీసుకుని వైట్ హౌస్ చేరుకున్నట్టు అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లతో చెప్పాడని ఏపీ న్యూస్ తెలిపింది.

    "వైట్ హౌస్ లోపలికి వెళ్లి, అధికారాన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్నాడని, అవసరమైతే ప్రెసిడెంట్‌ను చంపడానికైనా వెనుకాడనని చెప్పినట్టు" చార్జ్ షీట్‌లో రాసారని వార్తాసంస్థ వెల్లడించింది.

    మిసోరీలోని చెస్టర్‌ఫీల్డ్‌లో సెయింట్ లూయిస్ నగర శివార్లలో వర్షిత్ నివాసం ఉంటున్నాడని, నాజీ చరిత్ర, అధికారం, నియంతృతం మొదలైనవాటి వాటి నుంచి ప్రేరణ పొందినట్టు విచారణలో చెప్పాడని ఏపీ న్యూస్ తెలిపింది.

    ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. వర్షిత్ బ్యాగ్‌లో లేదా ట్రక్‌లో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు.

  16. ఐపీఎల్‌ 2023: పదోసారి ఫైనల్‌ చేరిన చెన్నై సూపర్ కింగ్స్.. గుజరాత్ టైటాన్స్‌‌ను ధోనీ సేన ఎలా ఓడించింది?

  17. 'మా సంబంధాలు టీ20 మోడ్‌లోకి ప్రవేశించాయి' - ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీ

    ప్రధాని నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, ANI

    ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నేడు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.

    తరువాత ప్రధానులిద్దరూ మీడియా సమావేశంలో ప్రసంగించారు.

    ఏడాది కాలంలో ఆస్ట్రేలియాతో ఇది ఆరవ సమావేశమని, ఇది ఆ దేశంతో ఉన్న సంబంధాలలో లోతును, పరిపక్వతను ప్రతిబింబిస్తుందని మోదీ అన్నారు.

    "క్రికెట్ భాషలో, మా సంబంధాలు టీ20 మోడ్‌లోకి ప్రవేశించాయని" అన్నారు.

    "ఆస్ట్రేలియాలో దేవాలయాలపై దాడి, వేర్పాటువాదుల కార్యకలాపాల గురించి మేం చర్చించాం. భారత్, ఆస్ట్రేలియా మధ్య స్నేహపూర్వక సంబంధాలకు హాని కలిగించే ఏ అంశాలనూ మేం అంగీకరించం. భవిష్యత్తులో ఇలాంటి అంశాలకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటానని ఆస్ట్రేలియా పీఎం ఆల్బనీస్ నాకు మరోసారి హామీ ఇచ్చారు" అని మోదీ తెలిపారు.

    ద్వైపాక్షిక సమావేశంలో "మైనింగ్, క్లిష్టమైన ఖనిజాల రంగాలలో వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చించాం. గ్రీన్ హైడ్రోజన్‌పై టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం" అని చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    బెంగుళూరులో కొత్త ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ఏర్పాటు చేస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తెలిపారు.

    నిన్న, ఆస్ట్రేలియాలో లిటిల్ ఇండియా గేట్‌వే శంకుస్థాపన కార్యక్రమానికి ఆంథోని ఆల్బనీస్, మోదీ హాజరయ్యారు.

  18. నమస్కారం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.