వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు

వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ మే 25న విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం. తాజా అప్డేట్స్‌తో రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం.

    నమస్తే... గుడ్ నైట్.

  2. ‘మోదీ ఈజ్ బాస్' అని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆల్బనీస్ ఎందుకు అన్నారు?

  3. 'భారత పార్లమెంట్ కొత్త భవనాన్ని మహాత్మాగాంధీని జీవితాంతం వ్యతిరేకించిన సావర్కర్ జయంతి రోజున ప్రారంభిస్తారా?'

  4. బిహార్: షేర్షాబాదీ ముస్లిం అమ్మాయిలకు పెళ్ళి చేయడం ఇప్పటికీ చాలా కష్టం, ఎందుకంటే...

  5. బీబీసీ కోర్టుకు రావాలని ఆదేశించిన దిల్లీ హైకోర్టు

    బీబీసీ

    ఫొటో సోర్స్, Reuters

    నరేంద్ర మోదీపై విడుదల చేసిన డాక్యుమెంటరీ నేపథ్యంలో బీబీసీపై దాఖలైన పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరుకావాలని దిల్లీ హైకోర్టు బీబీసీని ఆదేశించింది.

    గుజరాత్‌లో 2002లో జరిగిన ముస్లిం వ్యతిరేక హింసలో ప్రధాని మోదీ పాత్రపై రూపొందించిన డాక్యుమెంటరీని బీబీసీ విడుదల చేసింది. అప్పుడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

    దీనిపై గుజరాత్‌కు చెందిన ఓ సంస్థ బీబీసీపై పరువు నష్టం దావా వేసింది. ఈ డాక్యుమెంటరీ భారత్‌ ప్రతిష్టను దిగజార్చిందని, కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ఆ సంస్థ రాయిటర్స్‌తో చెప్పింది.

    కోర్టులో విచారణ జరుగుతున్నందున దీనిపై వ్యాఖ్యానించలేమని బీబీసీ తెలిపింది.

  6. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు

    వివేకా హత్య కేసు

    ఫొటో సోర్స్, YS Avinash Reddy/Facebook

    ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

    అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ మే 25న విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

    అవినాష్ సోమవారం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన వెకేషన్‌ బెంచ్ మంగళవారం విచారణ జరిపింది.

    తాము ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరపకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.

    మే 25న హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జాబితాలో అవినాష్ పిటిషన్‌ను చేర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

    ''మేము ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా హైకోర్టు విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వకపోవడం అసంతృప్తి కలిగించింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఆదేశాలు ఇవ్వడానికి ఎంత సమయం కావాలి'' అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

  7. జీ20 సదస్సు: కశ్మీర్‌లో ఆర్టికల్-370 రద్దు తర్వాత ఈ నాలుగేళ్ళలో ఏం మారింది?

  8. బయోబ్యాంక్: వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించగల అవకాశాలపై పరిశోధన

  9. బిడ్డను కనేందుకు ఒంటెపై ప్రయాణం.. ఏడు గంటల పాటు యువతి నరకయాతన

  10. శ‌ర‌త్‌బాబు: ఓ విజ‌య‌వంత‌మైన న‌టుడి ఫెయిల్యూర్ స్టోరీ

  11. జావెలిన్ త్రో: ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా

    నీరజ్ చోప్రా

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, నీరజ్ చోప్రా

    ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో నిలిచారు.

    ఆయన తన కెరీర్‌లో తొలిసారి ప్రపంచ నంబర్ వన్ ర్యాంకు సాధించారు. ప్రపంచ ర్యాంకింగ్స్ జాబితాలో 1455 పాయింట్లతో టాప్‌లో నిలిచారు.

    ప్రపంచ చాంపియన్‌, స్పెయిన్‌కి చెందిన అండర్సన్ పీటర్స్‌ కంటే ఆయన 22 పాయింట్ల తేడాతో ముందంజలో ఉన్నారు.

    2022 ఆగస్టు 30న నీరజ్ చోప్రా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచారు. ఇప్పుడు తొలి స్థానానికి చేరుకున్నారు.

    నిరుడు సెప్టెంబర్‌లో జ్యూరిచ్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో నీరజ్ విజయం సాధించారు. ఈ పోటీల్లో నెగ్గిన తొలి భారతీయుడు ఆయనే కావడం విశేషం.

  12. ఆర్ఆర్ఆర్ ‘విలన్’ రే స్టీవెన్సన్ మృతి

    ఆర్ఆర్ఆర్

    ఫొటో సోర్స్, Twitter/RRR Movie

    ఆస్కార్ గెలుచుకున్న తెలుగు సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌లో విలన్‌గా నటించిన ఐరిష్ నటుడు రే స్టీవెన్సన్ మృతి చెందారు. ఆయనకు 58 ఏళ్లు.

    రోమ్ వైకింగ్, డెక్స్‌టర్ వంటి టీవీ షోలతో ఆయన పాపులర్ అయ్యారు. ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్‌ సినిమాలో సర్ స్కాట్ పాత్రలో స్టీవెన్సన్ నటించారు.

    స్టీవెన్సన్ మరణాన్ని ఆయన ప్రచార వ్యవహారాల సంస్థ వ్యూపాయింట్ బీబీసీకి ధ్రువీకరించింది. ఆయన మరణానికి కారణం ఇంకా తెలియలేదు.

    ఇటాలియన్ ద్వీపం ఇషియాలో షూటింగ్ సమయంలో ఆయన ఆస్పత్రిలో చేరినట్లు చెబుతున్నారు.

    అప్పుడు ఆయన క్యాసినో అనే యాక్షన్ సినిమా షూటింగ్‌లో ఉన్నారు.

    స్టీవెన్సన్ ఉత్తర ఐర్లాండ్‌లో జన్మించారు. స్టీవెన్సన్‌కు ఎనిమిదేళ్ల వయసులో ఆయన కుటుంబం ఇంగ్లండ్ వెళ్లిపోయింది.

    ఆయన తండ్రి రాయల్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేశారు. స్టీవెన్సన్ మృతి వార్త నమ్మలేకపోతున్నానని, ఇది దిగ్భ్రాంతికరమని డైరెక్టర్ రాజమౌళి ట్విటర్‌లో చెప్పారు. సినిమా సెట్స్‌లో ఆయన చాలా ఉత్సాహంగా ఉండేవారని తెలిపారు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉండేదన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఆర్ఆర్ఆర్ సినిమాలో కష్టమైన స్టంట్ సీన్‌కు కూడా స్టీవెన్సన్ వెనకాడలేదని, ఆయన వయసు అప్పుడు 56 ఏళ్లు అని ఆర్ఆర్ఆర్ యూనిట్ గుర్తు చేసుకుంది.

    స్టీవెన్సన్ ఎప్పటికీ తమ హృదయాల్లో ఉంటారని, ఆయన ఆత్మకు శాంతికలగాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  13. ఐపీఎల్: నేడే తొలి క్వాలిఫయర్, గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనున్న చెన్నై సూపర్ కింగ్స్

    ఐపీఎల్

    ఫొటో సోర్స్, Getty Images

    ఐపీఎల్ - 16 సీజన్‌ ప్లే ఆఫ్స్ దశకు చేరుకుంది. ఈ రోజు తొలి క్వాలిఫయింగ్ మ్యాచ్ జరగనుంది.

    మార్చి 31న డిఫెండిండ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, నాలుగు సార్లు ఐపీఎల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ - 16 ప్రారంభమైంది. ఇప్పుడు తొలి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లోనూ గుజరాత్, చెన్నై జట్లు తలపడనున్నాయి.

    బ్యాటింగ్, బౌలింగ్‌లో బలంగా ఉన్న ఈ రెండు జట్ల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.

    లీగ్ మ్యాచ్‌లలో గుజరాత్ టైటాన్స్ జట్టు నిలకడగా రాణించింది. ఆడిన 14 మ్యాచ్‌లలో 10 మ్యాచ్‌లలో విజయం సాధించింది.

    చెన్నై 14 మ్యాచ్‌లకు గానూ 8 మ్యాచ్‌లలో గెలిచింది.

    లీగ్ దశలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. క్వాలిఫయర్ మ్యాచ్ చెన్నై జట్టు సొంత మైదానం చెపాక్ స్టేడియంలో జరుగుతుండడంతో మరింత ఉత్కంఠ రేపుతోంది.

  14. నమస్కారం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.